Prince Mahesh Babu: అలా ఎందుకు జరిగిందో తెలియదు: మహేశ్‌ బాబు

Mahesh Babu Reaction On Stage Dance In Kurnool Meet - Sakshi

Mahesh Babu Reaction On Stage Dance In Kurnool Meet: సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను సర్కారు వారి పాట టీమ్‌ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూసి మహేశ్‌ బాబు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కీర్తి సురేశ్‌, డైరెక్టర్‌ పరశురామ్‌తో కలిసి పలువురు యూట్యూబర్లతో చిట్‌చాట్ చేశారు. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరదగా, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. 

ఇందులో భాగంగాలనే కర్నూలులో జరిగిన విజయోత్సవ సభ గురించి మాట్లాడారు. 'సభలో స్టేజ్‌ పైకి ఎక్కి డ్యాన్స్‌ ఎక్కి చేశారు కదా. అసలు అలా ఎందుకు చేశారు ?' అని అడిగిన ప్రశ్నకు మహేశ్‌ బాబు.. 'అది ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు. అసలు ఏం జరుగుతుందో తెలియక మా టీమ్‌ మొత్తం షాక్‌, సర్‌ప్రైజ్‌లో ఉండిపోయింది. రెండేళ్లు కష్టపడి మూవీ చేశాం. దానికి అభిమానుల నుంచి వస్తున్న ఆదరణ చూశాక.. స్టేజ్‌పైకి ఎక్కి డ్యాన్స్‌ చేయాలనిపించింది. అలా చేసేశా.' అని సమాధానం ఇచ్చారు. కాగా 'సర్కారు వారి పాట' రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్‌, రూ. 100.44 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. 

చదవండి: ఓటీటీలో 'సర్కారు వారి పాట'.. ఎప్పుడంటే
అప్పన్న భక్తులకు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు  క్షమాపణ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top