Parasuram: మహేశ్‌ కోసం నాలుగేళ్లు పక్కకి.. ఇప్పుడు ఆ హీరోతో మూవీ

Director Parasuram Next Movie With Naga Chaitanya - Sakshi

మాట ఇస్తే, ఆ మాటకు కట్టుబడి ఉండటం అనేది గొప్ప విషయం. బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళికి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కాని టాలీవుడ్ లో తనకు కమిట్ మెంట్స్ ఉన్నాయని చెప్పి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. నాగ చైతన్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. 

2018 లో రిలీజైన బ్లాక్ బస్టర్ గీత గోవిందం తర్వాత  నాగ చైతన్య తో మూవీ కమిట్ అయ్యాడు డైరెక్టర్ పరశురాం. తీరా సెట్స్ పైకి వెళ్లాల్సిన సమయంలో మహేశ్‌ నుంచి సర్కారు వారి పాట చిత్రం  చేయాల్సిందిగా కబురు రావడంతో నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. మే 12న సర్కారు వారి పాట రిలీజ్ అవుతోంది.

(చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్‌)

సర్కారు వారి పాట థియేటర్స్ కు వచ్చిన తర్వాత, వెంటనే నాగ చైతన్యతో సినిమా స్టార్ట్ చేస్తానని చెబుతున్నాడు పరశురాం. నాలుగేళ్ల క్రితం నాగ చైతన్య కోసం నాగేశ్వరరావు అనే టైటిల్ తో స్టోరీ రాసుకున్నాడట. ప్రస్తుతం ఇదే స్టోరీని తెరకెక్కిస్తానంటున్నాడు. సర్కారు వారి పాట నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. చైతూతో రష్మిక జోడి కట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇక నాగ చైతన్య సినిమా విషయాలకొస్తే..  బంగార్రాజు తర్వాత నాగ చైతన్య  థ్యాంక్యూ అనే సినిమాను రిలీజ్ రెడీ చేశాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేయనున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈలోపు చైతూ అమెజాన్ కోసం వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతోనూ అలాగే పరశురాం తోనూ మూవీ స్టార్ట్ చేయనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top