విజయానికి పది మెట్లు | - | Sakshi
Sakshi News home page

విజయానికి పది మెట్లు

Mar 4 2026 9:03 AM | Updated on Mar 4 2026 9:03 AM

ప్రతి సబ్జెక్టుపై అవగాహన అవసరం

పరీక్షలు రాయనున్న

22,454 మంది విద్యార్థులు

సంగారెడ్డి క్రైమ్‌: ప్రతి విద్యార్థికి జీవితంలో పదో తరగతి కీలకమైన మెట్టు. గెలుపు గడపను దాటేందుకు వారు సిద్ధమవుతున్న వేళ, అటు పుస్తకాల భారంతోపాటు మనస్సులో ఏదో తెలియని ఆందోళన ఉండటం సహజం. ఇష్టపడి చదివి పరీక్షలు రాస్తేనే ఉత్తమ ఫలితాలు సొంతమవుతాయి. ప్రతి మార్కు ఎంతో విలువైనదిగా భావించి ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో చదవాలి. తక్కువ సమయంలో ప్రతి సబ్టెక్టులో ఎక్కువ మార్కులు పొందే మార్గాలేంటి. క్లిష్టమైన ప్రశ్నలను సులభంగా ఎలా గుర్తుపెట్టుకోవాలనే అంశాలపై నిపుణులు అందిస్తున్న విజయసూత్రాలు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14 నుంచి పది పరీక్షలు జరగనున్నాయి. 22,454 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ప్రతి విద్యార్థి సమయానికి భోజనం చేయాలి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

తప్పనిసరిగా ఎనిమిది గంటల పాటు నిద్రపోవాలి. స్మార్ట్‌ ఫోన్‌కు, సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలి.

పరీక్షల సమయంలో శాకాహారం, పళ్లు మాత్రమే ఎక్కువగా తీసుకోవాలి.

తెల్లవారుజామున 5గంటలకు చదివితే మెదడు వందశాతం శక్తి గ్రహిస్తుంది. తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement