ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్‌ అంటూ మహిళకు కాల్స్‌ చేసి చివరకు.. | MLA PA Vijay Simha Attacked On Woman At Hyderabad | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పీఏ అరాచకం.. ఫ్రెండ్స్‌ అంటూ మహిళకు కాల్స్‌ చేసి చివరకు..

Sep 19 2022 10:29 AM | Updated on Sep 19 2022 10:36 AM

MLA PA Vijay Simha Attacked On Woman At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఓ మహిళపై కత్తితో దాడి చేశాడు. దీంతో, మహిళ పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వివరాల ప్రకారం.. మాగంటి గోపీనాథ్‌ పీఏ విజయ్‌ సింహ ఓ మహిళపై దాడి చేశాడు. కత్తిలో మహిళను తీవ్రంగా గాయపరిచాడు. దీంతో, ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.

ఈ సందర్భంగా సదరు మహిళ భర్త మాట్లాడుతూ.. ప్రస్తుతం నా భార్య మాట్లాడలేని స్థితిలో ఉంది. ఎమ్మెల్యే పీఏ విజయ్‌ సింహా నా భార్యతో మాట్లడేవాడు. ఆమెతో అనుచితంగా కూడా ప్రవర్తించాడు. ఆమెకు ఫోన్‌లో న్యూడ్‌ వీడియో కాల్స్‌, ఫోన్‌కాల్స్‌ కూడా చేసేవాడు. కాల్స్‌కు సంబంధించిన ఫోన్‌ రికార్డ్స్‌ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఆమెతో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. కానీ, ఇలా ఈరోజు మా ఇంటి అడ్రస్‌ తెలుసుకుని వచ్చి అటాక్‌ చేస్తాడని అనుకోలేదు. నా భయం నాకు ఉంది. ఆయనకు రౌడీ షీటర్లు తెలుసంటా.. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో నాకు ఏమైనా ప్రాబ్లమ్‌ వస్తుందని భయపడుతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement