Mahesh Babu Dance: నితిన్‌ పాటకు మహేశ్‌ బాబు డ్యాన్స్‌ !.. 'వావ్‌' అని హీరో కామెంట్‌

Mahesh Babu Dance To Nithin Song Goes Viral - Sakshi

Mahesh Babu Dance To Nithin Song Goes Viral: హిట్‌ ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్‌ హీరో నితిన్‌. ఈ హీరో 'జయం' సినిమా హీరోగా నితిన్‌కు ఎంత గుర్తింపు తెచ్చిందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని 'రాను రానంటూనే చిన్నదో' అనే పాట ఎంత సూపర్‌ హిట్‌ అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ సాంగ్ యూత్‌ను ఒక ఊపు ఊపేసింది. తాజాగా ఈ పాటకు అనుగుణంగా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేష్‌ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నితిన్‌ 'వావ్‌' అంటూ కామెంట్ చేశాడు.  

అయితే ఈ పాటకు మహేశ్‌ బాబు నిజంగా స్టెప్పులు వేయలేదు. ఇదంతా కేవలం ఎడిటింగ్‌తో చేసిన ప్రయోగం. నితిన్‌ తాజాగా నటించిన చిత్రం 'మాచర్ల నియోజకవర్గం'. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో 'రారా రెడ్డి' స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌ అంజలి డ్యాన్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ పాట చివర్లో 'రాను రానంటూనే చిన్నదో' సాంగ్‌ను రీమిక్స్‌ చేసి జోడించారు. ఇప్పుడు ఈ రీమిక్స్‌కు అనుగుణంగా 'సర్కారు వారి పాట'లోని 'మ.. మ.. మహేశా' స్టెప్పులతో ప్రత్యేకంగా వీడియో క్రియేట్‌ చేశాడు ఓ నెటిజన్‌. ఈ స్పెషల్‌ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయగా అది కాస్త ట్రెండ్‌ అయింది. ఈ వీడియోకు నితిన్‌ 'వావ్‌.. సూపర్‌.. పర్‌ఫెక్ట్ సింక్‌' అంటూ పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ చలరేగిపోతోంది. 

చదవండి: నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్‌
జీవితంలో వారు మనకు స్పెషల్‌: నాగ చైతన్య

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top