'మహానటి' బర్త్‌డే..వరుస పోస్టర్లతో సర్‌ప్రైజ్‌ | Sarkaru Vaari Paata And Good Luck Sakhi Birthday Wishes To Keerthy Suresh | Sakshi
Sakshi News home page

HBD Keerthy Suresh : 'మహానటి' బర్త్‌డే..వరుస పోస్టర్లతో సర్‌ప్రైజ్‌

Oct 17 2021 11:46 AM | Updated on Oct 17 2021 12:09 PM

Sarkaru Vaari Paata And Good Luck Sakhi Birthday Wishes To Keerthy Suresh - Sakshi

Happy Birthday Keerthy Suresh : కీర్తి సురేశ్‌ ప్రస్తుతం సౌత్‌  ఇండ‌స్ట్రీలో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతుంది. అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకు మనసు గెలుచుకుంది. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న కీర్తి ప్రస్తుతం తెలుగులో బోళా శంకర్‌, సర్కారు వారి పాట, గుడ్‌లక్‌ సఖి చిత్రాల్లో నటిస్తుంది. ఆదివారం(అక్టోబర్‌17)న కీర్తి పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి వరుసగా కీర్తి బర్త్‌డే పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తూ ఫ్యాన్స్‌కు ట్రీట్‌ ఇచ్చారు. అవేంటో చేసేయండి..

సర్కారు వారి పాట చిత్రంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు జోడీగా కీర్తి సురేశ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. పరశురాం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలియజేసింది. మోస్ట్‌ బ్యూటిఫుల్‌ అండ్‌ టాలెంటెడ్‌ కీర్తి సురేశ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ మూవీ టీం ట్వీట్‌ చేసింది. సర్కారు వారి పాట చిత్రం నుంచి కీర్తి బర్త్‌డే పోస్టర్‌నే మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 ప్లస్‌ రీల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గుడ్ లక్ సఖి’ చిత్రంలో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్‌గా కనిపించనుంది.  పల్లెటూరి అమ్మాయి నుంచి జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎలా మారిందనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆది పినిశెట్టి కీర్తికి జోడీగా నటించనున్నారు. జగపతిబాబు ఇందులో రైఫిల్ షూట్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు. నవంబర్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement