పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

Mar 4 2026 9:03 AM | Updated on Mar 4 2026 9:03 AM

మెదక్‌జోన్‌: డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ పాత పెన్షన్‌ పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇమ్మడి సంతోష్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 7న, హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం మెదక్‌లో నిర్వహించిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర హైకోర్టు తీర్పును అమలుచేస్తూ ప్రభుత్వం పాత పెన్షన్‌ వర్తింప చేయాలన్నారు. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలలో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయని, పక్క రాష్ట్రం ఏపీలో సైతం అమలు చేస్తూ ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ 2003 జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌చారీ, జిల్లా బాధ్యులు తాళ్ల శ్రీనివాస్‌ , సుంకరి కృష్ణ, ఎల్‌.మల్లారెడ్డి, చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

పాత పెన్షన్‌ పోరాట సమితి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement