Sarkaru Vaari Paata: Producers Says Movie Will Collect Big Numbers in First Two Weeks - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: సర్కారువారి పాటకు బ్లాక్‌బస్టర్‌ టాక్‌

May 12 2022 8:21 PM | Updated on May 13 2022 10:26 AM

Sarkaru Vaari Paata: Producers Says Movie Will Collect Big Numbers In First Two Weeks - Sakshi

'బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మాకు ఇంత మంచి హిట్‌ ఇచ్చినందుకు మహేశ్‌బాబుకు, డైరెక్టర్‌ పరశురామ్‌కు కృతజ్ఞతలు. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా 1 మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌ వచ్చి రికార్డు సృష్టించాయి.

ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా?.. ఈ డైలాగ్‌ మహేశ్‌బాబుకు సెట్టయినంతగా మరెవరికీ సెట్‌ కాదేమో! ఎందుకంటే రెండున్నరేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చినా మరోసారి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు మహేశ్‌. 'సర్కారువారి పాట'లో డిఫరెంట్‌ స్టెప్పులు, భిన్నమైన ఫైట్లు, యూత్‌కు కనెక్ట్‌ అయ్యే డైలాగ్స్‌.. అన్నింటికీ మించి ఇంకా వయసు తగ్గినట్లుగా మరింత యంగ్‌గా కనిపించడంతో ఫిదా అయ్యారు ఫ్యాన్స్‌. ఇక మహేశ్‌, కీర్తి సురేశ్‌ల స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

ఈ సినిమాలో ఎక్కువగా కథ.. బ్యాంకుల్లో డబ్బులు ఎగ్గొట్టే బడా బాబుల గురించి తిరుగుతుంది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ టార్గెట్‌ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరశురామ్‌. కేవలం వార్తాపత్రికలో వచ్చిన ఓ కథనం ఆధారంగా సినిమా కథను రాసుకున్నానని చెప్పాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి, అందరికీ కనెక్ట్‌ అవుతుందని పేర్కొన్నాడు.

నిర్మాత నవీన్‌ ఎర్నేని మాట్లాడుతూ.. 'బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వచ్చింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మాకు ఇంత మంచి హిట్‌ ఇచ్చినందుకు మహేశ్‌బాబుకు, డైరెక్టర్‌ పరశురామ్‌కు కృతజ్ఞతలు. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా 1 మిలియన్‌ డాలర్ల కలెక్షన్స్‌ సాధించి రికార్డు సృష్టించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టే చిత్రంగా సర్కారువారి పాట నిలుస్తుంది. రెండువారాల్లోనే ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్‌ వస్తాయి' అని తెలిపాడు. మరో నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు రాజమౌళితో పాన్‌ ఇండియా సినిమా చేయబోతున్నాడు. మళ్లీ ఇప్పట్లో ఇలాంటి ఎనర్జిటిక్‌ రోల్‌లో మహేశ్‌ను మనం చూడలేము' అన్నాడు.

చదవండి: 'సర్కారువారి పాట' పబ్లిక్‌ రివ్యూ, ఆడియన్స్‌ ఏమంటున్నారంటే?

Advertisement
 
Advertisement
Advertisement