సర్కారు వారి ఫైట్‌..గోవాలో షూటింగ్‌

Goa Schedule Of Mahesh Babus Sarkaru Vaari Paata Begins - Sakshi

‘సర్కారువారి పాట’ తాజా షెడ్యూల్‌ గోవాలో ఓ ఫైట్‌తో మొదలైంది. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో కీర్తీ సురేష్‌ కథానాయిక. గోవా షెడ్యూల్‌లో ముందు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌–లక్ష్మణ్‌ సమకూర్చుతున్నారు. ఈ సందర్భంగా లొకేషన్‌ వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌ పూర్తయ్యాక కొంత టాకీ పార్టును కూడా షూట్‌ చేస్తారు. ఈ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుతో పాటు కీలక తారాగణం పాల్గొంటారు. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, మహేశ్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, లైన్‌ప్రొడ్యూసర్‌: రాజ్‌కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top