Vijaysai Reddy: సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది

సాక్షి, అమరావతి: పరశురామ్ డైరెక్షన్‌లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సర్కార్ వారి పాట’ గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమాపై వైఎస్సార్‌సీపీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన ఓ ట్వీట్ పోస్ట్ చేశారు.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుందని సదరు ట్వీట్ లో సాయిరెడ్డి పేర్కొన్నారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారని కూడా సాయిరెడ్డి చిత్రంపై ప్రశంసలు కురిపించారు.
సమకాలీన అంశాలను స్పృశిస్తూ సాగిన సందేశాత్మక చిత్రం 'సర్కార్ వారి పాట’ బాగుంది. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంక్స్ చూపే తేడా విధానం తెరపై బాగా ఆవిష్కరించారు.
All the best to #MaheshBabu #wishes #greetings.— Vijayasai Reddy V (@VSReddy_MP) May 12, 2022