
Pashamylaram incident Updates..
మంత్రి దామోదరను అడ్డుకున్న బాధితులు..
- ఉదయం నుంచి బాధితులను పట్టించుకున్న నాథుడే లేడు
- తమ వారి ఆచూకీ కోసం కళ్ళు కాయలు కాచేలా కంపెనీ వద్దే నిలబడ్డ బాధితులు
- ఉదయం నుండి ఘటనా స్థలంలో పత్తా లేని అధికారులు
- మంత్రితో పాటు ఇతర నాయకులు రావడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అధికారులు
- నిస్సహాయంగా ఓ మంత్రి రావడంతో తిరగబడ్డ బాధితులు
- మీడియాలో బాధితుల వర్షెన్ వస్తుండటంతో కంపెనీ లోపలికి తీసుకెళ్ళిన మంత్రి
- గేటు బయటికి మీడియాను పంపించి బాధితులతో మాట్లాడుతున్న మంత్రి
- సంఘటన స్థలాన్ని మరోసారి పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలు
- మంత్రి దామోదర, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, జగ్గారెడ్డి పరిశీలన
- ఘటన స్థలం లో మంత్రి దామోదరను అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు
- మీడియాపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రమాదంలో 13 మంది మిస్సింగ్
- 13 మంది ఆచూకీ కోసం బంధువుల, కుటుంబ సభ్యుల రోదనలు..
- సుభదీప్ సర్కార్, సిద్ధార్థ గౌడ్, లక్ష్మీముఖ్య, శ్యాంసుందర్, తస్లిముద్దీన్, ప్రశాంత్, జేపీ పటేల్, వెంకటేషం, అఖిల్, ప్రవీణ్ కుమార్, బాలకృష్ణ, చోటే లాల్, రామాంజనేయులు మిస్సింగ్.
సిగాచి యాజమాన్యంపై సర్కార్ సీరియస్
- సిగాచి యాజమాన్యం వైఖరిపై ప్రభుత్వం సీరియస్
- ఇప్పటికే కూడా ఘటన స్థలానికి చేరుకొని సిగాచి ఎండీ
- నిన్న స్వయంగా సిగాచి ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం
- 24 గంటలు గడచిన హైదరాబాద్ కి రాకపోవడం తో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీకి వార్నింగ్
- ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
నిలిచిపోయిన సహాయక చర్యలు
- పాశమైలారంలో నిలిచిపోయిన సహాయక చర్యలు
- శిథిలాలను తొలగించడానికి పలు అడ్డంకులు
- సగం కూలిన భవనం కిందకి వెళ్ళి సహాయక చర్యలు చేయడానికి ఇబ్బందులు
- ఏ క్షణంలో భవనం కూలుతుందోనన్న ఆందోళన
- పేలుడు ధాటికి కుప్పకూలిన సగం భవనం
- ఆచూకీ లభించని 17 మంది సిగాచి కంపెనీ కార్మికులు
- ఆందోళనలో కార్మికుల కుటుంబ సభ్యులు
- ఇప్పటి వరకు చనిపోయిన వారు 37 మంది
- పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 34 మంది
- పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి 36 మృతదేహాలు
- వీటిలో 11 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు
- మార్చురీలోనే మరో 25 మృతదేహాలు
- మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి ప్రత్యేక ఫ్రీజర్లలో భద్రపరిచిన సిబ్బంది
- ఇప్పటికే డీఎన్ఏ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్‌కు శాంపిల్స్
- ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి మరో 36 గంటల సమయం
- రిపోర్ట్ ఆధారంగా డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులు
- చికిత్స పొందుతున్న వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమం..
- ఇప్పటికే పాశమైలారం సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేసిన పోలీసులు
- BNS లోని 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన BDL భానుర్ పోలీసులు
- ఫిర్యాదు చేసిన మృతుల కుటుంబ సభ్యులు..
పొంతన లేని మృతుల సంఖ్య..
- సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పొంతన లేని మృతుల సంఖ్య.
- ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్టుగా చెబుతున్న రెస్క్యూ టీమ్.
- అధికారికంగా 39 మంది అంటున్న కలెక్టర్.
- మాకు 35 మృతదేహాలే హ్యాండ్ ఓవర్ చేశారు అంటున్న పటాన్ చెరువు ఆసుపత్రి సిబ్బంది.
- మరి మిగతా వారు ఎక్కడ?.
- డిపార్ట్‌మెంట్ల మధ్య పొంతన లేని సమాధానాలు..
మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
- పోస్టుమార్టం పూర్తి అయిన 11 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు
- పోస్టుమార్టం పూర్తయిన వారి వివరాలు
1.రాజనాల జగన్మోహన్, ఒరిస్సా
2.రామ్ సింగ్ రాజ్ బార్, యూపి
3.శశి భూషణ్ కుమార్, బీహార్
4.లగ్నజిత్ దావూరి, ఒరిస్సా
5.హేమ సుందర్, చిత్తూరు
6.రక్సూనా ఖాతూన్, బీహార్
7.నిఖిల్ రెడ్డి, కడప
8.నాగేశ్వరరావు, మంచిర్యాల
9.పోలిశెట్టి ప్రసన్న, ఈస్ట్ గోదావరి
10.శ్రీ రమ్య, కృష్ణా జిల్లా
11. మనోజ్ , ఒరిస్సా
- ఏపీకి చెందిన వారు నలుగురు
- తెలంగాణకు చెందిన వారు ఒకరు
- ఒడిషాకు చెందిన వారు ముగ్గురు
- బీహార్‌కు చెందిన వారు ఇద్దరుగా గుర్తింపు.
కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..
పాశమైలారం ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఇంకా 13 మందికి పైగా కార్మికుల ఆచూకీ గల్లంతు
వారి కోసం కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది
తమ వాళ్ళ ఆచూకీ తెలపాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్న కుటుంబ సభ్యులు
ఇప్పటికే కూలిపోయిన శిథిలాలు మొత్తాన్ని తొలగించిన అధికారులు
శిథిలాల కింద ఎవరూ లేరని తేల్చిన అధికారులు
మరోవైపు పటాన్ చెరువు ఆస్పత్రిలో కుప్పలుగా మృతదేహాలు..
డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామంటున్న అధికారులు.
👉సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 40 దాటినట్లు తెలిసింది. వీరిలో 15 మంది వివరాలు తెలిశాయి. పలువురు కార్మికులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
👉మిగతా వారి జాడ తెలియాల్సి ఉంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగే కొద్దీ ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉన్నట్లు భావిస్తుండగా, ఇందులో 58 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రమాదంలో 36 మంది మాత్రమే మరణించారని ప్రకటించారు.
అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు
👉పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో అడ్మినిస్ట్రేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగం భవనాలు కుప్పకూలాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు యంత్రాలు, వాటి విడిభాగాలు, పైపులు, రేకులు చెల్లా చెదురయ్యాయి. శిథిలాలను తొలగించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు శ్రమిస్తున్నాయి. బయటపడిన కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పటాన్‌చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి ఏకంగా 36 మృతదేహాలు రావడంతో మార్చురీ గదిలో శవాల గుట్ట తయారైంది.
డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాకే..
👉మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రం కావడంతో వాటిని బంధువులకు అప్పగించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు చేయడం అనివార్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ బృందాలు..తమవారి ఆచూకీ చెప్పాలంటూ వస్తున్న మృతుల కుటుంబీకుల రక్తనమూనాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనలో గల్లంతైన వారి వివరాల సేకరణకు ఐలా క్లినిక్‌లో హెల్ప్ డెస్క్‌ను నిర్వహిస్తున్నారు. మంగళవారం అక్కడ రక్త పరీక్షలను నిర్వహించారు.
👉అలాగే పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రిలో కూడా డీఎన్‌ఎ టెస్టులు చేస్తున్నారు. డీఎన్‌ఏలు సరిపోల్చుకున్నాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. డీఎన్‌ఏ రిపోర్టు రావడానికి 48 గంటల వరకు సమయం పడుతుండటంతో మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతోంది. మంగళవారం రాత్రి వరకు 13 మృతదేహాలను గుర్తించిన అధికారులు.. ఇందులో 11 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రుల్లో చేరినవారిలో కొందరు మరణించారని తెలుస్తుండగా, అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు.