SVP Movie: 'సర్కారు వారి పాట' కొత్త ట్రైలర్ విడుదల..

Sarkaru Vaari Paata Summer Sensational Blockbuster Trailer Released: సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్లు వర్షం కురిపిస్తున్న సందర్బంగా సోమవారం కర్నూలులో విజయేత్సవ వేడుకను నిర్వహించింది చిత్రబృందం.
ఈ వేడుకలో సర్కారు వారి పాట కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బ్లస్టర్' పేరుతో విడుదలైన ఈ ట్రైలర్‌లో మహేశ్ బాబు ఎక్స్‌ప్రెషన్స్, డైలాగ్స్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక వెన్నెల కిశోర్, కీర్తి సురేశ్, సముద్ర ఖనితో మహేశ్ చేసే సందడిని ఈ వీడియోలో చూడొచ్చు. అలాగే ఇందులో టైటిల్ ర్యాప్ సాంగ్ హైలెట్‌గా నిలిచింది.
చదవండి: ‘సర్కారు వారి పాట’ చూసిన సితార పాప రియాక్షన్ ఏంటంటే..
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు