breaking news
Pashamilaram industrial area
-
Pashamylaram: 43కి చేరిన ‘సిగాచి’ మరణాలు
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి కంపెనీలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కి చేరింది. పటాన్ చెరువులోని ధృవ ఆస్పత్రిలో ఆరు రోజుల పాటు చికిత్స పొందుతూ ఇవాళ మరో కార్మికుడు జితేందర్ మృతి చెందాడు. పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగి దుర్ఘటనలో క్షతగాత్రులైన వారు ఒక్కొక్కరుగా రాలిపోతున్నారు.తీవ్రగాయాలై ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో శుక్రవారం కార్మికుడు భీంరావు మృతి చెందగా, శనివారం మరో కార్మికుడు మున్‌మున్‌చౌదరి మృత్యువాత పడ్డారు. ఇవాళ(ఆదివారం) మరో కార్మికుడు మరణించాడు. ఇవాళ మరో మృతదేహాన్ని కూడా గుర్తించారు. ఆచూకీ లేని తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించడం లేదు. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య 43కి చేరింది. ఆ రెండు మృతదేహాలు ఎవరివి? పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో రెండు ఫుల్ డెడ్‌బాడీలు ఉన్నాయి. ఈ మృతదేహాలు ఎవరివనేది తేలడం లేదు. అవి ఆయా కుటుంబసభ్యుల డీఎన్ఏలతో సరిపోవడం లేదు. దీంతో ఆయా కుటుంబాల్లోని ఇతర సభ్యుల రక్తం శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన వారివి కాకుండా ఆ కుటుంబంలోని మరొకరి రక్తం శాంపిల్‌ను తీసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ నివేదికలు వచ్చాకే ఈ రెండు ఫుల్ డెడ్‌బాడీలను సంబంధిత కుటుంబాలకు అప్పగిస్తామని అధికారులు ప్రకటించారు. డీఎన్ఏ రిపోర్టులు వచ్చిన మూడు డెడ్‌బాడీలను శనివారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభ్యంశనివారం శిథిలాల కింద మరిన్ని శరీరభాగాలు లభించాయి. ఎముకలు, చేతివేళ్లు, ఇతర శరీరభాగాలు లభించడంతో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికే 15 శరీరభాగాలు మార్చురీలో ఉన్నాయి. వీటి డీఎన్ఏ రిపోర్టులు వచి్చ నా, అవి శాంపిల్స్ ఇచ్చిన వారి కుటుంబాలకు సరిపోవడం లేదు.కొనసాగుతున్న రెస్క్యూపేలుడు జరిగిన స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారుల రెస్క్యూ ఆపరేషన్ ఆదివారం కూడా కొనసాగుతోంది. శిథిలాల తొలగింపు దాదాపు పూర్తయ్యింది. కానీ పేలుడు తీవ్రతకు భూమిలోకి దంతాలు, ఎముకలు వంటి శరీరభాగాలు ఏమైనా చొచ్చుకుని పోయాయా? మరేదైనా ఆనవాళ్లు లభిస్తాయోనని ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు పంట చేలో కలుపు తీసిన మాదిరిగా ఆనవాళ్ల కోసం చేతులతో తవ్వుతున్నారు. -
బాధ్యత పట్టని ఏపీ ప్రభుత్వం!
శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం పాలకడియం గ్రామానికి చెందిన వెంకటేశ్ సిగాచీ పరిశ్రమలో సీనియర్ కెమిస్ట్. మూడురోజుల కిందట జరిగిన పేలుడు ఘటనలో అతడు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే రోజులు గడుస్తున్నా తన కొడుకు మృతదేహాన్ని అప్పగించని పరిస్థితి. దీంతో మృతుని తండ్రి చిన్నారావు ఆవేదనకు అంతులేదు. హెల్ప్‌డెస్క్ వద్ద, మార్చురీ వద్ద తమ బిడ్డ మృతదేహం కోసం పడరాని కష్టాలు పడుతున్నాడు.సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమ దుర్ఘటనలో మరణించిన, క్షతగాత్రులైన బిహార్, ఒడిశా కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారుల బృందాలను పంపింది. కానీ ∙ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ తరహా చొరవ చూపడం లేదు. ఈ దుర్ఘటనలో 8 మంది ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు దగ్గరుండి తమ రాష్ట్రాల బాధిత కుటుంబాలకు సహాయమందిస్తుంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క అధికారి కూడా అటువైపు తొంగిచూడలేదు. దీనిపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రోజుల తరబడి నిరీక్షణఏపీకి చెందిన మృతుల్లో విజయనగరం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, తూర్పుగోదావరి తదితర జిల్లాలకు చెందిన వారున్నారు. అయితే గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాల అప్పగింత ప్రహసనంగా మారింది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాలు ఇంకా అందక ఆయా కుటుంబాలు పాశమైలారం పారిశ్రామిక వాడలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వారిని కోల్పోయిన దుఖం కంటే.. కడసారి చూపు కోసం వారు పడుతున్న బాధ వర్ణణాతీతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబాలు కన్నీరు ఇంకిన కళ్లతో వేచి చూస్తున్నాయి. బిహార్, ఒడిశా రాష్ట్రాల మాదిరిగా తమకు సహాయం అందించేందుకు తమ అధికారులెవరూ రాలేదని వాపోతున్నాయి. -
శిథిల బతుకులు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు: పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించిన చోట శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతూనే ఉన్నా యి. బుధవారం మరో రెండు మృతదేహాలు లభించినట్టు సమాచారం. తీవ్రగాయాల పాలై వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మరణించినట్టు సమాచారం. దీంతో మృతుల సంఖ్య 45కు చేరువైనట్టు అనధికారిక అంచనా. సిగాచి పరిశ్రమ యాజమాన్యం మాత్రం 40 మంది చనిపోయారని ప్రకటించింది. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్నా పదిమంది ఆచూకీ లభించడం లేదని అధికారులు ప్రకటించారు. మరోవైపు పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ బుధవారం కూడా కొనసాగింది. డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. వర్షం, సాంకేతిక కారణాలతో సహాయక చర్యలకు అంతరాయం కలిగింది. దీంతో శిథిలాల తొలగింపు ప్రక్రియ గురువారం కూడా కొనసాగనుంది. డీఎన్ఏ రిపోర్టుల రాక ఆలస్యం శిథిలాల్లో బయటపడిన మృతదేహాలను పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేస్తున్నారు. మొత్తం 37 మృతదేహాలు పటాన్చెరు ఆస్పత్రికి చేర్చారు. ఈ మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డీఎన్ఏలు సరిపోయాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. అయితే ఈ రిపోర్టులు రావడానికి 24 గంటల నుంచి 48 గంటలు పడుతుందని అధికారులు చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురు మృత్యువాత తీవ్ర గాయాలపాలై సంగారెడ్డి జిల్లాతోపాటు, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో బుధవారం ముగ్గురు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి కారి్మకులు చాలామంది 70 శాతం వరకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఇందులో పలువురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు మృతి చెందినట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారుల విడుదల చేసిన సమాచారం ప్రకారం.. – ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో పనిచేస్తున్నవారు : 143 – ప్రమాదం నుంచి బయటపడిన వారు : 60 – గాయపడి చికిత్స పొందుతున్నవారు : 35 – మరణించిన వారిలో పేర్లు గుర్తించిన మృతదేహాలు : 18 – పేర్లు గుర్తించని మృతదేహాల సంఖ్య : 20 – ఆచూకీ లభించకుండా పోయినవారు : 10 డీఎన్ఏ రిపోర్టుల సమాచారం : డీఎన్ఏ టెస్ట్ అయ్యాక ఆయా కుటుంబాలకు అప్పగించిన మృతదేహాల సంఖ్య : 18 – ల్యాబ్ నుంచి డీఎన్ఏ రిపోర్టుల రావాల్సిన మృతదేహాలు : 18 – డీఎన్ఏ పరీక్షల కోసం సేకరించాల్సిన శాంపిల్స్ : 2 – ల్యాబ్‌లో ప్రాసెస్ చేయాల్సిన కుటుంబసభ్యుల రక్త శాంపిల్స్ : 25 – ఇప్పటి వరకు జాడ తెలియని కుటుంబాల సంఖ్య : 3 – ప్రాసెస్ చేయబడిన, సరిపోలిన శాంపిల్స్ సంఖ్య : 5 మంత్రి దామోదర వాహనం అడ్డగింత రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షించేందుకు వస్తున్న మంత్రి దామోదర రాజనరసింహ వాహనాన్ని సిగాచీ పరిశ్రమ వద్ద బాధిత కుటుంబాలు అడ్డున్నాయి. జస్టిన్ ఆచూకీ చెప్పాలని బాధిత కుటుంబ సభ్యులు మంత్రి వాహనానికి ఎదురుగా వెళ్లారు. దీంతో వాహనం దిగి వచ్చిన మంత్రి వారిని సుముదాయించి దైర్యం చెప్పారు. 18 బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం 18 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18 లక్షలు చెల్లించారు. గాయపడిన 34 మందికి రూ.50 వేల చొప్పున రూ.17 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఆచూకీ లభించని వారి కుటుంబాలకు తాత్కాలికంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందించినట్టు అధికారులు తెలిపారు. పరిశ్రమలోకి దూసుకెళ్లేందుకు బాధిత కుటుంబాల యత్నం..ఉద్రిక్తత సిగాచీ పరిశ్రమలోకి కొందరు బాధిత కుటుంబ సభ్యులు దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. బుధవారం సాయంత్రం వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిశ్రమ గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదం జరిగి మూడు రోజులైనా, తమ వారి మృతదేహాలను అప్పగించకపోవడం దారుణమన్నారు. అధికారుల వైఫల్యం కారణంగానే మట్టి దెబ్బల కింద ఎంతోమంది విగతజీవులుగా పడి ఉన్నారన్నారు. ‘మీకు చేతకాకపోతే చెప్పండి.. ఎముకలైనా తవ్వుకొని తీసుకెళతాం’అని బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ప్రమాదం జరిగిన రోజే శిథిలాలను తొలగించి వెతికి చూస్తే ఇంకా చాలామంది బతికే వారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెండు మృతదేహాలు వెలికి తీశారని, అది కూడా తమ ఒత్తిడి మేరకే జరిగిందని వారు వివరించారు. ఒక మృతదేహంపై దుస్తులు కూడా ఉన్నాయని, శవాన్ని గుర్తించే స్థితిలో ఉందని వారు చెప్పారు.ఆ రోజే శిథిలాలను తొలగించి ఉంటే ఇంకొంతమంది ప్రాణాలతో బయటపడే వారిని బండ్లగూడకు చెందిన శిల్ప పేర్కొన్నారు. ఇద్దరి పరిస్థితి విషమం గచ్చిబౌలి: ప్రమాదంలో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మదీనాగూడలోని ప్రణమ్ హాస్పిటల్లో 18 బాధితులకు చికిత్స అందిస్తున్నామని, గురువారం 10 మందిని డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ ఎండీ మనీష్‌గౌర్ తెలిపారు. ప్రమాదం జరిగిన రోజే ఈ హాస్పిట్‌కు 22మందిని తీసుకొచ్చారు. వీరిలో హేమసుందర్, లగ్నాజిత్, శశిభూషణ్‌లు మృత్యువాత పడ్డారు. ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. జనరల్ వార్డులో 13 మందికి చికిత్స అందిస్తున్నారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన తారక్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మిషనరీ కాలం చెల్లిందని చెప్పినా... సిగాచీ పరిశ్రమలో పేలుడు ఘటన విషయంలో పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌కు చెందిన రాజనాల సాయియశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భానూరు పోలీసులు మంగళవారం కేసు (క్రైం నెం.184/2025) నమోదు చేశారు. అయితే ఈ పరిశ్రమలో మిషనరీ కాలం చెల్లిపోయిందని.. పాతబడిన ఈ మిషనరీని మార్చాలని.. తన తండ్రి రాజనాల వెంకట్జగన్మోహన్ పలుమార్లు యాజమాన్యం దృష్టికి తెచ్చారని సాయియశ్వంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం ఈ యంత్రాలను మార్చకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం, ఆస్తినష్టం వాటిల్లుతుందని ముందుగానే యాజమాన్యానికి చెప్పారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పరిశ్రమలో 20 సంవత్సరాలుగా తన తండ్రి వెంకటజగన్మోహన్ (55) పనిచేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో ఆయన మరణించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు భానూరు పోలీసులు సిగాచీ పరిశ్రమ యాజమాన్యంపై బీఎన్ఎస్ 105, 110, 117 సెక్షన్ల కింద జూన్ 30న కేసు నమోదు చేశారు. వెంకటజగన్మోహన్ది స్వస్థలం ఒడిశాలోని గంజామ్ జిల్లా చత్రాపూర్. -
పాశమైలారం ప్రమాదం.. ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోలీసుల ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలను వెల్లడించారు. మిషనరీ పాతది కావడం, కనీస ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపింది.సిగాచి కంపెనీ ఉద్యోగి యశ్వంత్ ఇచ్చిన ఫిర్యాదుపై భానూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. సిగాచి కంపెనీలో పాత బడిన మిషనరీ ఉంది. దీనిపై కంపెనీ ఉద్యోగులు ఇప్పటికే చాలా సార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. కంపెనీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా అదే పాత బడిన మిషనరీ వాడటంతో ప్రమాదం జరిగింది. ఉద్యోగుల మరణాలకు కంపెనీయే కారణం.సోమవారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడు సమయంలో కంపెనీలో 145 మంది పనిచేస్తున్నారు. పేలుడు ధాటికి కొంత మంది అక్కడికక్కడే చనిపోయారు. చాలా మంది మంటల్లో కాలిపోతూ కనిపించారు. సిగాచి కంపెనీలో కనీస సదుపాయాలు లేవు. మంటలను ఆర్పేందుకు కనీసం ఫైర్ సిలిండర్స్ కూడా లేవు. ఇక, సిగాచి కంపెనీలో కనీస ప్రమాణాలు పట్టించుకోలేదని అధికారులు గుర్తించారు.ఇదిలా ఉండగా.. పాశమైలారంలోని పరిశ్రమలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం పరిశీలించారు. మంత్రితో పాటు ఏఐసీసీ తెలంగాణ ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, సీనియర్ నేత జగ్గారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో ఇప్పటివరకు 36 మంది మరణించారని.. ఇంకా 11 మంది కార్మికుల ఆచూకీ దొరకడం లేదని తెలిపారు. ఆచూకీ గల్లంతైనవారు బతికే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు. 18 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. బాధితుల బంధువులను పరామర్శించి అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. -
పాశమైలారంలో నిలిచిపోయిన సహాయక చర్యలు.. ఎండీపై సర్కార్ సీరియస్
Pashamylaram incident Updates..మంత్రి దామోదరను అడ్డుకున్న బాధితులు..ఉదయం నుంచి బాధితులను పట్టించుకున్న నాథుడే లేడుతమ వారి ఆచూకీ కోసం కళ్ళు కాయలు కాచేలా కంపెనీ వద్దే నిలబడ్డ బాధితులుఉదయం నుండి ఘటనా స్థలంలో పత్తా లేని అధికారులుమంత్రితో పాటు ఇతర నాయకులు రావడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అధికారులునిస్సహాయంగా ఓ మంత్రి రావడంతో తిరగబడ్డ బాధితులుమీడియాలో బాధితుల వర్షెన్ వస్తుండటంతో కంపెనీ లోపలికి తీసుకెళ్ళిన మంత్రిగేటు బయటికి మీడియాను పంపించి బాధితులతో మాట్లాడుతున్న మంత్రి సంఘటన స్థలాన్ని మరోసారి పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలుమంత్రి దామోదర, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, జగ్గారెడ్డి పరిశీలనఘటన స్థలం లో మంత్రి దామోదరను అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులుమీడియాపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి దామోదర రాజనర్సింహ ప్రమాదంలో 13 మంది మిస్సింగ్13 మంది ఆచూకీ కోసం బంధువుల, కుటుంబ సభ్యుల రోదనలు..సుభదీప్ సర్కార్, సిద్ధార్థ గౌడ్, లక్ష్మీముఖ్య, శ్యాంసుందర్, తస్లిముద్దీన్, ప్రశాంత్, జేపీ పటేల్, వెంకటేషం, అఖిల్, ప్రవీణ్ కుమార్, బాలకృష్ణ, చోటే లాల్, రామాంజనేయులు మిస్సింగ్. సిగాచి యాజమాన్యంపై సర్కార్ సీరియస్సిగాచి యాజమాన్యం వైఖరిపై ప్రభుత్వం సీరియస్ఇప్పటికే కూడా ఘటన స్థలానికి చేరుకొని సిగాచి ఎండీనిన్న స్వయంగా సిగాచి ప్రతినిధులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం24 గంటలు గడచిన హైదరాబాద్ కి రాకపోవడం తో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీకి వార్నింగ్ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నిలిచిపోయిన సహాయక చర్యలుపాశమైలారంలో నిలిచిపోయిన సహాయక చర్యలుశిథిలాలను తొలగించడానికి పలు అడ్డంకులుసగం కూలిన భవనం కిందకి వెళ్ళి సహాయక చర్యలు చేయడానికి ఇబ్బందులుఏ క్షణంలో భవనం కూలుతుందోనన్న ఆందోళనపేలుడు ధాటికి కుప్పకూలిన సగం భవనంఆచూకీ లభించని 17 మంది సిగాచి కంపెనీ కార్మికులుఆందోళనలో కార్మికుల కుటుంబ సభ్యులుఇప్పటి వరకు చనిపోయిన వారు 37 మందిపలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 34 మందిపటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి 36 మృతదేహాలువీటిలో 11 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులుమార్చురీలోనే మరో 25 మృతదేహాలుమృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి ప్రత్యేక ఫ్రీజర్లలో భద్రపరిచిన సిబ్బందిఇప్పటికే డీఎన్ఏ పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్కు శాంపిల్స్ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు రావడానికి మరో 36 గంటల సమయంరిపోర్ట్ ఆధారంగా డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్న అధికారులుచికిత్స పొందుతున్న వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమం..ఇప్పటికే పాశమైలారం సిగాచి పరిశ్రమపై కేసు నమోదు చేసిన పోలీసులుBNS లోని 105, 110, 117 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన BDL భానుర్ పోలీసులుఫిర్యాదు చేసిన మృతుల కుటుంబ సభ్యులు..పొంతన లేని మృతుల సంఖ్య..సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పొంతన లేని మృతుల సంఖ్య.ప్రమాదంలో 45 మంది మృతి చెందినట్టుగా చెబుతున్న రెస్క్యూ టీమ్.అధికారికంగా 39 మంది అంటున్న కలెక్టర్.మాకు 35 మృతదేహాలే హ్యాండ్ ఓవర్ చేశారు అంటున్న పటాన్ చెరువు ఆసుపత్రి సిబ్బంది.మరి మిగతా వారు ఎక్కడ?.డిపార్ట్మెంట్ల మధ్య పొంతన లేని సమాధానాలు.. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిపోస్టుమార్టం పూర్తి అయిన 11 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులుపోస్టుమార్టం పూర్తయిన వారి వివరాలు1.రాజనాల జగన్మోహన్, ఒరిస్సా2.రామ్ సింగ్ రాజ్ బార్, యూపి3.శశి భూషణ్ కుమార్, బీహార్4.లగ్నజిత్ దావూరి, ఒరిస్సా5.హేమ సుందర్, చిత్తూరు 6.రక్సూనా ఖాతూన్, బీహార్7.నిఖిల్ రెడ్డి, కడప8.నాగేశ్వరరావు, మంచిర్యాల9.పోలిశెట్టి ప్రసన్న, ఈస్ట్ గోదావరి10.శ్రీ రమ్య, కృష్ణా జిల్లా11. మనోజ్ , ఒరిస్సాఏపీకి చెందిన వారు నలుగురుతెలంగాణకు చెందిన వారు ఒకరుఒడిషాకు చెందిన వారు ముగ్గురుబీహార్కు చెందిన వారు ఇద్దరుగా గుర్తింపు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..పాశమైలారం ఘటనలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ఇంకా 13 మందికి పైగా కార్మికుల ఆచూకీ గల్లంతువారి కోసం కోసం ప్రయత్నాలు చేస్తున్న పోలీస్, రెవెన్యూ సిబ్బందితమ వాళ్ళ ఆచూకీ తెలపాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్న కుటుంబ సభ్యులుఇప్పటికే కూలిపోయిన శిథిలాలు మొత్తాన్ని తొలగించిన అధికారులుశిథిలాల కింద ఎవరూ లేరని తేల్చిన అధికారులుమరోవైపు పటాన్ చెరువు ఆస్పత్రిలో కుప్పలుగా మృతదేహాలు..డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత మృతదేహాలను అప్పగిస్తామంటున్న అధికారులు.👉సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు మహా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘోర దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మంగళవారం రాత్రి వరకు మృతుల సంఖ్య 40 దాటినట్లు తెలిసింది. వీరిలో 15 మంది వివరాలు తెలిశాయి. పలువురు కార్మికులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.👉మిగతా వారి జాడ తెలియాల్సి ఉంది. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగే కొద్దీ ఒక్కొక్కటిగా మృతదేహాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉన్నట్లు భావిస్తుండగా, ఇందులో 58 మంది ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే ప్రమాదంలో 36 మంది మాత్రమే మరణించారని ప్రకటించారు.అర్ధరాత్రి వరకు సహాయక చర్యలు 👉పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో అడ్మినిస్ట్రేషన్, క్వాలిటీ కంట్రోల్ విభాగం భవనాలు కుప్పకూలాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. మరోవైపు యంత్రాలు, వాటి విడిభాగాలు, పైపులు, రేకులు చెల్లా చెదురయ్యాయి. శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు శ్రమిస్తున్నాయి. బయటపడిన కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. పటాన్చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి ఏకంగా 36 మృతదేహాలు రావడంతో మార్చురీ గదిలో శవాల గుట్ట తయారైంది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాకే.. 👉మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఛిద్రం కావడంతో వాటిని బంధువులకు అప్పగించేందుకు డీఎన్ఏ పరీక్షలు చేయడం అనివార్యమైంది. ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ఫోరెన్సిక్ బృందాలు..తమవారి ఆచూకీ చెప్పాలంటూ వస్తున్న మృతుల కుటుంబీకుల రక్తనమూనాలు సేకరిస్తున్నారు. పేలుడు ఘటనలో గల్లంతైన వారి వివరాల సేకరణకు ఐలా క్లినిక్‌లో హెల్ప్ డెస్క్‌ను నిర్వహిస్తున్నారు. మంగళవారం అక్కడ రక్త పరీక్షలను నిర్వహించారు.👉అలాగే పటాన్చెరు ప్రభుత్వాస్పత్రిలో కూడా డీఎన్ఎ టెస్టులు చేస్తున్నారు. డీఎన్ఏలు సరిపోల్చుకున్నాకే మృతదేహాలను అప్పగిస్తున్నారు. డీఎన్ఏ రిపోర్టు రావడానికి 48 గంటల వరకు సమయం పడుతుండటంతో మృతదేహాల అప్పగింత ఆలస్యమవుతోంది. మంగళవారం రాత్రి వరకు 13 మృతదేహాలను గుర్తించిన అధికారులు.. ఇందులో 11 మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రుల్లో చేరినవారిలో కొందరు మరణించారని తెలుస్తుండగా, అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు. -
పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నిర్మల్ కెమికల్ ఫ్యాక్టరీలో కెమికల్ పదార్థం పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టు పక్కల ఉన్న పరిశ్రమలకు వ్యాపించడంతో అక్కడి స్థానికుల భయాందోళనలు గురవుతున్నారు . మంటలను అదుపులోకి తేవడానికి సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్రి ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. -
పటాన్చెరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు
మెదక్: మెదక్ జిల్లాలోని పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. శ్రీ లియో ఎంటర్ ప్రైజెస్ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. కెమికల్ డబ్బాలు లీక్ అవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.