పంజాబ్‌: కల్తీ మద్యానికి 24 మంది బలి

21 Last Breath Across 3 Districts In Punjab After Drinking Spurious Liquor - Sakshi

చండీగఢ్: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సీఎం అమరీందర్ సింగ్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మృతులంతా అమృత్‌సర్, గురుదాస్‌పూర్‌, టార్న్‌ తరన్‌‌ ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. గురువారం సాయంత్రం కల్తీ మద్యం తాగి అమృత్‌సర్‌లోని తార్సిక్కా మండలం ముచ్చల్‌, టాంగ్రా గ్రామాలకు చెందిన ఐదుగురు మొదట మరణించినట్లు డీజీపీ దింకర్‌ గుప్తా తెలిపారు. 

అదే రోజు రాత్రి ముచ్చల్‌ గ్రామంలో మరో ఇద్దరు మరణించారని డీజీపీ చెప్పారు. టార్న్‌ తరన్‌​లో నాలుగు, బటాలాలో ఐదు మరణాలు చోటు చేసుకున్నాయని చెప్పారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 24కు చేరిందని వెల్లడించారు. సీఎం ఆదేశం మేరకు ఈ కేసును డివిజనల్‌ కమిషన్‌ జలంధర్‌తో పాటు పంజాబ్‌ జాయింట్‌ ఎక్సైజ్‌ అండ్‌ టాక్సేషన్‌ కమిషన్‌ సంబంధిత జిల్లాల ఎస్పీలతో దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top