పాశమైలారంలో భారీ అగ్నిప్రమాదం

Fire Accident Occured In Pashamylaram Industrial Area Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న నిర్మల్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో కెమికల్ పదార్థం పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టు పక్కల ఉన్న పరిశ్రమలకు వ్యాపించడంతో అక్కడి స్థానికుల భయాందోళనలు గురవుతున్నారు . మంటలను అదుపులోకి తేవడానికి సిబ్బంది ఐదు ఫైరింజన్లతో ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్రి ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top