Sai Pallavi: సీక్రెట్‌గా సినిమా చూసిన సాయిపల్లవి, వీడియో వైరల్‌

Sai Pallavi Secretly Watched Sarkaru Vaari Paata Movie In RK Cineplex, Video Goes Viral - Sakshi

హ్యాండ్‌సమ్‌, స్వీట్‌, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అమ్మాయిలను ఇట్టే బుట్టలో పడేస్తాడు మహేశ్‌బాబు. ప్రతి సినిమాలోనూ మరింత అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడీ సూపర్‌స్టార్‌. ఆయన ఇటీవల నటించిన సినిమా సర్కారువారి పాట. ఈ మూవీలో ఫుల్‌ ఎనర్జిటిక్‌గా కనిపించాడు మహేశ్‌. ఈ సినిమా చూసేందుకు నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లింది. పీవీఆర్‌ ఆర్‌కే సినీప్లెక్స్‌లో మహేశ్‌ మూవీ చూసి ఎంజాయ్‌ చేసింది.

ఈ క్రమంలో తననెవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్‌తో తన ముఖాన్ని కప్పుకుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ముఖానికి మాస్క్‌ ధరించి ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడుతూ ఫోన్‌లో సంభాషిస్తూ వడివడిగా నడుచుకుంటూ థియేటర్‌ నుంచి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఆమె సింప్లిసిటీకి ముచ్చటపడుతుంటే మరికొందరు మాత్రం హీరోయిన్‌కు కాస్త ప్రైవసీ ఇవ్వొచ్చుగా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: ఆర్జే కాజల్‌ హోం టూర్‌ వీడియో, దీంట్లో ఓ స్పెషల్‌ ఉంది!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top