Mahesh Babu Letter to Fans: Requests Watch Sarkaru Vaari Paata Only in Theaters - Sakshi
Sakshi News home page

Mahesh Babu: ఫ్యాన్స్‌కు మహేశ్‌బాబు రిక్వెస్ట్‌, సోషల్‌ మీడియాలో లేఖ వైరల్‌

May 7 2022 3:37 PM | Updated on May 7 2022 4:00 PM

Mahesh Babu Letter to Fans: Requests Watch Sarkaru Vaari Paata Only In Theaters - Sakshi

సర్కారువారి పాట షూటింగ్‌ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారువారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు' అని రాసి ఉంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎస్‌ రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో మొదలవుతుందని తన సినిమా అప్‌డేట్‌ కూడా చెప్పేశాడు

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ సర్కారువారి పాట. పరశురామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించింది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌తో సోషల్‌ మీడియాను షేక్‌ చేసిన యూనిట్‌ నేడు ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరపబోతోంది. ఈ క్రమంలో మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ కోసం ఓ లేఖ వదిలాడు.

లేఖలో ఏముందంటే... 'సర్కారువారి పాట షూటింగ్‌ పూర్తయి, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే 12న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఎన్నో అంచనాలతో, ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న మన సర్కారువారి పాట చిత్రం థియేటర్లలోనే చూసి మీ స్పందన తెలియజేయగలరు' అని రాసి ఉంది. అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎస్‌ రాధాకృష్ణ నిర్మించే చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ జూన్‌లో మొదలవుతుందని తన సినిమా అప్‌డేట్‌ కూడా చెప్పేశాడు మహేశ్‌. మొత్తానికి ఫ్యాన్స్‌ను తన సినిమా థియేటర్లలోనే చూడండని చెప్తూనే కొత్త సినిమా షూటింగ్‌ కూడా త్వరలోనే ఉందని గుడ్‌న్యూస్‌ చెప్పాడు.

చదవండి: ఫ్యాన్సీ అమౌంట్‌కు షారుక్‌ ఖాన్ 'పఠాన్‌' డిజిటల్‌ రైట్స్‌..

 గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌

Advertisement
 
Advertisement
Advertisement