Attack on women
-
టీడీపీ నాయకుల దారుణం
రాప్తాడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. రోజూ ఏదో ఒక గ్రామంలో దాడులకు పాల్పడుతున్నారు. గత నెల 30న రాప్తాడు మండలం వరిమడుగు గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడి చేసిన ఘటన మరువకముందే తాజాగా ఆదివారం రాత్రి భోగినేపల్లిలో ఇద్దరు మహిళలపై అతి కిరాతకంగా దాడి చేశారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త ఎలగొండ నాగమ్మ, అదే గ్రామానికి చెందిన కరె వెంకటేష్ ఇళ్ల దగ్గర స్థలం విషయంపై గొడవ జరిగింది. ఈ విషయంలో గతంలోనే కరె వెంకటేష్, అతని కుమారుడు, ప్రస్తుత ఫీల్డ్ అసిస్టెంట్ కరె ప్రసాద్‌లు ఎలగొండ నాగమ్మపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా తనపై నాగమ్మ దాడి చేసిందంటూ కరె వెంకటేష్ భార్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఇరు వర్గాల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ప్రభుత్వం ద్వారా పక్కా గృహం మంజూరు కావడంతో నాగమ్మ ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకుంది. అయితే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ స్థలం తమదంటూ కరె వెంకటేష్ కుటుంబ సభ్యులు రోజూ నాగమ్మతో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తండ్రీకొడుకులిద్దరూ మద్యం తాగొచ్చి గొడవకు దిగారు. ఇనుప రాడ్లు, కొడవళ్లు, కట్టెలు తీసుకుని నాగమ్మ ఇంటి అద్దాలు, కిటికీలను, ఇంటి వెనుక ఉన్న బండలను ధ్వంసం చేశారు. అడ్డుపడిన నాగమ్మ, ఆమె అక్క కుమార్తె కోలా లక్ష్మీనారాయణమ్మలపై దాడి చేశారు. ‘ఇప్పుడున్నది మా ప్రభుత్వం. మీకు దిక్కెవరు?’ అంటూ బెదిరింపులకు దిగారు. తీవ్రంగా గాయపడిన మహిళలను స్థానికులు 108లో అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉంది. గ్రామస్తులు అడ్డుకోకుంటే ఇద్దరు మహిళలనూ టీడీపీ నాయకులు అక్కడే చంపేసేవారని స్థానికులు చెప్పారు. టీడీపీ నేతల వేధింపులతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చింతలపూడి: టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లిలో వైఎస్సార్సీపీ నాయకుడు మోరంపూడి శ్రీనివాసరావు ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్ఐ కుటుంబరావు నచ్చచెప్పి కిందకు దించారు. బాధితుడు తెలిపిన మేరకు.. మూడేళ్ల కిందట బహిరంగవేలంలో పంచాయతీకి చెందిన 28 ఎకరాల తుమ్మలచెరువులో చేపలు పెంచుకునే హక్కును ఆయన దక్కించుకుని చేపపిల్లల్ని వదిలారు. ప్రస్తుతం చెరువులో రూ.20 లక్షలకుపైగా విలువైన చేపలున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆంధ్ర కాలువ మరమ్మతుల్లో పూడికతీసిన మట్టిని ఈ చెరువుకు వెళ్లే రోడ్డుపై పోశారు. తరువాత వర్షాలతో రోడ్డు అధ్వానంగా మారి, చేపలు పట్టి తరలించేందుకు వీల్లేకపోయింది. దీంతో తాను నష్టపోతున్నానని, లీజును మరో ఏడాది పొడిగించాలని శ్రీనివాసరావు పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు. లీజు గడువు పెంచుతూ పంచాయతీ తీర్మానం చేసి నీటిపారుదలశాఖ అధికారులకు పంపింది. చెరువుకు ఎలాగైనా వేలం నిర్వహించాలని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు చేపల చెరువుకు వేలం వేస్తారేమోనని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం పనిచేశాననే తెలుగుదేశం నాయకులు కక్షగట్టి తనను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. ఈ విషయమై టీడీపీకి చెందిన గుత్తా వెంకులు, నల్లమోతు వాసు, దుర్గాప్రసాద్ (పండు), గుత్తా వెంకటేశ్వరరావు, గోళ్ల గాం«దీ, కొమ్మినేని నాగబాబు తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి, నీటిపారుదలశాఖ అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
అమానుషం: మహిళపై కర్రతో దాడి.. వీడియోలు తీసిన జనం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు విచక్షనారహితంగా దాడి చేశారు. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే కర్రతో కొట్టారు. అయితే చుట్టూ ఉన్న వారు దీన్నంతటినీ వీడియోలు తీస్తూ.. ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారే తప్ప అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటు.మోదీ కేబినెట్లో కేంద్రమంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్ స్వగ్రామమైన ధార్ జిల్లాలోని తండా ప్రాంతంలోఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.మహిళను కొందరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కర్రతో దారుణంగా కొట్టారు. నలుగురు వ్యక్తులు మహిళను పట్టుకోగా.. ఓ వ్యక్తి బలమైన కర్రతో కొడుతూ కనిపించాడు. ఈ దాడిలో తనను కాపాడండి అంటూ ఆ మహిళ ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. పైగా అక్కడ జరుగుతున్న దాన్ని తమ సెల్ఫోన్లలో రికార్డు చేస్తూ చోద్యం చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.#MadhyaPradesh का जिला धार..बेटी बचाओ का नारा था.. मगर यह लोग तो बेटियों पर खुलेआम जुल्म कर रहे है। @DGP_MP#आदिवासी_हिंदू_नहीं_हैं#मदन_दिलावर_माफी_मांगों Atal Setu Rs 1Sudi Ram Ram The Star योगी आदित्यनाथ Israel Nazis pic.twitter.com/tLZR7t5bS1— Abdul Qadir khan (@AbdulKh10143143) June 22, 2024 మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ పాలనలో మహిళల భద్రత లేదంటూ మండిపడింది. మధ్యప్రదేశ్‌లో వేధింపులు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించింది. మహిళలపై అఘాయిత్యాలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని విరుచుకుపడింది. వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని నూర్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ధార్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. -
మహిళలపై దాడి చేసినా పట్టించుకోరా?
ఆర్మూర్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ నడి బొడ్డున టవర్ సర్కిల్లో ఇద్దరు మహిళలపై నలుగురు హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం విమర్శలపాలవుతోంది. బాధితులు ఫిర్యాదుపై కనీసంగా పట్టించుకోకపోవడం, నలుగురు నిందితులను కనీసం విచారించకుండా వదిలేయడం వివాదాస్పదమవుతోంది. ఆర్మూర్ పట్టణంలోని నిజాంసాగర్ కెనాల్‌పై నివాసం ఉండే శివరాత్రి అరుణ, వింజ శోభ వరసకు అక్కా చెల్లెళ్లు. వీరిద్దరూ ఇళ్లలో కూలీ పనులు ముగించుకుని నడుచుకుంటూ తమ ఇళ్లకు వెళ్తుండగా వారి సామాజిక వర్గానికే చెందిన సంపంగి రమేష్, సంపంగి గణేశ్, సంపంగి బబ్లు, సంపంగి నాగమణి రాళ్లతో దాడి చేశారు. పాత కక్షల నేపథ్యంలో జరిగిన దాడిలో అరుణ తల పగిలి రక్తం కారడంతో తల్లి యాదమ్మ సహాయంతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తుకొని వెళ్లారు. వెంటనే పోలీసులు బాధిత మహిళలిద్దరినీ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి ఘటనా స్థలానికి వెళ్లి దాడికి పాల్పడిన నలుగురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. కానీ ఆ తర్వాత వారిని వదిలి వేయడంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని తిరిగి పోలీస్ స్టేషన్‌కు బాధిత మహిళలు వచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. గత రెండు రోజులుగా తిరుగుతున్నా పట్టించుకోకపోగా.. ఇదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై ఏకంగా మీపైనే కేసు పెడతాం అంటూ తమనే బెదిరించారని బాధిత మహిళలు చెబుతున్నారు. ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రచారం చేస్తుండగా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో మాత్రం నిరుపేద మహిళలపై దాడి చేసిన వారిని కేసులు పెట్టడానికి కూడా పోలీసులు మీనమేషాలు లెక్కించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆలస్యంగా ఎఫ్ఐఆర్ ఎందుకంటే: సురేష్ బాబు, ఎస్‌హెచ్‌వో, ఆర్మూర్ ’’ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఇతర కేసుల ఒత్తిడిలో ఇద్దరు మహిళలపై దాడి చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆలస్యం అయింది. దాడి చేసిన నలుగురిపై శుక్రవారం రాత్రి 324 సెక్షన్ కేసు నమోదు చేశాము. బాధిత మహిళలపై సైతం కౌంటర్ కేస్ ఫైల్ చేశాము.’ -
కేజిన్నర బంగారం దోపిడీ
గుడిపాల (చిత్తూరు జిల్లా): జనం చూస్తుండగానే ఓ మహిళపై దాడిచేసి.. బ్యాగ్‌లో ఉన్న కేజిన్నర బంగారాన్ని దుండగులు దోచుకెళ్లిన ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం వసంతాపురంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వసంతాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసులు, ఉష దంపతులు గుడిపాలలో జ్యూవెలరీ దుకాణం నడుపుతున్నారు. వీరు ప్రతిరోజూ ఇంటి నుంచి బంగారాన్ని తీసుకుని దుకాణానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మిగిలిన ఆభరణాలను రాత్రివేళ ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్త చేస్తుంటారు. బుధవారం రాత్రి 7:30 గంటలకు దుకాణం నుంచి కారులో బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటికి వచ్చారు. ఇంటివద్ద వెనుక వైపున భర్త కారు పార్కింగ్ చేస్తుండగా.. ఉష బంగారు ఆభరణాలున్న బ్యాగ్ పట్టుకుని నిలబడింది. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఉషపై దాడి చేశారు. ఆమె చేతిలో ఉన్న బంగారం బ్యాగ్‌ను గుంజుకుని పారిపోయారు. దీనిని గమనించిన భర్త, స్థానికులు ఆమె వద్దకు చేరుకోగా.. అప్పటికే దుండగులు పరారయ్యారు. నిందితులు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌తో గల ద్విచక్ర వాహనంపై వచ్చారని స్ధానికులు తెలిపారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాసమూర్తి, సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుల్ని వీలైనంత త్వరగా పట్టుకుంటామని డీఎస్పీ శ్రీనివాసమూర్తి పేర్కొన్నారు. సీసీ కెమెరాల సాయంతో నిందితుల జాడను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, తమిళనాడు సరిహద్దులో వాహన తనిఖీ చేపట్టామని చెప్పారు. -
ప్రేమోన్మాది దాడిలో ముగ్గురికి గాయాలు
కడియం: తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకలో ప్రేమోన్మాది దాడికి తెగబడ్డాడు. యువతితో పాటు ఆమె అక్క, తల్లిపై దాడి చేసి గాయపర్చాడు. పొట్టిలంక గ్రామానికి చెందిన దాసరి వెంకటేష్ కడియపులంకకు చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నెల 20న యువతి తండ్రికి ఫోన్ చేసి.. నీ చిన్న కుమార్తె నన్ను ప్రేమించకుంటే చంపేస్తా.. అంటూ బెదిరించాడు. అనంతరం శుక్రవారం రాత్రి యువతి ఇంటికి వెళ్లాడు. యువతితో పాటు, ఆమె అక్క, తల్లిపై సుత్తితో దాడి చేసి గాయపర్చాడు. వెంట తెచ్చుకున్న బ్లేడుతో తన మెడ, చేతిపై గాయపర్చుకున్నాడు. తల్లి, ఇద్దరు కుమార్తెలను బంధువులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వెంకటేష్‌ను అతడి స్నేహితులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఉన్న బాధితులను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం రూరల్ కో ఆర్డినేటర్ చందననాగేశ్వర్, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి పరామర్శించారు. ఇదిలా ఉండగా నిందితుడు దాసరి వెంకటేష్ జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడని, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ అనుచరుడని గ్రామస్తులు చెబుతున్నారు. -
ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్ అంటూ మహిళకు కాల్స్ చేసి చివరకు..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై కత్తితో దాడి చేశాడు. దీంతో, మహిళ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. మాగంటి గోపీనాథ్ పీఏ విజయ్ సింహ ఓ మహిళపై దాడి చేశాడు. కత్తిలో మహిళను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సదరు మహిళ భర్త మాట్లాడుతూ.. ప్రస్తుతం నా భార్య మాట్లాడలేని స్థితిలో ఉంది. ఎమ్మెల్యే పీఏ విజయ్ సింహా నా భార్యతో మాట్లడేవాడు. ఆమెతో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. ఆమెకు ఫోన్లో న్యూడ్ వీడియో కాల్స్, ఫోన్‌కాల్స్ కూడా చేసేవాడు. కాల్స్‌కు సంబంధించిన ఫోన్ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆమెతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. కానీ, ఇలా ఈరోజు మా ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చి అటాక్ చేస్తాడని అనుకోలేదు. నా భయం నాకు ఉంది. ఆయనకు రౌడీ షీటర్లు తెలుసంటా.. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో నాకు ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని భయపడుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. -
Gachibowli: ప్రేమను నిరాకరించిందని యువతి గొంతు కోసిన యువకుడు
-
హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. యువతి గొంతు కోసిన యువకుడు
సాక్షి, హైదరాబాద్: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. ప్రేమ వద్దంటూ యువతి నిరాకరించింది.. దీంతో కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా యువతిని చంపేయాలని యువకుడు నిశ్చయించుకున్నాడు. కత్తితో అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించి యువతిపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఈ ఘటన వట్టినాగులపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గచ్చబౌలి ఇన్స్పెక్టర్ గోనె సురేష్ వివరాలను వెల్లడించారు. వట్టినాగులపల్లిలో నివసించే తుల్జాబాయి, గణేష్‌సింగ్ దంపతులకు హనుమాన్సింగ్, రూఖీసింగ్(21) ఇద్దరు సంతానం. రూఖీసింగ్ మాదాపూర్‌లోని వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో బీఆర్క్ నాల్గో సంవత్సరం చదువుతోంది. కేపీహెచ్‌బీలోని ఎంఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రేమ్‌సింగ్ (21) రూఖీసింగ్‌కు రెండుసార్లు తెలిసిన వారి శుభకార్యాల్లో కనిపించింది. అన్నా అంటూ పలకరించింది. దాంతో అప్పటి నుంచి ఆమె వెంట పడటం మొదలు పెట్టాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. చదవండి: వామ్మో! గుండె గుబేలు.. కరెంటు బిల్లు రూ.లక్షా 21వేలు ఎప్పటిలాగే బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా భోజనం చేసి పడుకున్నారు. రాత్రి 11 గంటల సమయంలో హనుమాన్‌సింగ్‌కు కిడ్నీలో నొప్పి రావడంతో లింగంపల్లి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంజక్షన్ ఇప్పించి తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అనంతరం ఎవరి గదిలో వారు నిద్రించారు. అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో ఇంట్లో అలజడి కావడంతో వారికి మెలకువ వచ్చింది. చెల్లి గదిలో అలజడి అయినట్లు హనుమాన్ తల్లిదండ్రులకు చెప్పాడు. అందరూ కలిసి రూమ్ తలుపులను గట్టిగా తోయడంతో తలుపులు తెరుచుకున్నాయి. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మెడ, ఎడమచేతి వేళ్లకు, ఎడమకాలిపై గాయాలయ్యాయి. ఎదురుగా ఉండే బంధువులతో కలిసి కారులో ఆమెను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కత్తితో దాడి చేసిన ప్రేమ్‌సింగ్‌ను ఇంట్లోనే బంధించి చితకబాదారు. అనంతరం గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించగా వారు అతడిని కొండాపూర్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని ఉరితీయాలి తమ కూతురిపై కత్తితో దాడి చేసిన నిందితుడు ప్రేమ్‌సింగ్‌ను ఉరి తీయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. వారు విలేకరులతో మాట్లాడుతూ అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లోకి చొరబడి రెండు కత్తులతో దాడి చేశాడన్నారు. అలజడితో మేల్కొన్నామని, తలుపులు పగులగొట్టి అతడిని పట్టుకున్నామన్నారు. తమ కూతురికి తీవ్ర గాయాలయ్యాయని, చికిత్స పొందుతోందన్నారు. చదవండి: ‘అమ్మా.. నేను చనిపోతున్నా’ కూతురు ఫోన్.. అంతలోనే.. -
మృగాళ్లకు ఈ సమాజంలో స్థానం లేదు
సాక్షి,అమరావతి: ఆడబిడ్డలపై అరాచకాలకు పాల్పడుతున్న మృగాళ్ళకు ఈ సమాజంలో స్థానం లేదని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. బుధవారం ఆమె తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ రామకోటినగర్‌లో యువతిపై అమానుషంగా దాడి చేసి, కర్రలతో కొడుతూ హింసించిన ఘటన సీఎం జగన్‌ని చాలా తీవ్రంగా కలచివేసిందన్నారు. విశాఖలో ఇద్దరి బాలికలపై జరిగిన అఘాయిత్యంపై కూడా సీఎం జగన్ స్పందించారని చెప్పారు. ఈ రెండు ఘటనలపై సీఎం స్పందిస్తూ తక్షణం నిందితులను అదుపులోకి తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పారు. ఈ ఘటనలపై స్వయంగా బాధితుల పరిస్థితి తెలుసుకున్నానని, పోలీసు అధికారులతో మాట్లాడి, కమిషన్ సభ్యుల బృందాన్ని ఘటనాస్థలాలకు పంపించినట్లు చెప్పారు. -
మహిళ గొంతుకోసిన కానిస్టేబుల్
కోవూరు: వివాహిత మహిళపై ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. బ్లేడుతో ఆమె గొంతు కోశాడు. తన భార్య ఆత్మహత్యకు మహిళ, ఆమె భర్త కారణమన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన కోవూరులోని లక్ష్మీనగర్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ సర్వేపల్లి సురేష్ కుటుంబం రెండేళ్లక్రితం లక్ష్మీనగర్‌లో రవి, షకున్ దంపతుల ఇంటి పక్కన అద్దెకుండేది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు రావడంతో వేర్వేరు చోట్లకు వెళ్లిపోయారు. ఈ ఫిబ్రవరిలో కానిస్టేబుల్ భార్య హరిప్రియ ఆత్మహత్య చేసుకుంది. తన భార్య మృతికి షకున్ భర్త రవి కారణమని సురేష్ అనుమానించాడు. ఇందుకు ప్రతిగా రవి భార్యను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం లక్ష్మీనగర్‌కు వెళ్లాడు. ఆ సమయంలో రవి తన పిల్లలను స్కూల్ వద్ద వదిలేందుకు వెళ్లాడు. సురేష్ ను చూసి ‘అన్నా మంచినీళ్లు ఇవ్వమంటావా..’ అని షకున్ అడిగింది. నీళ్లు వద్దు.. కొద్దిగా పాలు ఇవ్వమనడంతో ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. వెంటనే సురేష్ ఇంటి తలుపుకు గడియపెట్టి కిచెన్‌లోకి వెళ్లాడు. ఆమెపై దాడికి దిగి బ్లేడుతో గొంతు కోశాడు. ఈలోగా ఇంటికి చేరుకున్న రవి తలుపు పగులగొట్టి లోపలికెళ్లగా.. అతనిపైనా సురేష్ దాడికి యత్నించాడు. అతను తప్పించుకుని బయటకు పరుగుతీశాడు. దీంతో సురేష్ అక్కడినుంచి పరారయ్యాడు. షకున్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆమె కోలుకుంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. -
గర్భిణి అని కూడా చూడకుండా.. కత్తితో దాడి
విశాఖపట్టణం: గర్భిణి అని చూడకుండా కత్తితో తన భార్యపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన విశాఖపట్టణం జిల్లాలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో అతడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనకాపల్లి ప్రాంతానికి చెందిన రమేశ్, సంతోషి యశోద భార్యాభర్తలు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడడంతో వాగ్వాదం జరుగుతోంది. ఈ క్రమంలో గ్రామ పెద్దల వద్ద పంచాయితీ కూడా నడిచింది. అయితే పెద్దల సమక్షంలో తనతో రానని భార్య తెగేసి చెప్పి కుంచంగిలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. దీంతో రమేశ్ తట్టుకోలేకపోయాడు. కోపంతో కుంచంగిలో ఉన్నఅత్తవారింటికి వెళ్లి సంతోషి యశోదపై కత్తితో దాడి చేశాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే కుటుంబసభ్యులు, స్థానికులు సంతోషిని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
మహిళపై ల్యాండ్ మాఫియా ఆగడం..
గువహటి : భూవివాదంలో 50 సంవత్సరాల మహిళను ల్యాండ్ మాఫియా సజీవ దహనం చేసిన ఘటన అసోంలోని హజోయి జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మాఫియా దౌర్జన్యం నుంచి మహిళను కాపాడిన పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని షీలా బేగంగా పోలీసులు గుర్తించారు. తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వారిని అడ్డుకోగా వారు తనను సజీవంగా దహనం చేసి చంపేందుకు ప్రయత్నించారని, తాను గాయాలతో వారి బారి నుంచి బయటపడ్డానని బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. చదవండి : దారుణం: మరో మాట లేకుండా ప్రాణాలు తీశారు మధ్య అసోం దక్షిణ్ సమరాలి ప్రాంతంలో గురువారం ఈ ఘటన చోటుచేసకుంది. భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన మాఫియా ముఠాను మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అడ్డుకోగా దుండగులు ఆమెపై దాడికి తెగబడి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
అప్పు తీర్చలేదని కిరాతకం
బొమ్మలసత్రం (నంద్యాల): రూ.లక్ష అప్పు తీర్చలేదని ఇద్దరు మహిళలపై మున్సిపల్ ఉద్యోగి సైకిల్ చైన్, కత్తితో కిరాతకంగా దాడి చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివార్లలోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకున్న ఈ దారుణం వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన సామేలు స్థానిక ప్రభుత్వ కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తూ పదేళ్ల క్రితం చనిపోయాడు. అతని భార్య మరియమ్మ ఒక కుమార్తె, ఇద్దరు కుమారులను కష్టపడి పోషించింది. ఇద్దరు కుమారులు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కుమార్తె స్వప్న మానసిక వికలాంగురాలు. మరియమ్మ పిల్లల చదువు కోసం గత ఏడాది ఏప్రిల్‌లో మున్సిపల్ ఉద్యోగి శేషన్న వద్ద రూ.లక్ష అప్పు తీసుకుంది. రూ.4 వడ్డీతో అప్పు తీసుకున్న ఆమె.. కూలి పనులకు వెళ్లగా వచ్చిన డబ్బుతో కొంత మేర వడ్డీ చెల్లించింది. మూడు నెలలుగా స్వప్న ఆరోగ్య పరిస్థితి సరిగా లేదు. దీంతో వడ్డీ చెల్లించడం మరియమ్మకు భారంగా మారింది. ఈ నేపథ్యంలో వడ్డీ, అసలు చెల్లించాలని వారం రోజులుగా శేషన్న వేధించడం మొదలుపెట్టాడు. మూడు నెలలు గడువు కావాలని కోరినా అతను అంగీకరించలేదు. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఉన్న మరియమ్మ, స్వప్నపై సైకిల్ చైన్, కత్తితో దాడికి పాల్పడ్డాడు. దెబ్బలు భరించలేక బాధితులు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని అడ్డుకోబోయారు. దీంతో వారిపైనా దాడికి ప్రయత్నించాడు. స్థానికుల సమక్షంలో బాధితులపై రెండోసారి కూడా దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గాయాలతో పడి ఉన్న తల్లి, కుమార్తెను స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నంద్యాల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
కుక్క మూత్రం పోసిందని.. మహిళలపై దాడి
సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో ఓ కాంగ్రెస్ కార్యకర్త రెచ్చిపోయాడు. మహిళలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లిలో లక్ష్మీ అనే మహిళకు చెందిన కుక్క కాంగ్రెస్ కార్యకర్త సందీప్ ఇంటిముందు మూత్ర విసర్జన చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైనా సందీప్ లక్ష్మీతోపాటు ఆమె కూతురు కల్పనతో గొడవకు దిగాడు. ఆ తర్వాత దుర్భాషలాడుతూ వారిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేశారు. -
యువతిపై ప్రేమోన్మాది దాడి
హైదరాబాద్: తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకుంటోందన్న అక్కసుతో ఓ యువకుడు యువతిపై కత్తెరతో దాడి చేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. యూసుఫ్‌గూడలోని జవహర్‌నగర్‌కు చెందిన యువతి (18)కి ఆమె అద్దెకుంటున్న ఇంటి కింది పోర్షన్లో ఉంటున్న యన్నాబత్తుల దుర్గాప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అతడు అక్కడి టైలర్‌షాపులో పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా అతను ప్రేమిస్తున్నట్లు చెప్పగా ఆమె నిరాకరించింది. ఇదిలా ఉండగా సదరు యువతికి ఇటీవల మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలియడంతో ఆగ్రహానికి లోనైన దుర్గాప్రసాద్ సోమవారం ఆమె ఇంటికి వెళ్లి తనను ప్రేమిస్తావా? లేదా? అంటూ నిలదీశాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా తనను కాకుండా ఇంకెవరిని చేసుకున్నా చంపేస్తానంటూ తనతో పాటు తెచ్చుకున్న కత్తెరతో మెడపై పొడిచాడు. బాధితురాలు అతడి బారి నుంచి తప్పించుకొని కిందకి పరుగు తీసింది. దీనిని గుర్తించిన టైలర్‌షాపు యజమాని యూసుఫ్ ఆమెను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాడు. స్థానికులు దుర్గాప్రసాద్‌ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శబరిమల ఆందోళనల్లో 1,500 మంది అరెస్టు
తిరువనంతపురం: ఇటీవల శబరిమల ఆలయంలో ఇటీవలి పూజల సందర్భంగా హింసాత్మక చర్యలకు పాల్పడిన వారి కోసం కేరళ పోలీసులు జల్లెడపడుతున్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన 10 నుంచి 50 ఏళ్ల మహిళలపై దాడికి యత్నించిన, హింసాత్మక చర్యలకు పాల్పడిన సుమారు 2 వేల మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎర్నాకులం, కోజికోడ్, పలక్కడ్, త్రిసూర్, కొట్టాయం, అలప్పుజ తదితర ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో దాడులు జరిపి 1,500 మందిని అరెస్టు చేశారు. మరో 210 మంది కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నవంబర్ 17 నుంచి ప్రారంభమయ్యే మండల పూజల నేపథ్యంలో 5వేల అదనపు బలగాలను మోహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
భర్తే.. మానవ మృగం..!
శ్రీకాకుళం రూరల్ : కడవరకు అండగా ఉంటానన్నాడు... కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానన్నాడు. ఏడు అడుగులు వేసి వేదమంత్రాల సాక్షిగా తాళికట్టిన భర్తే మానవ మృగంలా మారాడు. అదనపుకట్నం కోసం అత్త, ఆడపడుచు, భర్త ఒక్కటై హింసించి హత్య చేసేందుకు పూనుకున్నారు. తప్పించుకునే క్రమంలో ఆమె కాలు విరగ్గొడ్డి ఆస్పత్రి పాలుచేసిన ఘటన శ్రీకాకుళం రూరల్ మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని ఆ అభాగ్యురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో దీనస్థితిల్లో సహాయం కోసం ఎదురుచూస్తోంది. ఉన్న తమ్ముడు కూడా కొంతవరకే సేవ చేసినప్పటికీ కాలకృత్యాలు విషయంలో ఆమె నరకం చవిచూస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై కనీసం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక ఆస్పత్రిలోనే బిక్కుబిక్కుమంటుంది. ఈ హృదయవిధారక సంఘటనను చూసిన ప్రతీ ఒక్కరికీ కళ్ల నుంచి నీళ్లు తెప్పిస్తోంది. వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం రూరల్ మండలం కనుగులవానిపేటలో నివాసముంటున్న జాడ నాగరాజు(నగేష్) అనే వ్యక్తికి మొదటి భార్య చనిపోవడంతో ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమదాలవలస మండలం సోట్టవానిపేట గ్రామానికి చెందిన సుజాతను రెండో వివాహం చేసుకున్నాడు. తల్లిలేని పిల్ల కావడంతో పేద పరిస్థితిలో అతి చిన్న వయస్సులోనే సుజాతకు నగేష్‌తో వివాహం జరిగింది. మద్యంకు అలవాటు పడ్డ నగేష్ సుజాతపై తన పైశాచికత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శించేవాడు. వీరికి 5 సంవత్సరాల కుమారుడితో పాటు చనిపోయిన మొదటి భార్య కూతురు కూడా ఉన్నప్పటికీ ఇంట్లో పిల్లలు ముందే అత్యంత దారుణంగా కామావాంఛ తీర్చమనేవాడు. అదనపు కట్నం కోసం వేధింపులు తల్లిదండ్రులు లేని సుజాతపై అత్త, ఆడపడుచులు లేనిపోని చాడీలు చెప్పి భర్తచే ప్రతీసారి రెండు తగిలించేవారు. ఇదే క్రమంలో సుజాత తండ్రికి సంబందించిన ఇన్యూరెన్స్ డబ్బులు రావడంతో గడచిన కొద్దిరోజులుగా వీరింతా మరింతగా వేధించడం మొదలుపెట్టారు. దీంతో తినడానికి తిండి పెట్టకుండా అక్రమ సంబంధం అంటగడుతూ ప్రతీ నిత్యం ప్రత్యక్ష నరకం చూపించేవారు. వారం రోజులు క్రితం పూటుగా మద్యం సేవించిన నగేష్ తన చెల్లి టైలరింగ్ షాపు పెట్టుకోవడానికి డబ్బులు కావాలని, మీ నాన్నకు సంబంధించిన ప్రమాద బీమా సొమ్మును తేవాలని తీవ్రస్థాయిలో కుటుంబ సభ్యులు వత్తిడి చేశారు. ఆ డబ్బులతో తనకు సంబంధం లేదని ఎట్టిపరిస్థితిల్లోనైనా వాటిని తెచ్చి ఇచ్చే ప్రసక్తే లేదంటూ ఆమె మొండికేసింది. దీంతో తగాదా జరిగిన మరుసటిరోజు తన అక్క నివాసం ఉంటున్న రాగోలు గ్రామానికి కొడుకును తీసుకొని సుజాత వెళ్లిపోయింది. అక్క వద్ద ఉన్న సుజాత వద్దకు ఈ నెల 12వ తేదీన చేరుకున్న భర్త నగేష్ అక్కడ మరోసారి వాగ్వాదం చేశాడు. డబ్బులు తెస్తేనే ఇంటికి రావాలని, లేదంటే నీ దారి నువ్వు చూసుకోవాలంటూ మరింతగా బెదిరించాడు. ఏంచేసిన ఆ డబ్బులతో తనకు సంబంధం లేదంటూ తెగేసి చెప్పేసింది సుజాత. మద్యం మత్తులో ఉన్న భర్త ఓ బండరాయితో ఆమెను హత్య చేయబోయాడు. దీంతో తప్పించుకునే క్రమంలో ఆమె ఎడమకాలిపై పడడంతో ఒక్కసారిగా కాలు రెండు ముక్కలయింది. నడవలేని స్థితిలో ఉన్న సుజాతను తన తమ్ముడు దగ్గరిలో ఉన్న జెమ్స్ ఆస్పత్రిల్లో చేర్పించాడు. ఆస్పత్రిలోనే కోర్కె తీర్చాలని పైశాచికంగా ప్రవర్తించిన భర్త ఇదిలావుండగా ఆస్పత్రిలో ఆపసోపాలు పడుతూ వైద్యం పొందుతున్న సుజాతను చూసిన వారంతా అయ్యో... రామా అనే వారే ఎక్కువ. ఇవేవి పట్టించుకోని తన భర్త అక్కడే మృగంలా మారాడు. ఆస్పత్రిలో జాయినైనా మూడు రోజులు తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో నగేష్ తన భార్య వద్దకు వెళ్లి అందరూ పడుకున్నారని తన కామ కోర్కె తీర్చాలని పట్టుబట్టాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న సుజాతను నేలపైకి రావాలంటూ అక్కడే బలవంతం చేయబోయాడు. దీంతో పక్కనే ఉన్న రోగుల బంధువులు కేకలు పెట్టడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆస్పత్రిలోనే ఫిర్యాదు తీసుకున్న ఐసీడీఎస్ సిబ్బంది సుజాతకు జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారిని నిర్మల వెంటనే గురువారం జెమ్స్ ఆస్పత్రికి వెళ్లి నేరుగా ఆమెనుంచే ఫిర్యాదు తీసుకుంది. తన భర్త, అత్త, ఆడపడుచు చేసిన ఘోరాలను ఆ అధికారిని వద్ద సుజాత భోరున విలపించింది. ఆస్పత్రిలో భర్త చేసిన పైశాచకత్వపు పనులకు గాను ఓ కానిస్టేబుల్‌ను సుజాతకు కాపాలాగా పెట్టించారు. నాలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ భర్తే సర్వసం అనుకున్నాను. అదనపు కట్నం కోసం అత్త సరోజిని, ఆడపడుచు మాలతి కలిసి తన భర్తచే ప్రతీసారి వాతలు పెట్టించేవారు. మాట వినకపోతే వేధించడం... తిండి పెట్టకపోవడం... అనుమానించడం అన్ని నా భర్త నాకు ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. – సుజాత, బాధితురాలుబాధితురాలు -
అనుమానం పెనుభూతమై..
కేతేపల్లి(నకిరేకల్) నల్గోండ : తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భర్త ఆమెపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత తాను వ్యవసాయ బావి వద్ద విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేతేపల్లి మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన జటంగి భిక్షమయ్య–లింగమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు జటంగి శ్రీనివాస్(33)కు సూర్యాపేట మండలం కాసరబాద్‌కు చెందిన రజితతో పదమూడేళ్ల క్రితం వివాహమైంది. వీరు తుంగతుర్తి గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి 11 ఏళ్ల కూతురు నవ్య, 9 ఏళ్ల కుమారుడు కార్తీక్ సంతానం ఉన్నారు. వివాహం జరిగిన ఐదేళ్ల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో రజితను ఆమె భర్త తరుచూ వేధించసాగాడు. ఈక్రమంలో పలుమార్లు ఇరువురు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా జరిగాయి. అయినా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఏడాది కిత్రం రజిత తన ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లిగారి ఊరైన కాసరబాదుకు వెళ్లి కూలీ నాలీ చేసుకుని పిల్లలను పోషించుకుటుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ వివాహేతర సంబంధం పేరుతో తాను వేధించనని, భార్య, పిల్లలతో కలసి ఉంటానని నాలుగు నెలల కిత్రం కాసరబాదుకు వెళ్లి భార్య పిల్లలను తన ఇంటికి తీసుకువచ్చాడు. అయినా శ్రీనివాస్‌లో మార్పు రాలేదు. వివాహేతర సంబంధం పేరుతో మళ్లీ వేధించసాగాడు. ఈక్రమంలో మంగళవారం ఉదయం ఇరువురి మద్య ఏం జరిగిందో ఏమో కానీ శ్రీనివాస్ తన భార్య రజిత కాళ్లు, చేతులపై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారక స్థితిలో ఉన్న రజితను చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం 108 ఆంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మనస్తాపానికి గురైన భర్త.. భార్యపై దాడి చేసిన శ్రీనివాస్ మనస్తాపానికి గురై తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ చేతికందే ఎత్తులో కిందకు వేళాడుతున్న 11కేవీ విద్యుత్ తీగలను పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో విద్యుదాఘాతానికి లోనయిన శ్రీనివాస్ పొలంలో ఉన్న బురదలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఇది గమనించిన చుట్టు పక్కల రైతులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అప్పటికే శ్రీనివాస్ మృతి చెందాడు. పొలం బురదలో పడి ఉన్న శ్రీనివాస్ మృతదేహాన్ని అతికష్టం మీద గ్రామస్తులు ఒడ్డుకు చేర్చారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐ సమాచారం తెలుసుకున్న శాలిగౌరారం సీఐ కాస్ట్రోరెడ్డి, కేతేపల్లి ఎస్ఐ రజనీకర్‌రెడ్డి సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. సంఘటనకు సంబంధించి గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీనివాస్ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన శ్రీనివాస్ చిన్న సోదరుడు నాగయ్య సైతం భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. నాగయ్యను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. -
అరాచకం: మహిళపై టీడీపీ రేషన్ డీలర్ దాడి
సాక్షి, కర్నూలు(ఆదోని టౌన్): పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమాలపై ఫిర్యాదు చేశారనే కక్షతోనే టీడీపీకి చెందిన అంజినయ్య గ్రామంలో రేషన్ డీలర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కార్డుదారులకు రేషన్ సక్రమంగా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు అతడిపై ఆరోపణలున్నాయి. డీలర్ అక్రమాలపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక తహశీల్దార్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీఆర్వో రామాంజనేయులు ఆదివారం గ్రామంలో విచారణ జరపగా రేషన్ డీలర్ బియ్యం ఇవ్వటం లేదని వంద మందికిపైగా కార్డుదారులు తెలిపారు. ఇదే నివేదికను వీఆర్వో తహసీల్దార్‌కు సమర్పించారు. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె క్రిష్ణమ్మ కూడా సోమవారం గ్రామాన్ని సందర్శించి డీలర్ అక్రమాలు, తూకాల్లో మోసాలపై ఆరా తీశారు. దీన్ని జీర్ణించుకోలేని డీలర్ అంజనయ్య, అతడి సోదరులు నాగరాజు, కేశవ్, ఈరన్న గ్రామస్తులతో గొడవకు దిగారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ గొల్ల లక్ష్మి అనే మహిళను దుర్భాషలాడారు. ఆమెపై భౌతిక దాడికి దిగి కొట్టటంతో జాకెట్ చిరిగిపోయింది. ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపుతామంటూ బెదిరించారు. దాడితో అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. నడుము భాగం దెబ్బ తిన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు, మీడియా వద్ద బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మహిళపై ఆగంతకుల దాడి
సారవకోట: మండలంలోని మూగుపురం గ్రామానికి చెందిన బి.ఆదిలక్ష్మిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి తన కుమార్తెతో కలసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేందుకు ప్రయత్నించారని, పక్కనే ఉన్న కుమార్తె కేకలు వేయడంతో వారు పారిపోయారనిట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆదిలక్ష్మిని 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించి పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పార్ధి గ్యాంగ్‌పై వస్తున్న వదంతుల్లో భాగంగా కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారే తప్ప వాస్తవాలు లేవన్నారు. -
మహిళలపై జరుగుతున్నదాడులను అరికట్టాలి
ఖమ్మంమయూరిసెంటర్ : సభ్య సమాజం సిగ్గుపడే విధంగా చిన్నారులపై, బాలికలపై, మహిళలపై లైంగికదాడులు, హత్యలు జరుగుతున్నాయని, వాటిని నివారించే చర్యలు చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు జి.లలిత అన్నారు. బుధవారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో లలిత మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై, మైనార్టీలపై దాడులు పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ కరువైందని, బీజేపీ నాయకులే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అశ్లీల సాహిత్యాన్ని పెంచిపోషిస్తున్న వారికి ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తున్నాయని, మహిళలపై దాడులు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 25వ తేదీన పీఓడబ్ల్యూ, పీవైఎల్ ఆధ్వర్యంలో ఖమ్మంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో మేధావులు, ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థల బాధ్యులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పీవైఎల్, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శులు కె.శ్రీనివాస్, సీహెచ్ శిరోమణి, నాయకులు ఝాన్సీ, మంగతాయి, ఎం.జగన్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నతల్లిపై కానిస్టేబుల్ దాడి
సాక్షి, బంజారాహిల్స్ : తల్లిదండ్రులను చిత్రహింసలకు గురి చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. రహ్మత్‌నగర్‌లో విజయదుర్గాదేవి(61), తన భర్త వెంకటేశ్వర్లుతో కలిసి ఉంటోంది. వీరికి కుమారులు సురేష్‌బాబు, శ్రీకాంత్‌తో పాటు కుమార్తె ఉందిది. ఆమె భర్త వెంటేశ్వర్లు హెచ్ఏఎల్లో పని చేసి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ సొమ్ముతో రహ్మత్‌నగర్‌లో జీప్లస్–2 ఇంటిని నిర్మించుకున్నాడు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో విజయదుర్గాదేవి దంపతులు ఉండగా, ఫస్ట్‌ఫ్లోర్‌ను కిరాయికి ఇచ్చారు. 2016 నుంచి కొడుకులతో పాటు కోడళ్లు వారిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారు. ఈ నెల 12న కుమారులు సురేష్‌బాబు, శ్రీకాంత్ తల్లిదండ్రులను కొట్టి బయటకు గెంటేసి లోపలి నుంచి గడియ పెట్టుకున్నారు. తండ్రిని కొడుతుండటంతో అడ్డు వచ్చిన తల్లిపై దాడి చేయడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. తమకు న్యాయం చేయాలని, తమపై దాడి చేసిన కుమారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమను ఇంట్లో నుంచి తరిమేసి ఇంటిని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. చిన్న కొడుకు శ్రీకాంత్ సీఐఐఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్(పీసీ 819) పని చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కానిస్టేబుల్ శ్రీకాంత్‌తో పాటు సోదరుడు సురేష్‌బాబుపై క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
టీడీపీ నేతల దాష్టీకం
అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. అధికారం అడ్డం పెట్టుకుని విపక్ష నేతలే లక్ష్యంగా దారుణాలకు ఒడిగడుతున్నారు. రామగిరి మండలం పేరూరులో సుబ్బుకృష్ణ దంపతులపై దాడి ఘటన మరిచిపోక ముందే ఆదివారం ఇటు రాప్తాడులో , అటు తాడిపత్రిలో రెచ్చిపోయారు. ఓ మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులోనే ఆమె అనుచరులు భూ సమస్య నేపథ్యంలో ఇద్దరు మహిళలపై విచక్షణాæ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళల పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చారు. ఇక తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లలో అధికార పార్టీ నేతల ఆగడాలు పెచ్చుమీరాయి. క్రిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని మట్టుబెట్టిన టీడీపీ నేతలు... ఈకేసులో రాజీకి రావాలని బాధితులపై ఒత్తిడి తెస్తున్నారు. జేసీ సోదరుల అండతో సమయం దొరికినప్పుడల్లా వైఎస్సార్ సీపీ నేతలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం అప్పేచర్ల గ్రామంలోని వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లను కూల్చేసి తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించారు. రాప్తాడు: సాక్షాత్తు స్త్రీ శిశు సంక్షేమ శాక మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలోనే మహిళలపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. బాధితుల సమాచారం మేరకు.. రాప్తాడు మండలం గొందిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గిడ్డ మల్లయ్య తనకున్న తొమ్మిది ఎకరాల పొలం పక్కనే మరో 70 సెంట్ల ప్రభుత్వ భూమిని కూడా చదును చేసుకుని 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. ఈ భూమికి పక్కనే అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత మిడతల శీనయ్య పొలం ఉంది. ఆ భూమిని తన భూమిలో కలుపుకునేందుకు శీనయ్య కుమారుడు శీనయ్య రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తీసుకెళ్లాడు. దీంతో మల్లయ్యతో రెవెన్యూ అధికారులు చర్చించారు. భూమిపై సాగు హక్కు తనకే చెల్లుతుందని మల్లయ్య వివరించాడు. గ్రామ పెద్దలు కూడా మల్లయ్యకే ఆ భూమిపై సాగు హక్కు ఉందని తేల్చి చెప్పారు. పోలీసుల జోక్యంతో.. మూడు నెలల క్రితం ఈ భూమి విషయంపై గ్రామ సర్పంచ్ లక్ష్మమ్మ కుమారుడు పసుపుల బాబయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి పోలీసులు చర్చించారు. మల్లయ్యతో మాట్లాడి ఆ భూమిపై హక్కులు వదులుకునేలా చేయాలని బాబయ్యకు సూచించారు. ఇందుకు నిరాకరించి స్టేషన్ బయటకు వస్తున్న బాబయ్యను పోలీసులు అడ్డుకుని తమదైన శైలీలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పట్లో ఈ ఘటన సంచనలమైంది. కోర్టును ఆశ్రయించి.. వరుస ఘటనలతో విసుగెత్తిన మల్లయ్య ఆ భూమికి సంబంధించి కోర్టును ఆశ్రయించి, ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. ఈ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ శీనయ్య ఆయన కుమారులు ముగ్గురు, మరొక వ్యక్తి గోపాల్ శనివారం మల్లయ్య సాగు చేసుకుంటున్న 70 సెంట్ల ప్రభుత్వ భూమిని ట్రాక్టర్‌తో పాపించారు. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకునేందుకు బాధితులు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆదివారం ఉదయాన కర్రలు, ఇనుప రాడ్లతో మల్లయ్య ఇంటి వద్దకు చేరుకున్నారు. స్థానికులు వెంటనే మల్లయ్యను ఇంటిలోకి నెట్టి తలుపులు వేశారు. ఆ సమయంలో మల్లయ్య ముగ్గురు కుమారులు ఇంటి దగ్గర లేరు. ఇంటి బయట పనులు చేసుకుంటున్న మల్లయ్య భార్య రామక్క, రెండో కోడలు రాధమ్మపై వారు విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకోబోయిన చుట్టుపక్కల వారిని కూడా చితకబాదారు. బాధితుల పరిస్థితి విషమం దాడిలో గాయపడిన వన్నక్క, రాధమ్మను సర్వజనాస్పత్రికి స్థానికులు తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న వన్నక్కను మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, దాడి చేసిన మిడతల శీనయ్య, ఆయన ముగ్గురు కుమారులపై రౌడీ షీట్ ఉన్నట్లు పలువురు ఈ సందర్భంగా ఆరోపించారు. మూడు నెలలుగా వాదించుకుంటున్నారు ఈ విషయంపై ఎస్ఐ ధరణిబాబు వివరణ ఇస్తూ.. మల్లయ్య సాగు చేసుకుంటున్న భూమికి సంబంధించి ఇద్దరి మధ్య మూడు నెలలుగా ఘర్షణలు ఉన్నాయన్నారు. ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి రెవెన్యూ అధికారుల సమక్షంలో సమస్య పరిష్కరించుకోవాలని ఆదేశించినట్లు గుర్తు చేశారు. అయినా వారు వినకుండా ఘర్షణ పడుతూ వచ్చారు. ఆదివారం ఉదయం కూడా ఇరువర్గాల మహిళలు కొట్టుకున్నట్లు, ఒక వర్గం వారికి గాయాలైనట్లు సమాచారం అందిందని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు. -
ఎస్ఆర్ నగర్లో యువతిపై కిరాతకం
-
ఎస్ఆర్ నగర్లో యువతిపై కిరాతకం
సాక్షి, హైదరాబాద్ : అటు విశాఖలో యాచకురాలిపై యువకుడి కీచకపర్వం ఘటన దర్యాప్తు కొనసాగుతుండగానే, హైదరాబాద్‌లో మరో కిరాతకం చోటుచేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ రైతు బజార్ వద్ద ఓ వివాహితపై ప్రేమోన్మాది కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు. రక్తపుమడుగులో పడిపోయిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేసినా.. : ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వివాహితను అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. దీనిపై ఆమె రెండు సార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. సోమవారం మధ్యాహ్నం రైతు బజార్ వద్ద ఆమెపై కొబ్బరిబోండాల కత్తితో దాడిచేసి మెడ నరికే ప్రయత్నం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయే క్రమంలో స్థానికులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని విచారిస్తున్నామని, బాధితురాలికి గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందుతున్నదని పోలీసులు చెప్పారు. -
నంద్యాలలో టీడీపీ నేతల అరాచకం
-
నంద్యాలలో టీడీపీ నేతల అరాచకం
సాక్షి, నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల విశ్వనగర్ లో టీడీపీ నేతలు అరాచకానికి పాల్పడ్డారు. ఇళ్లకు అడ్డంగా ఇసుక డంప్ ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన మహిళలపై గురువారం ఉదయం ఎదురుదాడి చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీకి ఓటేశారంటూ ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తిని టీడీపీ నేతలు కొట్టారు. దీంతో తమపై దాడి చేసినవారిపై కేసు నమోదు చేయాలంటూ టూటౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే... టీడీపీ కార్యకర్త సుబ్బయ్య కక్షసాధింపు చర్యతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులపై దాడికి దిగాడు. నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేయడంతో... కావాలనే టీడీపీ నాయకుడికి సంబంధించిన ఇసుక ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డం పెట్టారు. రోడ్డుకు అడ్డంపెట్టి అసౌకర్యం కలిగిస్తున్నారని అడిగినందుకు మహిళ అని కూడా చూడకుండా నానా దుర్భాశలాడుతూ మహిళ చీర లాగి కొట్టారు. అడ్డుకోబోయిన పక్కింటి మహిళను కూడా కొట్టారు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేసి కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. -
మహిళలపై ఆగని ‘తమ్ముళ్ల’ దౌర్జన్యకాండ
అనంతలో మహిళపై టీడీపీ నాయకుల దాడి రాయదుర్గం : ‘అనంత’లో మహిళలపై టీడీపీ నేతల దౌర్జన్యకాండ కొనసాగుతూనే ఉంది. తాజాగా సోమవారం రాత్రి గుమ్మఘట్ట మండలం పూలకుంటలో దాసంపల్లి లక్ష్మి అనే మహిళపై దాడి చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. పూలకుంటలో ఆంజనేయస్వామి ఆలయంలోని సప్లయర్ సామగ్రి(షామియానా, వంటపాత్రలు)కు సంబంధించిన లావాదేవీల బాధ్యతలను లక్ష్మి భర్త హనుమంతరెడ్డికి గ్రామపెద్దలు అప్పగించారు. వచ్చే ఆదాయాన్ని గ్రామంలో వేలం పాట ద్వారా టీడీపీ నాయకుడైన డీలర్ బోయ చెన్నప్ప రూ.10వేలు వడ్డీకి తీసుకున్నాడు. గత వినాయక చవితినాడు ఆ డబ్బుకట్టాలని అడగడంతో ఆ రోజే హనుమంతరెడ్డిని చెన్నప్ప కొట్టాడు. అప్పట్లో గ్రామపెద్దలు రాజీచేశారు. ప్రస్తుతం హనుమంతరెడ్డి కూలీ పనుల కోసం బెంగళూరుకు వలస వెళ్లగా ఇంట్లో భార్య లక్ష్మి, తల్లి అనంతమ్మ ఉంటున్నారు. సోమవారం చెన్నప్ప సోదరుడు తప్పతాగి వచ్చి ‘అధికారం మాది.. మాకెవ్వరూ ఎదురు మాట్లాడకూడదు’ అంటూ గొడవచేశాడు. పక్కకు వెళ్లాలంటూ చెప్పిన లక్ష్మి, ఆమె అత్తపై టీడీపీ నాయకులు బోయ చెన్నప్ప, తమ్ముడు వెంకటేశులు, అతడి భార్య మూకుమ్మడిగా దాడిచేశారు. ప్రస్తుతం లక్ష్మి రాయదుర్గం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా లక్ష్మినే తమపై దాడిచేసిందంటూ నిందితులు కూడా ఆస్పత్రిలో చేరడం గమనార్హం. -
మహిళను వివస్త్రను చేసి చెప్పులతో దాడి..
- ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరుడి దాష్టికం కదిరి: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. నెల క్రితం రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయి బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై కిరాతకంగా దాడి చేశారు. అప్పట్లో బయటపడ్డ పరిటాల అనుచరుల దాడి దృశ్యాలపై సర్వత్రా చర్చ జరిగింది. అది మరువక ముందే తాజాగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అనుచరుడు ఓ మహిళపై తన దాష్టికాన్ని ప్రదర్శించాడు. చాంద్ బాషా అనుచరుడు రేషన్ నారాయణ, అతని అనుచరులు ఓ మహిళను వివస్త్రను చేసి చెప్పులతో దాడి చేశాడు. దీంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. నారాయణ దాడితో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కుటుంబం పరువు తీస్తోందని..
హైదరాబాద్: వివాహేతర సంబంధం కొనసాగిస్తూ.. కుటుంబం పరువు తీస్తోందని ఓ యువకుడు తన పిన్నిపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన నగరంలోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న జ్యోతి అనే మహిళ భర్త స్నేహితునితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం పై కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం జ్యోతికి వరుసకు కొడుకయ్యే గణేష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గణేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దొంగతనం ముసుగులో మహిళ హత్య!
-
దొంగతనం ముసుగులో మహిళ హత్య!
ఎస్.కోట (విజయనగరం): ఎస్.కోటలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు మహిళపై ముగ్గురు దుండగులు దాడి చేసి దోపిడికి పాల్పడి ఒక మహిళను హత్య చేశారు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి విజయనగరం జిల్లా ఎస్. కోట మండలంలోని రైల్వే ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్‌లో జరిగింది. వివరాలు.. స్వాతి(టెక్నిషియన్(25)), పార్వతి(హెల్పర్)లు సోమవారం విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతలో ముగ్గురు నిందితులు వారిపై దాడి చేశారు. ముందుగా పార్వతి ముఖానికి ముసుగువేసి బంధించారు. అనంతరం స్వాతిని పట్టుకొని ముఖంపై బలమైన వస్తువుతో మోదారు. దీంతో స్వాతి అక్కడికక్కడే మృతి చెందింది. అంతేకాకుండా పార్వతి వద్ద ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం సహాయంతో పరిశీలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దొంగలు అయితే, ఇద్దరి మహిళల్లో ఒక్కరినే ఎందుకు చంపుతారన్నది అర్థంకాని ప్రశ్న? ఇది దొంగతనం ముసుగులో కావాలనే చేసిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు.