SS Thaman Comments on Mahesh Babu in Sarkaru Vaari Paata Pre Release Event - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata Movie: మహేశ్‌ బాబుపై తమన్ ఆసక్తికర వ్యాఖ్యలు..

May 7 2022 9:30 PM | Updated on May 8 2022 10:02 AM

SS Thaman Comments On Mahesh Babu In SVP Movie Pre Release Event - Sakshi

సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఎస్ఎస్‌. తమన్ సంగీతం ‍అందిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు.

సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు, మహానటి కీర్తి సురేశ్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఎస్ఎస్‌. తమన్ సంగీతం ‍అందిస్తున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించారు. మహేశ్‌ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్‌ను స్పీడ్ చేసిన చిత్రబృందం శనివారం (మే 7) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని యూసుఫ్‌ గూడ  1వ టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ గ్రౌండ్‌లో నిర్వహించింది. 

ఈ కార్యక్రమంలో 'సుమతో తకిట తకిట విత్‌ తమన్‌' పేరుతో చిట్‌చాట్‌ జరిగింది. తర్వాత ఈ మూవీ టీమ్‌ క్రికెట్‌ ప్లేయర్స్‌ అయితే ఎవరెవరికీ ఏ పొజిషన్ ఇస్తారని తమన్‌ను యాంకర్  సుమ అడిగింది. దానికి తమన్‌ వికేట్‌ కీపర్‌గా పరశురామ్‌, బౌలర్‌గా కీర్తి సురేశ్‌ అని చెప్పాడు. దీంతో తన బౌలింగ్‌కు ఎవరైనా ఔట్‌ కావాల్సిందేనా అని సుమ అడగ్గా.. 'అవును. తన నటనతో బాగా నమ్మించేసింది' అంటూ చెప్పుకొచ్చాడు తమన్‌. అనంతరం మంచి ఫీల్డర్‌ అని సూపర్ స్టార్‌ మహేశ్‌ బాబు పేరు చెప్పాడు తమన్. ఎటునుంచి వచ్చిన బాల్‌ను పట్టుకునేది ఒక కెప్టెన్ అది మహేశ్ బాబు అని తమన్‌ పేర్కొన్నాడు.

చదవండి: సర్కారు వారి పాట: మ.. మ.. మహేశా పూర్తి పాట చూశారా !

Advertisement
 
Advertisement
Advertisement