మహిళను వివస్త్రను చేసి చెప్పులతో దాడి.. | mla chand basha supporter brutally attack a woman in anantapur | Sakshi
Sakshi News home page

మహిళను వివస్త్రను చేసి చెప్పులతో దాడి..

Dec 1 2016 12:14 PM | Updated on Sep 4 2017 9:38 PM

అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు,వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి.

- ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరుడి దాష్టికం
 
కదిరి: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. నెల క్రితం రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయి బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై కిరాతకంగా దాడి చేశారు. అప్పట్లో బయటపడ్డ పరిటాల అనుచరుల దాడి దృశ్యాలపై సర్వత్రా చర్చ జరిగింది. అది మరువక ముందే తాజాగా కదిరి ఎ‍మ్మెల్యే చాంద్ బాషా అనుచరుడు ఓ మహిళపై తన దాష్టికాన్ని ప్రదర్శించాడు. చాంద్ బాషా అనుచరుడు రేషన్ నారాయణ, అతని అనుచరులు ఓ మహిళను వివస్త్రను చేసి చెప్పులతో దాడి చేశాడు. దీంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. నారాయణ దాడితో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement