Sarkaru Vaari Paata Movie
-
మహేశ్ బాబు సినిమా వదులుకున్నా.. ఆ నిజం చెప్తే గొడవలే: రేణు దేశాయ్
మాస్ మహరాజా రవితేజ నటించిన చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న విడుదల అయ్యేందుకు రెడీగా ఉంది. 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ అయన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సుమారు 18 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మహేశ్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఆమె పంచుకున్నారు. (ఇదీ చదవండి: ఆ ఆత్మహత్యతో పెళ్లికి దూరంగా నిత్యా మేనన్.. నటుడి కామెంట్లు) మహేశ్‌బాబు- పరుశురామ్ కాంబోలో వచ్చిన 'సర్కారు వారి పాట' సినిమాలో తనకు నటించే ఛాన్స్ వచ్చిందని రేణు దేశాయ్ తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపారు. కాంట్రవర్సీని దృష్టిలో ఉంచుకుని ఆ విషయాలను ఇప్పుడు చెప్పలేకపోతున్నానని ఆమె ఇలా తెలిపారు. 'మహేశ్ బాబు సూపర్ హిట్ సినిమా 'సర్కారు వారి పాట' సినిమాలో నాకు అవకాశం వచ్చింది. అందులో నదియా పోసించిన బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం మొదట నన్ను సంప్రదించారు. అందులో నటించాలని నాకు కూడా ఆసక్తి ఉంది. అందుకు నేను కూడా ఓకే చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఎందుకు సెట్ కాలేదో అనే కారణాలను మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను. ఇప్పుడు చెప్పడం వల్ల అనవసరంగా కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది. నిజం ఏమిటో చెప్పాలని నాకు కూడా అనిపిస్తుంది.. కానీ మళ్లీ ఎన్ని కాంట్రవర్సీలు ఎదుర్కొవాల్సి వస్తుందోనని కామ్‌గా ఉండటమే బెటర్.' అని రేణు తెలిపారు. -
Year End 2022: మాస్ స్టెప్పులతో ఊపేసిన స్టార్స్
సినిమా సక్సెస్‌లో పాటలు కీలక పాత్రలు పోషిస్తాయి. కంటెంట్ మాత్రమే కాదు పాటలతో, స్టెప్పులతోనూ విజయం సాధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. అందుకే దర్శక-నిర్మాతలు స్క్రిప్ట్‌పైనే కాకుండా పాటలు, డాన్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారు. ప్రేక్షకున్ని మరింత అలరించేందుకు డైరెక్టర్లు స్పెషల్ సాంగ్స్, హీరోహీరోయిన్లతో మాస్ స్టెప్పులు వేయించి ప్రయోగాలు చేస్తున్నారు. అలా ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని చిత్రాలు థియేటర్లో పెద్దగా రాణించకపోయిన సాంగ్స్ రికార్టు సృష్టించాయి. అలాగే కంటెంట్‌తో పాటు పాటల, డాన్స్ పరంగా కూడా మరిన్ని చిత్రాలు సోషల్ మీడియాను ఊపేశాయి. అలా గతేడాది పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు కంటెంట్‌తోనే కాదు పాటలు కూడా ఎంతగా అలరించాయో ప్రత్యేకంగా చెప్పన్కర్లేదు. ఈ సాంగ్స్‌తో పాటు సిగ్నేచర్ స్టెప్పులు ఆడియాన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ ఏడాది వచ్చిన పలు సినిమా పాటలే కాదు, సిగ్నేచర్ స్టెప్స్‌కి కూడా విపరీతమైన ఆదరణ దక్కింది. మరి అవేంటో ఇక్కడ ఓ లుక్కెయండి! ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిన్న చిత్రంగా విడుదలై హ్యూజ్ హిట్ అందుకున్న సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌ను అలరించింది. ముఖ్యంగా ఇందులో టైటిల్ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. డీజే టిల్లు అంటూ థియేటర్లో, యూట్యూబ్‌లో రిసౌండ్ చేసింది ఈ పాట. పాటే కాదు ఇందులో సిగ్నేచర్ స్టెప్‌కు కూడా ప్రతి ఆడియన్స్ ఫిదా అయ్యాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ స్టెప్‌ను అనుసరిస్తూ కాలు కదిపిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ‘మ.. మ.. మహేశా’ అంటూ మాస్ రికార్డు సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇందులో ‘మ.. మ.. మహేశా’, ‘ఎవ్రీ పెన్ని’ సాంగ్స్ రికార్డు క్రియేట్ చేశాయి. అత్యధిక వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నిలిచాయి ఈ రెండు పాటలు. మ.. మ.. మహేశా అంటూ మహేశ్, కీర్తిలు వేసిన మాస్ స్టెప్‌కు థియేటర్లో ఈళలు మోగాయి. ఎవ్రీ పెన్ని అంటూ మహేశ్ వేసిన క్లాస్ డాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ‘ది వారియర్’ బుల్లెట్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించి చిత్రం ది వారియర్. ఈ ఏడాది జూలై 14న విడుదలైన ఈ చిత్రం పెద్దగా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. కానీ ఇందులోని బుల్లెట్, విజిల్ పాటలు శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బుల్లెట్ సాంగ్‌కు సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యింది. ‘కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ది బుల్లెటు..’ అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌ను షేక్ చేసింది. వ్యూస్ పరంగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాట మొత్తంగా 100 మిలియన్ పైనే వ్యూస్ రాబట్టింది. అంతేకాదా బుల్లెట్ బండి సిగ్నేచర్ స్టెప్ కూడా బాగా పాపులర్ అయ్యింది. రారా.. రక్కమ్మా (విక్రాంత్ రోణ) రారా.. రక్కమ్మా పాటల చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇప్పటికీ ఏ ఈవెంట్స్, ఫంక్షన్స్‌కు వెళ్లిన ఈ పాట మోగాల్సిందే. కన్నడ నటుడు సుదీప్, బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కలిసి కాలు కదిపిన ఈ పాట విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ సిగ్నేచర్ స్టేప్‌ను అనుసరించిన ప్రేక్షకులకు లేరనడంలో సందేహం లేదు. పెద్దవాళ్ల నుంచి చిన్నవాళ్లు వరకు ఈ స్టెప్‌కు వీణ వాయిస్తు నడుం ఊపారు. యూట్యూబ్‌లో సైతం ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో రికార్డు సృష్టించింది. బీస్ట్ అరబిక్ కతు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. ఈ మూవీ నుంచి వచ్చిన అరబిక్ కుతు' (హలమితి హబీబో) సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేసింది. సుమారు 260 మిలియన్లకుపైగా వ్యూస్ సన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ రాబట్టిన రెండో పాటగా అరబిక్ కుతు నిలిచింది. ఇక పాట సిగ్నేచర్ స్టేప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ప్రజలు నుంచి సినీ సెలబ్రెటీల వరకు ఎందరో అరబిక్ కుతుకు కాలు కదిపారు. ఇప్పటికీ ఈ స్టెప్‌ను అనుసరిస్తూ సోషల్ మీడియాలో వందల సంఖ్యలో రీల్స్ దర్శనిమిస్తున్నాయి. తార్ మార్ టక్కర్ మార్(గాడ్ ఫాదర్) మెగాస్టార్ చిరంజీవి, సత్యాదేవ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించని చిత్రం గాడ్ ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో కీ రోల్ పోషించారు. ఇక చిరు-సల్మాన్ కాంబినేషన్లో వచ్చిన ‘తార్ మార్ టక్కర్ మార్’ పాట ఎంతటి క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన ఈ పాట బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా చిరు, సల్మాన్ తార్ మార్ టక్కర్ మార్ అంటూ స్టైలిష్‌గా వేసిన ఈ స్టెప్ థియేటర్లో ఈలలు వేయించింది. రారా.. రెడ్డి (మాచర్ల నియోజకవర్గం) అలాగే మాచర్ల నియోజకవర్గంలో నితిన్, అంజలి కలిసి వేసిన రారా రెడ్డి పాటలకు మంచి హిట్ అందుకుంది. ఇందులోని అంజలి, నితిన్ వేసిన మాస్ స్టెప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలోని భళా భళా బంజారా, కమల్ హాసన్ విక్రమ్ మూవీలోని మత్తు మత్తుగా పాటలకు బాగా ఆకట్టుకున్నాయి. వీటితో ఇంకేన్నో పాటలు సిగ్నేచర్ స్టెప్‌తో రికార్డులు క్రియేట్ చేసి ఉర్రుతలూగించాయి. -
‘సాంగు భళా’: ఈ ఏడాది బాగా అలరించిన సాంగ్స్, అవేంటంటే..
మాటల్లో చెప్పలేని భావాన్ని పాటల్లో మరింత చక్కగా ఆవిష్కరించే వీలుంటుంది. ప్రేమ, విషాదం, ఆనందం.. ఏ భావోద్వేగాన్ని అయినా పాటలో పలికించవచ్చు. ఆ పాట ట్యూన్ క్యాచీగా ఉంటే శ్రోతల అటెన్షన్‌ని క్యాచ్ చేస్తుంది. 2022లో జనవరి నుంచి డిసెంబర్ వరకు అలాంటి ‘క్యాచీ సాంగ్స్’ చాలా వచ్చాయి. ‘సాంగు భళా’ అంటూ ఆకట్టుకున్న బోలెడన్ని పాటల్లో కొన్ని ఈ విధంగా... సినిమా పాట సంగీతం బంగార్రాజు కళ్లకు కాటుక ఎట్టుకుని.. కాళ్లకు పట్టీలు కట్టుకుని... అనూప్ రూబెన్స్ రౌడీ బాయ్స్ బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే... దేవిశ్రీ ప్రసాద్ గుడ్‌లక్ సఖి రావే రావే సఖి.. మురిసే ముచ్చట్లకి... దేవిశ్రీ ప్రసాద్ ఖిలాడీ నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్... దేవిశ్రీ ప్రసాద్ సెహరి ఓ కలలా.. ఇన్నాల్లే నిన్ను దాచి లోకమే... ప్రశాంత్ ఆర్. విహారి డీజే టిల్లు లాలాగూడ అంబర్‌పేట మల్లేపల్లి మలక్‌పేట... రామ్ మిర్యాల పటాసు పిల్లా... భీమ్లా నాయక్ భీమ్లా నాయక్.. ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ... ఎస్. తమన్ ఆడవాళ్లు మీకు జోహార్లు ఆడాళ్లు మీకు జోహార్లు... దేవిశ్రీ ప్రసాద్ రాధేశ్యామ్ నగుమోము తారలే.. తెగిరాలె నేలకే... తమన్ ఆర్ఆర్ఆర్ పొలంగట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు... ఎంఎం కీరవాణి కొమురం భీముడో కొమురం భీముడో... ఆచార్య సీమలు దూరని సిట్టడవికి సిరునవ్వొచ్చింది... మణిశర్మ లాహే లాహే లాహే లాహే లాహే లాహే... సర్కారువారి పాట వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి... మ మ మహేశా... ఎస్. తమన్ ఎఫ్ 3 అధ్యక్షా.. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా.. దేవిశ్రీ ప్రసాద్ మేజర్ నిన్నే కోరెనే.. నిన్నే కోరే.. శ్రీచరణ్ పాకాల అంటే సుందరానికీ.. చెంగుచాటు చేగువేరా... ఎంత చిత్రం... వివేక్ సాగర్ షికారు మనసు దారితప్పెనే... శేఖర్ చంద్ర ది వారియర్ నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడవుతుంది... దేవిశ్రీ ప్రసాద్ బింబిసార గుండె దాటి గొంతు దాటి పలికిందేదో వైనం... ఎంఎం కీరవాణి సీతారామం ఇంతందం దారి మళ్లిందా భూమిపైకి చేరుకున్నదా... ఓ సీతా వదలనిక తోడవుతా... విశాల్ చంద్రశేఖర్ మాచర్ల నియోజకవర్గం మాచర్ల సెంటర్లో మాపటేల నేనొస్తే.. మహతి స్వరసాగర్ గాడ్‌ఫాదర్ తార్ మార్ తక్కర్ మార్.. తమన్ జిన్నా జారు మిఠాయో నా జారు మిఠాయ.. అనూప్ రూబెన్స్ హిట్: ది సెకండ్ కేస్ రానే వచ్చావ వానై నా కొరకే... జాన్ స్టీవర్ట్ ఎడూరి ధమాకా నిన్ను సూడ బుద్ధి అయితాంది రాజిగో... భీమ్స్ సిసిరోలియో -
నితిన్ పాటకు మహేశ్ బాబు స్టెప్పులు !.. వీడియో వైరల్
Mahesh Babu Dance To Nithin Song Goes Viral: హిట్ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఈ హీరో 'జయం' సినిమా హీరోగా నితిన్‌కు ఎంత గుర్తింపు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ యూత్‌ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా ఈ పాటకు అనుగుణంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నితిన్ 'వావ్' అంటూ కామెంట్ చేశాడు. అయితే ఈ పాటకు మహేశ్ బాబు నిజంగా స్టెప్పులు వేయలేదు. ఇదంతా కేవలం ఎడిటింగ్‌తో చేసిన ప్రయోగం. నితిన్ తాజాగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ అంజలి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్‌ను రీమిక్స్ చేసి జోడించారు. ఇప్పుడు ఈ రీమిక్స్‌కు అనుగుణంగా 'సర్కారు వారి పాట'లోని 'మ.. మ.. మహేశా' స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్ చేశాడు ఓ నెటిజన్. ఈ స్పెషల్ వీడియోను ట్విటర్లో షేర్ చేయగా అది కాస్త ట్రెండ్ అయింది. ఈ వీడియోకు నితిన్ 'వావ్.. సూపర్.. పర్ఫెక్ట్ సింక్' అంటూ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ చలరేగిపోతోంది. చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ జీవితంలో వారు మనకు స్పెషల్: నాగ చైతన్య Wowww!! SUPERB and PERFECT SYNC 🔥🔥 https://t.co/KvXrbnzo7t — nithiin (@actor_nithiin) July 12, 2022 -
అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. తెరపై మహేశ్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో చిన్న చిన్న మార్పులు చేసుంటే మరింత పెద్ద విజయం సాధించేదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాలపై రివ్యూ ఇస్తున్న అయన.. తాజాగా ‘సర్కారు వారి పాట’పై తన అభిప్రాయన్ని వెల్లడించారు. (చదవండి: జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను..అదే నా భయం : తమన్నా) ఈ సినిమా ఫస్టాఫ్‌లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయని ఆయన అన్నారు. సరదాగా సాగిపోతున్న సమయంలో మహేశ్ ఇండియాకి తిరిగి రావడం అనేది ప్రమాదకరమైన మలుపు అని ఆయన అభిప్రాయపడ్డాడు. అలా కాకుండా కీర్తి సురేశ్, మహేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ నిడివి పెంచి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదన్నారు. హీరోతో పాటు హీరోయిన్ని కూడా ఒకే విమానంలో తిరిగి ఇండియాకు తీసుకువచ్చేలా కథ రాసుకొని ఉంటే..తెలియకుండానే కొన్ని కామెడీ సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ యాడ్ అయ్యేవని..అలా అయితే ఈ సినిమా మరో వంద కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసేదని పరుచూరి చెప్పుకొచ్చారు. -
ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు
సమ్మర్ హాలీడేస్ అయిపోయాయి. స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో పిల్లలు, యువత పుస్తకాలు తిరిగేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద సినిమాల సందడి తగ్గినట్లే కనిపిస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలతో పోటీపడలేక వాయిదాపడ్డ చిన్న చిన్న సినిమాలు ఇప్పుడు రిలీజ్‌కు రెడీ అంటూ బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ఈ క్రమంలో జూన్ నాలుగో వారంలో అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో ఓ లుక్కేయండి.. కొండా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం కొండా. కొండా మురళి- సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకుంది. సురేఖ పాత్రలో ఇర్రా మోర్, మురళి పాత్రలో త్రిగుణ్ నటించారు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. సమ్మతమే తన ప్రతి సినిమాకు తెలుగు టైటిల్స్‌నే పెట్టుకుంటూ వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. తాజాగా సమ్మతమే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. గోపీనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చాందినీ చౌదరి కథానాయిక. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. జూన్ 24న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చోర్ బజార్ ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి కథానాయకుడిగా నటించిన చిత్రం చోర్ బజార్. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గెహాన సిప్పీ హీరోయిన్. సురేశ్ బొబ్బిలి సంగీతం అందించిన ఈ మూవీ జూన్ 24న రిలీజ్ కానుంది. 7 డేస్ 6 నైట్స్ తెలుగు చిత్రసీమకు ఎన్నో హిట్స్ అందించారు దర్శకనిర్మాత ఎంఎస్ రాజు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 7 డేస్ 6 నైట్స్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తుండగా మెహర్ చాహల్ హీరోయిన్స్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా జూన్ 24న రిలీజ్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ గంగరాజు లక్ష్ చదలవాడ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్‌స్టర్ గంగరాజు. వేదిక దత్ కథానాయిక. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. సదా నన్ను నడిపే లంకా ప్రతీక్ ప్రేమ్ హీరోగా వైష్ణవి పట్వర్దన్ హీరోయిన్గా నటించిన చిత్రం సదా నన్ను నడిపే. ఈ సినిమాకు హీరో ప్రతీకే దర్శకుడు కావడం విశేషం. జూన్ 24న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయనుంది. ఇవే కాకుండా సాఫ్ట్వేర్ బ్లూస్, కరణ్ అర్జున్ సహా తదితర సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటంటే... అమెజాన్ ప్రైమ్ సర్కారువారి పాట - జూన్ 23 ఆహా మన్మథ లీల - జూన్ 24 సోనీ లివ్ నెంజుక్కు నీది (తమిళ్) - జూన్ 23 అవరోధ్ (హిందీ వెబ్ సిరీస్) - జూన్ 24 నెట్‌ఫ్లిక్స్ లవ్ అండ్ గెలాటో - జూన్ 22 మ్యాన్ వర్సెస్ బీ - జూన్ 24 కుట్టవుమ్ శిక్షాయుమ్ (మలయాళం) - జూన్ 24 గ్లామర్ గాళ్స్ - జూన్ 24 మనీ హెయిస్ట్ (కొరియన్)- జూన్ 24 హాట్‌స్టార్ డాక్టర్ స్ట్రేంజ్ - జూన్ 22 జీ5 ఫోరెన్సిక్ - జూన్ 24 చదవండి: హనీమూన్‌కు చెక్కేసిన నయనతార దంపతులు ‘విరాట పర్వం’ మూవీపై ప్రముఖ తమిళ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ -
‘మ..మ.. మహేశా..’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మ.. మ.. మహేశా’ అనే మాస్ బీట్ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య శ్రీకృష్ణ, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటలో మహేశ్, కీర్తి సురేశ్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవలే విడుదలైన మురారి వా, పెన్నీ వీడియో సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా జూన్ 23 నుంచి ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది ఆమెజాన్. చదవండి: విషాదం.. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన సింగర్ దంపతులు -
ఎక్స్ట్రా చార్జీ లేకుండా సర్కారువారి పాట ఫ్రీగా చూసేయండి
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా, మహానటి ఫేం కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన చిత్రం సర్కారువారి పాట. మే 12న థియేటర్స్‌లో రిలీజైన ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గీతాగోవిందం ఫేమ్ పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉంది సర్కారువారి పాట. అయితే తాజాగా ఈ సినిమాను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది అమెజాన్ ప్రైమ్. జూన్ 23 నుంచి సబ్స్క్రైబర్లు ఫ్రీగా మూవీ చూడొచ్చని వెల్లడించింది. this complete entertainer is now coming for you 🍿#SarkaruVaariPaataOnPrime, June 23 pic.twitter.com/4Kt1BFJC8D — amazon prime video IN (@PrimeVideoIN) June 15, 2022 చదవండి: కథ, డైలాగులు రాసేస్తున్న హీరోలు.. అట్లుంటది వీళ్లతోని! సినిమాలు చేయకుంటే ఆ కెరీర్ ఎంచుకుంటా: సాయి పల్లవి -
కొత్త ట్రెండ్.. స్టేజ్‌పై స్టార్ హీరోల స్టెప్పులు
ఒకప్పుడు హీరోలు స్టేజ్‌పై తమ సినిమాలోని డైలాగ్స్ చెపి అభిమానులను ఖుషీ చేసేశారు. కానీ ఇప్పుడు హీరోలు అదే స్టేజ్‌పై స్టెప్పులేయడం ట్రెండ్‌గా మారింది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ లో మైక్ పట్టుకుని అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సిన హీరోలు అంతటితో ఆగకుండా అదే స్టేట్ పై స్టెప్పులేస్తూ ఈవెంట్ వచ్చిన ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తున్నారు. సినిమా సక్సెస్ ను అందరితో షేర్ చేసుకుంటున్నారు. ఇటీవల సర్కారు వారు పాట ప్రమోషన్స్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు స్టేజ్‌పై స్టెప్పులేసి టోటల్ టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచాడు. (చదవండి: వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్) అలాగే ఎఫ్3 సక్సెస్ మీట్లో విక్టరీ వెంకటేష్ కూడా స్టేస్పై డాన్స్ చేశారు.తాజాగా అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, నజ్రియా మాత్రమే కాకుండా టోటల్ యూనిట్ ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ కు స్టెప్పులేసింది. The TRIO of Team #F3Movie rocks the stage dancing for 'Kurradu Baboye' DJ Mix 💥💥😍😍 Triple Blockbuster FUNtastic Celebrations! 🥳 📽️ https://t.co/YuJh17JmAd#F3TripleBlockbuster@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @ThisIsDSP @SVC_official @adityamusic @shreyasgroup pic.twitter.com/UptRcOSs9b — Sri Venkateswara Creations (@SVC_official) June 4, 2022 కరోనా కాలంలో థియేటర్స్‌కి ప్రేక్షకులను రప్పించడం కోసమే హీరోలో ఇలా డాన్స్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామమే అని ఇటీవల అల్లు అరవింద్ అన్నారు. .ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించేందుకు ఇండస్ట్రీకి కొన్ని సూచనలు కూడా చేశారు. వాటిల్లో హీరోలు సీరియస్ గా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాలని చెప్పారు. Sundar, Leela and their families are enjoying themselves on the stage with the Hook Step ❤️ Watch #AnteSundaraniki Pre Release Celebrations Live Now 💥💥#PKforSundar ❤️🔥 - https://t.co/tZCkxpv1zw IN CINEMAS TOMORROW 💥@NameisNani #NazriyaFahadh pic.twitter.com/4Ca25cStuR — Mythri Movie Makers (@MythriOfficial) June 9, 2022 -
మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'మురారి వా' సాంగ్ వచ్చేసిందిగా..
Mahesh Babu Sarkaru Vaari Paata Murari Vaa Song Released: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఆడియెన్స్ మళ్లీ మళ్లీ చూసేలా, మరింత చేరువయ్యేలా 'మురారి వా' అనే సాంగ్‌ను యాడ్ చేసింది చిత్రబృందం. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ పాటను రిలీజ్ చేసింది. ఈ పాటలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్ కాస్ట్యూమ్స్, డ్యాన్స్, లొకేషన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. మహేశ్, కీర్తి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది. అంతేకాకుండా కీర్తి సురేశ్‌ను చాలా గ్లామరస్‌గా చూపించారు. ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రచించగా శ్రుతి రంజని, ఎంఎల్ గాయత్రి, శ్రీ కృష్ణ ఆలపించారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్.. -
OTT: 3 వారాలకే అమెజాన్‌లో సర్కారు వారి పాట స్ట్రీమింగ్, కానీ..
Sarkaru Vaari Paata Now Streaming On Amazon Prime: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీ ఓటీటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు అమెజాన్ షాకిచ్చింది. తాజాగా సర్కారు వారి పాటను స్ట్రీమింగ్ చేస్తున్న ఆమె ట్విస్ట్ ఇచ్చింది. విడుదలైన మూడు వారాలకే సర్కారు వారి పాట ఇప్పుడు అమెజాన్‌లో చేస్తుంది. అయితే ఈ మూవీని చూడాలంటే మాత్రం కండీషన్ అప్లై ఉంది. చదవండి: మాల్లో ఛీల్ అవుతున్న తారక్, ఎక్కడో తెలుసా? the right mix of drama, action and comedy with a mind-blowing plot twist ✨#EarlyAccessOnPrime, Rent Now 🍿 pic.twitter.com/9n522fZtZu — amazon prime video IN (@PrimeVideoIN) June 2, 2022 పే-పర్-వ్యూ పద్దతిలో సర్కారు వారి పాటను స్ట్రీమింగ్ చేస్తోంది అమెజాన్. ‘సర్కారి వారి పాట’ చూడాలంటే సబ్స్క్రైబర్లు మూవీ రెంటల్స్‌లో రూ. 199 చెల్లించాల్సి ఉంది. కాగా ఇప్పటికే కేజీయఫ్ 2ను ఇదే విధానంలో అందుబాటులో తెచ్చిన ఆమెజాన్ ఇప్పుడు సర్కారు వారి పాట విషయంలోనూ ఇదే స్ట్రాటజీని అమలు చేసింది. కాగా పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. చదవండి: ఆస్ట్రేలియా ఆఫర్, భారీ రెమ్యునరేషన్, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట! -
'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్..
Anand Mahindra Interesting Tweet On Mahesh Babu Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. 'సర్కారు వారి పాట' రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. తాజాగా ఈ చిత్రంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తికరంగా ట్వీట్ చేశారు. అనుపమ్ తరేజా పోస్ట్ చేసిన ఓ వీడియోకు స్పందనగా రీట్వీట్ చేశారు. 'అన్‌బీటబుల్ కాంబినేషన్ అయిన సూపర్ స్టార్ మహేశ్ బాబు, జావా మెరూన్‌లను చూడకుండా ఎలా ఉండగలను. ప్రస్తుతం నేను న్యూయార్క్‌లో ఉన్నాను. న్యూ జెర్సీకి వెళ్లి సినిమా ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడికి వెళ్లి చూస్తాను.' అంటూ ఆనంద్ మహీంద్రా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చదవండి: 👇 అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే.. రూ. 85 కోట్లకుపైగా నష్టం కమల్ హాసన్: ఆయనతో కలిసి నటించాలని ప్రాధేయపడ్డా.. కానీ.. How can I miss watching the unbeatable combination of @urstrulyMahesh and Jawa? I’m in New York & will go out to New Jersey where it’s being screened… #SarkaruVaariPaata, #JawaMaroon https://t.co/ytc5pPQbl1 — anand mahindra (@anandmahindra) May 29, 2022 -
ఓటీటీకి ‘సర్కారు వారి పాట’, అంతకు ముందే స్ట్రీమింగ్?
Sarkaru Vaari Paata OTT Streaming: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన తొలి సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డు సృష్టించింది. చదవండి: మనసులో మాట చెప్పమన్న అషూ, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ సందడి చేస్తుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఒప్పందం ప్రకారం పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అనంతరం నెల రోజుల ముందుగానే ఈ సినిమాను అమెజాన్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఈ నెల చివరిలో లేదా జూన్ 10న ఈమూవీ ఓటీటీకి రాబోతుందట. లేదా జూన్ 24న నుంచి స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే పెద్ద సినిమాలు థియేట్రికల్ రన్‌టైం అనంతరం నెల రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తాయి. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ చూసిన హాలీవుడ్ మూవీ రైటర్, జక్కన్నపై ఆసక్తికర వ్యాఖ్యలు అందులోనూ సర్కారు వారి పాట వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీకి వచ్చేందుకు కనీసం రెండు నెలలైన పడుతుందని అందరు అభిప్రాయం పడ్డారు. కానీ ఈ మూవీని త్వరలోనే ఓటీటీకి తీసుకువచ్చేందుకు అమెజాన్ ప్లాన్ చేస్తుందట. ఇందుకోసం నెల రోజుల ముందుగానే డిజిటల్ రిలీజ్‌కు మేకర్స్‌తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుందని తెలుస్తోంది. ఈ బజ్ ప్రకారం సర్కారు వారి పాట అతి త్వరలోనే ఓటీటీకి రాబోతుందని సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. -
12 రోజులు..రూ.200 కోట్లు.. ‘సర్కారు వారి పాట’ రికార్డు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన తొలి సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డు సృష్టించింది. 12రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ.156.9కోట్ల గ్రాస్, రూ.100.01కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఇప్పటి వరకు 122.09 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వరకు కొత్త సినిమాలేవి రిలీజ్‌కు లేకపోవడంతో కలెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Super 🌟 @urstrulyMahesh's SWAG SEASON continues 🔥🔥#BlockbusterSVP 💥💥#SVPMania #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/mWZ9u6xo8s — Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2022 మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని విలన్‌గా నటించారు. తమన్ సంగీతం అందించాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మహేశ్ బాబు ఫారిన్ టూర్.. ఎక్కడికంటే ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న మహేశ్ బాబు ఫారిన్ టూర్ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఆయన యూరప్‌లో ల్యాండ్ అయ్యారు. దాదాపు రెండు వారాలు మహేశ్ అక్కడే ఉంటారని సమాచారం. ఫారిన్ ట్రిప్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా షూటింగ్లో మహేశ్‌బాబు జాయిన్ అవుతారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏప్రిల్ నెలాఖరులో కూడా మహేశ్ బాబు ఫారిన్ టూర్‌కు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. చదవండి: సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు
Mahesh Babu About Sitara In Chit Chat With Youtubers: 'ఆ సీన్ చూసి సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు' అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేర్కొన్నాడు. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో భాగంగా శనివారం (మే 21) పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేశ్ బాబు, కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్ పాల్గొన్నారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను వారితో పంచుకోవాలని మహేశ్ బాబు తెలిపాడు. ''ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నప్పటికీ కీర్తి చేయలేకపోయింది. దీంతో డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి 'మేడమ్.. మీరు సార్‌ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి ఆయన్ను మీరు తిట్టాలి.' అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బందిపడుతోందని నాకు అర్థమైంది. అప్పుడు నేను 'పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు' అని చెప్పాను. దానికి ఆమె 'సార్.. నేను మిమ్మల్ని తిట్టలేను. ఒకవేళ నేను మిమ్మల్ని తిడితే మీ ఫ్యాన్స్ నన్ను ఏదో ఒకటి అంటారు.' అని చెప్పింది. 'నా ఫ్యాన్స్ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు.' అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తయ్యేలా చేశాం. కానీ మొన్న నా ఫ్యామిలీతో కలిసి ఆ సీన్ చూసినప్పుడు సితార ఇచ్చిన రియాక్షన్ ఇప్పటివరకూ నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి నవ్వింది.'' అని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు. చదవండి: అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు ఆ సినిమా చూసి ఏడ్చేశాను : మహేశ్ బాబు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్ బాబు
Mahesh Babu Reaction On Stage Dance In Kurnool Meet: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను సర్కారు వారి పాట టీమ్ ఎంజాయ్ చేస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి మహేశ్ బాబు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేశ్, డైరెక్టర్ పరశురామ్‌తో కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగాలనే కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. 'సభలో స్టేజ్ పైకి ఎక్కి డ్యాన్స్ ఎక్కి చేశారు కదా. అసలు అలా ఎందుకు చేశారు ?' అని అడిగిన ప్రశ్నకు మహేశ్ బాబు.. 'అది ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్ మొత్తం షాక్, సర్ప్రైజ్లో ఉండిపోయింది. రెండేళ్లు కష్టపడి మూవీ చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ చూశాక.. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్ చేయాలనిపించింది. అలా చేసేశా.' అని సమాధానం ఇచ్చారు. కాగా 'సర్కారు వారి పాట' రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. చదవండి: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. ఎప్పుడంటే అప్పన్న భక్తులకు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు క్షమాపణ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అప్పన్న భక్తులకు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు క్షమాపణ
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్‌తో పలికించిన ఒక డైలాగ్ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే క్షమించాలని ఆ సినిమా దర్శకుడు పరశురామ్ తెలిపారు. సర్కారు వారి పాట సినిమా విజయవంతం కావడంతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. (చదవండి: అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ) ఈ సందర్భంగా సినిమాలోని ఒక డైలాగ్ విమర్శలకు తావివ్వడంపై మీడియా ప్రతినిధులు, కొందరు భక్తులు పరశురామ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఆ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు అడుగుతున్నానని తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అంటే తనకు ఎంతో భక్తి అని, వీలైనప్పుడల్లా స్వామిని దర్శించుకుంటానని అన్నారు. సర్కారు వారి పాట సినిమా ప్రారంభ సమయంలోనూ స్వామిని దర్శించుకున్నానన్నారు. సినిమాకు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. నాగచైతన్యతో త్వరలో సినిమా తీస్తున్నట్టు చెప్పారు. దర్శనార్థం వచ్చిన పరశురామ్ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సినిమా రిలీజైన రోజు ఉదయం మహేశ్‌బాబు ఫోన్ చేసి ఆ మాటన్నారు
‘‘సర్కారువారి పాట’ కథ అనుకున్నప్పుడే మహేశ్‌గారి కెరీర్లో పెద్ద హిట్ అవ్వాలని భావించాం. మేము ఊహించినట్లే సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డానో మహేశ్‌గారికి తెలుసు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉంది’’ అని డైరెక్టర్ పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా పరశురాం బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజైన రోజు ఉదయం మహేశ్‌గారు ఫోన్ చేసి, ‘అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది.. కంగ్రాట్స్’ అన్నారు. దర్శకులు సుకుమార్, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్‌గార్లు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ‘మహేశ్‌గారిని ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు.. బాగా చూపించారు’ అని ఆయన అభిమానులు ఫోన్ చేసి, ఆనందపడ్డారు. కథ చెప్పడంలో ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో శైలి. ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తూ చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పడం నాకు ఇష్టమైన శైలి. ఈ సినిమా పరంగా సూపర్ స్టార్ మహేశ్‌గారిని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం రెండో కిక్. మహేశ్‌గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం మూడో కిక్’’ అన్నారు. చదవండి 👇 ఆహాలో అశోకవనంలో అర్జున కల్యాణం, ఎప్పుడంటే? పోకిరి కంటే కూడా మహేశ్ ఈ సినిమాలో చాలా యంగ్‌గా ఉన్నాడు -
సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన
Super Star Krishna About Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోన్న ఈ చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అలాగే రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఇలా ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా సర్కారు వారి పాట రికార్డుకెక్కింది. ఇదిలా ఉంటే సర్కారు వారి పాట మూవీపై మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ స్పందించారు. చదవండి: జై భీమ్ వివాదం, హీరో సూర్య, జ్యోతికలపై ఎఫ్ఐఆర్ సర్కారు వారి పాట సక్సెస్ నేపథ్యంలో ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా సర్కారు వారి పాట ఇంత ఘనవిజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘మహేశ్ సర్కారు వారి పాట చాలా బాగుతుంది. ఫస్ట్ హాప్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్‌లో మహేశ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఈ మూవీ కలేక్షన్స్ అన్ని సెంటర్స్‌లోనూ హౌజ్‌ఫుల్‌తో పోతుంది. అయితే కొన్ని చానల్స్ మాత్రం మూవీ బాగాలేదని ప్రచారం చేస్తున్నారు’ అని అన్నారు. ఈ సినిమాలో మహేశ్ పోకిరి కంటే కూడా చాలా యంగ్ కనిపిస్తున్నాడంటూ కృష్ణ మురిసిపోయారు. మహేశ్ చాలా మెయిన్‌టెన్ చేస్తాడని, షూటింగ్ లేని రోజుల్లో ఎక్కువ సమయంలో జిమ్‌లోనే ఉంటాడని చెప్పారు. చదవండి: కంగనా చిత్రాలన్ని ఫ్లాప్ అవ్వాలని కోరుకుంటున్నా: నటి పాయల్ ఇక సర్కారు వారి పాట సినిమా గురించి సుప్రీం కోర్టులో మాట్లాడాలని, అంత మంచి కథ తీసుకున్నారని చెప్పారు. ఇక మే 31న ఆయన బర్త్‌డే వేడుకలపై స్పందిస్తూ స్ట్రెయిన్ అవుతున్న కారణంగా గత 5 ఏళ్లుగా బయటకు వెళ్లడం లేదని, తన చిన్న కూతురు ప్రయదర్శిని ఇంట్లోనే తనకు ఇష్టమైన వంటకాలు అన్ని చేస్తుందని తెలిపారు. అయితే సర్కారు వారి పాట మూవీ ఇంట్లోనే తన హోం థియేటర్లో చూశానని, సినిమా చూడగానే మహేశ్‌కు ఫోన్ చేశానన్నారు. చాలా బాగా నటించావని, పోకిరి, దూకుడు కంటే కూడా సర్కారు వారి పాట పెద్ద హిట్ అవుతుందని చెప్పడంతో వాడు చాలా హ్యాపీగా ఉన్నాడని పేర్కొన్నారు. అనంతరం భవిష్యత్తులో మహేశ్ అల్లూరి సీతారామరాజు సినిమా చేసే అవకాశం ఉందా? అని అడగ్గా వందశాతం ఈ మూవీ చేయబోడని కృష్ణ బదులిచ్చారు. -
'సర్కారు వారి పాట' విజయంపై మహేశ్ బాబు స్పందన..
Mahesh Babu Reaction On Sarkaru Vaari Paata Movie Success: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. 'సర్కారు వారి పాట' ఘన విజయంపై మహేశ్ బాబు స్పందించారు. చిత్రాన్ని సూపర్ హిట్ చేసినందుకు ఫ్యాన్స్‌కు, తనకు అద్భుతమైన మూవీని అందించిన తన టీమ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా డైరెక్టర్ పరశురామ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. 'సర్కారు వారి పాట చిత్రానికి వెల్లువెత్తుతున్న ప్రేమతో పొంగిపోయాను. మూవీని బ్లాక్ బ్లస్టర్ సక్సెస్ చేసినందుకు నా సూపర్ అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.' అని ట్వీట్ చేశారు మహేశ్ బాబు. Overwhelmed by the outpouring of love for #SarkaruVaariPaata! To all my super fans, a heartfelt thank you for making this film a blockbuster success! Gratitude always 🙏🙏🙏 pic.twitter.com/4kN8FzZFlE — Mahesh Babu (@urstrulyMahesh) May 18, 2022 A big thank you to the entire team of #SarkaruVaariPaata, my director @ParasuramPetla for giving me this amazing film, @KeerthyOfficial, producers @GMBents @MythriOfficial @14ReelsPlus and @MusicThaman for his incredible music! #SVP will always remain special ❤️❤️ — Mahesh Babu (@urstrulyMahesh) May 18, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
SVP: 'సమ్మర్ సెన్సెషనల్ బ్లాక్ బ్లస్టర్' ట్రైలర్ చూశారా !
Sarkaru Vaari Paata Summer Sensational Blockbuster Trailer Released: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపిస్తున్న సందర్బంగా సోమవారం కర్నూలులో విజయేత్సవ వేడుకను నిర్వహించింది చిత్రబృందం. ఈ వేడుకలో సర్కారు వారి పాట కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బ్లస్టర్' పేరుతో విడుదలైన ఈ ట్రైలర్లో మహేశ్ బాబు ఎక్స్ప్రెషన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక వెన్నెల కిశోర్, కీర్తి సురేశ్, సముద్ర ఖనితో మహేశ్ చేసే సందడిని ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఇందులో టైటిల్ ర్యాప్ సాంగ్ హైలెట్‌గా నిలిచింది. చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే.. -
‘బాక్సాఫీస్‌పై ‘సర్కారు వారి పాట’ దండయాత్ర
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. బాక్సాపీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే..) కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ని సాధించి, రికార్డు క్రియేట్ చేసింది. ఐదు రోజుల్లో రూ.100కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రమిది. నైజాం ఏరియాల్లో ఈ చిత్రం 31.47 కోట్ల వసూళ్లను రాబట్టింది. నైజాంలో 30కోట్లకు పైగా వసూళ్ల సాధించిన మూడో చిత్రమిది. ఈ చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. మరో 20 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉంది. ఇదే స్పీడ్ కొనసాగితే మరో మూడు, నాలుగు రోజుల్లోనే ‘సర్కారు వారి పాట’ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సర్కారు వారి పాట ఐదు రోజులు కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ.31.47 కోట్లు ► సీడెడ్ - రూ.10.44 కోట్లు ► ఈస్ట్ - రూ.7.05కోట్లు ► వెస్ట్ - రూ.4.65కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ.10.25 కోట్లు ► గుంటూరు- రూ.7.85కోట్లు ► కృష్ణా - రూ.5.76కోట్లు ► నెల్లూరు - రూ.3.12 కోట్లు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- 7.75 కోట్లు ►ఓవర్సీస్-12.1 కోట్లు ►మొత్తం 100.44 కోట్లు(షేర్) #BlockbusterSVP is setting new benchmarks in TFI 🔥#SVP #SVPMania #SarkaruVaariPaata Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/g4bAenYhDI — Mythri Movie Makers (@MythriOfficial) May 17, 2022 -
‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే..
Mahesh Babu About Sitara Reaction After Watching SVP: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12న థియేటర్లోకి వచ్చింది. విడుదలైన తొలి రోజు నుంచే హిట్‌టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ఈ మూవీ రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. చదవండి: వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్ ఈ నేపథ్యంలో కర్నూల్ ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి సర్కారు వారి పాట సక్సెస్ మీట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న మహేశ్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ‘సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ మా ఫ్యామిలీతో కలిసి చూసినప్పుడు మా అబ్బాయి(గౌతమ్ ఘట్టమనేని) షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇక సితార అయితే అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బాగా నటించావు నాన్న, ఇందులో చాలా అందంగా కూడా ఉన్నావు అని కితాబు ఇచ్చింది’ అంటూ మహేశ్ మురిసిపోయాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: మీడియా ముందుకు కరాటే కల్యాణి: నేను ఎక్కడికీ పారిపోలేదు అలాగే ఈ సినిమా చూసిన మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ రియాక్షన్ ఏంటని యాంకర్ అడగ్గా.. ఆయన సినిమా చూడగానే ఈ సినిమా పోకిరి, దూకుడు కంటే సూపర్ హిట్ అవుతుందని చెప్పారన్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముంద్రఖని, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, అజయ్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. -
వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్
-
SVP Success Meet Kurnool: కర్నూలులో ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ
-
వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్
కర్నూలు (కల్చరల్): అభిమానులు తనపై చూపిన ప్రేమ, అభిమానాలను జీవితంలో మరిచిపోలేనని సినీ హీరో మహేష్‌బాబు ఉద్వేగంతో చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు తనకు దొరికారన్నారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో కర్నూలు వచ్చానని.. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినట్టు చెప్పారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. మొదటిసారి వేదికపై డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఫంక్షన్లంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలని మహేష్‌బాబు అన్నారు. సినిమా డైరెక్టర్ పరుశురామ్ మాట్లాడుతూ.. కర్నూలులో విజయోత్సవ సభ జరుపుకోవడం లైఫ్ టైం గిఫ్ట్ అన్నారు. సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత అనంత శ్రీరామ్, ప్రొడ్యూసర్స్ నవీన్, రవి, గోపి, రామ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సర్కారువారి పాట కోసం సీక్రెట్‌గా థియేటర్‌కు వెళ్లిన హీరోయిన్
హ్యాండ్సమ్, స్వీట్, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అమ్మాయిలను ఇట్టే బుట్టలో పడేస్తాడు మహేశ్‌బాబు. ప్రతి సినిమాలోనూ మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడీ సూపర్‌స్టార్. ఆయన ఇటీవల నటించిన సినిమా సర్కారువారి పాట. ఈ మూవీలో ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు మహేశ్. ఈ సినిమా చూసేందుకు నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లింది. పీవీఆర్ ఆర్కే సినీప్లెక్స్‌లో మహేశ్ మూవీ చూసి ఎంజాయ్ చేసింది. ఈ క్రమంలో తననెవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్‌తో తన ముఖాన్ని కప్పుకుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ముఖానికి మాస్క్ ధరించి ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడుతూ ఫోన్లో సంభాషిస్తూ వడివడిగా నడుచుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమె సింప్లిసిటీకి ముచ్చటపడుతుంటే మరికొందరు మాత్రం హీరోయిన్‌కు కాస్త ప్రైవసీ ఇవ్వొచ్చుగా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. Yesterday @Sai_Pallavi92 mam Watched #SarkaruVaariPaata movie at PVR RK Cineplex (Hyderabad) 😃♥#SaiPallavi pic.twitter.com/e94wnk2OpM — Sai Pallavi™ (@SaipallaviFC) May 15, 2022 చదవండి: ఆర్జే కాజల్ హోం టూర్ వీడియో, దీంట్లో ఓ స్పెషల్ ఉంది! -
మేకింగ్ ఆఫ్ మూవీ - సర్కారు వారి పాట
-
ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. ఎప్పుడంటే
Sarkaru Vaari Paata OTT Platform: సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. భారీ మొత్తంలో ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో థియేట్రికల్ రన్ పూర్తైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
SVP: సుదర్శన్ థియేటర్లో నమ్రత సందడి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
-
SVP: సుదర్శన్ థియేటర్లో నమ్రత సందడి.. ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్
Namrata Shirodkar Watches Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మే 12న విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబడుతుడుతూ దూసుకుపోతోంది. అయితే సినిమా విడుదలైనప్పటినుంచే మహేశ్ బాబు అభిమానులతో థియేటర్ హాల్లు కిక్కిరిసిపోయాయి. తాజాగా ఈ మూవీని మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ వీక్షించారు. 'సర్కారు వారి పాట' సినిమాను తిలకించేందుకు నమ్రతా శిరోద్కర్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌కు వెళ్లారు. ఈ థియోటర్ అభిమానులతో సందడిగా మారింది. అధికజనంతో కిక్కిరిసిపోయింది. వారందరి మధ్య ఒక ప్రేక్షకురాలిగా నమ్రత సినిమాను వీక్షించారు. ఇదిలా ఉంటే ఫుల్ క్రౌడ్ ఉన్న ఆ థియేటర్లలో సందెట్లో సడేమియాలా జేబు దొంగలు చేతివాటం చూపించారు. ఓ వ్యక్తి జేబులో నుంచి పర్సు కొట్టేశారు. అందులో రూ. 2800 నగదు ఉన్నట్లు సమాచారం. తర్వాత అక్కడ కొద్దిసేపు పలువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చదవండి: గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ పార్టీ.. ఫోటోలు వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ సక్సెస్ పార్టీ.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల రాబడుతుండడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ .. మూవీ యూనిట్‌కి శుక్రవారం విందు ఏర్పాటు చేసింది. (చదవండి: 'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..) హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగిన ఈ పార్టీలో మహేశ్‌బాబు, నమ్రతలతో పాటు దర్శకుడు పరశురామ్, సుకుమార్, బుచ్చిబాబు, హరీశ్‌శంకర్, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ.. సర్కారు వారి పాటకు వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉందని నమ్రత రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. -
Sarkaru Vaari Paata: మహేశ్‌బాబు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమా వస్తోందంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది మాస్ మసాలా మూవీతో వచ్చాడంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. తాజాగా మహేశ్‌బాబు నటించిన సర్కారువారి పాట థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో నటీనటులు ఏ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నారన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ పరశురామ్ రూ.10 కోట్లు తీసుకోగా మహేశ్‌బాబు రూ.35 - 50 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ను బట్టి మహేశ్ తీసుకునే రెమ్యునరేషన్ లెక్కలు కూడా మారతాయట. అయితే ఈ సూపర్ స్టార్ తను ఎంత డబ్బు తీసుకున్నా దాని సాయంతో చిన్నారుల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తాడని, అలాంటప్పుడు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా తప్పు లేదంటున్నారు ఫ్యాన్స్. ఇక సర్కారువారిపాట సినిమా విషయానికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Bang! SUPERSTAR Box office bang 💵🔥#SVP SMASHED magical $1.5Million gross mark in the USA 🧨🧨#SVPUsaSandhadi #SarkaruvaariPaata @urstrulyMahesh @KeerthyOfficial@ParasuramPetla @GMBents @MythriOfficial @14ReelsPlus @FlyHighCinemas @ShlokaEnts#BlockbusterSVP pic.twitter.com/vGiT5iJ94T — SarkaruVaariPaata (@SVPTheFilm) May 14, 2022 Box Office Veta Shuru 💥💥 ALL TIME RECORD for #SVP 75 Crores gross worldwide on Day 1 for #SarkaruVaariPaata#BlockbusterSVP #SVPMania Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/ohgWExyDSt — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కు బ్యాండే అంటుంటారు ఫ్యాన్స్. ఈ మాటను మరోసారి నిజం చేసాడు మహేశ్‌బాబు. సర్కారువారి పాట పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్ స్టార్.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే జోష్ని కనబరిచాడు. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఏపీ, తెలంగాణల్లో కలిపి రెండో రోజు రూ.11.64 కోట్లను వసూలు చేసింది. నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్ 1.08 కోట్లు, వెస్ట్ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణా 89 లక్షలు, నెల్లూరులో 41లక్షల రూపాయలను వసూలు చేసింది. (చదవండి: మహేశ్ హీరోయిన్స్ మాస్ ఇమేజ్ పక్కా!) మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. రూ.50 కోట్ల క్లబ్లో చేరడానికి రెడీగా ఉంది. ఇక అమెరికాలో అయితే ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.5 మిలియన్స్ డాలర్లను కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది. సర్కారు వారి పాట రెండు రోజులు కలెక్షన్స్ వివరాలు(ఏపీ & తెలంగాణ) ► నైజాం - రూ.17.44 కోట్లు ► సీడెడ్ - రూ.6.15 కోట్లు ► ఈస్ట్ - రూ.4.33 కోట్లు ► వెస్ట్ - రూ.3.19కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ.5.38 కోట్లు ► గుంటూరు- రూ.6.34కోట్లు ► కృష్ణా - రూ.3.47 కోట్లు ► నెల్లూరు - రూ.1.97 కోట్లు ► మొత్తం రూ.48.27 కోట్లు -
మహేశ్ హీరోయిన్స్ మాస్ ఇమేజ్ పక్కా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాలో చాన్స్ అంటే హీరోయిన్స్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీ అన్నట్లే లెక్క. పైగా ఈ మధ్య కాలంలో సూపర్ స్టార్ మూవీలో కనిపించే హీరోయిన్స్ కు మాస్ ఇమేజ్ వచ్చేస్తోంది. వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం. అంతకు ముందు రష్మిక, ఇప్పుడు కీర్తిసురేశ్..ఇద్దరికి సరికొత్త ఇమేజ్ వచ్చేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీ వరకు రష్మిక ఇమేజ్ వేరు..ఆ తర్వాత ఆమె అందుకున్న ఇమేజ్ వేరు. అప్పటి వరకు క్యూట్ గా స్వీట్ గా కనిపిస్తూ వచ్చిన రష్మిక, సరిలేరు నీకెవ్వరులో మైండ్ బ్లాక్ సాంగ్ తో ఒక్క సారీగా మాస్ ఇమేజ్ అందుకుంది. మైండ్ బ్లాక్ సాంగ్ లో రష్మిక లుక్ వేసిన స్టెప్స్ ఆమెకు మరింతగా మాస్ ఇమేజ్ తీసుకొచ్చాయి. పుష్పలో అల్ట్రా మాస్ క్యారెక్టర్ శ్రీవల్లి పాత్రలో నటించేందుకు కాన్ఫిడెన్స్ అందించాయి. మహానటితో గొప్ప నటిగా పేరు తెచ్చుకుంది కీర్తిసురేశ్. ఆ తర్వాత అలాంటి సీరియస్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపిస్తూ వచ్చింది. కాని సర్కారు వారి పాటలో మ.. మ.. మహేషా సాంగ్ తో కీర్తి వేసిన స్టెప్పులు చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మహానటి వేసిన మాస్ మూవ్ కు ఫిదా అయ్యారు. సర్కారు వారి పాటతో అందివచ్చిన మాస్ ఇమేజ్ ను కీర్తీ సురేష్ కంటిన్యూ చేయాలనుకుంటోంది.నేచురల్ స్టార్ నానితో కలసి నటించబోయే కొత్త సినిమా ‘దసరా’లో మరో సారి మాస్ క్యారెక్టర్ తో సర్ ప్రైజ్ చేస్తానంటోంది. -
‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
Sarkaru Vaari Paata First Day Collection: సూపర్ స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ సర్కారు వారి పాట గురువారం(మే 12) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మహేశ్ నుంచి వచ్చిన సినిమా ఇది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ రివ్యూ) తెరపై సూపర్ స్టార్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి గుర్తు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ. 12.24 కోట్లు ► సీడెడ్ - రూ. 4.7 కోట్లు ► ఈస్ట్ - రూ. 3.25 కోట్లు ► వెస్ట్ - రూ. 2.74 కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ. 3.73 కోట్లు ► గుంటూరు- రూ. 5.83 కోట్లు ► కృష్ణా - రూ. 2.58 కోట్లు ► నెల్లూరు - రూ. 1.56 కోట్లు ► మొత్తం రూ.36.69 కోట్లు #SVP AP/TG Share 36.63Cr ALL TIME RECORD for Regional Film🤘💥#BlockbusterSVP #SarkaruVaariPaata https://t.co/QyE7gPFZIp — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం
‘‘దేశ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐతో ఇబ్బందిపడని మధ్య తరగతి మనిషి ఉండరు. అలాంటి పాయింట్‌ని మహేశ్‌గారి లాంటి సూపర్ స్టార్‌తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. రచయితగా, దర్శకుడిగా ఈ సినిమా నాకు తృప్తినిచ్చింది. మా సినిమాకి ప్రీమియర్ షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా ఉంది. మహేశ్‌గారి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చింది’’ అని పరశురాం అన్నారు. చదవండి: బాలీవుడ్‌పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘బ్లాక్ బస్టర్ మీట్’లో నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘మా రెండేళ్ల కష్టం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఎగిరిపోయింది. అమెరికాలో ప్రీమియర్‌లో మిలియన్ డాలర్స్‌ని కలెక్ట్ చేసి నాన్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులన్నీ క్రాస్ చేసింది’’ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో ‘సర్కారువారి పాట’ లాంటి పెద్ద సినిమా మళ్లీ చూడగలమా? అంటే సందేహమే’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే -
ప్రీమియర్ కలెక్షన్స్‌తో సర్కారువారి పాట రికార్డు
ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా?.. ఈ డైలాగ్ మహేశ్‌బాబుకు సెట్టయినంతగా మరెవరికీ సెట్ కాదేమో! ఎందుకంటే రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్. 'సర్కారువారి పాట'లో డిఫరెంట్ స్టెప్పులు, భిన్నమైన ఫైట్లు, యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్.. అన్నింటికీ మించి ఇంకా వయసు తగ్గినట్లుగా మరింత యంగ్‌గా కనిపించడంతో ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఇక మహేశ్, కీర్తి సురేశ్‌ల స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమాలో ఎక్కువగా కథ.. బ్యాంకుల్లో డబ్బులు ఎగ్గొట్టే బడా బాబుల గురించి తిరుగుతుంది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరశురామ్. కేవలం వార్తాపత్రికలో వచ్చిన ఓ కథనం ఆధారంగా సినిమా కథను రాసుకున్నానని చెప్పాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి, అందరికీ కనెక్ట్ అవుతుందని పేర్కొన్నాడు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. 'బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మాకు ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మహేశ్‌బాబుకు, డైరెక్టర్ పరశురామ్‌కు కృతజ్ఞతలు. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టే చిత్రంగా సర్కారువారి పాట నిలుస్తుంది. రెండువారాల్లోనే ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయి' అని తెలిపాడు. మరో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. మళ్లీ ఇప్పట్లో ఇలాంటి ఎనర్జిటిక్ రోల్లో మహేశ్‌ను మనం చూడలేము' అన్నాడు. చదవండి: 'సర్కారువారి పాట' పబ్లిక్ రివ్యూ, ఆడియన్స్ ఏమంటున్నారంటే? -
‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే
సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ‘సర్కారు వారి పాట’ చిత్రం ఈరోజు విడుదలైంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ ఈ సినిమా గురువారం(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో మహేశ్ నటన, కామెడీ పంచ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన సినీ ప్రముఖుల తమ రివ్యూను ప్రకటిస్తున్నారు. తాజాగా సర్కారు వారి పాట మూవీ చూసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మహేశ్‌పై ప్రశంసలు కురింపించారు. చదవండి: దిక్కుతోచక ఏటీఎమ్ రూమ్‌లో నిద్రించేవాడిని: బుల్లితెర నటుడు ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఎనర్జీటిక్గా నటన... కామెడీ పంచ్‌లు, డైలాగ్ డైలివరి అద్భుతం’ అంటూ కితాబు ఇచ్చారు. అనంతరం సర్కారు వారి పాట టీంకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమాపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని ఆయన అన్నారు. Superstar @urstrulyMahesh delivered a superb and energetic performance with fantastic comic timing in #SarkaruVaariPaata Congratulations to the entire team. — Raghavendra Rao K (@Ragavendraraoba) May 12, 2022 -
సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కార్ వారి పాట’ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమాపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని సదరు ట్వీట్ లో సాయిరెడ్డి పేర్కొన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారని కూడా సాయిరెడ్డి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు. All the best to #MaheshBabu #wishes #greetings. — Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022 -
'సర్కారువారి పాట' పబ్లిక్ రివ్యూ, ఆడియన్స్ ఏమంటున్నారంటే?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన మమ.. మహేశా, కళావతి, పెన్నీ సాంగ్స్ సోషల్ మీడియాను ఎంతలా షేక్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుమారు రెండున్నరేళ్ల తర్వాత మహేశ్‌బాబు సినిమా థియేటర్లలో రిలీజవడంతో ఫ్యాన్స్ హడావుడి అంతాఇంతా కాదు. మరి అభిమానులకు సర్కారు వారి పాట నచ్చిందా? సినిమాపై వాళ్ల అభిప్రాయం ఏంటి? అన్నది సాక్షి ఆడియన్స్ పోల్‌లో తెలుసుకుందాం.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ రివ్యూ, సినిమా ఎలా ఉందంటే.. త్వరలో పెళ్లి, ఇంతలో నగ్న ఫొటోలు షేర్ చేసిన సింగర్ -
‘సర్కారు వారి పాట’పై అమెరికా ఆడియన్స్ రివ్యూ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరో నుంచి సినిమా రావడంతో మహేశ్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. దీంతో అక్కడ కూడా పలు థియేటర్స్‌లో ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆడియన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం విజ్ఞప్తి
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూసిన ఆ రోజు వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ ఈ రోజు (మే 12న) విడుదలైంది. ఈ మూవీ చూసేందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కుడుతున్నారు. యాక్షన్-కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. తమన్ సంగీతం అందించాడు. చదవండి: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది: అల్లు అరవింద్ ఇదిలా ఉంటే మూవీ విడుదలకు కొద్ది గంటల ముందు ‘సర్కారు వారి పాట’ మూవీ టీం ప్రేక్షకులకు ఓ విజ్ఞప్తి చేసింది. సినిమాకు సంబంధించిన ఎలాంటి ఫొటోలు, వీడియోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని చిత్రం బృందం కోరింది. అలాగే ఎవరైనా, ఎక్కడైనా మూవీ పైరసీకి పాల్పడినట్లు మీ దృష్టికి వస్తే 89786 50014,99124 25159, 88811 08888 నంబర్లకు వాట్సాప్ ద్వారా, యాంటిపైరసీ.కామ్ (antipiracysolution) సమాచారం ఇవ్వాలని పేర్కొంది. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు #SarkaruVaariPaata Anti Piracy Control Room: Report piracy at claims@antipiracysolutions.org Whatsapp: 8978650014 9912425159 8881108888 — Mythri Movie Makers (@MythriOfficial) May 11, 2022 -
మహేశ్ బాలీవుడ్ కామెంట్స్‌పై రియాక్ట్ అయిన నిర్మాత
Mukesh Bhatt on Mahesh Babu: బాలీవుడ్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవలె ఓ ప్రెస్మీట్లో మాట్లాడిన ఆయన తనను భరించడం బాలీవుడ్‌కు కష్టమని, అందుకే, తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మహేశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత ముకేశ్ భట్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'ఆయనకు కావాల్సిన సౌకర్యం బాలీవుడ్ ఇవ్వలేకపోవచ్చు అని అనుకోవడంలో తప్పులేదు. మహేశ్ ఎంతో ప్రతిభావంతుడు. ఆయన ప్రయాణాన్ని నేను గౌరవిస్తాను. అయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరో. మహేశ్ అంచనాలని బాలీవుడ్ అందుకోలేకపోవచ్చు అనడం ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అయితే అందులో ఎటువంటి తప్పు లేదు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
సర్కారు వారి పాట మూవీ పబ్లిక్ టాక్
-
‘సర్కారు వారి పాట’ రివ్యూ
టైటిల్ : సర్కారు వారి పాట నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని,వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకుడు: పరశురాం సంగీతం: తమన్ సినిమాటోగ్రఫి: ఆర్ మది ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: మే 12, 2022 భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీత గోవిందం మూవీతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సర్కారు వారి పాట’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. మహి అలియాస్ మహేశ్(మహేశ్ బాబు) ‘మహి ఫైనాన్స్ కార్పోరేషన్’ పేరుతో అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు . తన దగ్గరు ఫైనాన్స్ తీసుకున్నవారు సమయానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. లేదంటే వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి వసూలు చేస్తాడు. ఎంతటి వారినైనా వదిలిపెట్టడు. అలాంటి వ్యక్తి దగ్గర చదువు కోసమని అబద్దం చెప్పి 10 వేల డాలర్లు అప్పుగా తీసుకుంటుంది కళావతి(కీర్తి సురేశ్). ఎవరికి అంత ఈజీగా అప్పు ఇవ్వని మహేశ్.. ఆమెను తొలిచూపులోనే ఇష్టపడి అడిగినంత అప్పు ఇచ్చేస్తాడు. కళావతి మాత్రం ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటుంది. ఒక రోజు మహేశ్‌కు అసలు విషయం తెలుస్తుంది. దీంతో తను అప్పుగా ఇచ్చిన 10 వేల డాలర్లు తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దానికి నో చెప్పిన కళావతిపై చేయి కూడా చేసుకుంటాడు. అయినప్పటికీ డబ్బులు ఇవ్వకపోగా, `మా నాన్న ఎవరో తెలుసా? నీకు పైసా కూడా ఇవ్వను` అని మహేశ్‌ని రెచ్చగొడుతుంది. కళావతి తండ్రి రాజేంద్రనాథ్(సముద్రఖని) విఖాఖపట్నంలో ఓ పెద్ద వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ. ఆ డబ్బులు ఏవో అతని దగ్గరే వసూలు చేసుకుంటానని చెప్పి విశాఖపట్నం బయలుదేరుతాడు మహేశ్. అక్కడకు వచ్చాక తనకు రాజేంద్రనాథ్ ఇవ్వాల్సింది 10 వేల డాలర్లు కాదని, రూ. పదివేల కోట్లు అని మీడియాకు చెబుతాడు. అసలు ఆ పదివేల కోట్ల రూపాయాల కథేంటి? మహేశ్ బాబు గతం ఏంటి? చివరకు రూ.10వేల కోట్లను మహేశ్ ఎలా వసూలు చేశాడు అనేదే ‘సర్కారు వారి పాట’ మిగతా కథ. ఎలా ఉందంటే... బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలా మంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్లు అప్పును ఎగగొట్టి, సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురాం. ఓ మంచి సందేశాత్మక పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు.. దానికి కమర్షియల్ హంగులను జతపర్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో హీరో ఎత్తుకున్న పాయింట్ నిజాయితీగా ఉంటుంది. కమర్షియల్ సినిమాలను లాజిక్ లేకుండా చూడాల్సిందే కాబట్టి.. ప్రేక్షకుడికి అంత ఇబ్బందిగా అనిపించదు. ఫస్టాఫ్ అంతా కామెడీగా సాగుతుంది. వెన్నెల కిశోర్‌పై మహేశ్ వేసే పంచులు.. కళావతితో లవ్ ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తాయి. కేవలం 10వేల డాలర్ల కోసం అమెరికా నుంచి ఇండియాకు రావడం ఏంటనే సందేహం ప్రేక్షకుడికి కలగకుండా.. హీరో క్యారెక్టర్ని డిజైన్ చేశాడు దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ కథ కాస్త సీరియస్ టర్న్ తీసుకుంటుంది. కళావతితో ‘కాలు వేసి నిద్రించే’ కామెడీ సీన్ పెట్టి జోష్ నింపాడు దర్శకుడు. మహేశ్ వేసే పంచ్ డైలాగులు, ప్రభాస్ శ్రీను కామెడీ, ఫ్లాష్‌బ్యాక్‌తో సెకండాఫ్ కూడా ముగుస్తుంది. బ్యాంకుల గురించి హీరో చెప్పే డైలాగ్స్ అందరికి ఆలోచింపజేస్తాయి. మహేశ్ ఫ్యాన్స్‌కి నచ్చే అంశాలు ఈ చిత్రంలో బోలెడు ఉన్నాయి. ఎవరెలా చేశారంటే... అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే మహి పాత్రలో సూపర్ స్టార్ మహేశ్ బాబు పరకాయ ప్రవేశం చేశాడు. ఫైట్స్‌తో పాటు డ్యాన్స్ కూడా అద్భుతంగా చేశాడు. ఇక ఆయన కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. సినిమా మొత్తం తన భుజాన వేసుకొని నడిపించాడు.తెరపై చాలా స్టైలీష్‌గా కనిపించాడు. ఆకతాయి అమ్మాయి కళావతిగా కీర్తి సురేశ్ మెప్పించింది. ఇక మహేశ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజేంద్రనాథ్ పాత్రకు ప్రాణం పోశాడు ఆయన. వెన్నెల కిశోర్ కామెడీ ఆకట్టుకుంటుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ సంగీతం. పాటలతో తనదైన బీజీఎంతో అదరగొట్టేశాడు. కళావతి, మ.. మ.. మహేశా పాటలు అయితే థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ని కిర్రెక్కిస్తాయి. మది సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘సర్కారు వారి పాట’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చాడు పరశురాం. ఇక కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్ పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Mahesh carries this movie from start to finish and definitely his best performance in recent times especially the comedy portions👍 Thaman’s BGM was only effective in a few places and thought it could’ve been in some portions especially in the first half and fights #SVP — Venky Reviews (@venkyreviews) May 11, 2022 మహేశ్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీ. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్‌లో ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. ఫస్టాఫ్‌తో పాటు కొన్ని ఫైట్స్ సీన్స్‌కి తమన్ బీజీఎం అంతగా వర్కౌట్ కాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half🔔 :Good 👍 Mahesh Anna in Never before Style 🔥🔥🔥🥵🥵🤙🤙 One man show SSMB Chennai babu Adda 💥💫#SarkaruVaariPaata https://t.co/k28xtDVumd pic.twitter.com/K6OoEKylp1 — ShoLaY🎱 (@sholay9_9) May 12, 2022 ఫస్టాఫ్ గుడ్. మహేశ్ అన్న సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్ షో అంటూ ఓ నెటిజన్ తన రివ్యూని పోస్ట్ చేశాడు Mahesh Anna intro ayithe next level with @MusicThaman's music 🙌🙌 Idhi kada kavalsindhi.... Deenikosame andharu Mahesh fans waiting On Screen Penny song visuals 🔥🔥🔥🔥🔥🔥 @urstrulyMahesh Anna next level swag#MaheshBabu𓃵 #SVPCelebrations#SarkaruVaariPaata #SVPMania #SVP — Madhukar Doppalapudi (@urdhfm) May 12, 2022 మహేశ్ అన్న ఎంట్రీని అయితే తమన్ తనదైన బీజీఎంతో నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లాడు. ఇదికదా కావాల్సింది. దీసికోసమే మహేశ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. పెన్నీ సాంగ్ విజువల్స్ అదిరిపోయాయి’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #SarkaruVaariPaata What a come back to see the @urstrulyMahesh in big screen. The energy and vibe he carries throughout is amazing. Romance and comedy timing is wow till interval right mix of action, romance and comedy 🤩😍❤️🥰💐👏🙌 — Madhusudhanan Varadarajulu (@Madhusu76425277) May 12, 2022 #SarkaruVaariPaata 1st half Routine Rotta...@/petla 💦 Deeniki pokiri range elevations entraa baabu 🤮leaves zero excitement for 2nd half — Nandha (@Nandha95807957) May 11, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪😎 — Madhav Singh 💙 (@Send4Madhav) May 12, 2022 Okka Expression ledhu Oka proper Plot ledhu Konni konni saarlu idi comedy na Anipinchindi ra thu worst lo worst 1.5 /5 Disaster . Disappointed.#SarkaruVaariPaata — V$K (@RtsChestunta) May 12, 2022 #SarkaruVaariPaata Final Report : NON RRR INDUSTRY HIT. 👉Rating : 3.75/5 ⭐️ ⭐️ ⭐️ ⭐️ 👉BOXOFFICE WILL BLAST 🔥 🌊 👉#MaheshBabu Performance 👉Interval Block 👉Blockbuster First Half & Second Half 👉Mass Fights & #MaMaMahesha Song#SarkaaruVaariPaata #SVP — M@h€$h V@m$i (@maheshvamsi9) May 12, 2022 #SarkaruVaariPaata ...first half average..@KeerthyOfficial scenes and love track is nice...👌@urstrulyMahesh comedy timing..😂👌 — M@HaR$Hi (@MaharshiGollap1) May 12, 2022 #SarkaruVaariPaata 1st off 🔥 2 fights 💣 2 song's 🔥 Comdey 😊 Love 😘 Next level 💥#BlockBusterSarkaruVaaripaata — VEMULA MB 🔔 (@maheshbabu_jr) May 12, 2022 Superb first half @urstrulyMahesh screen presence outstanding, pre- interval 20 minutes 👏👏👌👌 SSMB comedy timing and charm this film 🙏🙏 #SarkaruVaariPaata — Raghava (@Raghava4mahesh) May 12, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 12, 2022 #SarkaruVaariPaata First half is very good Mahesh babu 👌👌👌👌 Scenes with keerthy suresh in first half and second half are 👌👌👌👌👌👌 Villan role and performance is biggest minus for the movie — Mithun Y (@mithun_y11) May 12, 2022 -
Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం!
కీర్తీ సురేష్ అంటే సంప్రదాయబద్ధమైన పాత్రలకు చిరునామా అన్నట్లు ఉంటారు. కానీ ఆర్టిస్ట్ అంటే అన్ని రకాల పాత్రలు చేయాలన్నది కీర్తి అభిప్రాయం. అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరించారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించనంత గ్లామరస్‌గా, మాస్‌గా ఈ సినిమాలో కనిపిస్తా’’ అంటున్నారు కీర్తి. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదల సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. ► ‘గుడ్ లక్ సఖి’, తమిళ చిత్రం ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’), మధ్యలో ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలి పాత్ర. వీటికి భిన్నంగా ‘సర్కారువారి పాట’లో కనిపించడం గురించి? ‘సర్కారువారి పాట’లో మాస్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాను. కాస్ట్యూమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. హెయిర్ స్టయిల్ కూడా భిన్నంగా ఉంటుంది. మేకప్ కొత్తగా ఉంటుంది. ఈ తేడా నాకు చాలా నచ్చింది. నాది సరదా పాత్ర. ఇప్పటివరకూ తెలుగులో చేసిన పాత్రలన్నింటికన్నా భిన్నంగా ఉంటుంది. ► అందుకేనేమో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ‘కళావతి..’ (‘సర్కారువారి పాట’లో కీర్తి పాత్ర) నాకు మంచి గిఫ్ట్ అన్నారు. అవును. రేపు సినిమా చూశాక నాకు ఈ పాత్ర మంచి బహుమతి అని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. తమిళంలో చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకూ ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ► మరి.. ‘మహానటి’ లాంటి భారీ పాత్ర చేసిన మీకు ‘కళావతి’లాంటి మాస్ క్యారెక్టర్ చేయడం ఈజీ అయ్యుంటుందనుకోవచ్చా? లేదు. కళావతి కూడా చాలెంజింగ్ రోలే. ఈ పాత్రలో ఫన్ ఉంది. నా దృష్టిలో ఏడిపించడం, నవ్వించడం చాలా కష్టం. ఈ రెండూ పెద్ద సవాల్. పైగా డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటుంది. పరశురాంగారి హెల్ప్‌తో డబ్బింగ్ చెప్పాను. ఏ పాత్ర సవాల్ దానికి ఉంటుంది. ‘మహానటి’ సవాల్ ‘మహానటి’ది.. కళావతి సవాల్ కళావతిది. అంతే.. ► ‘లవ్ ట్రాక్’ కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తారని మహేశ్‌బాబు అన్నారు... సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. కథతో పాటు ఈ ట్రాక్ ఉంటుంది. ఇలా లవ్ ట్రాక్ చేయడం నాకు ఫ్రెష్‌గా అనిపించింది. ► ఈ మధ్యే ‘చిన్ని’లో డీ గ్లామరస్‌గా కనిపించి, వారం తిరిగే సరికల్లా గ్లామరస్‌గా కనిపించడం గురించి.. ‘చిన్ని’లో సాదా సీదా బట్టలు, చింపిరి జుట్టుతో, చెవికి పోగులు కూడా లేకుండా కనిపిస్తాను. ఆ సినిమా విడుదలై వారం అయింది. వెంటనే ‘సర్కారువారి పాట’లో ఆ పాత్రకు భిన్నంగా గ్లామరస్‌గా కనిపించనున్నాను. ఇలా వెంట వెంటనే రెండు పూర్తి భిన్నమైన పాత్రల్లో కనిపించడం అనేది పెద్ద సవాల్. ఇలాంటి చాలెంజ్‌లు నాకిష్టం. ► తమిళంలో మాస్ సాంగ్స్‌కి డాన్స్ చేశారు.. ఇప్పుడు ‘మ..మ.. మహేశా..’ పాటకు మాస్ స్టెప్స్ వేయడం ఎలా అనిపించింది? ఈ పాట చాలా ఇష్టపడి చేశాను. ‘మ..మ.. మహేశా..’ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ సాంగ్. థియేటర్ అదిరిపోతుంది. సీట్లలోంచి లేచి మరీ ఫ్యాన్స్ డాన్స్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మాస్ సాంగ్స్ తమిళ్లో చేశాను. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. ► ‘మహానటి’తో అందరూ మిమ్మల్ని మహానటి అన్నారు. ‘సర్కారు వారి..’తో మాస్ హీరోయిన్ అంటారా? ఏమో.. నిజానికి ‘మహానటి’కి చాన్స్ వచ్చినప్పుడు నేనలాంటి సినిమా చేయగలనని అనుకోలేదు... చేసేశా. ఇప్పుడు ‘సర్కారువారి..’లో మంచి మాస్ పాత్ర చేశాను. ఒక ఆర్టిస్ట్‌గా ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలి. అప్పుడే పరిపూర్ణత ఉంటుంది. ► ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలిగా, ఇప్పుడు ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలిగా చేశారు. చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వస్తాయేమో అనే టెన్షన్ లేదా? అలా ఆలోచించలేదు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం సరి కాదనిపించింది. పైగా రజనీ సార్‌తో చాన్స్ దొరకడం కష్టం. అలాగే చిరంజీవి సార్‌తో. ఈ పాత్రలను ఇష్టపడి చేశాను. -
'సర్కారు వారి పాట'కు 'సర్కారు' గుడ్ న్యూస్.. ఆరోజు 6 షోలు
Telangana Government Permission To Sarkaru Vaari Paata Special Show: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మూవీ స్పెషల్ షోకి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూవీ విడుదల రోజు అంటే మే 12న ఉదయం 4 గంటలకే ఒక స్పెషల్ షో ప్రదర్శించుకేందుకు అనుమతినిచ్చింది. అయితే ఈ స్పెషల్ షోను కేవలం నాలుగు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లీ కార్జున, విశ్వనాథ్ థియేటర్లు, మూసాపేటలోని శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ప్రదర్శించనున్నారు. ఇవి కాకుండా ఇతర థియేటర్లలో ప్రత్యేక షోలు నిర్వహిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. సర్కారు వారి పాట సినిమా నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్ శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ విజ్ఞప్తి మేరకు ఈ సినిమాను మే 12న ఒక స్పెషల్ షోను నిర్వహించుకునేందుకు అనిమతి ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా పేర్కొన్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పెంపు కూడా వారం రోజులు అంటే మే 12 నుంచి 18 వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. అయితే గురువారం (మే 12) ఒక్క రోజు మాత్రం హైదరాబాద్‌లో ఆరు షోలు పడనున్నాయి. చదవండి: సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా ! ‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
‘బాలీవుడ్’ వ్యాఖ్యలపై మహేశ్ బాబు వివరణ
బాలీవుడ్‌పై మహేశ్‌బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఆయన ఓ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. తనను భరించడం బాలీవుడ్‌కు కష్టమని, అందుకే, తన సమయాన్ని వృథా చేసుకోవాలని అనుకోవట్లేదని ఆయన అన్నారు. దీంతో మహేశ్ అంత భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటారా? అనే కథనాలు హిందీ మీడియాలో వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన వ్యాఖ్యలపై మహేశ్ బాబు వివరణ ఇచ్చారు. ఆయన నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. (చదవండి: సీఎం జగన్‌తో గడిపిన సమయం గుర్తుండిపోతుంది: మహేశ్‌బాబు) ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన తెలుగు మీడియాతో ముచ్చటించారు. బాలీవుడ్‌పై చేసిన కామెంట్స్ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా...మహేశ్ తనదైన శైలీలో సమాధానం ఇచ్చాడు. ‘బాలీవుడ్‌పై నేను ఎప్పుడు నెగెటివ్ కామెంట్స్ చేయలేదు. నేను అన్ని భాషలను గౌరవిస్తాను. బాలీవుడ్ సినిమాలు చేయనని చెప్పలేదు..నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్. నేను ఇక్కడ హ్యాపీగా ఉన్నాను. అక్కడికి వెళ్లే ఆలోచనలేదు’ అని మహేశ్ చెప్పుకొచ్చారు. -
మహేశ్ బాబు హ్యాష్ ట్యాగ్ ఏంటో తెలుసా?
Mahesh Babu What's Happening Video Goes Viral: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట మే 12న విడుదల కాబోతోంది. పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ మే 12వ తేదీ కోసం ఆత్రుతుగా ఎదురు చూస్తున్నారు. మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నాడు మహేశ్. ఇందుకోసం ఆయన ట్విటర్లో సైతం మూవీని ప్రమోట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చదవండి: నయనతార పెళ్లిపై ప్రముఖ ఆస్ట్రాలజర్ సంచలన వ్యాఖ్యలు తాజాగా వాట్స్ హ్యాపెనింగ్ అంటూ ట్విటర్లో మహేశ్ ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మహేశ్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చాడు. మీ గురించి హ్యాష్ ట్యాగ్ రూపంలో ఎలా చెప్పుకుంటారు అని అడగ్గా ‘కామ్ అండ్ ఫోకస్డ్(Calm And Focused)’ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఒక ఎమోజీతో మిమ్మల్ని మీరు వివరించుకోవాలంటే?.. స్మైలీ(Smiley) ఎమోజీతో పోల్చుకుంటానని చెప్పాడు. ఆ తర్వాత ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నారని ప్రశ్నంచగా.. ‘నా భార్యకు (నమ్రత శిరొద్కర్) ట్విటర్ ఖాతా ఉంటే బాగుండేది.. తననే ఫాలో అయ్యేవాడిని’ అన్నాడు. ట్విటర్లో ఇప్పటి వరకు మీరు అందుకున్న అంత్యంత ఫన్నీ డీఎమ్(DM) ఏంటి? అని అడగ్గా.. ‘నిజానికి నా డీఎమ్ లాక్ చేయబడింది.. దాన్ని ఓపెన్ చేయమంటారా?’ అన్నాడు. చదవండి: ‘ద పీకాక్’ మ్యాగజైన్‌పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్ ట్విటర్లో ఏడిట్ ఆప్షన్ కావాలా?వాద్దా? అన్నదానికి.. ఖచ్చితంగా కావాలి అని బదులిచ్చాడు. ఇక మీరు నటించిన ఒక్కడు సినిమాలో ఏ క్యారెక్టర్‌ను ఫాలో అవుతారు? మ్యూట్ చేస్తారు? బ్లాక్ చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు.. స్వప్న(భూమిక) పాత్రను ఫాలో అవుతా.. నాకు తండ్రిగా నటించిన ముకేశ్ రిషిని మ్యూట్ చేస్తా.. ఓబుల్‌రెడ్డిని(ప్రకాశ్ రాజ్)బ్లాక్ చేస్తానంటూ మహేశ్ చెప్పుకొచ్చాడు. చివరిగా సర్కారు వారి పాట గురించి ట్వీట్లో ఒక్కమాటలో చెప్పాలంటే?.. ‘ఈ వేసవికి నా అభిమానులు సర్కారు వారి పాటను బ్లాస్ట్ చేస్తారని ఆశిస్తున్నా’ అంటూ జవాబు ఇచ్చాడు. ఇలా మహేశ్ నవ్వుతూ.. సరదాగా ఇచ్చిన ఈ సమాధానాలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. Here's #WhatsHappening! pic.twitter.com/zGF6s5crdk — Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022 -
సీఎం జగన్ చాలా సింపుల్.. ఎదుటి వాళ్లకు మంచి గౌరవం ఇస్తారు: మహేశ్ బాబు
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎప్ జగన్మోహన్రెడ్డి గారిని నేరుగా కలిసినప్పుడు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉంటారా? అని నేరుగా కలిసినప్పుడు అనిపించింది. ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు. ఆయనతో చాలా విషయాలను చర్చించాం. సినిమాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. బయట ఏం జరుగుతుంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు అడిగారు. ఇలాంటి మీటింగ్స్ మరికొన్ని జరిగితే బాగుంటుందని నేను అన్నాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది’ అని సూపర్‌స్టార్ మహేశ్ బాబు అన్నారు. మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్గా నటించింది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం (మే 10) హీరో మహేశ్ బాబు మీడయాతో ముచ్చటించారు. ఆ విశేషాలు. ► సర్కారు వారి పాట షూటింగ్ జర్నీ చాలా కష్టమైనది. లాక్డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోవడం.. మళ్లీ మొదలు పెట్టడం..ఇలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మా టీమ్ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. సర్కారు వారి పాట ఫుల్ క్రెడిట్ పరశురామ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే.. దీంట్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా చేశారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. కొన్ని సీన్స్‌లో అయితే పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాండీ లాంగ్వేజీలోకానీ.. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ట్రైలర్ అమెజింగ్. సినిమా కూడా అలానే ఉండబోతుంది. ► నా ప్రతి సినిమా పోకిరితో పోల్చలేదు. కానీ ఈ సినిమాలో నా ఫెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో మాదిరి ఉంటుంది. పోకిరిలో ఉన్న మాస్ క్యారెక్టర్ ఇందులో ఉంది. పోకిరి స్టేజ్‌లో ఉన్న క్యారెక్టరైజేషన్ దొరికిందని హ్యాపీగా ఉంది. ఆ కారణంగానే పోకిరితో ఈ సినిమాను పోల్చాను. ► పరశురాం గొప్ప రచయిత కూడా. ఒక రచయిత దర్శకుడు అయితే మంచి ఔట్పుట్ వస్తుందని నేను నమ్ముతాను. దాదాపు నా దర్శకులందరూ రచయితలే. అందుకే మంచి సినిమాలొచ్చాయి. ► సర్కారు వారి పాట కథ ఫస్టాఫ్‌లో యూఎస్‌లో మొదలై సెకండాఫ్‌లో వైజాగ్‌కి వస్తుంది. ► మ..మ..మహేశా పాట స్థానంలో మొదటగా వేరే సాంగ్ అనుకున్నాం. షూటింగ్ కూడా పూర్తి చేశాం. కానీ డైరెక్టర్ గారితో పాటు మిగతా వాళ్లు సినిమా ఫ్లో చూసి.. ఒక మాస్ సాంగ్ ఉంటే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అప్పుడు తమన్ మ..మ..మహేశా ట్యూన్ తీసుకొచ్చాడు. ఇలాంటి మాస్ సాంగ్ నా కెరీర్లోనే ఇంతవరకు చేయలేదు. ► మురారి పాట ఈ సినిమాలో ఉండదు. దాని స్థానంలో మాస్ సాంగ్ ఉంటుంది. మురారి పాటను యూట్యూబ్‌లో విడుదల చేస్తాం. ► లాక్డౌన్ కారణంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట్లో అనుకున్న స్క్రిప్ట్‌నే ఫాలో అయ్యాం. ► మెడపై రూపాయి టాటూ క్రెడిట్ కూడా పరశురాం గారిదే. టైటిల్ అనౌన్స్మెంట్, పోస్టర్ రిలీజ్ టైమ్‌కి నా హెయిర్ పోస్టర్లో ఉన్నంత పెరగలేదు. పరశురామ్ గారే టాటూ వేయించి ఉన్న పోస్టర్ డిజైన్ చూపించి మీ పాత్ర ఇలా ఉంటుందన్నారు. ► నా గత మూడు నాలుగు సినిమాల్లో సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాం. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఫస్ట్‌టైం మహేశ్‌ని ఇంత ఫ్రీగా చూపించారా అని సర్కారు వారి పాట సినిమా చూశాక అంతా అనుకుంటారు. అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ► సర్కారు వారి పాట సినిమాను తెలుగు మూవీగానే తీద్దాం అనుకున్నాం. పాన్ ఇండియా మూవీగా చేద్దామని అనుకోలేదు. ► ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. నాకు బాగా దగ్గరైనవాళ్లు దూరమయ్యారు. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్లో కాస్త ఎమోషనల్ అయ్యాను. ► కథలో నుంచి వచ్చిన టైటిల్ సర్కారువారి పాట. టైటిల్ ముందే లీక్ అయిపోయింది. అందరికి తెలిశాక నాకు వచ్చి చెప్పారు. వినగానే బాగా నచ్చేసింది.వెంటనే ఓకే చెప్పేశాను. ► బాలీవుడ్ సినిమాలు చేయనని నేను అనలేదు. నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్. ► రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో చేస్తాను. ► ఈ సినిమాలో కీర్తి సురేశ్ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. లవ్‌ట్రాక్ మాత్రం ఈ సినిమాకే హైలెట్. కీర్తి సురేశ్ చాలా బాగా నటించింది. ► తమన్ ఈ సినిమాకు ప్రాణం పెట్టేశాడు. మ్యూజిక్ సెన్సేషన్ అతనిప్పుడు. అతను ఏ మ్యూజిక్ ఇచ్చిన యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కళావతి పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తమన్ ఫస్ట్ ఈ ట్యూన్ ఇచ్చినప్పుడు మా అందరికి నచ్చలేదు. స్లోగా ఉంది, మెలోడీ అని నా ఫీలింగ్.. మహేశ్ లాంటి మీరో కమ కమాన్ కళావతి అని పాడోచ్చా అని దర్శకుడి ఫీలింగ్. కానీ తమన్ మాత్రం నా మాట విననండి. ఇది మహేశ్‌బాబు కెరీర్లో ఒక బెస్ట్ సాంగ్ అవుతుంది అని చెప్పాడు. పాట విడుదల తమన్ చెప్పిందే నిజమైంది. ఇప్పుడు ఇదే నా ఫెవరేట్ సాంగ్. ► రాజమౌళితో సినిమా చేయడం లాంగ్ ప్రాసెస్. కానీ అతనితో ఒక్క సినిమా చేస్తే..పాతిక సినిమాలు చేసినట్లే. ► నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెబుతున్న ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తారు. ► రామ్ లక్ష్మణ్‌లు నా ఫెవరేట్ ఫైట్ మాస్టర్స్ . వాళ్లు ఎప్పుడు కథనే ఫాలో అవుతారు. ప్రతి సినిమాలో కొత్త స్టైల్ ఉంటుంద. తమ చుట్టూ ఉన్నవాళ్లని జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే వాళ్లంటే నాకు ఇష్టం. ► ఈ సినిమాలో సముద్రఖని చాలా బాగా నటించారు. మొదట ఈ పాత్రలో దర్శకుడు చాలా పెద్ద పెద్ద నటుల పేర్లను చెప్పాడు. రెండు మూడు షెడ్యూల తర్వాత సముద్ర ఖనిని ఫైనల్ చేశాం. చాలా కొత్తగా ఉంటది ఆయన పాత్ర. సముద్ర ఖని అదగొట్టేశారు. సినిమా షూటింగ్ అయ్యాక.. గుర్తుగా నా కళ్ల జోడు ఇవ్వమని అడిగారు. ఆయన ఫెర్మార్మెన్స్ చూశాక.. ఒక కళ్ల జోడు ఏంటి.. ఒక కళ్ల జోడు కొట్టునే ఇవ్వాలనిపించింది. ► ‘నేను విన్నాను..నేను ఉన్నాను’ అనే డైలాగ్‌ని సినిమా చూశాక చాలా ఎంజాయ్ చేస్తారు. ► నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచననే లేదు. ఇంతవరకు నాన్నగారి బయోపిక్ కోసం ఎవరు నన్ను అప్రోచ్ కాలేదు. -
‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు. (చదవండి: సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు) అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. టికెట్ రేట్ల విషయానికొస్తే మల్టిప్లెక్స్, రిక్లైనర్, లార్జ్ స్క్రీన్ ఐమ్యాక్స్ వంటి థియేటర్లలో టికెట్‌పై రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతించినట్టు తెలిపారు. మిగిలిన నాన్ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. -
సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’.పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ బాబు ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్ఫార్మెన్స్ గురించి అడగ్గా.. మహేశ్ మాట్లాడుతూ.. అది తమన్ ఆలోచన అని, నమ్రతతో ఈ విషయం గురించి చెప్పేలోపు తమన్ నమ్రతని అడిగాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో సితార డ్యాన్స్ ఎండ్ టైటిల్స్‌లో అయినా కనిపిస్తుందా అని అడగ్గా.. 'మేకింగ్ వీడియోలో అనుకున్నాం. ఇప్పటికే ప్రింట్స్ యూఎస్‌కి వెళ్లిపోయాయి. అయినా దయచేసి ఇవన్నీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితర అడుగుతుంది. కానీ పర్ఫార్మన్స్ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేశ్. -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే
మొన్నటిదాకా థియేటర్లలో 'ఆర్ఆర్ఆర్', 'కేజీఎఫ్' వంటి పెద్ద సినిమాలు సందడి చేశాయి. మే నెలలో మరిన్ని భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ గ్యాప్‌లో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. . అటు ఓటీటీలు కూడా కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ మీ అరచేతిలో అంటూ కొత్త సరుకుతో సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.. సర్కారు వారి పాట సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. జయేశ్ భాయ్ జోర్దార్ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం జయేశ్ భాయ్ జోర్దార్. డైరెక్టర్ దివ్యాంగ్ ఠక్కర్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రచార కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 13న విడుదలకు సిద్దమైంది. భ్రూణహత్యల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటులు బోమన్ ఇరానీ, రత్నాపాఠక్ షాలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. యశ్‌రాజ్ ఫిలింస్ పతాకాంపై ఆదిత్య చోప్రా, మనీశ్ శర్మలు ఈ సినిమాను నిర్మించారు. ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు: దీ కశ్మీర్ ఫైల్స్ చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 11న విడుదలైన ఈ మూవీ రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. థియేటర్లలో రికార్డులు బద్దలు కొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీని షేక్ చేసేందుకు రెడీ అయింది. జీ 5లో మే 13 నుంచి ప్రసారం చేస్తున్నట్లు ఇటీవల వెల్లడించారు మేకర్స్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కశ్మీర్ ఫైల్స్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ ‘బీస్ట్’ మూవీ దళపతి విజయ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించాడు. పూజా హెగ్డే కథానాయిక. భారీ అంచనాలతో ఏప్రిల్ 13న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఎక్కువగా నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. పైగా ఈ సినిమా రిలీజైన మరునాడే కేజీఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ కావడంతో బీస్ట్ దూకుడుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా బీస్ట్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. సన్ నెక్స్ట్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో మే11 నుంచి బీస్ట్ ప్రసారం కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలు మే 12: ది మాట్రిక్స్ రెసరెక్షన్స్ మోడర్స్ లవ్(తెలుగు) మే 13: మోడర్న్ లవ్ ముంబై(హిందీ సిరీస్) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మే 13: స్నీకరెల్లా ఆహా మే 13: కుతుకు పత్తు(తమిళం) నెట్‌ఫ్లిక్స్ మే 12: సేవేజ్ బ్యూటీ వెబ్ సిరీస్ -
దేవకన్యలా మెరిసిన కీర్తి సురేష్ (ఫోటోలు)
-
మహేశ్ కోసం ఆ హీరోని పక్కకు పెట్టిన పరశురాం..నెక్ట్స్ అతనితోనే మూవీ!
మాట ఇస్తే, ఆ మాటకు కట్టుబడి ఉండటం అనేది గొప్ప విషయం. బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళికి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కాని టాలీవుడ్ లో తనకు కమిట్ మెంట్స్ ఉన్నాయని చెప్పి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. నాగ చైతన్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. 2018 లో రిలీజైన బ్లాక్ బస్టర్ గీత గోవిందం తర్వాత నాగ చైతన్య తో మూవీ కమిట్ అయ్యాడు డైరెక్టర్ పరశురాం. తీరా సెట్స్ పైకి వెళ్లాల్సిన సమయంలో మహేశ్ నుంచి సర్కారు వారి పాట చిత్రం చేయాల్సిందిగా కబురు రావడంతో నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. మే 12న సర్కారు వారి పాట రిలీజ్ అవుతోంది. (చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్) సర్కారు వారి పాట థియేటర్స్ కు వచ్చిన తర్వాత, వెంటనే నాగ చైతన్యతో సినిమా స్టార్ట్ చేస్తానని చెబుతున్నాడు పరశురాం. నాలుగేళ్ల క్రితం నాగ చైతన్య కోసం నాగేశ్వరరావు అనే టైటిల్ తో స్టోరీ రాసుకున్నాడట. ప్రస్తుతం ఇదే స్టోరీని తెరకెక్కిస్తానంటున్నాడు. సర్కారు వారి పాట నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. చైతూతో రష్మిక జోడి కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక నాగ చైతన్య సినిమా విషయాలకొస్తే.. బంగార్రాజు తర్వాత నాగ చైతన్య థ్యాంక్యూ అనే సినిమాను రిలీజ్ రెడీ చేశాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేయనున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈలోపు చైతూ అమెజాన్ కోసం వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతోనూ అలాగే పరశురాం తోనూ మూవీ స్టార్ట్ చేయనున్నాడు. -
‘సర్కారువారి పాట’ కు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
‘సర్కారువారి పాట’సినిమా యూనిట్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సినిమా టికెట్ల ధర పెంపుకు అనుమతి ఇచ్చింది. భారీ బడ్జెట్ సినిమా కావడంతో 10 రోజుల పాటు సాధారణ టికెట్ల రేటుపై రూ.45 అదనంగా వసూళ్లు చేసుకునే వెసులుబాటుని కలిపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల తర్వాత మళ్లీ పాత ధరలే కొనసాగుతాయి. టికెట్ల ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించిన ఏపీ ప్రభుత్వానికి ‘సర్కారువారి పాట’ యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. (చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్) -
నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్రబృందం.. శనివారం (మే 7) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్, వీరితో పాటు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, వంశీ పైడి పల్లి కూడా సందడి చేశారు. (చదవండి: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి) ఈ సందర్భంగా మహేశ్ బాబు తన అన్నయ్య రమేశ్‌బాబుని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు ( కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు అన్నయ్య రమేశ్ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. ఆ సమయంలో మహేశ్‌బాబు కరోనా బారిన పడడంతో చివరి చూపు కూడా నోచుకోలేదు). కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి..’ అంటూ మహేశ్‌బాబు ఎమోషనల్ అయ్యారు. -
‘సర్కారువారి పాట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Mahesh Babu: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి
‘‘సర్కారువారి పాట’లో నా పాత్రని ఎక్స్ట్రార్డినరీగా తీర్చిదిద్దిన పరశురాంగారికి థ్యాంక్స్.. నాకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి’’ అని మహేశ్‌బాబు అన్నారు. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రీ రిలీజ్ వేడు కలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘పరశురాంగారి కథ విని ఓకే చెప్పాను. ఆయన ఇంటికెళ్లిన తర్వాత.. ‘‘థ్యాంక్యూ సార్.. ‘ఒక్కడు’ చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను.. మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.. చూడండి ‘సర్కారు వారి పాట’ని ఎలా తీస్తానో.. ఇరగదీస్తాను’’ అని మెసేజ్ పెట్టారు. ‘థ్యాంక్యూ సార్. ఈరోజు మా నాన్నగారు (కృష్ణ), నా అభిమానులకు మీరు వన్నాఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్స్. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉంటాయి. వాటిలో హీరో హీరోయిన్ ట్రాక్ ఒకటి. ఈ ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. కచ్చితంగా.. రాసిపెట్టుకోండి. తమన్ నేపథ్య సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ‘సర్కారువారి పాట’ సినిమా ‘పోకిరి’ని దాటుతుందని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్‌గారు అనేవారు. ‘శ్రీమంతుడు’ సినిమాని ఎంత బాగా తీశారో ఈ సినిమాని అంతకంటే బాగా తీసిన కెమెరామేన్ మదిగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, దూకుడు’ లాంటి బ్లాక్బ్లస్టర్స్ ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్.. మన కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ ఇంకో మరచిపోలేని బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సర్కారువారి పాట’ పాటలు విడుదల కాగానే మూవీకి గుడ్ ఫీల్ వచ్చింది. ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఫీల్ బాగుండాలి. రిలీజ్‌కి ముందే బాక్సాఫీస్ హిట్ అని ముద్ర వేసుకుంటున్న సినిమా ఇది’’ అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్‌లో మహేశ్‌గారు ‘శ్రీమంతుడు’ చేశారు. అప్పుటికి మాకు అనుభవం లేకపోయినా మమ్మల్ని నమ్మి, సినిమా చేసి బ్లాక్‌బస్టర్ ఇచ్చి మాకు ఇండస్ట్రీలోకి పాజిటివ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమా మాతో చేసిన పరశురాంకి థ్యాంక్స్. మే 12న మా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది’’ అన్నారు. మనం సూపర్‌స్టార్‌ని (మహేశ్‌బాబు) ఎలా చూద్దామనుకుంటున్నామో పరశురాంగారు ఆ పాత్రని అలాగే డిజైన్ చేశారు. మే 12న మాకు డబుల్ బ్లాక్ బస్టర్’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘నాకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నారు మహేశ్‌గారు. ఈ సినిమాతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు పరశురాం. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘మ మ మహేశ..’ పాట చూశా. ఈ పాట థియేటర్లో దద్దరిల్లిపోతుందని మాట ఇస్తున్నా. పరశురాం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు.. తన డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడున్న బెస్ట్ మాటల రచయితల్లో తను ఒక్కడు. ‘గీత గోవిందం’ చూస్తే అంత సెన్సిటివ్‌గా చెప్పే ఆర్ట్ ఉంది. అలాంటి డైరెక్టర్ ఒక మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘సర్కారువారి పాట’లో చూస్తారు. ‘1 నేనొక్కడినే’ అప్పుడు మహేశ్‌గారు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సెట్లో కింగ్‌లా ఉంటాడు. డైరెక్టర్స్‌కి అంత నమ్మకాన్ని ఇస్తారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారికి బెస్ట్ మెలోడీ పాటలు ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించాను. ఫస్ట్ టైమ్ క్లాసికల్‌గా ‘కళావతి..’ పాట వినిపించినప్పుడు నాకు వందకు రెండొందల మార్కులు వేశారు’’ అన్నారు. మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లల్లో చాలా జరిగాయి.. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు (చెమర్చిన కళ్లతో).. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి. ఈ 12న మీ అందరికీ నచ్చే సినిమా (సర్కారువారి పాట) రాబోతోంది.. మళ్లీ మనందరికీ పండగే. – మహేశ్‌బాబు -
మహేశ్ బాబుపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఎస్ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను స్పీడ్ చేసిన చిత్రబృందం శనివారం (మే 7) ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ 1వ టీఎస్ఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 'సుమతో తకిట తకిట విత్ తమన్' పేరుతో చిట్‌చాట్ జరిగింది. తర్వాత ఈ మూవీ టీమ్ క్రికెట్ ప్లేయర్స్ అయితే ఎవరెవరికీ ఏ పొజిషన్ ఇస్తారని తమన్‌ను యాంకర్ సుమ అడిగింది. దానికి తమన్ వికేట్ కీపర్‌గా పరశురామ్, బౌలర్‌గా కీర్తి సురేశ్ అని చెప్పాడు. దీంతో తన బౌలింగ్‌కు ఎవరైనా ఔట్ కావాల్సిందేనా అని సుమ అడగ్గా.. 'అవును. తన నటనతో బాగా నమ్మించేసింది' అంటూ చెప్పుకొచ్చాడు తమన్. అనంతరం మంచి ఫీల్డర్ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు పేరు చెప్పాడు తమన్. ఎటునుంచి వచ్చిన బాల్‌ను పట్టుకునేది ఒక కెప్టెన్ అది మహేశ్ బాబు అని తమన్ పేర్కొన్నాడు. చదవండి: సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా ! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా !
Sarkaru Vaari Paata: Mahesh Babu Ma Ma Mahesha Full Song Released: సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఇటీవల ఈ సినిమా నుంచి 'మ.. మ.. మహేశా' అనే పాట ప్రొమోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పూర్తి పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో మ్యూజిక్, లిరిక్స్, మహేశ్ బాబు స్టెప్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాయగా, జొనిత గాంధీ, శ్రీకృష్ణ ఆలపించారు. ఇప్పటికే విడుదలైన ఈ సాంగ్ ప్రొమోకు రికార్డు స్థాయిలో వ్యూస్ రాగా, ప్రస్తుతం రిలీజైన పూర్తి పాట కచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని మహేశ్ బాబు ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అలాగే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం (మే 7) ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది చిత్రబృందం. చదవండి: అభిమానుల కోసం మహేశ్‌బాబు లేఖ, నెట్టింట వైరల్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అభిమానుల కోసం మహేశ్‌బాబు లేఖ, నెట్టింట వైరల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన మాస్ ఎంటర్టైనర్ సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేసిన యూనిట్ నేడు ప్రీరిలీజ్ ఈవెంట్ జరపబోతోంది. ఈ క్రమంలో మహేశ్‌బాబు ఫ్యాన్స్ కోసం ఓ లేఖ వదిలాడు. లేఖలో ఏముందంటే... 'సర్కారువారి పాట షూటింగ్ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారువారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు' అని రాసి ఉంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్ రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో మొదలవుతుందని తన సినిమా అప్డేట్ కూడా చెప్పేశాడు మహేశ్. మొత్తానికి ఫ్యాన్స్‌ను తన సినిమా థియేటర్లలోనే చూడండని చెప్తూనే కొత్త సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ఉందని గుడ్‌న్యూస్ చెప్పాడు. Superstar #MaheshBabu's letter to fans. Requests fans to watch #SarkaruVaariPaata only in theaters.#SSMB28 begins from June. pic.twitter.com/GHApyH47df — Manobala Vijayabalan (@ManobalaV) May 7, 2022 చదవండి: ఫ్యాన్సీ అమౌంట్‌కు షారుక్ ఖాన్ 'పఠాన్' డిజిటల్ రైట్స్.. గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ -
గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
Sarkaru Vaari Paata Grant Pre Release Event: సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం ఈ రోజు గ్రాండ్ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకోనుంది. శనివారం(మే 7) సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడ 1వ టీఎస్ఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో ఈ వేడుకను నిర్వహించారు. చదవండి: సర్కారువారి పాట: మ.. మ.. మహేశా సాంగ్ విన్నారా? మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులోని కళావతి సాంగ్, ఎవ్రీ పెన్నీ సాంగ్‌లు అయితే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచాయి. దీంతో ఈ మూవీని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు, మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. The Day is Here 💥 Witness the Grand #SVPPreReleaseEvent today evening 🤘 Watch Live here - https://t.co/WvhBKoVltB #SarkaruVaariPaata #SVPMania #SVP pic.twitter.com/y5WaFnbo9G — Mythri Movie Makers (@MythriOfficial) May 7, 2022 -
వైఎస్ఆర్గారిని చూస్తే హీరో ఫీలింగ్
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని నేను. ఆయన్ని చూస్తే ఒక హీరో అనే అనుభూతి కలుగుతుంది. ఆయన వద్దకు ఏదైనా సమస్యని తీసుకెళితే ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ భరోసా ఇచ్చేవారు. ‘సర్కారువారి పాట’లో అలాంటి ఒక సందర్భంలో మహేశ్‌గారు ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు’’ అని పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పరశురాం మీడియాతో పంచుకున్న విశేషాలు. ‘గీత గోవిందం’ నిర్మాణంలో ఉన్నప్పుడే ‘సర్కారువారి పాట’ ఐడియా వచ్చింది. ‘గీత గోవిందం’ హిట్ నాకు గొప్ప ఎనర్జీ ఇచ్చింది. పరశురాం అనే దర్శకుడు రూ. 150కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్ని ఇండస్ట్రీకి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇక ‘గీత గోవిందం’ విడుదలయ్యాక మహేశ్‌గారిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ చేశాను. ఈ చిత్రంలో బ్యాంక్ టాపిక్ ఉంటుంది కానీ మహేశ్‌గారు బ్యాంక్ ఉద్యోగి కాదు. ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి కానీ, వ్యవస్థని ప్రశ్నించడం కానీ ఉండవు. నా కల తీరింది మహేశ్‌గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ‘సర్కారువారి పాట’ ఆయన కోసం రాసిన కథ. దేవుడి దయ వల్ల ఆయనే చేయడంతో నా కల తీరింది. ఈ కథని అల్లు అర్జున్‌గారికి చెప్పలేదు. ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఉన్నప్పటికీ నాలాంటి ఒక మీడియమ్ రేంజ్ దర్శకుడికి మహేశ్‌గారు చాన్స్ ఎలా ఇచ్చారనే ప్రశ్న కొందరిలో ఉండొచ్చు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీలవుతారు. నేను చెప్పిన కథ నచ్చే మహేశ్‌గారు ‘సర్కారువారి పాట’కి పచ్చజెండా ఉపారు.‘పోకిరి’ ఒక అండర్ కాప్ బిహేవియర్. ‘సర్కారువారి పాట’ ఒక కామన్‌మేన్ బిహేవియర్. ఇందులో మహేశ్‌గారి మ్యానరిజమ్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్, డాన్స్‌లు చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతారు. కీర్తి పాత్ర లవ్లీగా ఉంటుంది ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి కీర్తీ సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. తనది బలమైన పాత్ర. లవ్లీగా, లైవ్లీగా ఉంటుంది. ఆమె పాత్రకు కూడా మంచి పేరొస్తుంది. సముద్ర ఖని పాత్ర అద్భుతంగా ఉంటుంది. పూరీగారు అభినందించారు మా గురువు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌గార్ల సినిమాలన్నీ చూస్తాను. అందుకేనేమో డైలాగులు బాగా రాయగలుగుతున్నాను. ‘సర్కారువారి..’ ట్రైలర్ చూసి పూరీగారు అభినందించారు. నెక్ట్స్ నాగచైతన్యతో... ‘పెన్నీ...’ సాంగ్ ప్రమోషన్లో సితార డాన్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘సర్కారువారి పాట’ని పాన్ ఇండియాగా చేయాలనే ఆలోచన నాకు కానీ, మహేశ్‌గారికి కానీ లేదు. ముందు అనుకున్నట్లే చేశాం. అన్ని చోట్లా తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. నా తర్వాతి సినిమా నాగచైతన్య హీరోగా 14 రీల్స్ నిర్మాణంలో ఉంటుంది. -
సర్కారువారి పాట: మ.. మ.. మహేశా సాంగ్ విన్నారా?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం సర్కారువారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేశాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాను షేక్ చేసేందుకు మరో సాంగ్ సిద్ధమైంది. ఈ మేరకు చిత్రయూనిట్ మ.. మ.. మహేశా అనే పాట ప్రోమోను రిలీజ్ చేసింది. ఇందులో బ్యూటిఫుల్ డ్రెస్సింగ్, అదరగొట్టే స్టెప్స్‌తో అదరగొట్టారు మహేశ్, కీర్తి. సన్నజాజి మూర తెస్తా సోమవారం, మల్లెపూల మూర తెస్తా మంగళారం.. అంటూ మహేశ్ స్టెప్పులేయగా.. మ..మ.. మహేశా, నే ము..ము.. ముస్తాబయ్యి ఇట్టా వచ్చేశా అంటూ కీర్తి గ్రేస్‌తో చిందేశింది. పూర్తి పాట వినాలంటే మాత్రం మే 7వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే! చదవండి: సౌత్ రీమేక్స్ అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను ఇట్స్ టూ మచ్, అంత మేకప్ అక్కర్లేదు.. నటిపై ట్రోలింగ్ -
సూపర్ స్టార్ మహేశ్ గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఇదే..
సూపర్ స్టార్ మహేశ్ బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసులో 25ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తారు మహేశ్. సినిమా, సినిమాకి సరికొత్త లుక్‌లో కనిపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తారు. ఆయన గ్లామర్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని హీరో,హీరోయిన్లు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా మహేశ్ అంత హ్యండ్సమ్గా కనిపించడం రహస్యాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ –లక్ష్మణ్‌లు బయటపెట్టారు. పరుశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన సర్కారు వారి పాట మే12న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్‌గా పనిచేసిన రామ్ –లక్ష్మణ్‌లు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ ఛార్మింగ్ లుక్ సీక్రెట్‌ను లీక్ చేశారు. “మహేష్ ఇంత అందంగా, కూల్ గా, ఛార్మింగ్ గా కనిపించడానికి కారణం ప్రతి రోజు ధ్యానం చేయడమే. ఆయన రోజూ మూన్ ద్యానం చేస్తారు. దీనివల్ల చాలా కూల్‌గా కనిపిస్తారు. ఈ మూన్ ధ్యానం వల్ల సుదీర్ఘ కాలంగా చేయడం వలన మహేష్ ఇంత ఛార్మింగ్‌గా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిరోజూ యోగా, వర్కవుట్స్‌తో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుంటారు. ఇదే ఆయన గ్లామర్‌కి సీక్రెట్ అంటూ చెప్పుకొచ్చారు. -
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సరికొత్త రికార్డు..
Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మరో వారం రోజుల్లో అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్‌పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. అలాగే 1.2 మిలియన్స్‌కుపైగా లైక్స్‌తో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది ఈ మూవీ ప్రచార చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్‌లో 603 ప్రాంతాల్లో రిలీజ్ చేయనున్నారట. పాన్ ఇండియా మూవీస్ తప్పితే ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఇన్ని ప్రదేశాల్లో విడుదల కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్లో భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ Super🌟 @urstrulyMahesh sets a new benchmark in TFI ❤️🔥❤️🔥#SVPTrailer is the MOST VIEWED trailer of TFI in 24 hours with 27M+ Views & 1.2M+ Likes! - https://t.co/AMjXMIUh7F@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/DulbFZZssX — Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2022 అయితే అక్కడ మే 11న 'సర్కారు వారి పాట' ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ నెల 7న భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. -
ఈ మూవీకి కీర్తి పేరును నేనే సిఫార్స్ చేశా, మహేశ్ కాదు: డైరెక్టర్
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మే 12 ఈ మూవీ థియేటర్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు, హీరోయిన్ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ పరశురామ్ మూవీ విశేషాలతో పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సర్కారు వారి పాట కథ రాసుకున్నాననని చెప్పారు. చదవండి: ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ ‘మహేశ్ బాబు గారి కోసమే ఈ స్క్రిప్ట్ రాశాను. ఒకవేళ ఆయన ఈ కథను రిజెక్ట్ చేస్తే స్క్రిప్ట్ పక్కన పెట్టేయాలని అనుకున్నా. కానీ మహేశ్ బాబు గారికి కథ వివరిస్తున్నంతసేపు ఆయన ఎంజాయ్ చేశారు. అప్పుడే ఆయనకు కథ నచ్చిందని అర్థమైంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పూర్తి స్క్రిప్ట్ విన్నాక.. కథ చాలా బాగుందంటూ మహేశ్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారన్నారు. ఆ వెంటనే హీరోయిన్గా ఎవరిని అనుకుంటున్నారని మహేశ్ తనని అడిగారని, అప్పుడే కీర్తి సురేశ్ పేరు చెప్పానన్నారు. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు అందుకు ఆయన వెంటనే ఒకే అనేశారని చెప్పారు. అయితే కీర్తి సురేశ్‌ను చూసిన దగ్గర నుంచి ఆమెతో సినిమా చేయాలని అనుకున్నానని, అది సర్కారు వారి పాటతో కుదరిందన్నారు. అయితే ఈ సినిమాకు ఆమెను తీసుకోవడం వెనుక పాత్ర పరమైన కారణం ఉండి ఉంటుందనే ఉద్దేశంతో మహేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. కథ ఒకసారి లాక్ చేసిన తరువాత మహేశ్ గారు ఏ విషయంలోను జోక్యం చేసుకోరని ఆయన వివరించారు. అలా కీర్తి సురేశ్ పేరును ఈ సినిమాకు తానే సిఫార్స్ చేశానని, మహేశ్ కాదని డైరెక్టర్ పరశురామ్ స్పష్టం చేశారు. -
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు రిహార్సల్స్‌కు రాలేదు: శేఖర్ మాస్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా నుంచి ఇటీవల రిలీజైన ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్ వ్యూస్‌ను క్రాస్ చేసి టాలీవుడ్ ఫాస్టెస్ట్ వన్ డే రికార్డ్ నెలకొల్పింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకొని రికార్డ్ వేగంతో దూసుకుపోతుంది. ఇక కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్.. ప్రేక్షకులని అమితంగా అలరించాయి. ముఖ్యంగా కళావతి పాట 150 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ పాటలో మహేష్ బాబు వేసిన సిగ్నేచర్ స్టెప్స్‌కు సోషల్ మీడియాలో రికార్డ్ స్థాయి రీల్స్ సందడి చేశాయి. మే 12న ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపధ్యంలో సినిమా కోసం గ్రేట్ సిగ్నేచర్ మూమెంట్స్ కంపోజ్ చేసిన స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మీడియాతో ముచ్చటించారు. కళావతి, పెన్నీ పాటలతో పాటు సర్కారువారి పాట నుంచి రాబోయే మాస్ సాంగ్ విశేషాలు ఇలా పంచుకున్నారు... ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు ? బుల్లితెర, వెండితెరని అలరిస్తున్నారు. మీ సీక్రెట్ ఏమిటి ? సీక్రెట్ ఏం లేదండీ. ఇచ్చిన పని చక్కగా చేయడమే. నా దృష్టి వెండితెరపైనే వుంది. ఐతే నెలకు రెండు రోజులు టీవీ షూటింగ్ కి సమయం కేటాయించా. సర్కారు వారి పాటలో ఎన్ని పాటలు చేశారు ? మూడు. కళావతి, పెన్నీ, ఇంకో మాస్ సాంగ్. కళావతి, పెన్నీ ఇప్పటికే విజయాలు సాధించాయి. రాబోతున్న పాట కూడా ఫ్యాన్స్ కు గొప్ప ట్రీట్. ఇందులో మహేష్ బాబు గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్స్ట్ లెవల్ లో వుంటాయి. ఒక పెద్ద హీరో సినిమా చేస్తున్నపుడు ఒత్తిడి వుంటుందా ? ఒత్తిడి వుండదు. ఒక సాంగ్ కి మించిన సాంగ్ ఇవ్వాలనే పట్టుదల వుంటుంది, దాని కోసమే కష్టపడి పని చేస్తాం. సరిలేరు నికెవ్వరులో మైండ్ బ్లాక్ పాట సూపర్ హిట్. దానికంటే గొప్ప పాట ఇవ్వడానికి ప్రయత్నించాం. పాట అద్భుతంగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. మహేశ్ గారితో మీ కాంబినేషన్ ? మహేశ్‌బాబు గారితో సరిలేరు నికెవ్వరులో డ్యాంగ్ డ్యాంగ్, మైండ్ బ్లాక్, సర్కారు వారి పాటలో మూడు సాంగ్స్. మహేశ్‌బాబు చాలా త్వరగా నేర్చుకుంటారు. మహేష్ బాబుగారిలో అద్భుతమైన రిధమ్ వుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ అర్ధం చేసుకుంటే చాలు. కళావతి పాటని అందరూ రీల్స్ చేశారు. మహేష్, సితార ల్లో ఎవరు బాగా చేశారు ? ఒక కోరియోగ్రఫర్ గా చెప్పండి? మహేష్-సితార ఇద్దరూ బాగా చేశారు. సితార పాపలో గొప్ప గ్రేస్ వుంది. ఐతే పెన్నీ ప్రమోషనల్ సాంగ్ కొరియోగ్రఫీలో నేను లేను. మా అసిస్టెంట్స్ చేశారు. సినిమాలో వచ్చే పాటలో సితార పాప కనిపించదు. కాపీ స్టెప్పులు అని విమర్శలు వస్తుంటాయి కదా ? దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ? మనం ఒరిజినల్ గా చేస్తే మనది మనకే తెలిసిపోతుంది. మూమెంట్ కంపోజ్ చేస్తున్నపుడే కొత్తగా వుందా లేదా ? అనేది అర్ధమైపోతుంది. డ్యాన్స్ కాకుండా సాంగ్ లో కోరియోగ్రఫర్ ఇన్పుట్స్ ఎలా వుంటాయి ? ప్రాపర్టీస్ ని కూడా సజస్ట్ చేస్తారా ? కోరియోగ్రఫి అంటే డ్యాన్స్ మాత్రం కాదు.. సాంగ్ ని అందంగా ప్రజంట్ చేయాల్సిన బాధ్యత వుంటుంది. మూమెంట్స్ తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీ, కాస్ట్యూమ్స్ కూడా కొన్నిసార్లు చెబుతాం. దర్శకులు కూడా సూచనలు చేస్తారు. కళావతి పాటని ఫారిన్ లో షూట్ చేశాం. బ్యాగ్ గ్రౌండ్ లో సితారలు వుంటే బావుంటుంది అనిపించింది. దర్శకుడు పరశురాం గారికి చెప్పా. ఆయన ఓకే అన్నారు. అప్పటికప్పుడు వేరే చోట నుంచి తెప్పించి షూట్ చేశాం. సాంగ్ లో బ్యుటిఫుల్ గా కనిపించాయి. మహేశ్ గారితో పని చేయడం ఎలా అనిపిస్తుంది ? మహేశ్ గారికి ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎన్ని మార్కులు వేస్తారు? మహేశ్‌బాబు గారితో పనిచేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్. మనం ఓకే అన్నా .. ''మాస్టర్ ఇంకోసారి చేద్దామా' అంటారు. ఈ సినిమాలో ఆయన మరింత అందంగా కనిపిస్తారు. డ్యాన్స్ విషయానికి వస్తే సర్కారు వారి పాటలో సరికొత్త మహేశ్‌బాబు గారిని చూస్తారు. మహేష్ గారి డ్యాన్సులకి వంద మార్కులు వేస్తా. మీ పిల్లల్ని కూడా ఈ రంగంలో ప్రోత్సహిస్తున్నారా ? ఈ మధ్య డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ పాప ప్యాషన్ డిజైన్ అవుతానని అంటుంది. బాబు డాక్టర్ అంటున్నాడు. ఏం కావాలో ఛాయిస్ వాళ్ళకే ఇచ్చేశా. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువయ్యాయి కదా ? ఇది కొరియోగ్రఫీలో కూడా వుంటుందా ? కొరియోగ్రఫీకి అలా ఏం వుండదు. ఇప్పుడు పాన్ ఇండియా అని అంటున్నారు కానీ 'టాపు లేచిపోద్ది' పాటని ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. 'పుష్ప' మూమెంట్స్ కూడా పాన్ వరల్డ్ లో సందడి చేశాయి కదా. మూమెంట్ యునిక్ , క్యాచిగా వుంటే జనాల దృష్టిని ఆకట్టుకుంటుంది. టీమ్ ఇండియా క్రికెటర్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మా మూమెంట్స్ రీల్స్ చేస్తుంటే చాలా హ్యాపీగా వుంటుంది. ఆచార్యలో మెగాస్టార్ చిరంజీవి- మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సాంగ్ ని ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా అంచనా వేశారు కదా ? ఆచార్య సాంగ్ ఎంత డిమాండ్ చేసిందో అంతా చేశాం. కథలో సందర్భాన్ని బట్టే కొరియోగ్రఫీ వుంటుంది. కొరియోగ్రాఫేర్ గా మీ డ్రీమ్ ఏమిటి ? చిరంజీవి గారికి, ప్రభు మాస్టర్ కి చేయాలని అనుకున్నాను. ఆ టార్గెట్ రీచ్ అయ్యింది. రాజమౌళిగారితో, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి చేయాలని వుంది. మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు? ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు. ఆయన స్పాట్ లో చేసేస్తారు. మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు. మీ అంచనాలు తప్పిన పాట ? 'జైలవకుశ లో ట్రింగ్ ట్రింగ్ సాంగ్. చాలా కొత్తగా చేశాం. చాలా ఆదరణ పొందుతుందని భావించాం. కానీ అది అనుకున్నంత కనెక్ట్ కాలేదు. కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా ? లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ? చిరంజీవి గారు మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాకా సినిమాలకి చేస్తున్నా. శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు. చదవండి: నామినేషన్స్‌లో బిందు ఓవరాక్షన్, టైటిల్ గెలిచే అర్హత లేదంటూ ట్రోలింగ్ నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
SVP: మహేశ్ బాబు డాన్స్‌పై శేఖర్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Sekhar Master About Mahesh Babu Mental Mass Step: ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ కొరియోగ్రఫర్‌గా రాణిస్తున్నాడు శేఖర్ మాస్టర్. ప్రభుదేవ, లారెన్స్‌ల తర్వాత అంతగా పాపులర్ అయ్యాడు. ప్రస్తుతం అగ్ర హీరోలతో మాస్, క్లాస్ స్టెప్పులు వేయిస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్‌పై తన మార్క్ తప్పసరిగా కనిపిస్తుంది. ఇక అల్లు అర్జున్ సరైనోడులో ‘బ్లాక్ బస్టర్.. బ్లాక్ బస్టరే’, అలా వైకుంఠపురంలోని ‘రాములో రాములో’ పాటల సిగ్నెచర్ స్టెప్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవి జనంలోకి ఎంతగా దూసుకేళ్లాయో తెలిసిందే. చదవండి: ‘లైగర్’కి రికార్డు డీల్స్, డిజిటల్, ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ఆఫర్స్ ఇప్పుడు తాజాగా నెటిజన్లు ఎక్కువగా ఫాలో అవుతున్న స్టెప్ కళావతి సాంగ్. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో స్టైలిష్‌గా, క్యూట్‌గా వేయించిన ఈ స్టెప్‌కు ప్రస్తుతం ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. దీంతో ఆ స్టెప్‌ను అందరూ ఫాలో అవుతున్నారు. కొరియోగ్రాఫర్‌గా తనకంటూ ప్రత్యేక మార్క్ వేయించుకున్న శేఖర్ మాస్టర్ తాజాగా సాక్షితో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తనకు ఈ సినిమా ఆఫర్ ఎలా వచ్చింది, కళావతి స్టెప్‌పై మహేశ్ బాబు రియాక్షన్ ఎంటన్నది ఆయన మాటల్లోనే వినండి! చదవండి: సుమ చేతిపై ఆ వ్యక్తి పేరు.. సీక్రెట్ రివీల్ చేసిన యాంకరమ్మ -
ఈ సినిమాను మహేశ్ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అదే: డైరెక్టర్ పరశురామ్
Director Parasuram About Mahesh babu Role: దర్శకుడు పరశురామ్ తాజాగా రూపొందించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ మరికొద్ది రోజుల్లో థియేటర్లో సందడి చేయబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఈ క్రమంలో నిన్న(మే 2న) ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ 24 గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మూవీ ప్రమోషన్లో భాగంగా డైరెక్టర్ పరశురామ్ ఓ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నాడు. ‘ఈ సినిమాలో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఇంతకుముందు ఆయన చేసిన ఏ సినిమాలోని పాత్రను.. ఈ సినిమాలో పాత్రతో పోల్చలేము. అందుకే ఆయన కథ విన్న వెంటనే ఓకే చేశారు’ అని అన్నాడు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ అలాగే ‘ఈ సినిమాలో ఆయన రోల్ యాటిట్యూడ్ చాలా కొత్తగా కనిపిస్తుంది. ఈ సినిమా కథాకథనాలు, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మహేశ్ బాబుకి ఎంతో నచ్చాయి. అన్నింటికీ మించి హీరో పాత్ర, యాటిట్యూడ్ ఆయనను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను ఆయన ఒప్పుకోవడానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఇక సినిమాలో మహేశ్ డాన్స్, ఫైట్స్, నెక్ట్ లెవెల్లో ఉంటాయి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. కాగా మహేశ్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 12న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. -
ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ చేస్తోన్న ఈ సినిమా మే12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలతో మూవీటీం బిజీ అయ్యింది. తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. హాఫ్ స్క్రీన్‌లో మహేశ్ బాబు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందని అడగ్గా.. ఆయనతో షూటింగ్ చాలా సరదాగా ఉంటుందని కీర్తి సురేష్ పేర్కొంది. ఓ సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు నా టైమింగ్ మిస్సయ్యి స్టెప్పులు మర్చిపోయాను. ఆ సమయంలో పొరపాటున నా చేయి మహేశ్ సార్ ముఖానికి రెండుసార్లు తగిలింది. అప్పటికే సారీ చెప్పగా, మూడోసారి కూడా అదే రిపీట్ కావడంతో ‘నేను ఏమైనా తప్పు చేశానా నీకు?’అంటూ మహేశ్ సరదాగా అడిగారని చెప్పుకొచ్చింది. -
24 గంటలు గడవకముందే 'సర్కారు వారి పాట' రికార్డు..
Mahesh Babu Sarkaru Vaari Paata Trailer Gets 24 Million Views In Youtube: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విలన్‌గా సముద్ర ఖని అలరించనున్నారు. మే 12న ఈ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచిన చిత్ర యూనిట్ మే 2న ట్రైలర్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. (చదవండి: 'సర్కారు వారి పాట'ను బాగా వాడేసిన హైదరాబాద్ పోలీసులు..) ఈ ట్రైలర్ 19 గంటల్లో అంటే 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఈ వ్యూస్‌తోపాటు ఒక మిలియన్ లైక్స్ కూడా సాధించింది. అంతేకాకుండా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడే ఇన్ని లైక్స్, వ్యూస్ సాధించిన ఈ ప్రచార చిత్రం 24 గంటలు గడిస్తే మరెన్ని రికార్డులు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. ఈ ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. ఈ మూవీ నుంచి ఇదివరకు విడుదలైన పెన్నీ, కళావతి పాటలు, టీజర్ విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. (చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం) That's Super🌟 @urstrulyMahesh reporting from the top of @YouTubeIndia sir 😎#SVPTrailer Trending #1 🔥 - https://t.co/AMjXMIUh7F#SVPOnMay12@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/WuLQIWEW2u — Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2022 -
'సర్కారు వారి పాట'ను బాగా వాడేసిన హైదరాబాద్ పోలీసులు..
SVP Trailer: Hyderabad Police Awareness With Helmet Scene: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇటీవల విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్‌లోని సీన్లు, డైలాగ్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ట్రైలర్‌లోని సీన్లు ప్రేక్షకులనే కాకుండా హైదరాబాద్ సిటీ పోలీసులను సైతం బాగా ఆకర్షించాయి. ఈ మూవీ ప్రచార చిత్రంలో ఓ సన్నివేశంలో విలన్‌కు హెల్మెట్ పెడుతూ డైలాగ్ చెప్తాడు మహేశ్ బాబు. ఈ సీన్‌ను హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ అకౌంట్ నిర్వాహకులు బాగా వాడారు. మూవీలోని ఈ సీన్‌కు క్రెడిట్ ఇస్తూ హెల్మెట్ ధరించండి, భద్రత ముఖ్యం అంటూ ట్వీట్ చేశారు. సాధారణంగానే బాగా వైరల్ అయిన సీన్లు, సాంగ్స్, హుక్ స్టెప్స్లను మార్ఫింగ్ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇక ట్రైలర్లోనే హెల్మెట్ ధరించడం ఉండేసరికి వీడియో పోస్ట్ చేస్తూ కొటేషన్స్‌తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట #WearHelmet #SafetyFirst Vc: SarkaruVaariPaataTrailer pic.twitter.com/Npgg05zeXs — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) May 2, 2022 -
థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్.. అద్దాలు ధ్వంసం
SVP Trailer: Mahesh Babu Fans Hulchal At Bramaramba Theatre: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశు రామ్ దర్శకత్వంలో మహేశ్‌కు సరసన హీరోయిన్గా మహానటి కీర్తి సురేష్ నటించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌లో స్పీడు పెంచారు మేకర్స్. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన పెన్నీ, కళావతి, టీజర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీపై భారీగా హైప్ పెరిగింది. తాజాగా 'సర్కారు వారి పాట' మూవీ ట్రైలర్‌ను సోమవారం (మే 2)న విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ లాంచ్ అయిన హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో మహేశ్ బాబు ఫ్యాన్స్ హల్చల్ చేశారు. ఈ క్రమంలో మహేశ్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో థియేటర్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అభిమానులకు గాయాలు కూడా అయినట్లు సమాచారం. చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట -
మహేశ్‌బాబు నోట ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట
Mahesh Babu Mass Dialogues In Sarkaru Vari Pata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ రానే వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన హీరోయిన్గా కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్లో మహేశ్ బాబు లుక్స్, డైలాగ్‌లు, డైలాగ్ డెలివరీ అభిమానులనే కాదు ప్రేక్షకులను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ట్రైలర్లో మహేశ్ చెప్పిన డైలాగ్‌లు బాగా పేలాయి. 'నువ్ నా ప్రేమను, స్నేహాన్ని దొంగలించగలవు కానీ నా డబ్బును దొంగలించలేవ్', 'నేను విన్నాను.. నేను ఉన్నాను', 'వంద వయగ్రాలు వేసి శోభనానికి ఎదురుచూస్తున్న పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చార్రా', 'దిస్ ఈజ్ మహేశ్ రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలుప్పాడ బీచ్ సర్' వంటి తదితర డైలాగ్‌లు ఓ రేంజ్లో ఉన్నాయి. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే మాటలను.. కూడా ఈ మూవీలో వాడారు. చదవండి: విశ్వక్ సేన్-టీవీ యాంకర్ వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. -
‘సర్కారు వారి పాట’ మూవీ (ఫొటోలు)
-
మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్
Mahesh Babu Sarkaru Vaari Paata Trailer Out Now: సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలో వరుస అప్డేట్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన రాగా.. కళావతి, ఎవ్రీ పెన్నీ పాటలు అత్యధిక వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేశాయి. చదవండి: ‘గెట్ అవుట్’ అంటూ విశ్వక్ సేన్‌పై టీవీ యాంకర్ ఫైర్ ఈ నేపథ్యంలో నేడు(మే 2) సర్కారు వారి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో ట్రైలార్ లాంచ్ ఈవెంట్‌ను కూకటపల్లిలోని భ్రమరాంబ థియేటర్లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించి మెంటల్ మాస్ స్వాగ్తో కూడిన 105 షార్ట్స్ గల ట్రైలర్ వదిలారు మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. యాక్షన్, రొమాన్స్ సన్నివేశాలతో సాంతం ఆకట్టుకుంటోంది. చదవండి: హీరో విశ్వక్ సేన్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు ‘యు కెన్ స్టీల్ మై లవ్(నా ప్రేమ దొంగలించగలవు), యు కెన్ స్టీల్ మై ఫ్రెండ్షిప్(నా స్నేహాన్నీ.. దొంగలించగలవు’.. బట్ యు కాంట్ స్టీల్ మై మనీ’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కీర్తి సురేశ్‌తో మహేశ్ బాబు రొమాన్స్ సీన్స్, ఫన్నీ డైలాగ్స్ నెక్ట్లెవల్ అని చెప్పొచ్చు. ఇక యాక్షన్ సీన్స్ చూస్తుంటే సూపర్ స్టార్ అభిమాలకు చిత్ర బృందం మంచి ట్రీట్ ఇచ్చిందనడంలో ఎలాంటి అతిశయేక్తిలేదు. కాగా మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. -
'సర్కారు వారి పాట' డబ్బింగ్ పూర్తి చేసిన కీర్తి సురేష్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. పరుశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే12న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా డబ్బింగ్ పూర్తి చేసింది. దర్శకుడు పరుశురాం, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దగ్గరుండి కీర్తి సురేష్ చేత డైలాగ్స్ చెప్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసిన కీర్తి సర్కారు వారి పాట సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది. చదవండి: 'ప్రేమ'పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన కృతిశెట్టి Final touches for dubbing is done! Cant wait for everyone to see Super⭐@urstrulymahesh in this one. A treat for all his fans! ❤️ Love, Kalaavathi #SarkaruVaariPaata #SVPOnMay12 pic.twitter.com/KsKub6MiG0 — Keerthy Suresh (@KeerthyOfficial) May 1, 2022 -
'సర్కారు వారి పాట' బ్లాక్ బస్టర్ అవుతుంది: అనంత శ్రీరామ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' ఆల్బమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. సంగీత సంచలనం ఎస్.ఎస్. తమన్ మ్యూజిక్ లో ఇప్పటికే విడుదలైన కళావతి, పెన్నీ, టైటిల్ సాంగ్ అన్నీ వర్గాల ఆడియన్స్ ఆకట్టుకొని టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట'కి అద్భుతమైన సాహిత్యం అందించిన గేయ రచయిత అనంత శ్రీరామ్ మీడియాతో ముచ్చటించారు. అనంత శ్రీరామ్ పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు... ► పదిహేడేళ్ళ జర్నీ.. 1295 పాటలు రాశారు, ఈ ప్రయాణం ఎలా అనిపిస్తుంది ? ►నా ప్రయాణం సులువుగానే ప్రారంభమైయింది. పెద్ద సినిమా కష్టాలు పడలేదు. ప్రారంభంలోనే విజయాలు వచ్చేశాయి. ఐతే ఈ విజయాల నిలకడని కొనసాగించడానికి ప్రతి క్షణం శ్రమించాల్సిందే. ఎప్పటికప్పుడు విజయాలు సాధించాలి. పాటకు మించిన పాట ఇస్తేనే ఇక్కడ రచయితగా నిలబడగలం. దీనికి నిదర్శనమే గీత గోవిందం సినిమాలోఇంకేం ఇంకేం పాట. అప్పుడప్పుడే వ్యూస్ లెక్కపెడుతున్న సమయంలో వంద మిలియన్స్ దాటి రికార్డ్ సృష్టించింది. దాన్ని మించిన విజయం మూడేళ్ళ తర్వాత 'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ తో వచ్చింది. ► 'సర్కారు వారి పాట' కి రాసే అవకాశం రావడానికి కారణం గీత గోవిందం విజయం అనుకోవచ్చా ? ►ఖచ్చితంగా అనుకోవచ్చు. గీత గోవిందం విజయం తర్వాత నాతో పాట రాయించాలని దర్శకుడు పరశురాం గారికి అనిపించింది. ఐతే సినిమాలో ప్రతీ పాట రాయాలనిపించడం మాత్రం దైవ సంకల్పం. ఒక పాట బావుందని మరో పాట.. ఇలా ఐదు పాటలూ రాయించారు. ► ఐదు పాటలు డిఫరెంట్ జోనర్ లో వుంటాయా ? ►ఐదూ విభిన్నమైన పాటలు. పెన్నీ సాంగ్ హీరో కారెక్టరైజేషన్ కి సంబధించి వుంటుంది. రూపాయి ఎవరిదైన దాన్ని గౌరవించే క్యారెక్టర్ హీరోది. దీన్నే మాస్ ధోరణిలో పెన్నీ సాంగ్ లో చెప్పాం. కళావతి ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. ఎంతటి పోగరబోతు కూడా అమ్మాయి ప్రేమలో పడితే ఎలా ప్రాధేయపడి ఆమె ప్రేమని కోరుతాడనేది ఈ పాటలో అందంగా చెప్పాం. సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ పూర్తి కమర్షియల్ గా వుంటుంది. 'సర్కారు వారి పాట వెపన్స్ లేని వేట'. వేటాడాలంటే ఆయుధం కావాలి. కానీ హీరో ఆయుధం అతని తెలివి. ఇందులో సాహిత్యం పాత్రకి తగ్గట్టుగా కమర్షియల్ గా వుంటుంది. మరో రెండు పాటలు కూడా ఈ వారంలోనే విడుదలౌతాయి. ఆ రెండు పాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. అభిమానులని అలరిస్తాయి. ► పాట రాస్తున్నపుడు హీరోలు ఇన్పుట్స్ ఇస్తారా ? వారి ప్రభావం ఉంటుందా ? ►దర్శకుడి ప్రభావమే వుంటుంది. వారి మార్గదర్శకత్వంలోనే వుంటుంది. ఒకవేళ హీరోలు ఏమైనా చెప్పాలనుకున్న దర్శకుల ద్వారానే చెప్తారు. ► సర్కారు వారి పాటలో ఏ సాంగ్ రాయడనికి ఎక్కువ సమయం తీసుకున్నారు ? ►అన్ని పాటలు సమయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 2020లో సినిమా పట్టాలెక్కింది. తర్వాత లాక్ డౌన్లు వచ్చాయి. ఐతే ఈ రెండేళ్ళ గ్యాప్ లో కొన్ని సందేహాలు రావడం, మళ్ళీ రాయడం, మార్చడం జరిగేది. ప్రతి పాట నెలలు తరబడే సమయం తీసుకుంది. ► డబుల్ మీనింగ్ వుండే పాటలు రాయాల్సివస్తే ఎలాంటి కసరత్తు చేస్తారు ? ఇబ్బంది పడే సంధర్భాలు ఉన్నాయా ? ►సందర్భాన్ని బట్టి అది శ్రంగారభరితమైన పాటే ఐతే .. దాన్ని రాయడానికి నేనేం ఇబ్బంది పడను. మడి కట్టను. కాకపొతే ఎలాంటి వేదికకి రాస్తున్నాం అనేది చూసుకోవాలి. కుటుంబం మొత్తం కలసి చూసే సీరియల్ కి రాసినప్పుడు మోతాదుకి మించి రాస్తే ఒకరిని ఒకరు చూసి ఇబ్బంది పడతారు. ఇక్కడ శ్రుతిమించికూడదు. సినిమాకి రాస్తున్నపుడు .. స్నేహితులు, కాస్త వయసుపెరిగిన వారు ప్రేక్షకులుగా వుంటారు కొంత కంఫర్ట్ జోన్ వుంటుంది కాబ్బట్టి ఇక్కడ కొంచెం మోతాదు పెంచవచ్చు. సోషల్ మీడియా, మిగతా ఓటీటీ వేదికలలో వ్యక్తిగతంగా చూస్తారు కాబట్టి మోతాదు పెరిగినా పర్వాలేదు. వేదికలు బట్టి మోతాదు చూసుకోవాలి. ► సర్కారు వారి పాట కథ చెప్పినపుడు మీకు ఎలాంటి ఎక్సయిట్మెంట్ కలిగింది. ? ►ఈ కథ వినగానే గత ఐదేళ్ళుగా ఇలాంటి కథ రాలేదు , మళ్ళీ ఐదేళ్ళ తర్వాత గానీ ఇలాంటి కథ మహేశ్ బాబు గారికి రాదనపించింది. విలువలుండి, వ్యాపార విలువలు జోడించిన కథ దొరకడం చాలా కష్టం. ఇలాంటి కథ మహేష్ బాబు గారికి వచ్చింది, ఇలాంటి సినిమాలో భాగమైతే నా భవిష్యత్ కు మంచి పునాది పడుతుందనిపించింది. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ► ఇప్పుడు సినిమాల్లో పాటలు తగ్గిపోయాయి ? వున్న పాటలు కూడా ఇరికించినట్లనిపిస్తున్నాయి. సర్కారు వారి పాటలో సాంగ్స్ ప్లేస్ మెంట్ ఎలా ఉండబోతుంది? ►ఇందులో పాటలుగా నాలుగే వుంటాయి. అవి కూడా అద్భుతమైన ప్లేస్ మెంట్స్ వస్తాయి. అవసరమైన చోటే పాట పెట్టడం జరిగింది. ఇక మిగతా సినిమాల్లో పాటలు తగ్గడానికి మారుతున్న ట్రెండ్ ఒక కారణం కావచ్చు. సినిమా నిడివి ఇప్పుడు తగ్గుతుంది. పాటలు లేకుండా కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే తెలుగు ప్రేక్షకులు మాత్రం పాట కోరుకుంటారు. ► తమన్ తో పని చేయడం ఎలా అనిపించింది ? ►తమన్ లయ మాంత్రికుడు. మనం మామూలు సాహిత్యం ఇచ్చినా అతని రిధమ్ తో కొత్తగా అనిపిస్తుంది. తమన్ సౌండ్ చాలా గ్రాండ్ గా వుంటుంది. అతని బీట్ తగ్గట్టు సాహిత్యం రాస్తే అద్భుతంగా వినిపిస్తుంది. ► సింగర్ ని ఎంపికలో గీత రచయిత ప్రమేయం వుంటుందా ? ►తమన్, నేను సమకాలికులం కాబట్టి ఈ పాటకు ఏ గాయకుడు, గాయిని అయితే బావుంటుందని అడుగుతారు. ఐతే అ నిర్ణయం దర్శకుడికి హీరో కి ఎవరైతే పాడాక నచ్చారో వారిదే ఉంచుతారు. ► కళావతి పాట రాసినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని ఊహించారా ? ►పాట రాసినప్పుడు విజయం సాదిస్తుందని ఊహిస్తాం కానీ ఇంత స్థాయిలో విజయం సాధిస్తుందని మాత్రం ఊహించలేం. ఎలాంటి ట్యూన్ ప్రేక్షకులికి నచ్చుతుంది. ఎలాంటి సాహిత్యం కావాలి, సౌండ్స్ ఎలా వుండాలి.. ఇలా చర్చలు జరుగుతాయి. అలా బయటికి వచ్చిన పాట అందరికీ నచ్చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. ► రెండేళ్ళ గ్యాప్ లో పాటలపై ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే వున్నామని తమన్ చెప్పారు . సాహిత్యం పై కూడా పని చేశారా ? ►సర్కారు వారి పాట కి చాలా వర్క్ జరిగింది. సాహిత్యం పరంగా ఎప్పటికప్పుడు కొత్తగా మార్పులు చేర్పులు చేస్తూ వచ్చాం. సర్కారు వారి పాట రచనలో 190 పేజీల వైట్ నోట్ బుక్స్ నాలుగైపోయాయి. ► సర్కారు వారి పాట నుంచి రాబోయే రెండు పాటలు కూడా కళావతి స్థాయిలో ఆకట్టుకుంటాయా ? ►స్థాయి చెప్పలేను కానీ రాబోయే రెండు పాటలు మాత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తాయి. ► కొంతమంది గాయకులు సాహిత్యాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నారు. గేయ రచయిత చెప్పేవరకూ ఆ సాహిత్యం అర్ధం కావడం లేదు ? ఎవరి గురించి చెబుతున్నామో ఈ పాటకి మీకు తెలిసేవుంటుంది ? ► మీరు సిద్ శ్రీరామ్ గురించి మాట్లాడుతున్నారని నాకు అర్ధమైయింది. కళావతి పాట విషయానికి వస్తే అతని ఉచ్చారణ దోషాలు ఏమీ లేవు. నేను దగ్గర వుండి పాడించాను. ఐతే అతని గత పాటల్లో తెలుగు పరిచయం లేకపోవడంతొ కొన్ని తప్పులు జరిగుండోచ్చు. అదే మూడ్ లో వినేసరికి ఏదో తప్పుగా ఉచ్చరిస్తున్నారనే భావనే తప్పా .. కళావతి పాట ఉచ్చారణలో ఎలాంటి దోషాలు లేవు. దినితో పాటు ఐతే పాట మిక్స్ చేసినపుడు కొన్ని ఎఫెక్ట్స్ వేస్తారు. దాని కారణంగా కూడా కొన్ని పదాలు వేరేగా వినిపించవచ్చు. పెరిగిన టెక్నాలజీకి మన చెవులు ఇంకా సిద్ధపడలేదని నా అభిప్రాయం. ► ఒక పాటని ఇదే విధంగా వినాలని ప్రేక్షకుడికి చెప్పలేం కదా ? ►చెప్పాలి. ఒక బుల్లెట్ పేలిస్తే కనిపించదు. కానీ సినిమాలో దాన్ని స్లో మోషన్ లో చూపిస్తే అది అసహజమే అయినప్పటికీ చూస్తున్నాం కదా. ప్రతిదాంట్లో టెక్నాలజీ వస్తుంది. దీనికి కళ్ళు ఎలా సిద్ధపడుతున్నాయో చెవులు కూడా అలా సిద్ధపడాలి. ► మహేష్ గారితో ఇది ఎన్నో సినిమా ? ►'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాకి రాశాను. సర్కారు వారి పాట రెండోది. పరశురాం గారితో సారొచ్చారు,శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం,,. ఇప్పుడు సర్కారు వారి పాట. ► దర్శకుడు పరశురాం గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? ►దర్శకుడు పరశురాం గారి కథలు సాఫ్ట్ అండ్ క్లాస్ గా వుంటాయి. సర్కారు వారి పాట మాత్రం హైవోల్టేజ్ వున్న కథ. ప్రతి సీన్, డైలాగ్, పాట, సీక్వెన్స్ ఇలా అన్నిటితో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ► గత నాలుగేళ్లతో పాట స్వరూపం, దాని పెట్టె బడ్జెట్ ఓ స్థాయికి వెళ్ళాయి . మరి గీత రచయితకు ప్రతిఫలం వస్తుందా ? ►ప్రతిఫలం బాగానే వస్తుంది. రాయలిటీ చట్టాలు బలంగా వున్నాయి. వందల మిలియన్ల వ్యూస్ వచ్చే పాట రాయగలిగితే రేమ్యునిరేషనే కాకుండా కొన్నేళ్ళు పాటు కూరగాయలు ఖర్చుకి వాల్సిన డబ్బు ఇస్తుంది. ► మహేష్ బాబు గారికి ఈ సినిమాలో ఇష్టమైన పాట ? ►పెన్నీ సాంగ్ మహేష్ బాబుగారికి చాలా ఇష్టం. ఈ కథ ఆయన ఓకే చేయడానికి గల కారణం హీరో పాత్రలో వుండే కొత్తదనం. హీరో క్యారెక్టర్ ని పెన్నీ సాంగ్ లో అద్భుతంగా రావడం వలన ఆయనకి ఇంకా అద్భుతంగా నచ్చింది. ► ఈ సినిమాకి మూడు పెద్ద బ్యానర్లు పనిచేశాయి.. ముగ్గురు నిర్మాతలతో పని చేయడం ఎలా అనిపించింది ? ►ముగ్గురు నిర్మాతలనే భావనే రాలేదు. దర్శకుడి తరపున పరశురాం గారితో పని చేశాను. ప్రొడక్షన్ వైపు నుండి వాళ్ళు ఎంచుకున్న సంధానకర్తతో పని చేశాను. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్.. నిర్మాతలంతా సినిమాపై ప్రేమ వున్న వాళ్ళు. అలాంటి నిర్మాణ సంస్థలతో కలసి పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది.కొత్తగా రాస్తున్న సినిమాలు చిరంజీవి గారి గాడ్ ఫాదర్, రామ్ చరణ్ - శంకర్ గారి సినిమా, నాగ చైతన్య థ్యాంక్ యూ చిత్రాలకు రాస్తున్నాను. ఇవి కాకుండా నవదీప్ హీరోగా లవ్ మౌళి, సత్యదేవ్ కృష్ణమ్మ చచిత్రాలకు సింగెల్ కార్డ్ రాస్తున్నాను. అలాగే ఎస్వీ కృష్ణా రెడ్డిగారి సినిమాకి రాస్తున్నాను. అల్ ది బెస్ట్ ► థ్యాంక్ యూ -
మహేశ్‌బాబు పెన్నీ సాంగ్ కోసం సితార ఎందుకన్నారు: తమన్
‘‘నిర్మాతలు, దర్శకులు మనల్ని నమ్మి డబ్బు ఖర్చుపెడుతున్నారు. వారి నమ్మకాన్ని కాపాడుకున్నంత సేపే మన గోల్డెన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాకు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి’’ అన్నారు సంగీతదర్శకుడు తమన్. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పిన విశేషాలు. స్టార్ హీరోలతో సినిమాలంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచాలను ఎలా అందుకోవాలా? అని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా స్కూల్‌కు వెళ్లాలనిపిస్తుంటుంది (నవ్వుతూ). ఇప్పుడు మ్యూజిక్ ఇవ్వడమే కాదు.. దాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడం కూడా ముఖ్యమైన విషయంగా మారిపోయింది. ఆడియో కంపెనీలు ఊరికే డబ్బులు ఇన్వెస్ట్ చేయవు. ఆదాయం వస్తుందా? లేదా అనే అంశాలను ఆలోచించుకుంటారు. ఒక పాట (‘సర్కారువారి..’లోని ‘కళావతి..’ని ఉద్దేశించి) 150 మిలియన్ల వ్యూస్‌ను దాటడమనేది చిన్న విషయం కాదు. పాన్ ఇండియా అనేది సినిమాల విషయంలోనే కాదు.. పాట విషయంలో కూడా జరుగుతోంది. పాట ఎలా ఉండాలి? లిరికల్ వీడియోను ఎలా డిజైన్ చేయాలి? అనే అంశాలను కూడా ముందే డిజైన్ చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంటుంది. అప్పుడు.. అదో టెన్షన్ ఓ మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ చేయడమనేది పాయింట్ నెంబర్ వన్ మాత్రమే. అంచనాలను అందుకోగలడా? ఒత్తిడిని అధిగమించగలడా? అనే అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫ్యాన్స్, హీరోలు, డైరెక్షన్ డిపార్ట్మెంట్.. ఇలా ఎవరైనా సరే మ్యూజిక్‌లో కరెక్షన్స్ చెప్పగలుగుతున్న రోజులివి. ఇవి కాక మా లిరికల్ వీడియోలు, ఇతర భాషల్లోని లిరికల్ వీడియోలు ఒకే రోజు రిలీజైతే అదో టెన్షన్. ఉదాహరణకు ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి..’, విజయ్ ‘బీస్ట్’ చిత్రంలోని ‘అరబిక్..’ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. అలాగే ప్రతి సినిమాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి రీచ్ కావడం కష్టం అయినా రీచ్ కావాల్సిందే. లవ్‌స్టోరీకి చేయాలని ఉంది ఒకప్పుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాలే ఉండేవి. ఇప్పుడు స్టోరీ డ్రివెన్ సినిమాలను చేస్తున్నాం. దాంతో మ్యూజిక్‌లోని డిఫరెంట్ యాంగిల్స్‌ను చూపించే అవకాశం ఉంటుంది. సక్సెస్‌ను హెడ్‌కు లోడ్ చేసుకుంటే అప్పుడు మనం ఫెయిల్యూర్స్‌ను తట్టుకోలేం.. పెద్ద సినిమాలే కాదు.. చిన్న సినిమాలకూ సంగీతం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లవ్‌స్టోరీ చిత్రాలకు మ్యూజిక్ అందించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అప్పుడు ‘కళావతి..’ ఉండేది కాదు ‘సర్కారువారి పాట’లో టైటిల్ సాంగ్ నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ పాటకు ఓ పదీ పదిహేను ఆప్షన్స్ చేశాం. ఆ తర్వాత ఫైనల్ ట్యూన్ వచ్చింది. మ్యూజిక్ అంటే మ్యూజికల్ వెర్షన్ ఆఫ్ డైలాగ్సే. సినిమాలో ఉన్న డైలాగ్స్‌ను మ్యూజికల్‌గా చెప్పడం అన్నమాట. నాలుగు నిమిషాలు డైలాగ్స్ వదిలేసి దర్శకుడు మాకు ఆ టైమ్ ఇస్తున్నాడు. మేం కథను సంగీతంతో చెప్పాలి. అది పెద్ద బాధ్యత. ఇప్పుడు కథలో నుంచి వచ్చే పాటలు ఎక్కువయ్యాయి. లేకపోతే ‘కళావతి’ అనే పాట రాదు. జనరల్‌గా మాస్ సాంగ్‌కు డాన్స్ చేసే ఆడియన్స్ రివర్స్‌లో ‘కళావతి..’ పాటకు స్టెప్పులు వేస్తారు. సినిమాలో మహేశ్‌బాబుగారి లవ్‌ని ప్యూర్‌గా చూపించాలని ‘కళావతి..’ పాట రాశాం. ఈ పాట లిరికల్ వీడియో కోసం అదనంగా 30 లక్షలు ఖర్చుపెట్టాం. మా సినిమా నిర్మాతలు మ్యూజిక్‌ను ప్రేమించేవారు కాబట్టి అంత ఖర్చు పెట్టారు. అయితే పాట లీక్ కావడం చాలా బాధ అనిపించింది. కరోనా పరిస్థితుల్లో మా నిర్మాతలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ కష్టాల గురించి ఆలోచించకుండా అలా లీక్ చేయడం బాధాకరం. లీక్ చేసిన వ్యక్తిని పిలిచి ‘నీ కెరీర్ గురించి ఆలోచించుకున్నావా? లీక్ చేయడం పెద్ద తప్పు’ అని మందలించి పంపాం. ఎందుకంటే అతనికి ఓ కుటుంబం ఉంది. సితార రాక్‌స్టార్ ‘పెన్నీ’ సాంగ్‌లో సితారను తీసుకోవాలనిపించి నమ్రతగారిని అడిగాను. మీ హీరోను అడగండి అన్నారు. మహేశ్‌గారిని అడిగాను. ఈ సాంగ్‌లో సితార ఎందుకు? అన్నారు. అప్పుడు సోషల్ మీడియాలో సితార డాన్సింగ్ వీడియోలు కొన్ని మహేశ్‌గారికి మళ్లీ చూపించి సితార బాడీలో మంచి రిథమ్ ఉందని చెప్పాను. ఆ తర్వాత ఓసారి నమ్రతగారితో మాట్లాడుతున్నప్పుడు సితార వచ్చింది. ‘పెన్నీ’ సాంగ్‌లో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లు చెప్పింది. సితార జస్ట్ మూడు గంటల్లో పాట పూర్తి చేసింది. సితార రాక్‌స్టార్. ‘పెన్నీ’ సాంగ్ ఫైనల్ వెర్షన్లో సితారను చూసి హ్యాపీ ఫీలయ్యారు మహేశ్‌గారు. ఓ తండ్రిగా ఆయనకు అది ఓ గ్రేట్ ఫీలింగ్. సితార లిరికల్ వీడియోలోనే ఉంటుంది. ఆడియో సైజ్ మారింది మన సినిమాలు పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ అయ్యాయి. ‘బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్’ చిత్రాల తర్వాత గ్లోబల్ ఆడియన్స్ కూడా తెలుగు సినిమా వైపు చూస్తున్నారు. ‘అల వైకుంఠపురములో..’ తర్వాత ఆడియో సైజే మారిపోయింది. సినిమాలో మేటర్ ఉంటేనే ఏమైనా చేయగలం. ‘అఖండ’లో బాలయ్యగారిలో శివుణ్ణి ఊహించుకుని ఆ స్థాయిలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగాను. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ శంకర్‌గారి దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా, చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’ చిత్రం, బాలకృష్ణగారి సినిమా, తమిళ హీరో విజయ్‌తో సినిమా చేస్తున్నాను. హిందీ సినిమాలకు సంగీతం అందించే అవకాశం ఉంది. చదవండి: ‘సలాం రాఖీ భాయ్’ అంటూ ఐరా ఎంత క్యూట్‌గా పాడిందో! -
'సర్కారు వారి పాట' పోకిరిని మించి హిట్ అవుతుంది : ఎడిటర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం 'సర్కారు వారి పాట' విడుదలకు సిద్దమౌతుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా 'సర్కారు వారి పాట' కు పనిచేసిన స్టార్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సర్కారు వారి పాట' విశేషాలు... ►దర్శకుడు పరశురాం గారు ఈ కథ చెప్పినపుడు.. ఇంతకుముందు మీరు చేసిన సినిమాలకి 'సర్కారు వారి పాట'కి ఎలాంటి తేడా గమనించారు ? దర్శకుడు పరశురాం గారి సినిమాలు ఫ్యామిలీ డ్రామా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా వుంటాయి. కానీ సర్కారు వారి పాట లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా వుంటాయి. గీత గోవిందం, పోకిరి.. ఈ రెండు సినిమాలు నేనే ఎడిట్ చేశాను. ఈ రెండు సినిమాలు కలిపితే ఎలా వుంటుందో సర్కారు వారి పాట అలా వుంటుంది. పోకిరికి మించి సర్కారు వారి పాట హిట్ అవుతుంది. సర్కారు వారి పాటలో మంచి ఫీల్ వుంటుంది. అందరికీ కనెక్ట్ అయ్యే మెసేజ్ వుంది. నేను చేసిన సినిమాలన్నీటి కంటే మహేష్ బాబు ఈ సినిమాలో చాలా అందంగా వుంటారు. ఫ్యాన్స్, ఫ్యామిలీస్, మాస్ కి ఈ సినిమా చాలా నచ్చుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ ఫుల్ గా, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్ తో అదిరిపోతుంది. ►పోకిరి తర్వాత మహేష్ బాబు గారి చాలా హిట్స్ వచ్చాయి కదా? మరి పోకిరితోనే పోల్చడానికి కారణం ? పోకిరి నేను ఎడిటర్ గా చేసిన సినిమా. అందుకే పోకిరితో పోల్చాను. పోకిరి రష్ చూసినప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పా. సర్కారు వారి పాట ఫస్ట్ రష్ చూసిన తర్వాత పోకిరిని క్రాస్ చేస్తామని చెప్పా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ ట్రాక్ లో తెగ నవ్వుకున్నా. సెకండ్ హాఫ్ లో వారు ఎక్కడ కలిసిన చిన్న లాఫ్ వుండేది. థియేటర్ లో ఈ సందడి పెద్దగా ఉంటుందని మా అంచనా. మహేష్ బాబు ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట ఒక పెద్ద పండగలా వుంటుంది. ► విజువల్స్ చాలా గ్రాండ్ కనిపించడానికి మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణం కారణమని భావిస్తున్నారా ? అవునండీ. దర్శకుడు పరశురాం గారి సినిమాలు చేశాను. కానీ ఫస్ట్ టైం సర్కారు వారి పాట కోసం మైత్రి మూవీ మేకర్స్ ,జీ ఎం బీ ఎంటర్ టైన్మెంట్స్ ,14 రీల్స్ ప్లస్ లో పని చేశాను. నిర్మాణ విలువలు వండర్ ఫుల్ గా వున్నాయి. వీరు అంతా సినిమాని రిచ్ గా తీయాలనే లక్ష్యంగా వుంటారు. సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడరు. సినిమా పట్ల వారికున్న అంకితభావం అభినందనీయం. ఇది చాలా మంచి అనుభవం. ►దర్శకుడు పరశురాం గారి సినిమాలు క్లాస్ గా వుంటాయి. సర్కార్ వారి పాటలో ఇప్పటివరకూ అంతా మాస్ గానే కనిపిస్తుంది ? ఇందులో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. హీరో, హీరోయిన్ పాత్రలని ఇష్టపడతాం. హీరోయిన్ పాత్ర చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి మనకీ వుంటే బావున్ననిపిస్తుంది. హీరో పాత్రతో కనెక్ట్ అవుతాం. ఎడిట్ చేసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ కలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అని జడ్జ్ చేస్తాం. ఎడిట్ చేస్తున్నపుడు సర్కారు వారి పాటకి అద్భుతంగా కనెక్ట్ అయ్యాం. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం వుంది. ►ఇప్పటి వరకూ ఎన్ని సినిమాలు చేశారు ? ఇప్పటి వరకూ 450 సినిమాలు చేశాను. మహేష్ గారితో రాజకుమారుడు, టక్కరి దొంగ,పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. ఇప్పుడు సర్కారు వారి పాటకి చేశాను. ►రీలు కంటింగ్ కి, డిజిటల్ కంటిగ్ కి ఎలాంటి తేడా వుంది ? రీలు కంటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ వుండేది. ఎవరు చూడాలన్నా ఎడిటింగ్ రూమ్ లోకి రావాలి. పైగా అది హార్డ్ వర్క్. ఇన్ని సినిమాలు చేయలేం, డిజిటల్ వల్ల ఎక్కువ సినిమాలు ఎక్కువ చేయగలుగుతున్నాం. రీలు ఎడిటింగ్ లో ఏడాదికి పది సినిమాలు చేయడం గొప్ప. డిజిటల్ వచ్చిన తర్వాత ఏడాది ఇరవై సినిమాలు కూడా చేయొచ్చు. ► రీలు ఎడిటింగ్ లో ఎడిటర్ కి రెస్పెక్ట్ ఉండేదని అన్నారు . అంటే డిజిటల్ లో రెస్పెక్ట్ లేదా ? రీలు ఎడిటింగ్ ఒకటే వెర్షన్ వుండేది. డైరెక్టర్, ఎడిటర్ కలసి సినిమాని ఫైనల్ చేసేవారు. నిర్మాతలు కథ విని దానికి ఎవరు హీరో అయితే బావుంటుదని వెళ్ళేవారు. కానీ ఇప్పుడు అంతా రివర్స్ లో వుంది. ► ఇప్పుడు సెట్ లోనే ఎడిట్ చేస్తున్నారు కదా ? సెట్ లో చేసేది పక్కా ఎడిటింగ్ కాదు. ఆ సీన్ వరకే చేస్తారు. ఫైనల్ ప్రోడక్ట్ , స్క్రీన్ ప్లే ఎడిటింగ్ రూం నుండే వెళ్తుంది. ► దర్శకుడు పరశురాం తో చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నారు. అప్పటికి ,ఇప్పటికి ఆయనలో ఎలాంటి మార్పులు గమనించారు ? " పరశురాం అద్భుతమైన రచయిత. మంచి డైలాగ్స్ రాస్తారు. హీరో, హీరోయిన్స్ పాత్రలు డిఫరెంట్ గా డిజైన్ చేస్తారు. సర్కారు వారి పాటలో మహేష్ బాబు గారి పాత్ర అదిరిపోతుంది. ఈ మధ్యలో కాలంలో ఇలాంటి పాత్రని చుసివుండరు. హీరో క్యారెక్టరైజేషన్ లోనే బోలెడు వినోదం వుంటుంది. చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ►దర్శకుడు పరశురాం ఫస్ట్ టైమ్ మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ తో సినిమా చేస్తున్నారు. కథ ఓకే అయిన తర్వాత మీతో పంచుకున్న విశేషాలు ఏమిటి ? దర్శకుడు పరశురాం నాకు చాలా సన్నిహితంగా వుంటారు. ఈ కథని గీత గోవిందం సినిమా సమయంలోనే నాకు చెప్పారు. అద్భుతంగా ఉందని అప్పుడే చెప్పా. ►సర్కారు వారి పాట చూసిన తర్వాత మహేష్ బాబు గారి రియాక్షన్ ? అందరూ చాలా హ్యాపీగా వున్నారు. సర్కారు వారి పాట చాలా పెద్ద సినిమా అవుతుంది. నేను చేసిన సినిమాల్లో పోకిరిని క్రాస్ చేస్తుంది. ►అన్ని సాంకేతిక విభాగాల్లో కొత్త వారి పేర్లు వినిపిస్తుంటాయి. కానీ ఎడిటింగ్ లో మాత్రం ఓ ముగ్గురు పేర్లే వినిపిస్తాయి. ఇంత లాంగ్ కెరీర్ ఎలా సాధ్యమైయింది? ఎడిటింగ్ లోకి కొత్తతరం రావడం లేదా ? రానివ్వడం లేదా ? తరం అని కాదు, మేము కూడా ఆ తరాన్ని దాటుకునే వచ్చాం కదా. కొందరు యూత్ ఫుల్ ఫిల్మ్స్ అంటారు. అంటే మేము యూత్ కాదా? కోమాలో వున్నామా ? దాన్ని దాటే కదా వచ్చాం. వయసుకి సినిమాకి సంబంధం లేదు. ఆ తరాన్ని దాటునికొని వచ్చాం కాబట్టి కథని ఇంకా బాగా చెప్పగలం. ► ఎక్కువ సార్లు ఎడిట్ చేయడం వల్ల మీ జడ్జ్ మెంట్ కి ఏమైనా ఇబ్బంది వస్తుందా ? అలా వుండదు. రష్ చూసినపుడు మొదట వచ్చిన ఫీలింగ్ కే కనెక్ట్ అవుతాం. ►ఎడిటర్ రూమ్ లో చాలా చర్చలు జరుగుతుంటాయి. ఎడిటర్ అభిప్రాయాన్ని డైరెక్టర్ అంగీకరిస్తారా? ఖచ్చితంగా. సినిమా కోసమే కదా గొడవలు పడతాం. ఆడిటోరియం లో చూసేది మేము ముందుగానే చెప్తాం. నేను పని చేసే దర్శకులంతా నా అభిప్రాయాన్ని తీసుకుంటారు. ►మీరు బలంగా నమ్మి నిరాశపడిన సినిమా ఏదైనా ఉందా ? శేఖర్ కమ్ముల లీడర్. ఈ సినిమా పొలిటికల్ సినిమాల్లో చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మాం. కానీ టీవీలో వచ్చినంత స్పందన రిలీజ్ టైం లో రాలేదు. ► టెక్నాలజీ పెరిగిన తర్వాత లీకేజీలు పెరిగాయి. దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాకు బాగా నమ్మకం వున్న వాళ్ళనే తీసుకుంటాం. తెలియనివారిని అస్సలు పెట్టుకోము. దీనికి కారణం లికేజీలే. మొదట్లో రీలు వుండేది. ఎడిటింగ్ రూమ్, ల్యాబ్ లో ప్రింట్ అయిన రీలు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ప్రతిదానికి అవుట్ పుట్ వెళ్ళిపోతుంది. అందుకే ప్రతిదానికి డేట్ తో సహా వాటర్ మార్క్ వేస్తాం. ►ఒక సినిమాకి కూడా పనిచేసే అనుభవం లేని దర్శకులు ఇప్పుడు వస్తున్నారు. ఇలాంటి వారితో పని చేయడం ఎలా వుంటుంది ? ఎడిటర్ గా మాకు చిన్న చిన్న సమస్యలు వుంటాయి. ఫైట్ మాస్టర్ మొత్తం ఫైట్ వుండాలంటారు. టాప్ యాంగిల్ లో కస్టపడి తీసిన షాట్ ఎందుకు పెట్టలేదని కెమరామెన్ అంటారు. సినిమాకి అక్కర్లేదని మేము తీసేసుంటాం. ఇలాంటి చిన్నచిన్న ఆర్గుమెంట్స్ జరుగుతాయి. ఫైనల్ కాల్ మాత్రం దర్శకుడిదే. ► ఎడిటింగ్ కి సంబధించిన విమర్శలని ఎలా తీసుకుంటారు ? విమర్శ మంచిదే. అయితే అది నిర్మాణాత్మకంగా వుండాలి. పది నిమిషాలు తగ్గించుంటే బావుంటుందని చెప్తారు. ఏం తగ్గించాలో చెప్పరు, ఏ సీన్ బాలేదో చెప్పరు. ఇలా చెప్తే దాని గురించి ఆలోచిస్తాం. మాకూ కొంచెం హెల్ప్ ఫుల్ గా వుంటుంది. ►పెద్ద సినిమాకి చివరి నిమిషం వరకూ ఎడిటింగ్ చేస్తూనే వుంటారు. దానివలన ఒత్తిడిపెరుగుతుందా ? ఒత్తిడి ఖచ్చితంగా వుంటుంది. ఓవర్సిస్ కి మూడు రోజులు ముందే వెళ్ళాలి. అంటే నాలుగు రోజులకి ముందే ఇచ్చేయాలి. దర్శకులకు చివరి నిమిషం వరకూ ఏదో చేయాలనే తాపత్రయం వుంటుంది. చూసింది పదిసార్లు జాగ్రత్తగా చూసి చివరి క్షణం వరకూ దానిపై చర్చజరుగుతుంది. ఇది ప్రతి సినిమాకి వుంటుంది. ► పాన్ ఇండియా సినిమాలు విదేశాలకు వెళ్ళినపుడు నిడివి తగ్గిస్తారా ? లేదు. అవార్డ్ లకి వెళ్ళే సినిమాకి మాత్రం పాటలు తీసేస్తాం. ఇండియన్ లాంగ్వేజస్ కి మాత్రం ఒక ఎడిట్ నే వెళుతుంది. ►ఇన్నేళ్ళ కెరీర్ లో మీ ఫేవరేట్ సినిమా ? ఫేవరేట్ అని ఏమీ లేదు. కొన్ని సినిమాలు చూసినపుడు ఇలాంటి సినిమా మనం చేస్తే బావుండేదనిపిస్తుంది. ►మీతోటి ఎడిటర్స్ మధ్య ఎలాంటి అనుబంధం వుంది? మంచి అనుబంధమే వుంది. వర్క్ గురించి మాట్లాడుకుంటాం. మా కష్టాలు చెప్పుకుంటాం. సినిమా బాగా చేస్తే ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటాం. ►ఒక సినిమాని విజయవంతం చేయడంలో ఎడిటర్ పాత్ర ఎంత వుంటుంది ? ఒక దర్శకుడికి ఎడిటర్ కి రిలేషన్ షిప్ బావుంటే చాలా మంచి సినిమా అవుతుంది. ఎంత ఆర్గుమెంట్స్ జరిగితే రిజల్ట్ అంత మంచిగా వస్తుంది. ►డైరెక్టర్ తన స్వేఛ్చతో ఎడిటర్ ని ఎన్నుకుంటాడా ? హీరో జోక్యం వుంటుందా ? ఒకొక్క సినిమాకి ఒకొక్కలా వుంటుంది. 'సారోచ్చారా' తప్పితే పరశురాం అన్ని సినిమాలకి నేనే చేశా. దర్శకుడి తరపున వెళితే ఎడిటర్ బలంగా ఉంటాడు. ►పాన్ ఇండియా సినిమాలని తెలుగు కాకుండా ఇతర భాషల్లో చూసినపుడు ఏమైనా తేడా ఉంటుందా ? అలా ఏమీ వుండదు. కానీ రిమేక్ కి వచ్చేసరికి కొంచెం తేడా వుంటుంది. మలయాళం దృశ్యం నీట్ గా స్లోగా వుంటుంది. తెలుగులో చేసినప్పుడు ఇక్కడ ఆడియన్స్ తగ్గట్టు మన స్టయిల్ లో చేశాం. ►కొత్తగా చేస్తున్న సినిమాలు ? చిరంజీవి గారి గాడ్ ఫాదర్, భోళా శంకర్, సమంత కధానాయికగా యశోద సినిమాలకి చేస్తున్నా. -
'సర్కారు వారి పాట' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. పరుశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మే12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కోసం మహేశ్ ఫ్యాన్స్ సహా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ షేర్ చేశారు. మే2న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, పాటలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చదవండి: అర్థరాత్రి 12 గంటలకు.. సమంతకు విషెస్ చెప్పిన హీరో The wait ends! Rocking #SVPTrailer drops on MAY 2nd💥 Super🌟 @urstrulyMahesh is all set to mesmerize you with his MASS Energy😎#SarkaruVaariPaata#SVPOnMay12@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @madhie1 @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/eyrDbdx8aM — Mythri Movie Makers (@MythriOfficial) April 28, 2022 -
వందో, ఒక వెయ్యో, లక్షో కాదు.. కళావతి సాంగ్‌కు 150 మిలియన్ వ్యూస్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేశ్ కథానాయిక. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీఎంబీ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వాలంటైన్స్ కంటే ఒకరోజు ముందే (ఫిబ్రవరి 13న) కళావతి సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 'వందో, ఒక వెయ్యో, ఒక లక్ష మెరుపులు మీదికి దూకినాయా.. ఏందే ఈ మాయ.. కమ్మ కమ్మాన్ కళావతి.. నువ్ లేకుంటే అధోగతి..' అంటూ సాగే లిరిక్స్ జనాల మెదళ్లలో నుంచి అంత ఈజీగా పోవట్లేదు. మ్యూజిక్ లవర్స్ నుంచి భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ పాట తాజాగా ఓ అరుదైన రికార్డు సాధించింది. ఈ సాంగ్ 150 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించి రికార్డుకెక్కింది. తమన్ సంగీతం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. సమ్మర్ కానుకగా ఈ చిత్రం మే 12న విడుదలవుతోంది. #KalaaVathiHits150MViews 🔥Blockbuster Magical Melody #Kalaavathi continues to allure Music Lovers ❤️🎧 https://t.co/ItJS7k8bXF#SarkaruVaariPaata#SVPonMay12 Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @sidsriram @saregamasouth pic.twitter.com/jSRYVwBhvG— GMB Entertainment (@GMBents) April 26, 2022 చదవండి 👉 పెళ్లి చేసుకోమని బెదిరింపులు, తమిళ నిర్మాత అరెస్ట్ ఓటీటీలో కశ్మీర్ ఫైల్స్, ఎప్పుడు, ఎక్కడంటే? -
‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్: ఆర్ట్ డైరెక్టర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు నిర్మించారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన పంచుకున్న మూవీ విశేషాలు ఇలా ఉన్నాయి. ⇔ పరుశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా. ⇔ మహేశ్ బాబు గారితో నాకు ఇది 7వ సినిమా. ఆయన సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలను చర్చిస్తారు. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన సెట్లో డాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ⇔ 'సర్కారు వారి పాట' బ్యాంక్ నేపథ్యంలో సాగుతుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్‌లో డిజైన్ చేశాం. దీనికి సంబంధించిన సెట్‌ను అన్నపూర్ణ స్టూడియో వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. అలాగే మరో రెండు మోడ్రన్ బ్యాంక్ సెట్స్ వేశాం. ⇔ భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా ఉంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబాద్‌లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్‌లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం. ⇔ దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ కథ ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందో చెప్పినప్పుడే ఒక ఊహా ఏర్పడుతుంది. దర్శకులు ఒక విజన్‌తో వస్తారు. దానికి ఆర్ట్ డైరెక్టర్ విజన్ తోడవుతుంది. ఈ విజన్‌నే కెమరా మ్యాన్ క్యాప్చర్ చేయాలి. ⇔ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడ రాజీ పడకుండా చిత్రాల్ని నిర్మిస్తారు. కథకు ఏం అవసరమో అది సమకూర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా గ్రాండ్‌గా రావాలనే తపన మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. -
మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ వచ్చేసింది
Sarkaru Vaari Paata Title Song Release: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిన్న(శుక్రవారం, ఏప్రిల్ 22న) గుమ్మడికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసిన చిత్ర బృందం తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసి మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చింది. చదవండి: అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్ ‘సరా సరా సర్కారు వారి పాట... షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా...’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటుంది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ ఈ రోజు(ఏప్రిల్ 23) ఉదయం 11 గంటలకు విడుదలై అప్పుడే యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: గుడ్‌న్యూస్, ‘సర్కారు వారి పాట’కు గుమ్మడికాయ కొట్టేశారు -
గుడ్‌న్యూస్, ‘సర్కారు వారి పాట’కు గుమ్మడికాయ కొట్టేశారు
Sarkaru Vaari Paata Wraps Up Shoot: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం శుభవార్త అందించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. మే 12న ఈమూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్‌ను డైరెక్టర్ శరవేగంగా పూర్తి చేశాడు. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ చివరిగా హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ పాట చిత్రీకరణతో సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ పాటలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌లు స్టెప్పులేశారు. ఇక పాట చిత్రీకరణ పూర్తికాగానే చిత్రానికి గుమ్మడికాయా కొట్టేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఏప్రిల్ 22) సాయంత్రం మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ పూర్తి. ఇక మే 12న బాక్సాఫీసును షేక్ చేసేందుకే సిద్ధమవుతుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. చదవండి: అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్ ఈ సందర్భంగా ఈ మూవీలోని మహేశ్ కొత్తలుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తాళల గుత్తితో మహేశ్ మాస్‌లుక్‌లో కనిపించాడు. ఇక ఇది చూసి సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో మహేశ్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇందులో పాటలు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్ రికార్టు క్రియేట్ చేశాయి. Shoot Done & Dusted 🤘 All Set for the Box Office Recovery From MAY 12th 💥💥#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/UOVMq4Pqlc — Mythri Movie Makers (@MythriOfficial) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సర్కారు వారి పాట: ఫైనల్ షూటింగ్
‘సర్కారువారి పాట’ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయిన సంగతి తెలిసిందే. ఆ పాట చిత్రీకరణ సోమవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రం హీరో హీరోయిన్లు మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ ఈ పాటకు స్టెప్పులేస్తున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పాట చిత్రీకరణ పూర్తయితే చిత్రయూనిట్ గుమ్మడికాయ కొడతారు. అంటే.. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ‘సర్కారువారి పాట’ చిత్రం మే 12న రిలీజ్ కానుంది. -
నాకు తెలియదు, నన్ను నమ్మండి : పాపులర్ సింగర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సర్కారు వారి పాట. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా కోసం మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కళావతి, పెన్నీ సాంగ్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మూడవ పాటను బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్మాన్ మాలిక్ పాడాడు. దీంతో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ మహేష్ ఫ్యాన్స్ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై అర్మాన్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. నాకు సందేశాలు పంపుతున్న మహేశ్ బాబు అభిమానులందరికి, నిజంగా సర్కారు వారి పాట నుంచి నెక్ట్స్ సాంగ్ ఎప్పుడు వస్తుందనేదానిపై నా వద్ద ఎలాంటి క్లూ లేదు. నన్ను నమ్మండి. నాకు కూడా తెలియదు.ప్రతీ దానికి ఒక ఇంటర్నల్ ప్రాసెస్ ఉంటుంది. మేమంతా ఓపికగా పనిచేస్తున్నాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా వేచి చూడండి అంటూ ట్వీట్ చేశారు. To all SSMB fans messaging me, I genuinely have no clue when the song from #SarkaruVaariPaata is dropping. I know how eager y’all are to hear it. Trust me, I am too! But there’s an internal process to everything & all we can do is patiently wait for an official announcement ❤️🙏🏻 — ARMAAN MALIK (@ArmaanMalik22) April 17, 2022 -
మహేశ్ బాబు సినిమా నుంచి కొత్త అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే
Mahesh Babu Sarkaru Vaari Paata Movie Complete Shoot Except A Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌తోపాటు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్‌కు విశేష ప్రేక్షకదారణ లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ వార్తతో మహేశ్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఆ వార్త ఏంటంటే ఈ సినిమా షూటింగ్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ''సర్కారు వారి పాట' చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కేవలం ఒకే పాటను షూట్ చేయాల్సి ఉంది.' అని చిత్రబృందం తెలిపింది. దీంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఒక పాట చిత్రీకరిస్తే సినిమా అనుకున్న సమయానికే విడుదలవుతుంది కాబట్టి. వేసవి కానుకగా మే 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చదవండి: మహేశ్ బాబు చిత్రంలో తమిళ స్టార్ హీరో.. క్లారిటీ! #SarkaruVaariPaata completes shoot except for a song! Get ready for exciting updates 💥#SVPManiaBegins 🔥#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/qK4tYD0h6d — Mythri Movie Makers (@MythriOfficial) April 12, 2022# -
మీడియాతో ‘సర్కారు వారి పాట’ డైరెక్టర్, ఆసక్తికర విషయాలు వెల్లడి
Director Parashuram Talks With Media: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’సినిమాను మే 12న విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా దర్శకుడు పెట్ల పరశురామ్ వెల్లడించారు. ఆయన కుటుంబ సమేతంగా శ్రీ నూకాలమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెర్లోపాలెంలోని తన స్వగృహంలో మాజీ సర్పంచ్ మాకిరెడ్డి వెంకటరమణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు 30 నెలల సమయం పట్టిందన్నారు. కరోనా కారణంగా ముందస్తు ప్రణాళిక కంటే.. అధిక రోజులు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ విదేశాలు, మన దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు విశాఖపట్నంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. హీరో మహేష్‌బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ అద్భుతంగా నటించారని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సన్నివేశాలు, పాటలు, డైలాగ్‌లు ఉంటాయన్నారు. నర్సీపట్నంలోని శ్రీకన్య థియేటర్లో ఈ సినిమా మొదటి ఆట చూస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించానని.. సోలో చిత్రం పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. గీత గోవిందం, ఆంజనేయులు, యువత, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు సంతృప్తినిచ్చాయన్నారు. తాండవ షూటింగ్‌లకు అనుకూలం సినిమా షూటింగ్‌లకు విశాఖ జిల్లా ఎంతో అనుకూలమన్నారు. సొంత ప్రాంతంపై మమకారంతో జిల్లాలోని ఏదో ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీతో పాటు తాండవ రిజర్వాయర్ అందాలు తనను బాగా ఆకర్షించాయన్నారు. ఇటీవల తాండవ రిజర్వాయర్ సందర్శించానని చెప్పారు. తమ గ్రామ దేవత జిల్లేడుపూడి బుచ్చేంపేట నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఏటా వస్తానన్నారు. తను ఏ పని తలపెట్టినా.. అమ్మవారిని తలచుకుని ప్రారంభిస్తానని తెలిపారు. అమ్మవారి ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం తన భార్యకు చాలా ఇష్టమన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రముఖ సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరానని.. తర్వాత దర్శకుడిగా మారినట్లు వివరించారు. -
సర్కారు వారి పాట.. మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్..
ఉగాది పండగ సందర్భంగా మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్డేట్ ఇచ్చింది ‘సర్కారు వారి పాట’ మూవీ టీం. తాజాగా ఈ మూవీలోని మహేశ్ న్యూలుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మేకర్స్ ‘ఈ న్యూయర్కు మాస్ కొత్త నిర్వచనం’ అంటూ మహేశ్ మాస్ లుక్‌ను పంచుకున్నారు. ఇది విడుదలైన కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఈ పోస్టర్లో మహేశ్‌ను చూస్తుంటే.. విలన్‌ను ఇరగదీసేందుకు రెడీ అవుతున్నట్టుగా ఉంది. ఈ మాస్‌లుక్ చూసి మహేశ్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో మహేశ్ బ్యాంకు ఉద్యోగిగా కనిపించనున్నాడు. This new year, MASS has a new definition 😎 Happy Ugadi ❤️ Get ready for exciting updates for #SarkaruVaariPaata soon 💥#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/6b58yn8xWD — Mythri Movie Makers (@MythriOfficial) April 2, 2022 -
మరో సర్‌ప్రైజ్‌కి మహేశ్ రెడీ.. మాస్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు మరో సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడా? అంటే అవుననే అంటూన్నారు టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ మాసీవ్ మూవీస్లని యాక్షన్ ప్యాక్డ్ చిత్రాలని చేస్తున్నారు. త్వరలో మహేశ్ కూడా అదే తరహా మూవీ చేయలాని ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కారువారి పాట’మూవీతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ సాంగ్స్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మరింత స్టైలిష్‌గా మహేశ్ కనిపిస్తున్నాడు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే వున్నాయి. `పోకిరి` వైబ్స్ కనిపిస్తున్నాయని మహేశ్ స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మహేశ్ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ తరువాత రాజమౌళితో ఓ భారీ మూవీకి మహేశ్ శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఆఫ్రికాలోని థిక్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోందని స్క్రీప్ట్ వర్క్ పూర్తయిందని ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. రాజమౌళి మూవీ తరువాత మహేశ్ ఓ మాసీవ్ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నాడట. ఊర మాస్ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా అయిన బోయపాటి ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం వుందని ఫీల్మ్నగర్ టాక్ వినిపిస్తుంది. నిజంగా ఈ కాంబినేషన్ సెట్టయితే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి మహేశ్ సర్ప్రైజ్ ఇచ్చినట్లే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. -
‘సర్కారువారి పాట’ మూవీ స్టిల్స్
-
Sarkaru Vaari Paata: యూట్యూబ్‌లో ‘కళావతి’ సరికొత్త రికార్డు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘కళావతి’ అనే సాంగ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 100 మిలియన్స్ పైగా వ్యూస్‌ని సాధించి, రికార్డు సృష్టించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ మెలోడీ సాంగ్ జనాల్లోకి దూసుకెళ్లింది. ఏ ఫంక్షన్లో చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో మహేశ్‌బాబు వేసిన స్టెప్పులు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి.ఈ పాటపై ఇప్పటికే అనేకమంది నెటిజన్స్ రీల్స్ చేసి అలరించారు. ఈ మెలోడీ సాంగ్‌కి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ తనదైన శైలీలో ఆలపించారు. మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘పెన్నీ సాంగ్’సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. -
సర్కారు వారి పాట: పెన్నీ ఫుల్ సాంగ్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు(ఆదివారం) సెకండ్ సింగిల్ పెన్నీ ఫుల్ సాంగ్ విడుదలైంది. ‘ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని’ అంటూ సాగే పాట ప్రోమోను నిన్న(శనివారం) రిలీజవగా తాజాగా ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాట ద్వారా తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార పాప. కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. మే 12న ఈ మూవీ రిలీజ్ కానుంది. చదవండి: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తమిళ బ్యూటీ..! -
నిన్ను గర్వపడేలా చేస్తా నాన్న: సితార
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న ఈ మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి నేడు(ఆదివారం) సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ‘ఎవ్రీ పెన్ని ఎవ్రీ పెన్ని’ అంటూ సాగే పాట ప్రోమోను నిన్న(శనివారం) మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో అందరిని ఆశ్చర్యపరిచే ఓ సంఘటన చోటు చేసుకుంది. మహేశ్ బాబు కూతురు సితార ఈ పాటలో కనిపించి షాకిచ్చింది. తొలిసారి తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని వెండితెర ఎంట్రీ ఇచ్చేసింది సితార పాప. చదవండి: Sarkaru Vaari Paata: సెకండ్ సింగిల్ అవుట్, ఆశ్చర్యపరిచిన సితార దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరంలో మునిగితేలుతున్నారు. శనివారం(మార్చి 19) ప్రోమో విడుదలైన నేపథ్యంలో సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తిర పోస్ట్ షేర్ చేసింది. ‘పెన్ని సాంగ్ కోసం సర్కారు వారి పాట వంటి అద్భతమైన టీంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. నాన్న.. నిన్ను గర్వపడేలా చేస్తాను’ అంటూ సితార రాసుకొచ్చింది. కాగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
కళావతి సాంగ్‌కు ఎస్ఆర్హెచ్ ఆటగాడి స్టెప్పులు.. నీకంత సీన్ లేదులే! అయినా
ఐపీఎల్- 2022 సీజన్ ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఫ్రాంఛైజీలు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు మరింత దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి. ఆటగాళ్ల మ్యాచ్ ప్రాక్టీసు వీడియోలతో పాటు.. ఖాళీ సమయాల్లో వారు సరదగా గడిపిన క్షణాలను బంధించి షేర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు సన్‌రైజెర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు ఆభిషేక్ శర్మ స్టెప్పులేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సన్‌రైజెర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆభిషేక్ డ్యాన్స్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఓ యాజర్ స్పందిస్తూ.. 'మైఖేల్ జాక్సన్ లా డ్యాన్స్ చేస్తున్నా అనుకుంటున్నావా.. నీకంత లేదులే.. అయినా పర్లేదనిపించావు' అంటూ కామెంట్ చేశాడు. ఇక ఐపీఎల్ మెగా వేలంలో ఆభిషేక్ శర్మను రూ. 6.50 కోట్లకు ఎస్ఆర్హెచ్ కొనుగోలు చేసింది. ఇక మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. అదే విధంగా సన్‌రైజెర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో మార్చి న రాజస్తాన్ రాయల్స్‌ను ఢీకొట్టనుంది. మా పాట.. మీ ఆట అదుర్స్ అభిషేక్ శర్మ డాన్స్ వీడియోపై సర్కారు వారి పాట టీమ్ ట్విటర్ వేదికగా స్పందించింది. ‘‘మా పాట.. మీ ఆట.. రెండూ అదిరిపోతాయి. ఆల్ ది బెస్ట్’’ అంటూ సన్‌రైజర్స్‌కు విషెస్ తెలిపింది. Sarkaru vaari paataki Abhishek vaari aata 😜@IamAbhiSharma4 #OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/AE32pFTwPY — SunRisers Hyderabad (@SunRisers) March 19, 2022 Maa Paata🎵 🔔 Mee Aaata 🕺🏏 Rendu Adhiripothai 🤩⚡️ Best Wishes for #IPL2022 🧡 https://t.co/FZyK8yaErI — SarkaruVaariPaata (@SVPTheFilm) March 19, 2022 The dance, you saw. 🕺 The making, you now see 😅#OrangeArmy #ReadyToRise #TATAIPL pic.twitter.com/76RHAhDXQI — SunRisers Hyderabad (@SunRisers) March 19, 2022 -
‘సర్కారు వారి పాట’ సెకండ్ సింగిల్, సితార పాప ఎంట్రీ ఇచ్చేసిందిగా..
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే మార్చి 20న ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్ ‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే ఈ పాటలో మహేశ్ తనయ సితార ఘట్టమేనిన కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. చూస్తుంటే తండ్రి మూవీతోనే సితార వెండితెర ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ పాటలో సితార గ్రూప్‌లో లీడ్ డ్యాన్సర్‌గా కనిపించింది. ఇందులో ఆమె స్టైలిష్ స్టెప్పులతో అదరగొట్టింది. తండ్రి ఓ ఫారిన్ లేడి గ్రూప్‌తో డ్యాన్స్ చేస్తుంటే.. సితార మరో గ్రూప్‌తో లీడ్ డ్యాన్స్‌ర్‌గా ఆకట్టుకుంటుంది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నామంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
‘సర్కారు వారి పాట’ అప్డేట్, 20న సెకండ్ సింగిల్
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి జాన్వీ కపూర్ మూవీ! ఎక్కడంటే? మే 12న విడుదల కానున్న ఈ సినిమాలోని ‘పెన్నీ..’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ పేర్కొంటూ, ఓ పోస్టర్ విడుదల చేసింది. ‘పెన్నీ’ అంటున్నారు కాబట్టి ‘డబ్బు’ నేపథ్యంలో ఈ పాట సాగుతుందని ఊహించవచ్చు. ‘‘భారీ అంచనాలతో రూపొందుతోన్న ‘సర్కారువారి పాట’ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మా చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ‘కళావతి..’ ఇప్పటికే 90 మిలియన్ల వ్యూస్‌ను దాటింది. ‘పెన్నీ..’ పాటకి కూడా మంచి స్పందన వస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
యాక్షన్ క్లైమాక్స్
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ యాక్షన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబుపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్సే సినిమా క్లైమాక్స్‌లో ఉంటుందని తెలిసింది. ఈ సీక్వెన్స్‌తో టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఇక పాటల షూటì ంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాంకు మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ‘సర్కారువారి పాట’ మే 12న విడుదల కానుంది. -
Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు మహాశివరాత్రి కానుక
Mahesh Babu Movie Poster Out: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే కానుకను అదించింది సర్కారువారి పాట చిత్ర యూనిట్. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు రౌడీలను కొడుతుంటే.. వాళ్లు గాల్లో ఎగిరిపడుతున్నారు. ఈ పోస్టర్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉందని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. A demeanour so calm and a rage so destructive 💥 Team #SarkaruVaariPaata wishes everyone a Happy Shivaratri! #SVPOnMay12 Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/2OJMKt3v5C — Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2022 -
ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్
Mahesh Babu Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీలో మహేశ్ ఫ్యాన్ష్ ఎన్నో అంచాలను పెట్టుకున్నారు. అయితే ఇందులో మహేశ్‌కు జోడిగా కీర్తి సురేశ్‌ను ప్రకటించినప్పటి నుంచి మహేశ్ ఫ్యాన్స్ నిరాశ భావం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటలో హీరోయిన్గా కీర్తి ఉత్తమమైన ఎంపిక కాదని, మహేశ్‌కు ఆమె సరైనా జోడి కాదంటూ నెటిజన్లు మొదటి నుంచి వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. ఇక మహేశ్ సినిమాను మేలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ వాదనలు మరింత ఎక్కువయ్యాయి. మే నెల మహేశ్‌కు కలిసి రాకపోవడం, పైగా కీర్తి సురేశ్ హీరోయిన్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకుంటే ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాల్లో నేను.. శైలజా, మహానటి తప్పా మరే సినిమాలు సక్సెస్ కాలేదు. ఇటీవల ఆమె నటించిన పెద్దన్న, గుడ్‌లక్ సఖీ, మిస్ ఇండియా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పొందాయి. దీంతో కీర్తికి ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఇదే సర్కారు వారి పాటకు కొనసాగుతుందేనేమోనని భయపడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఆమె నటించిన గాంధారి మ్యూజిక్ వీడియో రీసెంట్గా విడుదలైంది. ఈ మ్యూజిక్ వీడియోలో కీర్తి నటించడంపై మహేశ్ ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి కళాకారులు సైతం మంచి విజువల్స్‌తో ఆకట్టుకునే మ్యూజిక్ వీడియోలు చేస్తున్న తరుణంలో కీర్తి ఇలాంటి చెత్త మ్యూజిక్ వీడియోలో నటించిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియో సహజంగా లేదని, పేలవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఆమె కాస్ట్యూమ్, వీడియో విజువల్స్ పేలవంగా ఉన్నాయని, ఈ సాంగ్ కాపీ కొట్టినట్లు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మహేశ్ బాబు వంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్రమంలో ఆమె ఎంపికల అదే స్దాయిలో ఉండాలని, కానీ ఆమె ఇలాంటి సెకండ్ గ్రేడ్‌లో మ్యూజిక్‌లో నటించి తెలివి తక్కువగా వ్యవహరించింది’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇకనైన ఆమె ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించే వరకు ఇలాంటి మ్యూజిక్ చేయద్దని ఆమెకు సూచిస్తున్నారు. ఇక గాంధారీ మ్యూజిక్ వీడియోతో ఆమెపై వస్తున్న నెగిటివిటిని చూసి ‘సర్కారు వారి పాట’ మూవీ టీం సైతం కీర్తిపై అప్సెట్ అయినట్లు సినీవర్గాల నుంచి సమాచారం. మరి ఈ ట్రోల్స్‌పై కీర్తి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
కళావతి స్టెప్ ను రీక్రియేట్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్
-
కళావతి పాటకు తమన్ స్టెప్పులు
-
కళావతి పాటకు తమన్ స్టెప్పులు.. నెటిజన్ల ప్రశంసలు
Thaman Dance To Kalavathi Song From Sarkaru Vaari Paata: మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మాస్ బీజీఎంలతో ప్రేక్షకులను, అభిమానులను ఉర్రూతలూగిస్తాడు. ఇటీవల 'అఖండ' సినిమాకు ఇచ్చిన తమన్ బీజీఎం ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ సినిమాలోని బీజీఎంకి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అయితే తమన్ మ్యూజిక్‌తోనే కాకుండా డ్యాన్స్‌తో సైతం మ్యాజిక్ చేశాడు. ప్రస్తుతం తమన్ సంగీతం అందించిన మరో సినిమా 'సర్కారు వారి పాట'. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ జోడిగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ 'కళావతి సాంగ్' యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ లిరికల్ అత్యధిక వ్యూస్‌తో దుమ్ములేపుతోంది. దీంతో నెటిజన్లే కాకుండా కీర్తి సురేష్, మహేశ్ బాబు కుమార్తె సితార సైతం ఈ సాంగ్‌పై స్టెప్పులేసి అలరించారు. తాజాగా తనే కంపోజ్ చేసిన సాంగ్‌కు స్టెప్పులేసి అబ్బురపరిచాడు తమన్. శేఖర్ మాస్టర్‌తో కలిసి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఈ పాటలో మహేశ్ బాబు వేసిన హుక్ స్టెప్‌ను వేసిన తమన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. తమన్ డ్యాన్స్ స్టెప్పులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. -
'కళావతి సాంగ్'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్
Keerthi Suresh Dance On Kalavathi Song Videos Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'కళావతి పాట' యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికే 35 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ పాటపై ఇప్పటికే అనేకమంది నెటిజన్స్ రీల్స్ చేసి అలరించారు. అలాగే మహేశ్ బాబు గారాల పట్టి సితార 'కళావతి సాంగ్'పై అదిరిపోయేలా స్టెప్పులేసింది. తాజాగా 'కళావతి సాంగ్'పై కళావతే అంటే కీర్తి సురేష్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
సితార డ్యాన్స్ వీడియోపై మహేశ్ ఏమన్నాడంటే..
Mahesh Babu Comments On Sitara Cute Dance To Kalavathi Song: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరేళ్ల వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన యూనిక్ స్టైల్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రికి తగ్గ కూతురిగానే కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్ స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది. ఇది చూసిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్యూ మై లిటిల్ వన్ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే సూపర్‌స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: 'కళావతి' పాటకు మహేశ్ బాబు కూతురు సితార స్టెప్పులు View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
కళావతి పాట రచయిత అనంత శ్రీరామ్ సర్కారు వారి పాట గురించి..
-
కళావతి సాంగ్ మేకింగ్ వీడియో, ఈ పాట కోసం ఎంత ఖర్చు పెట్టారంటే?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారువారి పాట. వాలంటైన్స్ డేకు ఒకరోజు ముందే అంటే ఫిబ్రవరి 13న ఈ సినిమా నుంచి కళావతి సాంగ్ రిలీజైంది. వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయా.. ఏందే నీ మాయ.. అంటూ సాగే లిరిక్స్ సంగీతప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇప్పటివరు ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్ రాగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. సెన్సేషనల్‌గా మారిన ఈ హిట్ పాటకు తమన్ సంగీతం అందించగా సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. తాజాగా ఈ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో చిత్రయూనిట్ మహేశ్, కీర్తి సురేశ్ ఫన్నీ మూమెంట్స్‌ను చూపించారు. ఇక ఈ లిరికల్ సాంగ్ కోసం నిర్మాతలు ఏమాత్రం వెనకడుగు వేయకుండా రూ.40- రూ.60 లక్షల మేర ఖర్చు చేసినట్లు ఫిల్మీదునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా మే 12న విడుదలవుతోంది. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న 'కళావతి' సాంగ్
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక వాలెంటైన్స్‌డేకు ఒకరోజు ముందుగా ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ కళావతి సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ పాట 20మిలియన్స్‌కి పైగా వ్యూస్‌ని సాధించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సోషల్‌మీడియాలో సైతం ఈ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వస్తుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అప్పుడే 943kకి పైగా లైక్స్ రావడం విశేషం. -
లుక్స్ తో ఫిదా చేసిన మహేష్, మహానటి
-
లీక్ ఎఫెక్ట్.. 'సర్కారు వారి పాట' ఒరిజినల్ సాంగ్ అవుట్
మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ కళావతి పాట విడుదల చేయాల్సి ఉండగా, ఒకరోజు ముందుగానే ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. దీంతో ఈ పాటను షెడ్యూల్‌కి ఒకరోజు ముందే మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. 'వందో, ఒక వెయ్యో, ఒకలక్షో మెరుపులు దూకినాయా.. ఏందే ఈ మాయ, కమా కమాన్ కళావతి.. నువ్వే లేకుంటే అదోగతి' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటాయి. మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. మే 12వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. #Kalaavathi is here!! Definitely one of my favourites! 👌https://t.co/t7fWq2UyUa@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @sidsriram @GMBents @MythriOfficial @14ReelsPlus — Mahesh Babu (@urstrulyMahesh) February 13, 2022 -
'సర్కారువారి పాట' సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్
Two Persons Arrested For SVP Song Leak: సూపర్‌స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి పాట ఆన్లైన్లో లీకైన సంగతి తెలిసిందే. వాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న మూవీ టీంకు లీకువీరులు భారీ షాకిచ్చారు. దీంతో రిలీజ్‌కు ఒకరోజు ముందుగానే కళావతి పాట సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దీంతో షాక్‌కి గురైన మేకర్స్ రంగంలోకి దిగారు. పాటను లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. కాగా వాలైంటైన్స్ డే సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా ఆన్లైన్ లీక్ నేపథ్యంలో నేడు(ఆదివారం)అధికారికంగా పాటను విడుదల చేస్తున్నారు. -
హార్ట్ బ్రేకింగ్: వాడికి పనిస్తే.. ఈ పని చేస్తాడని అనుకోలేదు
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం నుంచి గతంలో మూవీ టీజర్ లీక్ కాగా తాజాగా కళావతి పాట కూడా లీక్ కావడంతో మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఇదే విషయంపై సంగీత దర్శకుడు తమన్ స్పందించాడు. తన మాటల్లో.. నా మనసు చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట వీడియో కోసం ఎంతెంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. ఈ పాట షూటింగ్ సమయంలో 9మందికి కరోనా పాజిటివ్ కూడా వచ్చింది. మేము మా హీరోగారికి చూపించిల్సిన ప్రేమ, మా అభిమానం. మా పాటలో ఉండే ప్రాణం. మా కవి రాసిన అద్భుతమైన లిరిక్స్. మా డైరెక్టర్ గారు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా చేసిన లిరికల్ వీడియో. మాస్టరింగ్, మిక్సింగ్ టెక్నాలజీ వాడాం ఈ పాట కోసం. అలా ఎంతో కష్టపడి తయారు చేసిన పాటను ఎవడో చాలా ఈజీగా నెట్లో పెట్టేశాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. వాడికి పనిస్తే.. వాడు మాకు ఈ పని చేస్తాడని అనుకోలేదు. గుండె తరుక్కుపోతోంది. కోపంగా వుండాలా, బాధ పడాలా.. మూవ్ ఆన్ అవ్వాలా తెలియట్లేదు. ఎంతో హార్ట్ బ్రేకింగా వుంది. నేను మామూలుగా ఇంత హార్ట్ బ్రేక్ అవ్వను. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. ఎన్నో ఎదుర్కొన్నాను లైఫ్‌లో. నేనెందుకు పబ్లిక్ డొమైన్లో ఈ ఆడియో నోట్ పెడుతున్నానంటే వాడికి అర్దం కావాలి పైరసి అనేది ఎంత ఘోరమైన విషయమో వాడికి తెలియాలి అంటూ తమన్ ట్వీట్ ద్వారా తన ఆవేదనను తెలిపాడు. ఇక పాట లీకైన నేపథ్యంలో కళావతి పూర్తి పాటను నేడు అధికారికంగా యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. Heartbroken 💔 !! pic.twitter.com/tO75lsUND6 — thaman S (@MusicThaman) February 12, 2022 -
‘సర్కారు వారి పాట’ మూవీ టీంకు షాక్, ముందుగానే ఆన్‌లైన్‌లోకి..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ టీంకు మరోసారి భారీ షాక్ తగిలింది. ప్రారంభం నుంచి సర్కారు వారి పాటను పైరసి వీరులు వెంటాడుతున్నారు. ప్రారంభం నుంచి ఈ మూవీ అప్డేట్ విషయంలో చిత్ర బృందం కంటే లీక్ వీరులు ముందుగా స్పందిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ల నుంచి రేపు రాబోయే తొలి సాంగ్ వరకు ముందుగానే అప్డేట్ లీక్ చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా రేపు ఈ చిత్రం నుంచి విడుదల కానున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ ముందుగానే నెట్టింట దర్శనమించింది. వాలంటైన్స్ డేకు మహేశ్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయాలనుకున్న మూవీ టీంకు షాకిస్తూ లీకు వీరులు ఒకరోజు ముందుగానే ఈ పాటను ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మూవీ టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‌పై మండిపడుతున్నారు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ఇదిలా ఉంటే నిన్న(శుక్రవారం) కళావతి పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్, కీర్తి సురేశ్‌ల మధ్య రొమాంటి యాంగిల్ ఉండటంతో సోషల్ మీడియాలో రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఫుల్సాంగ్ ఆసక్తికగా ఎదురు చూస్తున్న వారికి ఇది బిగ్ సర్ప్రైజ్ అంటు కామెంట్స్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది. -
‘సర్కారు వారి పాట’ తొలి సాంగ్ ప్రోమో..
మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ‘వందో.. ఓక వెయ్యో’ అంటూ మహేశ్ బాబు కీర్తి సూరేశ్‌ను ఫాలో అవుతుంటాడు. మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకరస్, 14 రీల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
‘సర్కారువారి పాట’లో జూనియర్ మహేశ్ ఎవరో తెలుసా?
‘‘నటుడిగా ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమా నుంచి ఒక కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాను’’ అని సుధీర్‌బాబు అన్నారు. 2012లో వచ్చిన ‘శివ మనసులో శృతి’ (ఎస్ఎమ్ఎస్) చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు సుధీర్‌బాబు. నేటికి (ఫిబ్రవరి 10) ఈ హీరో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో సుధీర్‌బాబు చెప్పిన విశేషాలు... ఇండస్ట్రీకి వందమంది వస్తే నలుగురే సక్సెస్ అవుతారు. నా కెరీర్లో నేను ఇప్పటివరకు 14 సినిమాలు చేశాను. నటుడిగా వందశాతం కష్టపడ్డాను. కానీ ఫలితాలు మన చేతుల్లో ఉండవు. రిలీజ్ డేట్, బడ్జెట్, ఆ సమయంలో ఆడియన్స్ మూడ్... ఇలా ఒక సినిమా రిజల్ట్‌కి చాలా కారణాలుంటాయి. నా కెరీర్లోనూ కొన్ని సినిమాలు ఆడలేదు.. ఆ అనుభవాల నుంచి తప్పులు తెలుసుకుని, వాటిని సరిదిద్దుకున్నాను. ఇప్పటికీ నా ప్రతి సినిమాను చివరి సినిమాలానే భావించి కష్టపడుతుంటాను. నటుడిగా కొంచెం ఆ భయం ఉండాలి. ► నా కెరీర్లో ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ డే షూటింగ్ సమయంలో నాది ఫొటోజెనిక్ ఫేస్ కాదన్నట్లుగా కెమెరామ్యాన్, అతని అసిస్టెంట్ మాట్లాడుకుంటుంటే విన్నాను. ఈ విషయం గురించి ఆలోచించి ఆ సినిమా కోసం నా పెర్ఫార్మెన్స్ను మెరుగుపరచుకున్నాను. కానీ అప్పుడు ఆ కెమెరామ్యాన్‌ను ఆ సినిమా నుంచి తొలగించాను. నెగటివ్ ఫీలింగ్స్ ఉండకూడదని అలా చేశాను. ఆ తర్వాత వేరే సినిమాకి అతనితో పనిచేశాను. స్టార్టింగ్‌లో నా వాయిస్ విషయంలో కొంత మిశ్రమ స్పందన వచ్చింది. సంగీత దర్శ కుడు ఆర్పీ పట్నాయక్‌గారి సహకారంతో కొంత ట్యూన్ చేసుకోగలిగాను. ► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ అవకాశాలు రావాలంటే నటుడిగా నిరూపించుకోవాలని ‘ఏ మాయ చేసావె’, హిందీ చిత్రం ‘బాఘీ’లో నెగటివ్ షేడ్స్ పాత్రలు చేశాను. హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’లో అవకాశం వచ్చింది. అదే సమయంలో నాకు ‘సమ్మోహనం’ రావడంతో ‘బ్రహ్మాస్త్ర’ చేయలేకపోయాను. ► కెరీర్ పరంగా కృష్ణగారు, మహేశ్‌ల నుంచి చాలా నేర్చుకున్నాను. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా వారు ఫ్యామిలీకి సమయం కేటాయిస్తారు. నేను కూడా అంతే. నాకు ఫేవర్ చేయమని వారినెప్పుడూ అడగలేదు. మహేశ్‌కి విలన్‌గా చేయడానికి అభ్యంతరం లేదు. కానీ మంచి కథ కుదరాలి. మహేశ్‌తో ఓ సినిమా నిర్మించాలని ఉంది. ► యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. జాకీ చాన్‌కు పెద్ద అభిమానిని. నేను నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ రిలీజ్‌కు రెడీగా ఉంది. హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను. భవ్య క్రియేషన్స్‌లో ఓ మూవీ కమిటయ్యాను. ‘లూజర్ 2’ డైరెక్టర్ అభిలాష్ రెడ్డితో ఓ సినిమా ఉంటుంది. ► నా ఇద్దరు కుమారులు చరిత్, దర్శన్ సినిమాల పట్ల ఆసక్తిగానే ఉన్నారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో నేను చేస్తోన్న సినిమాలో చరిత్ నా చిన్ననాటి క్యారెక్టర్ చేశాడు. మహేశ్ ‘సర్కారువారి పాట’ సినిమాలో జూనియర్ మహేశ్‌గా దర్శన్ కనిపిస్తాడు. -
సర్కారు వారి పాట: కళావతి సాంగ్ పోస్టర్ రిలీజ్
మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘కళావతి..’ (హీరోయిన్ పాత్ర పేరు) అంటూ సాగే మొదటి పాటను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా మే 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. The Classical Melody #Kalaavathi will strum your heart strings ♥️ #SVPFirstSingle will join your playlists on FEB 14 🎶#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/CtyfZaQXdg — SarkaruVaariPaata (@SVPTheFilm) February 9, 2022 -
మే 12 న సర్కారు వారి పాట రిలీజ్
-
వాలంటైన్స్ డేకు ‘సర్కారి వారి పాట’ నుంచి సర్ప్రైజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి త్వరలోనే ఓ ఆసక్తికర అప్డేట్ రానుంది. దీనికి ప్రమేకుల రోజు ఫిబ్రవరి 14న చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేస్తూ తాజాగా ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా సర్కారు వారి పాటోలోని ఫస్ట్‌సింగిల్ విడుదలకు రెడీ అయినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. చదవండి: అషురెడ్డి రచ్చ, ఫోన్ నెంబర్ షేర్ చేయడంతో దిగొచ్చిన నెటిజన్.. ‘కళావతి’ అంటూ పాగే ఈ పాటను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం పేర్కొంది. "వాలెంటైన్స్ డే రోజున 'కళావతి'తో ప్రేమలో పడండి" అంటూ ఓ ప్రకటన ఇచ్చింది. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సర్కారు వారి పాట చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. Fall in love with #Kalaavathi this Valentines day ❤️ #SVPFirstSingle on February 14th 🎶#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/rlhzw9t0yq — Mythri Movie Makers (@MythriOfficial) February 7, 2022 -
తీపి కబురు.. పెద్ద సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ఇవే!
మంచిది.. ఇలా కదా చేయాల్సింది.. మంచిది... ఇది కదా జరగాల్సింది. మంచిది... ఇంత ఫ్రెండ్లీగా కదా ఉండాల్సింది. సోమవారం కొన్ని మంచి విషయాలను మోసుకొచ్చింది. టాలీవుడ్ పెద్ద నిర్మాతలందరూ మంచి నిర్ణయం తీసుకున్న కబురు తెచ్చింది. పెద్ద సినిమాలు క్లాష్ కాకుండా.. నిర్మాతలు సినిమాల రిలీజ్ డేట్స్‌ని డిసైడ్ చేశారు. సోమవారం ముందు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి. నిర్మాతలు డిసైడ్ అయి, ఇలా విడుదల తేదీలు చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక రిలీజ్ ‘డేట్ లాక్’ చేసుకున్న సినిమాల డేటా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ‘రౌద్రం.. రుధిరం.. రణం’ (ఆర్ఆర్ఆర్) సినిమా గురించి సినీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. కానీ జనవరి 31 (సోమవారం) ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి, స్వీట్ షాక్ ఇచ్చింది. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. కొన్ని కల్పిత అంశాలకు స్నేహం, భావోద్వేగాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల రాజమౌళి చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా దాదాపు పద్నాలుగు భాషల్లో (విదేశీ భాషలతో కలిపి) విడుదల కానుంది. ఇక ధర్మస్థలి పోరాటాన్ని వెండితెరపై చూసే సమయం ఎప్పుడో తెలిసిపోయింది. చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ చిత్రం ధర్మస్థలి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం సోమవారం ప్రకటించింది. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు 2022లో ముందుగానే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రాల జాబితాలో మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ముందు వరుసలో ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు (అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల జనవరి 7కి షెడ్యూలైన కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోరిన మేరకు వాయిదా వేసుకున్నారు). ఆ తర్వాత ఏప్రిల్ 1న ‘సర్కారువారి పాట’ను రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్రనిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట తెలిపారు. అయితే ఏప్రిల్ 1కి షెడ్యూల్ అయిన ఈ చిత్రం ఆ తేదీకి రావడంలేదు. మే 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయిక. ఇటు మేం ఎప్పుడు వస్తే అప్పుడే నవ్వుల పండగ అని ‘ఎఫ్ 3’ టీమ్ చెబుతూనే ఉంది. ఏప్రిల్ 28న ప్రేక్షకులను నవ్వించాలని ఈ సినిమా టీమ్ ఇటీవల డిసైడ్ అయింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి సినిమాల కొత్త విడుదల తేదీలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ‘ఎఫ్ 3’ సినిమా విడుదలలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమాను ఏప్రిల్ 28నే విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ మంచి విజయాన్ని సాధించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. ఇక ‘ఎఫ్ 3’ గ్యాంగ్‌లో సునీల్, సోనాలీ చౌహాన్ కూడా చేరారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ‘ఎఫ్ 3’ సినిమాను నిర్మించారు. మరోవైపు పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఈ ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. అయితే సోమవారం కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో తమ సినిమా రిలీజ్‌ను కూడా ‘భీమ్లానాయక్’ టీమ్ ప్రకటించింది. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని చిత్రనిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. కోవిడ్ సృష్టించిన అయోమయ పరిస్థితుల కారణంగా సినిమాల విడుదలలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా ఒకేసారి పెద్ద చిత్రాల విడుదల తేదీలు ఖరారు కావడం సినిమాని నమ్ముకున్న అందరికీ తీపి కబురులాంటిది. విడుదల తేదీలు ఆర్ఆర్ఆర్ – మార్చి 25 ఆచార్య – ఏప్రిల్ 29 ఎఫ్ 3 – ఏప్రిల్ 28 సర్కారువారి పాట – మే 12 భీమ్లా నాయక్ – ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 డేట్ డిబేట్ ఇక మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ గురించి డిబేట్స్ (చర్చలు) జరుగుతున్నాయని తెలిసింది. ఈ జనవరి 14న విడుదల కావాల్సిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ థియేటర్స్‌కు రాలేదు. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుందన్నది లేటెస్ట్ టాక్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే వరుణ్ తేజ్ చేసిన ‘గని’ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే అంటే ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రనిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహోర్లు’ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ తేదీకి ‘భీమ్లా నాయక్’ వస్తే, ‘ఆడవాళ్ళు...’ సినిమా రిలీజ్ డేట్ మారొచ్చు. అలాగే ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కావాల్సింది. కానీ తాజా విడుదల తేదీల ఖరారు దృష్ట్యా ఈ సినిమా రిలీజ్ డేట్ (‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ రిలీజ్ కారణంగా) మారే చాన్స్ ఉంది. అలాగే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్‌పై నిర్మాతల మధ్య సానుకూల వాతావరణంలో డేట్ డిబేట్ జరుగుతోంది. -
సర్కారు వారి పాట లేటెస్ట్ అప్డేట్
Sarkaru Vaari Paata Movie First Love Song Release Date Confirmed: సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ని విడుదల చేసింది చిత్ర బృందం. ఈ చిత్రంలోని తొలి పాటను ఫిబ్రవరి14, వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ని విడుదల చేసింది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. This Valentines Day, let us fall in love with the Melody Of The Year 💕#SVPFirstSingle on February 14.#SarkaruVaariPaata Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/AdexC9sZu6 — SarkaruVaariPaata (@SVPTheFilm) January 26, 2022 -
మనసు మార్చుకున్న మహేశ్.. ఇకపై తన టార్గెట్ అదేనట!
టాలీవుడ్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. మన హీరోలు గతంలో నటించిన చిత్రాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకుంటున్నాయి. దాంతో తెలుగు హీరోలు అక్కడ బాగా పాపులర్ అయిపోయారు. సౌత్ నుంచి నార్త్ కు వెళ్తున్న సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారు. సర్కారు వారి పాట మూవీని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఇండియాలో హ్యాండ్ సమ్ హీరోస్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో లిస్ట్ లో మహేశ్ పేరు కూడా ఉంటుంది. కేవలం టాలీవుడ్ మూవీస్ తోనే, బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు సూపర్ స్టార్. అందుకే ఉత్తరాదిన చాలా మంది హీరోయిన్స్ మహేశ్‌తో నటించాలని ఉందని చాలా సార్లు స్టేట్ మెంట్ ఇచ్చారు. అక్కడి దర్శకులు కూడా ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ పై ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. పోకిరి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి చిత్రాలతో మహేశ్ స్టార్ డమ్ గురించి బాలీవుడ్ లో బాగానే డిస్కషన్ జరిగింది. ఒక దశలో ప్రిన్స్ బాలీవుడ్ ఎంట్రీ కన్ ఫామ్ కూడా అయింది. కాని ఎందుకో మహేశ్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు ప్లాన్ మళ్లీ మారింది. మహేశ్ బాలీవుడ్ మార్కెట్ పై సీరియస్ గా టార్గెట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ముందు సర్కారు వారి పాట, ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా, అల్టిమేట్ గా రాజమౌళి మూవీతో అక్కడ ఇండస్ట్రీ కొట్టాలని డిసైడ్ అయ్యాడట ప్రిన్స్. -
ఊ అంటావా.. ఊహూ అంటావా .. కరోనా
ఊ అంటావా కరోనా.. ఊహూ అంటావా కరోనా... రమ్మంటావా కరోనా.. రావొద్దంటావా కరోనా.. రెండేళ్లుగా సినిమాల విడుదల విషయంలో కరోనా ఇలానే దోబూచులాడుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, తెరపై ప్రత్యక్షమవడమే ఆలస్యం అనుకునే టైమ్‌లో కరోనా విజృంభించి ‘ఊహూ’ అంటోంది... ‘రావద్దంటోంది’. కరోనా ఎఫెక్ట్‌తో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రావాల్సిన సినిమాలు ఏప్రిల్‌కి వాయిదా పడ్డాయి. అయితే ఆరేడు సినిమాల వరకూ పెద్దవే కావడంతో డేట్ల సర్దుబాబు, థియేటర్ల సర్దుబాటు... ఇలా ఎన్నో సర్దుబాట్లు అవసరం. మరి.. అన్ని సర్దుబాట్లూ చేసుకుని తీరా రిలీజ్ టైమ్‌కి కరోనా ‘ఊ’ అంటుందా... ‘రావొద్దు’ అంటుందా అనేది సమ్మర్లో తెలుస్తుంది. ఇక సమ్మర్లో మెయిన్ సీజన్ అయిన ఏప్రిల్‌లో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం. ఏప్రిల్ ఎండలు పుంజుకునే టైమ్‌కి నెల తొలి రోజే రావడానికి రెడీ అవుతున్నాడు ‘ఆచార్య’. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్‌కు ప్రకటించక ముందే ఇదే తేదీని ముందుగా బుక్ చేసుకుంది ‘సర్కారువారి పాట’ చిత్రం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల మహేశ్ కాలికి సర్జరీ జరగడం, ఆ తర్వాత కరోనా బారిన పడటం, అలాగే ఈ చిత్రానికి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు కూడా కోవిడ్ బారిన పడటంతో ‘సర్కారువారి పాట’ చిత్రం విడుదల ఆగస్టుకు వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1నే విడుదల చేసే సాధ్యాసాధ్యాలను ఈ చిత్రం యూనిట్ పరిశీలిస్తోందని తెలిసింది. మరి.. ఏప్రిల్ 1నే ‘ఆచార్య’, ‘సర్కారువారి పాట’ విడుదలవుతాయా? ఏదైనా చిత్రం వాయిదా పడుతుందా? మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు ‘కేజీఎఫ్ 2’ ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ వస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక ఇదే నిర్మాత నిర్మిస్తోన్న మరో భారీ చిత్రం ‘సలార్’ కూడా ఏప్రిల్ 14 విడుదల జాబితాలో ఉంది. ఈ తేదీని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. అయితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘సలార్’ చిత్రాలకు ఒకే నిర్మాత, ఒకే దర్శకుడు కాబట్టి, పైగా ‘కేజీఎఫ్ 2’తో పోల్చితే ‘సలార్’ షూటింగ్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. ‘సలార్’ దసరాకు విడుదలయ్యే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఏప్రిల్ 14నే నాగచైతన్య తెరపై కనిపించనున్నారు. కానీ నాగచైతన్య హీరోగా చేసిన చిత్రంతో కాదు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న హిందీతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇంకోవైపు సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా çపడిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎఫ్ 3’. వెంకీ–వరుణ్–అనిల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న థియేటర్స్‌కు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా ఇదే తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఎమ్ఎస్ రాజశేఖర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్. ఇక సమంత నటించిన తొలి మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ కూడా సమ్మర్ లిస్ట్‌లోనే ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమ గుణ తేదీలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇవే కాదు.. మరికొన్ని మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా ఏప్రిల్ రిలీజ్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. మరి.. సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ మంచి సీజన్ కదా. ఏప్రిల్ వైపు ‘ఆర్ఆర్ఆర్’ చూపు? ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై అన్ని ఇండస్ట్రీస్‌లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని ఏప్రిల్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకుంటే ‘ఎఫ్ 3’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల విడుదల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. వేసవిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు కూడా విడుదలవుతుంటాయి. ఈ వేసవికి కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘బీస్ట్’, దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముందుగా విజయ్ ‘బీస్ట్’ ఏప్రిల్ 14న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ‘విక్రమ్’ కూడా ఏప్రిల్‌లోనే రానున్నట్లు తెలిసింది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి పార్ట్ వేసవిలోనే రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. -
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' మళ్లీ వాయిదా !.. కారణం ?
Will Mahesh Babu Sarkaru Vaari Paata Get Postponed Again: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్గా చేస్తోంది. నిజానికి ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 14) థియేటర్లలో సందడి చేయాల్సింది. దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్)ను జనవరి 7న రిలీజ్ చేస్తామని ప్రకటించడం, పలు కారణాలతో 'సర్కారు వారి పాట' మూవీ విడుదలను వాయిదా వేయాల్సి వచ్చింది. తర్వాత ఏప్రిల్ ఒకటిన రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే మళ్లీ తాజాగా ఈ డేట్‌కు కూడా విడుదల చేయడం అనుమానమే అంటున్నాయి సినీ వర్గాలు. ఎందుకంటే మహేశ్ బాబుతో పాటు హీరోయిన్ కీర్తి సురేష్ ఇద్దరికి కూడా కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వీళ్లిద్దరూ ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉన్నారు. వైద్యుల సూచనలతో చికిత్స తీసుకుంటున్నారు. ఇదే కాకుండా ఇటీవల మహేశ్ బాబుకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. దీంతో ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం కానున్నట్లు సమాచారం. ఇలాంటి కారణాలు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏప్రిల్ 1 తేదికి సినిమా పూర్తయ్యే సూచనలు కనిపించనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' రిలీజ్‌ను వాయిదా వేయటం తప్ప మరో అవకాశం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పరిస్థితులన్నీ సవ్యంగా చక్కబడి సినిమా షూటింగ్ పూర్తియ్యాక సినిమాను ఆగస్టు 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదీ చదవండి: సర్జరీ కోసం అమెరికా వెళ్తున్న మహేశ్‌బాబు -
సంక్రాంతికి ‘సర్కారు వారి పాట’సర్ప్రైజ్!
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్ బాబు మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. సంక్రాంతికి బరిలోకి దిగాల్సిన ‘సర్కారు వారి పాట’ పోస్ట్ పోన్ అయింది. దీంతో ప్రిన్స్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు.అయితే మరో నాలుగు రోజులు ఒపిక పట్టమంటోంది ఈ సినిమా యూనిట్. సంక్రాంతి నుంచి సర్కారు వారి అప్ డేట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కికి కావడం అంటోంది యూనిట్. సంక్రాంతి పండగ కానుకగా సినిమాను రిలీజ్ చేయలేకపోయింది యూనిట్. అందుకే పండక్కి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనుకుంటోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్ కంపోజీషన్ కంప్లీట్ చేసాడు తమన్. సాంగ్స్ అన్ని నెక్ట్స్ లెవల్లో ఉంటాయని, సర్కారు వారి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయమని గతంలోనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు తమన్.గీత గోవిందం దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. మూవీ షూటింగ్ కు సంబంధించిన మరో షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. త్వరలో లాస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసి,మూవీని ఏప్రిల్ 1కి రిలీజ్ కు రెడీ చేయనుంది యూనిట్. మహేశ్‌కు జోడిగా కీర్తి సురేష్ కనిపిస్తోంది. సముద్రఖని విలన్ రోల్ చేస్తున్నాడు. -
సూపర్ స్టార్ పండగ కానుక
-
మహేశ్‌బాబుపై రాజమౌళి ప్రశంసల వర్షం.. కారణం ఇదే
ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్న సూపర్ స్టార్ మహేశ్ బాబుపై దర్శక దిగ్గజం రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేందుకు మహేశ్ తీసుకున్న చొరవ అభినందనీయం అని కొనియాడారు. మహేశ్‌తో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఎఫ్ 3 మూవీ టీమ్‌ని కూడా అభినందించాడు. కాగా, పాన్ ఇండియా మూవీస్ ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ విడుదలను దృష్టిలో పెట్టికొని మహేశ్.. తాను హీరోగా నటిస్తున్న ‘‘సర్కారువారి పాట’ను 2022 సంక్రాంతి నుంచి ఏప్రిల్ 1కి వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే సీజన్లో విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’, ఎఫ్3 చిత్రాలు కూడా విడుదల తేదీలను మార్చుకున్నాయి. .@urstrulyMahesh was the one who took the initative in decluttering the Pongal releases... Even though #SarkaruVaariPaata was a perfect Pongal film, he moved it to summer and created a healthy atmosphere. Thanks to my Hero 🙂 and also to the entire team at @MythriOfficial… — rajamouli ss (@ssrajamouli) December 21, 2021 ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25కి, ‘ఎఫ్ 3’ చిత్రాలను ఏప్రిల్ 29కి వాయిదా వేశారు. ఈ మూడు చిత్రాల మేకర్స్ తీసుకున్న నిర్ణయంపై రాజమౌళి హర్షం వ్యక్తం చేశాడు. ‘సంక్రాంతి సీజన్‌కు రావాల్సిన సరైన సినిమా ‘సర్కారు వారి పాట’. కానీ చిత్ర సీమలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మహేశ్ బాబు తన చిత్రాన్ని వేసవికి వాయిదా వేసుకున్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు లేకుండా చూసేందుకు మహేశ్ తీసుకున్న చొరవ అభినందనీయం’అని రాజమౌళి ట్వీట్ చేశాడు. అలాగే భీమ్లా నాయక్, ఎఫ్3 బృందాలకు కూడా ట్విటర్ వేదికగా ధన్యవాదాలు తెలిపాడు. The decision by Chinababu garu and Pawan Kalyan garu to defer the release date of #BheemlaNayak is well appreciated. Wishing the team all the very best…:) — rajamouli ss (@ssrajamouli) December 21, 2021 ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం.. 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో కొమరమ్ భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలు పోషిస్తున్నారు. చెర్రీకి జోడిగా బాలీవుడ్ నటి ఆలియాభట్ నటించగా, తారక్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటించారు. Also, thanks to Dil Raju garu and the #F3Movie team for shifting the release of their film. Best wishes ! @SVC_official — rajamouli ss (@ssrajamouli) December 21, 2021 -
Mahesh Babu: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకి సర్జరీ.. షూటింగ్‌కు బ్రేక్
Super Star Mahesh Babu Undergo Surgery In Usa: సూపర్‌స్టార్ మహేశ్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో శస్త్రచికిత్స కోసం మహేశ్ యూఎస్‌కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్‌కు బ్రేక్ పడనుంది. రెండు నెలల పాటు షూటింగ్ వాయిదా పడనున్నట్లు సమాచారం. మరోవైపు ట్విట్టర్లో #GETWELLSOONMAHESHBABU అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. తమ అభిమాన హీరో మహేశ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. I wish u to have Speed Recovery Annayya 🥺#GetWellSoonMaheshBabu#SarkaruVaariPaata pic.twitter.com/4hHZTuA2ps — Maheshwar Thota 🔔 (@ThotaMaheshwar) December 1, 2021 Cinema late ina parley Anna, Ne health jagratha @urstrulyMahesh Annayya ❤️👍 మీకు ఏం కాదు అన్న మీ మంచితనం మీమల్ని ఎప్పుడు కాపాడుతుంది 💯🙏 Love you Anna 💗#GetWellSoonMaheshAnna #MaheshBabu #GetWellSoonMaheshBabu pic.twitter.com/n1TSyiOPhB — Bharath Dhfm 🔥🦁😎 (@Bharath19774940) December 1, 2021 Get well soon Superstar @urstrulyMahesh !! Have a speedy recovery! #GetWellSoonMaheshBabu pic.twitter.com/zEMBpLOcf3 — Tata Madhulika (@Madhutata24) December 1, 2021 #GetWellSoonMaheshAnna #GetWellSoonMaheshBabu #SarkaruVaariPaata — Ur'sTruelyPrinceAbhi (@Abhisvee) December 2, 2021 -
సంక్రాంతి బరిలో నుంచి ‘సర్కారు వారి పాట’ ఔట్.. విడుదల ఎప్పుడంటే
Sarkaru Vaari Paata New Release Date: సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్. ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో ఉన్న ఈ చిత్రం తాజాగా.. వేసవి బరిలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది. 2022 ఏప్రిల్ 1న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ని విడుదల చేసింది. The Date is Locked for the Auction & the Action in Theatres 🔥#SarkaruVaariPaata Grand Release on 1st APRIL, 2022 💥#SarkaruVaariPaataOnApril1 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/pLN14g2ER1 — Mythri Movie Makers (@MythriOfficial) November 3, 2021 -
స్పెయిన్‌లో మహేష్ బాబు క్రేజ్ ఎలా ఉందో చూశారా..
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. అంత స్టార్డమ్ ఉన్నప్పటికీ ఆయన ఎంతో ఒద్దికగా, డౌన్ టు ఎర్త్ ఉంటాడు. ఎవరితో అనవసరంగా దురుసుగా ప్రవర్తించడు. తన పనేదో తాను చూసుకొని వెళుతుంటాడు. అందుకే నటనకి మాత్రమే కాకుండా యాటిట్యూడ్‌కి సైతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా పరశురాం దర్శకత్వంలో మహేశ్ హీరోగా ‘సర్కారు వారి పాట’ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్ గ్యాప్‌లో అభిమానులు ఆయనతో ఫోటోల కోసం ఎగబడ్డారు. ఆయన కూడా ఎంతో ఓపికగా అందరితో కలిసి ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోని ఓ అభిమాని స్పెయిన్‌లో మహేశ్ బాబు క్రేజ్ అంటూ ట్విట్టర్లో షేర్ చేశాడు. దీంతో సూపర్‌స్టార్‌ని చాలామంది ఫ్యాన్స్ చుట్టుముట్టి ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మహేశ్ సరసన కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13, 2022న విడుదల కానుంది. చదవండి: ఫ్యామిలీతో స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ Superstar #MaheshBabu craze in Spain.#SarkaruVaariPaata pic.twitter.com/qM9M7sD85u — Manobala Vijayabalan (@ManobalaV) October 27, 2021 -
'సర్కారు వారి పాట' సెట్లో నమ్రత సందడి
Namrata And Keerthy’s BTS picture from SVP: మహేశ్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. దీంతో మహేశ్ తన ఫ్యామిలీని తీసుకొని స్పెయిన్ వెళ్లారు. ఓ వైపు మహేశ్ సినిమా షూటింగులో పాల్గొంటూనే మరోవైపు వెకేషన్లో ఉన్నారు. తాజాగా సర్కారు వారి పాట చిత్రీకరణలో స్పెయిన్‌లో ముగిసింది. చివరి రోజున సినిమా సెట్స్‌లో మహేశ్ భార్య నమ్రత సందడి చేసింది. సాంగ్ షూట్ నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఆమె కీర్తి సురేశ్‌తో సరదాగా ముచ్చటించారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటో వైరల్‌గా మారింది. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన విడుదల కానుంది. చదవండి: ఆర్యన్‌కు బెయిల్ రాకపోతే జరిగేది ఇదే.. Hyper Aadi: ఏడాదికి హైపర్ ఆది ఎంత సంపాదిస్తున్నాడంటే.. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఒక వైపు సూపర్ స్టార్ మరోవైపు పవర్ స్టార్..విజయమెవరిది?
టాలీవుడ్ కు కాసులు కురిపించే సీజన్ ఏదైనా ఉందంటే అది సంక్రాంతి పండగ మాత్రమే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరోనా సమయంలోనూ సంక్రాంతి సీజన్ కు విడుదలైన సినిమాలు కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. అందుకే ఈసారి మ్యాగ్జిమమ్ స్టార్స్ సంక్రాంతి సీజన్ కు సై అంటున్నారు. ఈసారి సంక్రాంతి సీజన్ కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కనీవినీ ఎరుగని పోటీ కనిపించనుంది. ఎందుకంటే ఒక వైపు సూపర్ స్టార్ మరో వైపు పవర్ స్టార్ ఇంకో వైపు రాధే శ్యామ్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే కన్ ఫామ్ చేసారు. జనవరి 7న ఆర్ఆర్ఆర్ రిలీజ్ అవుతున్నప్పటికీ సంక్రాంతికే వస్తున్నామని మాటిమాటికి రిలీజ్ డేట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు. జనవరి 12న పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న భీమ్లానాయక్ విడుదల కానుంది. ఇక జనవరి 13న మహేశ్ బాబు సర్కారువారి పాటతో రానున్నాడు. అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే.ఆ రోజున స్పెషల్ టీజర్ రిలీజ్ చేయనుంది రాధే శ్యామ్ యూనిట్. అందుకు సంబంధించిన పోస్టర్ పై కూడా జనవరి 14న ఈ మూవీ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు భారీ చిత్రాలతో పాటు మరో రెండు ప్రెస్టీజీయస్ ప్రాజెక్ట్స్ కూడా పోటపడబోతున్నాయంట. ఈ మూడు చిత్రాలతో పాటు ఎఫ్ 3 కూడా రిలీజ్ కానుందని ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయనా సీక్వెల్ బంగార్రాజు కూడా ఈ సంక్రాంతి సీజన్ కు రానుందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అప్పుడు సంక్రాంతి సమరం మరింత ఆసక్తికరంగా మారుతుంది. 2016లో సంక్రాంతికి విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సంచలన విజయం సాధించింది. కింగ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అందుకే మరోసారి సంక్రాంతి సీజన్ లోనే ఈ సినిమా సీక్వెల్ ను విడుదల చేయాలనుకుంటున్నారట.నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి కనువిందు చేయనుంది. నాగ చైతన్య, కృతి శెట్టి తొలిసారి కలసి నటిస్తున్నారు. మనం తర్వాత నాగార్జున, నాగ చైతన్య కలసి స్టెప్పులేయనున్నారు. -
సర్కారు వారి పాట: 70 శాతం షూటింగ్ పూర్తి, మహేశ్-కీర్తి మధ్య డ్యూయెట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల షూటింగ్ నేపథ్యంలో సర్కారు వారి పాట టీం స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్, సెకండ్ షెడ్యుల్‌ను హైదరాబాద్, ఇటీవల స్పెయిన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు 70 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట టీం స్పెయిన్‌లోని బార్సిలోనాలో షూటింగ్‌ను జరుపుకుంటోదట. చదవండి: ప్రభాస్ బర్త్‌డే హంగామా.. లీకైన ‘సలార్’ యాక్షన్ సీన్ వీడియో అక్కడి అందమైన లొకేషన్స్‌లో మహేశ్, కీర్తి మధ్య పాటలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, లవ్ ట్రాక్‌కు సంబంధించిన సీన్స్‌ను కూడా అక్కడ షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ నెల చివరి వరకు అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చివిరి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తారని సమాచారం. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చదవండి: లైవ్‌చాట్‌లో పూజ హెగ్డేకు షాకింగ్ ప్రశ్న, నెటిజన్‌కు హీరోయిన్ చురక -
'మహానటి' బర్త్‌డే..వరుస పోస్టర్లతో సర్ప్రైజ్
Happy Birthday Keerthy Suresh : కీర్తి సురేశ్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది. అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకు మనసు గెలుచుకుంది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి ప్రస్తుతం తెలుగులో బోళా శంకర్, సర్కారు వారి పాట, గుడ్‌లక్ సఖి చిత్రాల్లో నటిస్తుంది. ఆదివారం(అక్టోబర్17)న కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా కీర్తి బర్త్‌డే పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. అవేంటో చేసేయండి.. సర్కారు వారి పాట చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేసింది. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కీర్తి సురేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ మూవీ టీం ట్వీట్ చేసింది. సర్కారు వారి పాట చిత్రం నుంచి కీర్తి బర్త్‌డే పోస్టర్‌నే మేకర్స్ రిలీజ్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. Team #SarkaruVaariPaata wishes the amazingly talented & beautiful actress @KeerthyOfficial a very Happy Birthday ❤️ Super 🌟 @urstrulyMahesh @ParasuramPetla @MusicThaman @madhie1 @MythriOfficial @GMBents @14ReelsPlus @SVPTheFilm @saregamasouth#HBDKeerthySuresh pic.twitter.com/Q34UBEB9O0 — SarkaruVaariPaata (@SVPTheFilm) October 17, 2021 జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుడ్ లక్ సఖి’ చిత్రంలో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్‌గా కనిపించనుంది. పల్లెటూరి అమ్మాయి నుంచి జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆది పినిశెట్టి కీర్తికి జోడీగా నటించనున్నారు. జగపతిబాబు ఇందులో రైఫిల్ షూట్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. Happy Birthday to our Beautiful Soul & the Very Talented @KeerthyOfficial🎂. We wish you only the best❤#GoodLuckSakhi Coming This NOVEMBER only in theatres!#HBDKeerthySuresh@AadhiOfficial @IamJagguBhai #NageshKukunoor @ThisIsDSP #DilRaju @sudheerbza @shravyavarma pic.twitter.com/rcpsk9G49i — Worth A Shot (@WorthAShotArts) October 17, 2021 -
దిమ్మతిరిగే ట్విస్ట్.. ‘లక్ష్మీ నరసింహ స్వామి’గా మహేశ్!
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అతడు స్క్రీన్ పై కనిపిస్తే కలెక్షన్ల వర్షమే.. మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్ బస్టర్స్ కొడుతుంటాడు. పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఐతే.. గెటప్స్ విషయంలో మాత్రం పెద్దగా వేరియేషన్ చూపించడు. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చబోతున్నాడు. ఎడ్వేంచరస్ గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’, 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’..ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ గెటప్స్ జోలికి మాత్రం పెద్దగా పోలేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరిలో మాత్రం కాస్త లాంగ్ హెయిర్ తో కనిపించి వేరియేషన్ చూపించాడు. 1 నేనొక్కడినే చిత్రంలో బాడీ షేప్ కాస్త మార్చాడు. అతిథిలో కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశాడు. ఐతే.. అవేమీ పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు కావు. ఐతే.. ఈ సారి మహేశ్ ఎవరూ ఊహించని గెటప్ లో కనిపంచబోతున్నాడని తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఇందులో మహేశ్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ సీన్ లో మహేశ్ బాబు లక్ష్మీ నరసింహ స్వామి గెటప్ లో కనిపించ బోతున్నాడట. విలన్ మహేశ్‌ను అలా ఊహించుకుంటాడట. అదే నిజమైతే.. మహేశ్ అతిపెద్ద ఎడ్వేంచర్ చేస్తున్నట్టే. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లోకి దిగబోతుంది. -
ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్న కీర్తి
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతోంది. సరదాగా ఆమె ముంబై పర్యాటనకు వెళ్లినట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ది పర్ఫెక్ట్ మిట్‌వీక్ మూడు’ అంటూ ఫొటో షేర్ చేసింది. ఇందులో కీర్తి బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్డ్ తెలుపు రంగు చొక్కాలో ఉన్న కీర్తిసురేశ్ చిరునవ్వులు చిందిస్తూ పూల మొక్కల ముందు నిలబడి ఫొటోకు ఫోజు ఇచ్చింది. అలాగే వీకెండ్ కోసం ఎదురుచూస్తూ..అంటూ #WednesdayVibes, #MumbaiDiaries హ్యాష్ ట్యాగ్‌లను జతచేసింది. చదవండి: ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం కాగా కీర్తి ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ సరసన సందడి చేయనుంది. అయితే సర్కారు వారి పాట ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ క్రమంలో ‘కీర్తి హైదరాబాద్‌లో ఉండకుండా ముంబైలో ఏం చేస్తున్నారు’ అంటూ ఫ్యాన్స్ తన పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే సర్కారి వారి పాటలో తన షూటింగ్ షెడ్యూల్‌ను కాస్తా విరామ సమయంలో దొరకడంతో స్నేహితలతో కలిసి అలా సరదాగా గడిపేందుకు ముంబై వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా సర్కారు వారి పాటతో కీర్తీ చేతిలో ‘గుడ్ లక్ సఖీ’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలతో పాటు మలయాళంలో వాశి అనే మూవీలో నటిస్తుంది. చదవండి: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ మామూలుగా లేదుగా.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
స్పెయిన్ వెళ్లనున్న మహేశ్ బాబు
ఈ నెలాఖరున మహేశ్‌బాబు స్పెయిన్ వెళ్లనున్నారు. ‘సర్కారువారి పాట’ సినిమా చిత్రీకరణ కోసమే అక్కడికి వెళుతున్నారు. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట, మహేశ్‌బాబు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. ఈ నెలాఖరున స్పెయిన్‌లో ఆరంభించే షెడ్యూల్లో టాకీతో పాటు రెండు పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. స్పెయిన్ షెడ్యూల్ నెల రోజుల పాటు జరుగుతుందని తెలిసింది. ఆ తర్వాత డిసెంబర్లో జరిపే షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తయిపోతుంది. జనవరి 13న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: ఆర్. మది, లైన్ ప్రొడ్యూసర్: రాజ్‌కుమార్. చదవండి : రమ్మకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో త్రిష, ఖుష్భూ.. -
‘సర్కారి వారి పాట’ సెట్లో ప్రత్యక్షమైన ఎంపీ శశిథరూర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ మూవీలో హైదరాబాద్ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ రోజు మాదాపూర్‌లోని ఓ స్టార్ హోటల్లో మూవీ షూటింగ్ జరిగింది. అయితే షూటింగ్ సెట్లోకి ఆకస్మాత్తుగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ ప్రత్యక్షం అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. చదవండి: ఆర్సీ 15 కాన్సెప్ట్ పోస్టర్‌కు డైరెక్టర్ ఎంత ఖర్చు పెట్టించాడో తెలుసా! As it happens, at our hotel in Hyderabad, the @TridentHyd, I ran into Superstar MaheshBabu @urstrulyMahesh along with my colleague (& his brother-in-law) @JayGalla, a member of the Committee. What a delightful personality! pic.twitter.com/rhrTDOQBQy — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 ఆయన ట్వీట్ చేస్తూ ‘ఈ రోజు మాదాపూర్‌లోని ట్రిడెంట్ హోటల్లో ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్‌ను జరుపుకుంది.అది తెలిసి నేను నా సహా ఉద్యోగులతో కలిసి వెళ్లి మహేశ్‌ను కలిశాను. మా వెంట ఆయన బావ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. ఆయనను కలిసి కాసేపు మాట్లాడాను. నిజంగా ‘సూపర్ స్టార్’ ఎంత గొప్ప వ్యక్తి. ఆయనను ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ రాసుకొచ్చారు. అలాగే మరో ట్వీట్లో మహేశ్‌తో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. చదవండి: ఆర్జీవీతో అశు బోల్డ్ ఇంటర్వ్యూ చూసిన ఆమె తల్లి రియాక్షన్ చూశారా! అంతేగాక అదే సమయంలో ఆయన విలన్లతో పోరాడే సన్నివేశాలను పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా థరూర్ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సూరేశ్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకురుస్తున్నాడు. 2022 జనవరి 13న సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. Talking to MaheshBabu @urstrulyMahesh shows you why no one in Hyderabad refers to him without the honorific “Superstar”! He had just finished knocking out the villain in his next production when we had a chat behind the scenes… @JayGalla pic.twitter.com/2ZaKSVBOIi — Shashi Tharoor (@ShashiTharoor) September 8, 2021 -
పుష్ప నుంచి ఫైటింగ్ సీన్ లీక్..సినిమాకు ఇదే కీలకమట!
కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఈ మధ్యే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండగా, మరికొన్ని చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా సినిమాలకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, ఫోటోలు నెట్టింట దర్శనమివ్వడం చూస్తూనే ఉంటాం. ఇక పెద్ద సినిమాల విషయంలో ఈ లీకుల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. పాన్ ఇండియా ప్రాజెక్టులుగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట, పుష్ప చిత్రాల నుంచి ఇప్పటికే ఫస్ట్‌లుక్, పాటలు ముందే లీకైన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప నుంచి దీని నుంచి మరో వీడియో బయటకు వచ్చింది. ఇది ఆ సినిమాలోని ఎంతో ముఖ్యమైన ఫైటింగ్ సీన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ స్పందిస్తూ.. 'మా సినిమాలకు సంబంధించిన మెటీరియల్ ఒకదాని తర్వాత ఒకటి ఆన్లైన్లో లీక్ కావడం పట్ల చాలా నిరాశ చెందాం. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ అంశంపై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. త్వరలోనే నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఎవరూ పైరసీని ప్రోత్సహించవద్దు' అని ట్వీట్ చేసింది. ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. We are deeply disturbed by the recent leaks of our movie material online. We condemn it and have lodged a complaint against the same in the cyber crime department. The culprits would soon be booked by the law. Please do not encourage piracy. - Team @MythriOfficial pic.twitter.com/FelB6ih0TD — Mythri Movie Makers (@MythriOfficial) August 15, 2021 -
ఫ్యామిలీతో మహేశ్ గోవా ట్రిప్..ఫోటోలు వైరల్
Mahesh Babu Goa Vacation : సూపర్ స్టార్ మహేశ్ బాబు పక్కా ఫ్యామిలీ మెన్ అన్న సంగతి తెలిసిందే. షూటింగులతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన ఏ మాత్రం సమయం దొరికినా కుటుంబంతో గడపడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ గోవాల్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మహేశ్ తన ఫ్యామిలీని తీసుకొని గోవాకు వెకేషన్ ట్రిప్‌కు వెళ్లారు. ఓ వైపు సినిమా షూటింగ్‌లోనే పాల్గొంటూనే మరోవైపు కుటుంబంతో సరదాగా గడపనున్నారు. చార్టర్డ్ ఫ్లైట్‌లో వీరంతా గోవాకు వెళ్లినట్లు తెలుస్తుంది. మహేశ్ కుటుంబంతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబం కూడా ఈ ట్రిప్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 'నాన్నతో ఫైట్ జర్నీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. కేక్స్‌తో పాటు అద్భుతమై గూడీస్ పొందవచ్చు' అంటూ సితార తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇదిలా ఉండగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
గోవాలో ఫైటింగ్‌కు దిగిన 'సర్కారు వారు'..
‘సర్కారువారి పాట’ తాజా షెడ్యూల్ గోవాలో ఓ ఫైట్‌తో మొదలైంది. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్ కథానాయిక. గోవా షెడ్యూల్లో ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా లొకేషన్ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ యాక్షన్ సీక్వెన్స్ పూర్తయ్యాక కొంత టాకీ పార్టును కూడా షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్లో మహేశ్‌బాబుతో పాటు కీలక తారాగణం పాల్గొంటారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, మహేశ్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, లైన్‌ప్రొడ్యూసర్: రాజ్‌కుమార్. -
‘సర్కారు వారి పాట’.. మోత మొదలైంది, అప్పుడే ఆ రికార్డు గల్లంతు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి రికార్డులు క్రియేట్ చేయడం, వాటినే మళ్లీ తానే బ్రేక్ చేయడం కొత్తేమి కాదు. సినిమా ఫస్ట్ లుక్ మొదలు, టీజర్, ట్రైలర్ అంటూ ధియేటర్లో బాక్సాఫీస్ మోత మోగించే వరకు ప్రిన్స్ హవా కొనసాగడం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లలేదు. తాజాగా మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్ర టీజర్ విడుదల కాగా, ఇది యూట్యూబ్ రికార్డులను తిరగరాస్తోంది. ‘సర్కారు వారి పాట’ టీజర్ విడుదలైన 24 గంటల్లో ఈ బ్లాస్టర్ ప్రోమోకు 25.7 మిలియన్ వ్యూస్, 7లక్షల 54వేల లైక్స్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసి మహేశ్ దూకుడు ఏ మాత్రం తగ్గలేదని ఈ టీజర్ మరో సారి నిరూపించింది. కాగా ఆగస్టు 9న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సినిమా టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించిన చిత్రయూనిట్.. అందుకు కొద్ది గంటలకు ముందే సర్ప్రైజ్ చేశారు. ‘సర్కారు వారి పాట’ బ్లాస్టర్ అంటూ అర్థరాత్రి 12 గంటలకే ఈ వీడియో విడుదల చేసి ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించారు. ఒక నిమిషం 16 సెకనుల నిడివితో కూడిన ఈ వీడియో ఆయన అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఇందులో మహేశ్ మరింత యంగ్‌గా, స్టైలిష్ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్‌కి కనువిందు చేశాడు. టీజర్లో డైలాగ్ డెలివరీ కేక పెట్టించాయ్. ఇక కీర్తి, మహేశ్‌ల జోడి అయితే చూడముచ్చటగా ఉంది. -
‘సర్కారు వారి పాట’: కీర్తి పాత్ర రివీల్ చేసిన మహేశ్, ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగ నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. సోమవారం మహేశ్ బర్త్‌డే సందర్భంగా ‘సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్’ పేరుతో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇక ఇందులో మహేశ్ మరింత యంగ్‌గా, సూపర్ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు. ఆయన చెప్పిన ఒక్కొక్క డైలాగ్ కేక పెట్టించేలా ఉన్నాయి. ఇక కీర్తి, మహేశ్‌ల జోడి అయితే చూడముచ్చటగా ఉంది. ‘పడుకునేముందు దిష్టి తీసుకోవడం మర్చిపోకండి’ ఆని ఆమె క్యూట్‌గా చెప్పిన డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇదే డైలాగ్‌తో కీర్తీ మహేశ్ బర్త్‌డేకు ఫైనల్ టచ్ ఇచ్చింది. ‘నమత్ర మేడం సార్ పడుకునేముందు దిష్టి తీయడం మర్చిపోకండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అలాగే ట్విటర్లో ఆమెజింగ్ కో-స్టార్ మహేశ్ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ట్వీట్, ఇన్‌స్టా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ఈ ట్వీట్‌కు మహేశ్ ఇచ్చిన సమాధానం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే తన పుట్టిన రోజున విషెస్ చెప్పిన ప్రతి నటీనటులకు మహేశ్ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో అందరికి కేవలం థ్యాంక్స్ చెప్పిన మహేశ్ కీర్తికి మాత్రం స్పెషల్‌గా ‘థ్యాంక్యూ కళావతి’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఆయన ట్వీట్ చూసిన నెటిజన్లు ఈ మూవీలో కీర్తి పాత్ర పేరు ‘కళావతి’ అయ్యింటుందాని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ టీజర్లో ఎక్కడ కూడా హీరోహీరోయిన్లు పాత్రల పేర్లను బయట పెట్టలేదు చిత్ర బృందం. ఏదేమైన మహేశ్ తన బర్త్‌డే సందర్భంగా కీర్తి పాత్రను రివీల్ చేశాడని చర్చించుకుంటున్నారు. మహేశ్ పాత్ర పేరేంటో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకురుస్తున్నాడు. 2022 జనవరి 13న సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. You are not only an inspiration on screen but off screen as well!❤️ Here’s to an amazing co-star and a beautiful person. May you have a day as fabulous as you! Happy Birthday, @urstrulyMahesh sir!😊🤗 #SarkaruVaariPaata Teaser - https://t.co/vrmvtgw4Oq#HBDSuperstarMaheshBabu — Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2021 -
కేక పుట్టిస్తున్న ‘సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్'