Sarkaru Vaari Paata Movie Day 2 Box Office Collections In AP And Telangana - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata Box Office Collections: 'సర్కారు వారి పాట’ రెండో రోజు కలెక్షన్స్‌ ఎంతంటే..

May 14 2022 2:17 PM | Updated on May 14 2022 4:33 PM

Sarkaru Vaari paata Day 2 Box Office Collection In AP And Telangana - Sakshi

బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కు బ్యాండే అంటుంటారు ఫ్యాన్స్

బాబు ల్యాండ్ అయితే బాక్సాఫీస్ కు బ్యాండే అంటుంటారు ఫ్యాన్స్. ఈ మాటను మరోసారి నిజం చేసాడు మహేశ్‌బాబు. సర్కారువారి పాట పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సూపర్‌ స్టార్‌.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా అదే జోష్‌ని కనబరిచాడు. వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.103 కోట్ల గ్రాస్‌ని సాధించింది.  ఏపీ, తెలంగాణల్లో కలిపి రెండో రోజు రూ.11.64 కోట్లను వసూలు చేసింది.  నైజాంలో రూ.5.2 కోట్లు, సీడెడ్‌ 1.45 కోట్లు, ఉత్తరాంధ్ర 1.65 కోట్లు, ఈస్ట్‌ 1.08 కోట్లు, వెస్ట్‌ 45 లక్షలు, గుంటూరు 51 లక్షలు, కృష్ణా 89 లక్షలు, నెల్లూరులో 41లక్షల రూపాయలను వసూలు చేసింది. 

(చదవండి: మహేశ్‌ హీరోయిన్స్‌ మాస్‌ ఇమేజ్‌ పక్కా!)

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రూ.48.27 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి.. రూ.50 కోట్ల క్లబ్‌లో చేరడానికి రెడీగా ఉంది. ఇక అమెరికాలో అయితే ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన వస్తోంది. రెండు రోజుల్లో ఈ చిత్రం అక్కడ 1.5 మిలియన్స్‌ డాలర్లను కలెక్ట్‌ చేసి తెలుగు సినిమా సత్తా చాటింది.

సర్కారు వారి పాట రెండు రోజులు కలెక్షన్స్‌ వివరాలు(ఏపీ & తెలంగాణ)

► నైజాం - రూ.17.44 కోట్లు

► సీడెడ్ - రూ.6.15 కోట్లు

► ఈస్ట్ - రూ.4.33 కోట్లు

► వెస్ట్ - రూ.3.19కోట్లు

► ఉత్త‌రాంధ్ర - రూ.5.38 కోట్లు

► గుంటూరు- రూ.6.34కోట్లు

► కృష్ణా - రూ.3.47 కోట్లు 

► నెల్లూరు - రూ.1.97 కోట్లు

► మొత్తం రూ.48.27 కోట్లు 

Advertisement
 
Advertisement
Advertisement