
సాక్షి, సంగారెడ్డి: పాశమైలారంలోని మరో పరిశ్రమలో తాజాగా భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఎన్ వీరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. సిగాచి పరిశ్రమలో అగ్ని ప్రమాద ఘటన నుంచి తేరుకోక ముందే మరో ప్రమాదం జరగడం స్థానికులను, కార్మికులను భయాందోళనకు గురిచేసింది.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఆదివారం ఉదయం మరో భారీ అగ్నిప్రమాద ఘటన వెలుగు చూసింది. ఎన్ వీరో వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.