నారాయణఖేడ్: ప్రతీ ఒక్కరూ భక్తి మార్గంలో పయనించాలని ఓం దక్షిణ కాళీ సేవాఘడ్ ఆలయ పీఠాధిపతి జగదీశ్వరానంద మహారాజ్ తెలిపారు. మంగళవారం ఆలయంలో హోలీ పండుగ జాతర మహోత్సవంలో భాగంగా 21 కన్యలతో అభిషేకం, హోమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఐదు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో హాజరైన భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆలయంలోని యంత్ర, తంత్ర త్రిశూలాన్ని దర్శించుకోవడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా దిశా కమిటీ సభ్యులు ప్రకాశ్ రాథోడ్, కాంగ్రెస్ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు నెహ్రూనాయక్, మాజీ జడ్పీటీసీ రవీందర్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సురేశ్ నాయక్, గోన్‌సేనా నాయక్, రాజు నాయక్ పాల్గొన్నారు.


