కుక్క మూత్రం పోసిందని.. మహిళలపై దాడి

Congress Worker Attack Women In Peddapalli - Sakshi

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్త రెచ్చిపోయాడు. మహిళలపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లిలో లక్ష్మీ అనే మహిళకు చెందిన కుక్క కాంగ్రెస్‌ కార్యకర్త సందీప్‌ ఇంటిముందు మూత్ర విసర్జన చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైనా సందీప్‌ లక్ష్మీతోపాటు ఆమె కూతురు కల్పనతో గొడవకు దిగాడు. ఆ తర్వాత దుర్భాషలాడుతూ వారిపై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై కూడా దాడి చేశాడు. ఈ ఘటనతో బిత్తరపోయిన మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు సందీప్‌ను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top