Top Stories
ప్రధాన వార్తలు
AP: సిట్ దూకుడు.. అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు!
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ ఘటనలపై సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు(సోమవారం) ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. కాగా, ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో సిట్ బృందం పని ప్రారంభించింది. ఈ మేరకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజిలాల్ రేపు ఈసీకి నివేదిక ఇవ్వనున్నారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై సిట్ బృందం ప్రధానంగా దృష్టిసారించింది. కాగా, హింసాత్మక ఘటన తర్వాత అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మరోవైపు.. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్లను సిట్ నమోదు చేయనుంది. అయితే, కొందరు పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్లో పలు సెక్షన్లు మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు సిట్ గుర్తించింది. ఇక, హింసాత్మక ఘటనలకు సంబంధించి సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను సిట్ బృందం పరిశీలిస్తోంది.
మరోసారి పోలీసుల అదుపులో ఉయ్యూరు లోకేష్
సాక్షి, కృష్ణాజిల్లా: గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ బాబును మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం ఎయిర్‌పోర్టులో ఉయ్యూరు లోకేష్ అనుమానాస్పదంగా తిరిగిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ పర్యటన ఎయిర్ పోర్ట్‌కు వస్తున్న సమయంలో ఆందోళన చేసేందుకు లోకేష్ ప్లాన్ చేయగా, తనిఖీల్లో భాగంగా సరైన టికెట్ లేకపోవడం, సరైన సమాధానం లేకపోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం 41ఏ నోటిస్ ఇచ్చిన శనివారం పంపించారు.తిరిగి ఆదివారం మరోసారి ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు లోకేష్ వచ్చాడు. ఎయిర్ పోర్ట్ అధికారుల తనిఖీల్లో లోకేష్ నుంచి శాటిలైట్ ఫోన్ బయటపడింది. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు గన్నవరం పోలీసులకు సమాచారం ఇవ్వగా, లోకేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా లోకేష్ శాటిలైట్ ఫోన్ వినియోగిస్తున్నాడు. తుళ్ళూరు మండలం వెంకటాయపాలెంకు చెందిన లోకేష్.. గతంలో అమెరికాలో డాక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. లోకేష్‌ను గన్నవరం పోలీసులు విచారిస్తున్నారు.
May 19th: ఏపీ పొలిటికల్ అప్డేట్స్
May 19th AP Elections 2024 News Political Updates12:30 PM, May 19th, 2024తిరుపతిలో సిట్ బృందం పరిశీలనతిరుపతి జిల్లా..చంద్రగిరి మండలం కూచివారిపల్లిలో సిట్ బృందం పరిశీలనటీడీపీ నాయకుల దాడిలో ధ్వంసమైన కొటాల చంద్రశేఖర్ రెడ్డి ఇల్లును పరిశీలించిన బృందంచంద్రగిరి వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గన్‌మెన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్న సిట్ బృందంసీఐ రామయ్య, కానిస్టేబుల్ వెంకటరమణను ఆరోజు జరిగిన సంఘటన గురించి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు 11:45 AM, May 19th, 2024టీడీపీ నేతల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతి..శ్రీకాకుళంటీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ ఏజెంట్ తండ్రి మృతిగురువారం వైఎస్సార్సీపీ ఏజెంట్ మాధవరావు తండ్రి తోట మల్లేష్‌పై అచ్చెన్నాయుడు అనుచరుల దాడికోటబొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ బూత్-288లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న మాధవరావుమాధవరావు కుటుంబ సభ్యులపై ఒక్కసారిగా దాడికి పాల్పడిన టీడీపీ నాయకులుమాధవరావు తండ్రి తోట మల్లేష్ గుడిలో పూజ చేస్తుండగా దాడికి పాల్పడిన అచ్చెన్నాయుడి అనుచరులుదాడిలో తీవ్రంగా గాయపడిన తోట మల్లేష్ రావు.వెంటనే శ్రీకాకుళం రిమ్స్‌కు తరలింపు.పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించిన వైద్యులుచికిత్స పొందుతూ కేజీహెచ్‌లో మరణించిన తోట మల్లేశ్వరరావు 11:10 AM, May 19th, 2024ఎన్నికల విధులకు వెళ్తూ ఏఎస్ఐ రమణ మృతిఎన్టీఆర్ జిల్లాఎన్నికల విధులకు హాజరయ్యేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురైన విజయవాడ సీపీఎస్ ఏఎస్ఐ రమణరమణను వేగంగా ఢీకొట్టిన ఎర్టిగా కారు.తీవ్రగాయాల పాలైన రమణ..పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపుచికిత్సపొందుతూ మృతి చెందిన రమణ 10:40 AM, May 19th, 2024పరారీలో చింతమనేని..ఏలూరు జిల్లాపరారీలో దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ఈనెల 16 రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన చింతమనేనిబెంగళూరు వెళ్ళినట్టు ప్రాథమిక సమాచారంఆయనతోపాటు మరో 14 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తింపుహత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి సినీ పక్కిలో దౌర్జన్యం చేసి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిచింతమనేనితో పాటు 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదుచింతమనేని అతని అనుచరులను పట్టుకునేందుకు ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీంలు ఏర్పాటుచింతమనేని అతని అనుచురులపై సెక్షన్ 353, 224, 225, 143, 149 సెక్షన్ల కింద కేసులు నమోదుచింతమనేని కేసును పర్యవేక్షిస్తున్న నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్యముద్దాయి రాజశేఖర్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పెదవేగి పోలీస్ సిబ్బంది.కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించిన ఏలూరు జిల్లా కోర్టు.రిమాండ్ విధించిన ముద్దాయిని ఏలూరు జిల్లా సబ్ జైలుకు తరలించిన పెదవేగి పోలీస్ సిబ్బంది. 10:00 AM, May 19th, 2024ఏపీలో దూకుడు పెంచిన సిట్ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై దర్యాప్తు కోసం 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో చోటు చేసుకున్న హింసపై దర్యాప్తు జరుపుతున్న సిట్మాచర్ల, గురజాల, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింసపై ప్రధానంగా దృష్టిసారించిన సిట్అనుమానితుల్లో కొందరు అజ్ఞాతంలోకి, మరికొందరు హైదారాబాద్ సహా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు గుర్తించిన సిట్సోమవారం ఈసీకి నివేదిక ఇవ్వనున్న సిట్ సారథి వినీత్ బ్రిజిలాల్ఇప్పటికే హింస జరిగిన ప్రాంతాల్లో పని ప్రారంభించిన సిట్ బృందాలుఅల్లర్లు జరిగిన ప్రాంతాల్లో నమోదైన ఎఫ్ఐఆర్లు పరిశీలించి అవసరమైన చోట అదనపు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న సిట్సీసీ కెమెరాలు సహా అన్ని ఆధారాలను పరిశీలిస్తున్న సిట్ 9:30 AM, May 19th, 2024ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు..చిత్తూరు జిల్లాజిల్లావ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరు కానీ అధికారులపై చర్యలుజిల్లాలో 228 మంది పీవో, ఏపీవో, ఓపీవోలపై క్రమశిక్షణ చర్యలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.షన్మోహన్ 8:00 AM, May 19th, 2024నెల్లూరులో పోలీసుల కార్డన్ సెర్చ్..ఎస్పీ ఆరిఫ్ హఫీస్ ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్న కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్డెన్ సర్చ్ నిర్వహణ సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 7:00 AM, May 19th, 2024మాట నిలుపుకున్న సీఎం జగన్విజయవాడమాట నిలుపుకున్న సీఎం జగన్ ప్రభుత్వంఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే డీబీటీ నిధులు జమనాలుగు రోజుల్లో రూ.5,868 కోట్లు నిధులు జమవైఎస్సార్ ఆసరా కింద డ్వాక్రా మహిళలకు రూ.1843 కోట్లు జమఇన్‌ఫుట్ సబ్సిడీ రైతుల ఖాతాల్లో రూ.1236 కోట్లు జమవైఎస్సార్ చేయూత పథకం కింద రూ.1552 కోట్లు జమఈబీసీ నేస్తం కింద అగ్రవర్ణాల పేదలకు రూ.629 కోట్లు జమజగనన్న విద్య దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కింద రూ.605 కోట్లు జమఎన్నికల కమిషన్ అడ్డుకోవడంతో ఇన్నాళ్లు ఆగిన నిధుల జమఈసీకి తీవ్రంగా చీవాట్లు పెట్టిన ఎన్నికల కమిషన్సీఎం జగన్ హామీ ఇచినట్టుగానే ఎన్నికలు అవ్వగానే చెల్లింపులు 6:50 AM, May 19th, 2024తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంఅనంతపురం:తాడిపత్రి చేరుకున్న సిట్ బృందంపోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై విచారణ చేపట్టిన సిట్ బృందం సభ్యులుటీడీపీ నేతలు రాళ్లు రువ్విన జూనియర్ కాలేజీ మైదానాన్ని పరిశీలించిన సిట్ బృందం సభ్యులు 6:40 AM, May 19th, 2024పల్నాడుపై పగబట్టిన బాబుటీడీపీ శ్రేణులను రెచ్చగొట్టి వరుస దాడులునాటి నుంచి నేటి వరకు అదే తీరు2020లో కాజ టోల్గేట్ వద్ద పిన్నెల్లిపై దాడివిజయవాడ నుంచి రౌడీలను పంపిన బాబుఎన్ని కుట్రలు పన్నినా పుంజుకోలేని టీడీపీఅభివృద్ధితో పోటీపడలేకే ఘర్షణలకు ఆజ్యం 6:30 AM, May 19th, 2024అల్లర్లకు ఆద్యుడు చంద్రబాబే: జోగి రమేష్రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నాడుప్రణాళిక బద్ధంగా వైస్సార్సీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారుగతంలో ఇటువంటి పరిస్థితులు లేవుఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నాడుఎన్నికలై నాలుగు రోజులైనా వైస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయిఅమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నాడుఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతాడుటీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందికులాలు, మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నాడుప్రజలే బాబుకి బుద్ధి చెబుతారువైస్సార్‌సీపీ నేతలు సమన్వయం పాటించండిటీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం
సాక్షి ఎక్స్‌క్లూజివ్: ‘సుష్మా స్వరాజ్ కూతురికి టికెట్ ఇవ్వొచ్చా?’
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత సోమనాథ్ భారతి. వారసత్వ రాజకీయాలను బీజేపీ కూడా పోత్సహిస్తోందని సోమనాథ్ ఎద్దేవా చేశారు. ఢిల్లీ సాక్షి ప్రతినిధితో సోమనాథ్ భారతి ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది. అన్యాయంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. స్వాతి మలివాల్ ఘటనను కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. అబ్ కీ బాత్ బీజేపీ తడి పార్. బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రసక్తే లేదు. కేంద్రంలో ఇండియా కూటమి కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులే గెలుస్తారు. వారసత్వ రాజకీయాలను బీజేపీ వ్యతిరేకిస్తుందని బీజేపీ నేతలు చెప్పుకుంటారు. మరి సుష్మా స్వరాజ్ కూతురు టికెట్ ఎలా ఇచ్చారు?. దీన్ని రాజకీయ వారసత్వం అనరా?. బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇదే నిదర్శనం అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మల్లారెడ్డి భూ వివాదంలో మరో ట్విస్ట్..
సాక్షి, కుత్బుల్లాపూర్: సుచిత్ర సెంటర్లోని భూమి వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, బాధితుల మధ్య తీవ్ర విగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) భారీ బందోబస్తు మధ్య పోలీసులు సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో మీడియాను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ సందర్భంగా వివాద స్థలం ఉన్న ప్రాంతానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిలు వచ్చారు. తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు. ఈ విషయంలో అధికారులు తమకు సహకరించడంలేదని మల్లారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. సర్వే ముగిసిన తర్వాత మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సర్వే రిపోర్ట్ వచ్చేందుకు ఒక్కరోజు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూవివాదంలో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ ల్యాండ్ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ స్పందించారు. ఆ భూమిలో తాను కూడా కొంత ల్యాండ్ కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2015 82/e సర్వే నెంబర్లో వేరే వ్యక్తి దగ్గరి నుంచి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. మరో మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఎలాంటి వివాదాలు లేవని తెలిసిన తర్వాతే మేము భూమి కొనుగోలు చేశాము. 15 మంది వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని.మల్లారెడ్డితో ఈ ల్యాండ్ వివాదంపై పలుమారు మాట్లాడాము. బేరి సుభాష్ రెడ్డితో పాటు మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. సర్వే కోసం ఎన్నిసార్లు రమ్మని చెప్పినా మల్లారెడ్డి రాలేదు. తనకు సర్వే అవసరంలేదని చెప్పారు. 82/e సర్వే నెంబర్లో ల్యాండ్‌పై ఇంజెక్షన్ అర్డర్ వేసినా దానికి కౌంటర్ వేయలేదు.మల్లారెడ్డి పలుమార్లు నాపేరు ప్రస్తావించినందుకే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. గతంలో అధికారంలో ఉన్న సమయంలో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ల్యాండ్ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారు. కేటీఆర్ మాటలను కూడా మల్లారెడ్డి పెడచెవిన పెట్టారు. అధికారికంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి ఎన్నో ఆటలు ఆడాడు. మేడ్చల్ మల్కాజ్‌గిరిలో మల్లా రెడ్డి ఆధీనంలో ఉన్న భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శనివారం రోజున సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఉన్న రెండున్నరెకరాల భూమి తమదేనని మల్లారెడ్డి వాదిస్తుండగా.. అయితే అందులో 1.11 ఎకరాలు తమదేనని, తలా 400 గజాలు కొన్నామని, కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వచ్చిందంటూ మిగతా 15 మంది వాదిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. అయితే పోలీసులు చెప్పేది వినకుండా తన అనుచరులను మల్లారెడ్డి ఫెన్సింగ్‌లు తొలగించాలని ఉసిగొల్పారు. ఈ క్రమంలో పోలీసులతో మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. ‘కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటా’ అని మల్లారెడ్డి పోలీసులతో అన్నారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది. అనంతరం, మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
మహిళా చైతన్యంపై మారీచ మేఘం!
ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఇప్పుడు పురుషులకంటే మహిళలే ఎక్కువగా చైతన్యం కనబరుస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో కూడా మొత్తం పోలైన ఓట్లలో పురుషుల కంటే ఒకటిన్నర శాతం మహిళల ఓట్లే ఎక్కువ. చైతన్యవంతమైన నాగరిక సమాజానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాల్లో మహిళా సాధికారత ప్రధానమైనది. అందుకు మార్గం అన్ని రంగాల్లో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడమేనన్న సంగతిని విజ్ఞులందరూ అంగీకరిస్తారు.ఈ సమానత్వం అనే అంశంపై ఐక్యరాజ్య సమితి గత సంవత్సరం విడుదల చేసిన నివేదికలో మన దేశం అట్టడుగు పొరల్లోనే కనిపించింది. 146 దేశాలతో పొందుపరిచిన స్త్రీ – పురుష సమానత్వ జాబితాలో మన దేశానికి 127వ స్థానం దక్కింది. సమానత్వపు సాధనలో మనం సాధించవలసిన లక్ష్యం ఇంకెంతో దూరం ఉన్నదని ఈ నివేదిక గుర్తు చేసింది. అమ్మవారిని ఆదిశక్తిగా ఆరాధించే దేశంలో ఈ దుర్గతి సంప్రాప్తమవడం ఒక విషాదం. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ మహిళ వేసే ప్రతి ముందడుగును ఈ దేశంలోని ప్రజాస్వామ్య ప్రియులందరూ స్వాగతిస్తారు. ఓటు హక్కు వినియోగంపై ఇప్పుడొస్తున్న వార్తలు కూడా అటువంటి ముందడుగులే.కేవలం ఓటుహక్కు వినియోగించుకోవడం వరకే ఈ ముందడుగు పరిమితం కాలేదు. ఓటు వేసే విషయంలో స్వతంత్ర నిర్ణయం తీసుకునే మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రతిష్ఠాత్మక సంస్థగా పేరున్న సీఎస్డీఎస్ వారు గత సాధారణ ఎన్నికల తర్వాత చేసిన పోస్ట్ పోల్ విశ్లేషణలో ఈ సంగతి వెల్లడైంది. స్త్రీ సమానత్వానికి సామాజిక–సాంస్కృతిక ప్రతిబంధకాలు బలంగా ఉన్న హిందూ మనుధర్మ సమాజంలో ఈమాత్రం పురోగతిని కూడా విప్లవాత్మకమైనదిగానే పరిగణించాలి. 55 నుంచి 60 శాతం మంది మహిళలు తమ సొంత అభిప్రాయాల మేరకే ఓటేస్తున్నారని ఈ అధ్యయనంలో వెల్లడైంది.భారతీయ మహిళల్లో క్రమంగా పెరుగుతున్న ఆర్థిక స్వావలంబన కూడా ఈ పరిణామానికి దారి తీసి ఉండవచ్చు. భద్రత, పిల్లల భవిష్యత్తు, ఉన్నంతలో గుట్టుగా బతకడం వంటి అంశాలకు మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు దోహదపడే రాజకీయ పక్షాలను ఎన్నుకోవడంలో వారు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. అంతకుముందుతో పోలిస్తే గత ఎన్నికల్లో (2019) బీజేపీకి మహిళల మద్దతు పెరిగిందని సీఎస్డీఎస్ తెలిపింది. ఉజ్వల్ యోజన, స్వచ్ఛ భారత్ అభియాన్, జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో – బేటీ పఢావో వంటి పథకాల ఫలితంగా మహిళా ఓటర్ల మద్దతు బీజేపీకి పెరిగిందట! ఈ పథకాలను వినియోగించుకోని మహిళలతో పోలిస్తే లబ్ధిదారులైన మహిళల్లో 8 శాతం ఎక్కువమంది బీజేపీకి ఓటు వేసినట్టు సీఎస్డీఎస్ అంచనా వేసింది.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మహిళలు పెద్ద ఎత్తున బీజేపీకి ఓట్లు వేశారు. యోగీబాబా హయాంలో మెరుగైన శాంతిభద్రతల పరిస్థితే అందుకు కారణం. అంతే తప్ప యోగీజీ కాషాయ సిద్ధాంతం ఎంతమాత్రమూ కాదు. మహిళలు కోరుకుంటున్న భద్రత, పిల్లల భవిష్యత్తు, బతుకు భరోసా వంటి అంశాల్లో ఐదేళ్ల వైఎస్ జగన్ పరిపాలన మోదీ, యోగీల పాలన కంటే ఎన్నోరెట్లు ప్రభావవంతమైనది. అమ్మ ఒడి, 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వగైరా పథకాలు మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన అతిపెద్ద గేమ్ ఛేంజర్స్.మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన ‘దిశ’ యాప్‌ను సుమారు కోటిన్నర మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దాదాపు 32 వేల సందర్భాల్లో ‘దిశ’ యాప్ ద్వారా మహిళలు పోలీసు రక్షణ పొందగలిగారు. ‘దిశ’ యాప్ అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు 27 శాతం తగ్గాయి. అన్నిటినీ మించి విద్యారంగ సంస్కరణలు మహిళలను అపరిమితంగా ప్రభావితం చేసినట్టు కనిపిస్తున్నది. బిడ్డలకు అంతర్జాతీయస్థాయి ఇంగ్లిషు మీడియం చదువులు అందుబాటులోకి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. అలాగే నాణ్యమైన ఆరోగ్య సేవలు. ఈ ఐదేళ్ల కాలంలో సుమారు 55 లక్షలమంది సిబ్బందిని అరోగ్య సేవల కోసం నియమించిన సంగతి తెలిసిందే. వైద్యశాఖలో ఇంత పెద్దఎత్తున నియామకాలు జరిపిన రాష్ట్రం మరొకటి లేదు. ‘నాడు–నేడు’ పథకం కింద వేలకోట్లు వెచ్చించి ప్రభుత్వాసుపత్రులను ఆధునీకరించారు. ఈ కార్యక్రమాలు కచ్చితంగా మహిళల ఆలోచనల్ని ప్రభావితం చేసేవే!వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన ఏపీలో 36 శాతం భూకమతాలకు మహిళలే సేద్య సారథ్యం వహిస్తున్నారు. కాలుష్య రహితమూ, పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఏపీలో ఈ సాగు చేసే రైతుల్లో 80 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. సుస్థిర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురుషుల కంటే మహిళల్లోనే చైతన్యం ఎక్కువనేందుకు ఇదొక ఉదాహరణ. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న మహిళలందరికీ ఆర్బీకే సెంటర్ల సేవలపై సదభిప్రాయం ఉన్నది.ఈ పరిణామాలన్నీ మహిళల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రజల ఓటింగ్ బిహేవియర్‌పై అధ్యయనం చేస్తున్న సంస్థల అంచనా ప్రకారం ఈ రాష్ట్రంలో 70 శాతానికి పైగా మహిళలు వారి సొంత అభిప్రాయాల మేరకే ఓట్లు వేశారు. వీరి ఓటింగ్ ఛాయిస్‌పై భర్తల లేదా కుటుంబ సభ్యుల ప్రభావం లేదు. అంటే దాని అర్థం కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా 70 శాతం మంది ఓటు వేశారని కాదు. ఇందులో దాదాపు 50 శాతం మంది కుటుంబ సభ్యులకు మహిళల అభిప్రాయాలతో ఏకీభావం ఉండవచ్చు. సుమారు 20 శాతం మంది మహిళలు వారి భర్తలు లేదా కుటుంబ సభ్యుల అభిప్రాయాలకు భిన్నంగా, తమకు మేలు చేస్తారని భావించే పార్టీకి ఓటు చేసి ఉంటారని అంచనా.ఎన్నికలకు ముందు ప్రజాభిప్రాయం సేకరించిన ఒపీనియన్ పోల్స్ ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. వాటి సగటును తీసుకుంటే 48 నుంచి 50 శాతం మంది పురుషులూ, 54 నుంచి 56 శాతం మంది మహిళలూ ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేస్తారని ఆ సర్వేలు పేర్కొన్నాయి. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం ఈ అభిప్రాయాలను కొంతమంది పరిశీలకులు మార్చుకున్నారు. 50 శాతానికి పైగా పురుషులు, 60 శాతానికి పైగా మహిళలు వైసీపీకి ఓట్లు వేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. అంటే పోలైన ఓట్లలో 55 నుంచి 56 శాతం. ఈ అంచనాలే నిజమైతే వచ్చే ఫలితాన్ని సునామీగానే పరిగణించవలసి ఉంటుంది.జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల కారణంగా పేద వర్గాల్లోని మహిళల్లో, కష్టజీవుల్లో సింహభాగం ఓట్లు వైసీపీకే పడతాయనే అంచనా ఎన్నికలకు ముందే ఉన్నది. బీజేపీ, జనసేనలను కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకున్న చంద్రబాబు గెలుపుపై భరోసా కోసం కొంతకాలంగా వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిశోర్‌ను సంప్రదిస్తున్నారట! అప్పటికే బాబు కోసం పనిచేస్తున్న రాబిన్‌శర్మతో కలిసి పీకే అందజేసిన తుది నివేదికలో పై అంశం కూడా ప్రస్తావనకొచ్చింది.బలహీనవర్గాలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఓట్లను గణనీయమైన సంఖ్యలో పోలవకుండా చూస్తే తప్ప గెలుపు సాధ్యంకాదని ఈ వ్యూహకర్తలు కుండబద్దలు కొట్టారని సమాచారం. ఈ కార్యక్రమానికే వాళ్లు ‘ఎలక్షనీరింగ్’ అనే ముద్దుపేరు పెట్టుకున్నారు. ఎలక్షనీరింగ్ చేయడానికి ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయగలగాలి. అందుకోసం బీజేపీతో పొత్తు కావాలి. ఎన్నో అవమానాలు భరించి, అడిగినన్ని సీట్లిచ్చి, అందుకోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. షెడ్యూల్ విడుదలైన దగ్గర్నుంచీ మొదలుపెట్టిన ఎలక్షనీరింగ్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నుంచి ఉధృతమైంది. బాబు బంధువైన పురందేశ్వరి రాష్ట్ర బీజేపీకి అధ్యక్షురాలవడంతో ఆరెంజ్ బీజేపీపై యెల్లో బీజేపీదే పైచేయిగా మారింది.బడుగు బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉండే అనేక ప్రాంతాల్లో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల సంఘానికి పురందేశ్వరి అర్జీలు పెట్టేవారు. అంతటితో ఆగకుండా ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో సూచిస్తూ పేర్లను కూడా అందజేశారు. నియమించవలసిన అధికారుల పేర్లను ఒక పార్టీ అధ్యక్షురాలు సూచించడం న భూతో న భవిష్యతి! ఎన్నికల సంఘం కూడా ఆ అర్జీలను సవినయంగా స్వీకరించి శిరసావహించింది. పురందేశ్వరికి ఆ రికమండేషన్లు కరకట్ట ప్యాలెస్ నుంచే అందాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఎలక్షనీరింగ్ ప్రారంభమైంది. పోలింగ్ రోజున ఎంపిక చేసుకున్న ఏరియాల్లోకి తాము కోరుకునే అధికారులు వచ్చారు. వ్యూహకర్తల సూచన మేరకు తెలుగుదేశం అభిమానుల ఓట్లన్నీ తొలి మూడు గంటల్లోనే పోల్ చేసుకోవాలి. ఆ తర్వాత హింసాకాండను మొదలుపెట్టి బడుగు వర్గాల మహిళలు, వృద్ధుల ఓట్లు పోలవకుండా చూడాలి. వారి ఖర్మకాలి పొద్దున ఆరు గంటలకే బలహీనవర్గాల ప్రజలు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడటం మొదలుపెట్టారు. దీంతో విచక్షణ కోల్పోయిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే దాడుల కార్యక్రమాన్ని ప్రారంభించారు.పల్నాడు జిల్లాలోని గణేశునిపాడు గ్రామంలో బీసీలను, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పోలింగ్‌లో పాల్గొనవద్దని ముందురోజే బెదిరించారు. వాళ్లు బెదిరింపులను ఖాతరు చేయకుండా పొద్దున్నే వచ్చి ఓట్లు వేసి వెళ్లారు. దాంతో రెచ్చిపోయిన మూకలు గ్రామంపై దండెత్తి దాడులకు తెగబడ్డారు. అనంతపురం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో ఇలా వీలైన ప్రతిచోట బలహీన వర్గాల ప్రజలను, మైనారిటీలను, ముఖ్యంగా మహిళలను ఓటింగ్‌లో పాల్గొనకుండా చూసేందుకు దాడులకు తెగబడ్డారు. ఉదయంపూటే పోలింగ్ కేంద్రాలకు రాలేకపోయిన మహిళలు సాయంత్రానికల్లా జట్లు జట్లుగా వచ్చి పోలింగ్ కేంద్రం క్యూలైన్లలో రాత్రి పొద్దుపోయే దాకా నిలబడి మరీ ఓట్లు వేశారు. ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా ఎగరేశారు.పెరుగుతున్న మహిళా చైతన్యంపై ఒక రాజకీయ పార్టీ కక్షకట్టడం, వారిని ఓట్లు వేయకుండా చూసేందుకు దాడులకు పూనుకోవడం క్షమించరాని నేరం. ఆడపిల్లలకు ఆస్తిహక్కును కల్పించి, వారి ఉన్నతికి అండగా నిలబడిన ఎన్టీఆర్ సిద్ధాంతాలను చంద్రబాబు సమాధి చేశారు. ఆ పార్టీకి పురుషాధిపత్య స్వభావాన్ని నూరిపోశారు. ఆయనే స్వయంగా పురుషాహంకారపూరితమైన వ్యాఖ్యానాలను పబ్లిగ్గానే చేసేవారు. ‘కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా’ అంటూ మాట్లాడిన తీరును తెలుగు సమాజం ఎలా మరిచిపోగలుగుతుంది? బహిరంగ వేదికల మీద బాబు బావమరిది బాలకృష్ణ మహిళలను కించపరిచిన వైనాన్ని ఎలా క్షమించగలదు? ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మహిళలకు మూడో వంతు సీట్లు రిజర్వు కానున్నాయి. అందుకోసం మహిళా నేతలను ఇప్పటి నుంచే సమాయత్తం చేయవలసిన అవసరం ఉన్నది. వారిలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించవలసిన అవసరం సమాజంపై ఉన్నది. ఇటువంటి కీలక దశలో పురుషాహంకార రాజకీయ పార్టీలు మనుగడ సాగించడం దేశానికి శ్రేయస్కరం కాదు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com
చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్ అనే మహిళ డాన్స్ తెగ వైరల్ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్ హిట్. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్ సావన్ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. అక్కడ సేమ్ చాందినీ సినిమాలోని లొకేషన్ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్ షూట్ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్’లాంటి పాటలకు డాన్స్ చేయడానికి లొకేషన్స్ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!)
Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అంచనాలు తలకిందులు చేస్తూ అద్బుతం చేసింది. ఐపీఎల్-2024 ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇవేనంటూ సాగిన విశ్లేషణలను తలదన్నుతూ విలువైన విజయం సాధించింది.అసలు టాప్-4లో నిలిచే జట్టే కాదంటూ విమర్శించిన వాళ్ల నోళ్లు మూయిస్తూ సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో గెలుపొంది జయభేరి మోగించింది.సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ఆద్యంతం ఆసక్తి రేపిన పోరులో పైచేయి సాధించిన ఆర్సీబీ టోర్నీలో ముందుకు సాగేందుకు అర్హత సాధించింది.కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆటగాళ్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇక బెంగళూరు జట్టు ముఖచిత్రమైన విరాట్ కోహ్లి ఆనందం పట్టలేక కన్నీటి పర్యంతమయ్యాడు. స్టాండ్స్‌లో ఉన్న తన భార్య అనుష్క శర్మను చూస్తూ.. ‘‘సాధించాం’’ అన్నట్లుగా ఉద్వేగానికి లోనయ్యాడు.కోహ్లిని చూస్తూ అనుష్క శర్మ సైతం.. ‘అవును’ అన్నట్లుగా ఆనంద భాష్పాలు రాలుస్తూ భర్తను చీర్ చేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో విరుష్క జోడీని చూస్తూ తాము ఉద్వేగానికి లోనయ్యామంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.ఆరెంజ్ క్యాప్ ఇప్పటికీ కోహ్లిదేకాగా ఈ సీజన్లో కోహ్లి అదరగొట్టినా అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా స్ట్రైక్‌రేటు గురించి సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ అతడిని విమర్శించారు. ఇందుకు కోహ్లి కూడా ధీటుగానే బదులిచ్చాడు.అయినప్పటికీ జట్టు కనీసం ప్లే ఆఫ్స్ కూడా చేరకపోతే ఏమిటన్న బాధ మాత్రం అతడిలో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో శనివారం నాటి విజయంతో కోహ్లి ఇలా ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్లో లీగ్ దశలో 14 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 708 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. చదవండి: RCB Vs CSK: నా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అతడికి అంకితమిస్తున్నా: డుప్లిసిస్Aaarrr Ceeee Beeee ❤️👏6️⃣ in a row for Royal Challengers Bengaluru ❤️They make a thumping entry into the #TATAIPL 2024 Playoffs 👊Scorecard ▶️ https://t.co/7RQR7B2jpC#RCBvCSK | @RCBTweets pic.twitter.com/otq5KjUMXy— IndianPremierLeague (@IPL) May 18, 2024
'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)
తప్పక చదవండి
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్‌బోర్డ్ ప్రయాణం
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
సినిమా
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
'జబర్దస్త్' కమెడియన్‌కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
ఏంటో ఈ మధ్య పవిత్ర అనే పేరున్న వాళ్లకు అస్సలు కలిసి రావట్లేదు. ఈ మధ్య తెలుగు సీరియల్ నటి పవిత్రా జయరాం.. కారు ప్రమాదంలో మరణించింది. ఇప్పుడు అదే పేరున్న మరో నటి కారు ఇలానే యాక్సిడెంట్ అయింది. కాకపోతే ఇక్కడ ఎవరికీ ఏం కాలేదు. ఇది జరిగిన దాదాపు వారం రోజులు పైనే అయింది. ఇప్పుడు తనకు జరిగిన షాకింగ్ యాక్సిడెంట్ గురించి 'జబర్దస్త్' ఫేమ్ పవిత్ర బయటపెట్టింది. ప్రాణాలతో బయటపడ్డామని చెబుతూ ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!)సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించిన పవిత్ర.. 'జబర్దస్త్' షోలో తనదైన కామెడీతో ఆకట్టుకుంటోంది. గత కొన్నేళ్ల నుంచి ఇదే షోలో చేస్తున్న పవిత్ర.. ఏడాదిన్నర క్రితం కారు కూడా కొన్నది. ఇప్పుడు ఆ కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఎన్నికల్లో ఓటు వేసేందుకు పిన్ని, పిల్లలతో కలిసి పవిత్ర సొంతూరు వెళ్లింది. కాకపోతే నెల్లూరు జిల్లాలోని ఉప్పలపాడు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి గోతిలో పడింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చిన్న దెబ్బలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.'మా పిన్ని, ఆమె పిల్లలిద్దరూ ఫస్ట్ టైమ్ నా కారు ఎక్కారు. ఇంకో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాం అనేలోపు ఈ యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వస్తున్న వెహికల్ డ్రైవర్ కన్ఫ్యూజ్ చేయడంతోనే మాకు ఇలా జరిగింది. ఎవ్వరికీ ఎలాంటి దెబ్బలు తగలకపోవడం నాకు కాస్త హ్యాపీగా అనిపించింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లే నాకు దెబ్బలేం తగల్లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత నేను కుదుటపడటానికి రోజంతా పట్టింది. అయితే యాక్సిడెంట్ జరిగినప్పుడు అందరూ నన్ను గుర్తుపట్టారా కానీ ఒక్కరు కూడా సాయం చేయలేదు. వీడియోలు తీశారు. అదొక్కటే నాకు బాధగా అనిపించింది' అని చెబుతూ పవిత్ర ఎమోషనల్ అయింది.(ఇదీ చదవండి: హీరోయిన్ అనుష్క.. ఆ నిర్మాతని పెళ్లి చేసుకోబోతుందా?)
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
హారర్ సినిమాలకు ఓటీటీలో మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు ఎప్పుడెప్పుడు రిలీజవుతాయా? అని ఓటీటీ ప్రియులు ఎదురుచూస్తుంటారు. వీరికోసమే ఈ గుడ్‌న్యూస్. 'ది ఫస్ట్ ఒమెన్' అనే అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.ఒమెన్ ఫ్రాంచైజీలో ఆరో సినిమాఒమెన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ఐదు సినిమాలు వచ్చాయి. ది ఒమెన్(1976), డామెయిన్- ఒమెన్ 2 (1978), ద ఫైనల్ కాన్ఫ్లిక్ట్(1981), ఒమెన్ 4- ద అవేక్నింగ్(1991), ది ఒమెన్(2006) కాగా ఇప్పుడు వచ్చిన ది ఫస్ట్ ఒమెన్(2024) ఆరవది! ఇది 2006లో వచ్చిన ది ఒమెన్ సినిమాకు ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ఆర్కష స్టీవెన్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాఫీక్ బర్హోమ్, సోనియా బ్రాగ, నెల్ టైగర్ ఫ్రీ, బిల్ నైయ్, రాల్ఫ్ ఇనెసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెలన్నర లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 30 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ అధికారికంగా ప్రకటించింది.From service to survival. Brace yourself for a chilling mystery.#TheFirstOmen streaming 30th May on #DisneyPlusHotstar pic.twitter.com/0GTsn66z9O— Disney+ Hotstar (@DisneyPlusHS) May 18, 2024 చదవండి: సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోవాలి.. నటుడి సలహా
In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
చాలామందికి టైమ్ అంటే అస్సలు విలువ ఉండదు. ఈ రోజు పని చేయ్ అంటే రేపు, ఎల్లుండి అని వాయిదాలు వేస్తుంటారు. మరికొందరు మాత్రం రోజుకి 24 గంటలు ఉన్నా సరిపోవట్లేదని బాధపడుతుంటారు. ఒకవేళ ఇలాంటి వాళ్లకు ఎంత కావాలంటే అంత టైమ్ కొనుక్కునే ఛాన్స్ వస్తే.. అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుంది? ఇదేదో విడ్డూరంగా ఉంది కదా! అవును ఓటీటీలో 'ఇన్ టైమ్' (2011) అనే సైన్స్ ఫిక్షన్ మూవీ చూశారంటే ఇలాంటి వింతలు బోలెడు కనిపిస్తాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటి? అంత బాగుంటుందా?అది 2169 సంవత్సరం. ప్రతి ఒక్కరూ చేతికి డిజిటల్ క్లాక్‌తో పుడతుంటారు. ముసలితనం అనేది రాకుండా జెనెటిక్స్‌లో శాస్త్రవేత్తలు మార్పులు చేసుంటారు. దీంతో ప్రతి ఒక్కరి వయసు 25 ఏళ్ల దగ్గరకొచ్చి ఆగిపోతుంది. బతకాలంటే మాత్రం కష్టపడి టైమ్ సంపాదించుకోవాలి. ఆ టైమ్‌తోనే వస్తువులు కొనుక్కోవాలి, అదే టైమ్‌ని ఎక్కడా పోగొట్టుగోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఒకవేళ చేతికున్న టైమ్ జీరో అయిపోతే మాత్రం నొప్పి లేకుండా చచ్చిపోతారు. అలా మురికివాడలో ఉండే హీరో విల్.. ఇదే టైమ్ కారణంగా ఒక్క సెకనులో తల్లిని కోల్పోతాడు. దీంతో పగ పెంచుకుంటాడు. తనకు ఇలాంటి పరిస్థితి కల్పించిన డబ్బునోళ్లపై పగ తీర్చుకుంటాడు? ఇంతకీ ఏం చేశాడు? వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు? అనేదే స్టోరీ.(ఇదీ చదవండి: ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటుంది.. ఓటీటీలో ఈ మలయాళ థ్రిల్లర్ చూశారా?)2011లో రిలీజైన హాలీవుడ్ మూవీ 'ఇన్ టైమ్'. బతకాలంటే టైమ్ కొనుక్కోవాలి, ఆ టైమ్‌తోనే ప్రతిదీ చేసుకోవాలి అనే డిఫరెంట్ కాన్సెప్టుతో తీసిన మూవీ ఇది. విల్ అనే కుర్రాడు తల్లితో కలిసి జీవిస్తుంటాడు. ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని టైమ్ సంపాదిస్తుంటాడు. అలాంటిది ఓ రోజు ఇతడికి ఓ వ్యక్తి 100 సంవత్సరాల్ని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇంకేముంది తల్లితో కలిసి హ్యాపీగా బతికేయొచ్చని అనుకుంటాడు. కానీ ఒక్క సెకను లేట్ కావడంతో తన చేతుల్లోనే తల్లి చనిపోతుంది. దీంతో వేల సంవత్సరాలు దగ్గర పెట్టుకుని దర్జాగా బతికేస్తున్న డబ్బున్నోళ్లపై హీరో పగ పెంచుకుంటాడు.వాళ్ల చోటుకే వెళ్లి వీస్ అనే ధనవంతుడు కూతురిని కిడ్నాప్ చేస్తాడు. ఇతడి ఆలోచనలకు ఫిదా అయిన ఆ అమ్మాయి.. హీరో విల్‌తో కలిసి టైమ్ దొంగిలించడం మొదలుపెడుతుంది. అలా సొంతం చేసుకున్న టైమ్‌ని వీళ్లిద్దరూ కలిసి పేదలకు పంచుతారు. ఇలా కథ సింపుల్‌గా చెప్పాను గానీ సినిమా చూస్తుంటే మీకు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం బోర్ కొట్టకుండా దాదాపు 100 నిమిషాల పాటు ఎంటర్టైన్ చేస్తుంది. మనుషులకు టైమ్ విలువ తెలిస్తే అది వృథా కాకుండా కాపాడుకోవడానికి ఎంత విలువ ఇస్తారో తెలియజేసే 'ఇన్ టైమ్' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. 'టైమ్' ఉంటే దీనిపై ఓ లుక్కేయండి. మిమ్మల్ని అయితే అస్సలు డిసప్పాయింట్ చేయదు.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
ఫొటోలు
సుడిగాలి సుధీర్ బర్త్‌డే.. రష్మిగౌతమ్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
రెడ్ కార్పెట్‌పై తెలుగందం.. చూడటానికి రెండు కళ్లు చాలట్లేదు! (ఫోటోలు)
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు..లావణ్య త్రిపాఠి ఫోటోలు వైరల్
క్రీడలు
యశ్ దయాల్‌పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
ఐపీఎల్-2024లో ప్లే ఆఫ్స్ చివరి బెర్తును ఖరారు చేసే పోటీలో చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నువ్వా- నేనా అన్నట్లుగా తలపడ్డాయి. వర్షం రాకతో ఆరంభం నుంచే ఆసక్తి రేపుతూ.. హోరీహోరీగా సాగిన ఈ పోరులో ఎట్టకేలకు ఆర్సీబీదే పైచేయి అయింది.ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్ సత్తా చాటి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. సమిష్టి ప్రదర్శనతో చెన్నైకి చెక్ పెట్టి టాప్-4కు అర్హత సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు ఓవర్ల పాటు ఆర్సీబీ బ్యాటింగ్ పూర్తైన తరుణంలో వరణుడి రాక అభిమానులను కలవరపెట్టింది. అయితే, కాసేపటికే మ్యాచ్ తిరిగి ఆరంభమైంది. ఈ క్రమంలో ఓపెనర్లు విరాట్ కోహ్లి(47), ఫాఫ్ డుప్లెసిస్(54).. వన్‌డౌన్ బ్యాటర్ రజత్ పాటిదార్(41) రాణించారు.వీరికి తోడు నాలుగో నంబర్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్ ధనాధన్ ఇన్నింగ్స్(17 బంతుల్లో 38 నాటౌట్)తో చెలరేగాడు. మిగతా వాళ్లలో దినేశ్ కార్తిక్ 14, మాక్స్వెల్(16) ఫర్వాలేదనిపించారు. ఈ క్రమంలో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులు చేసింది.చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే ఆరంభంలోనే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర(61) రాణించగా.. అజింక్య రహానే(33) అతడికి సహకరించాడు.రవీంద్ర జడేజా సైతం 22 బంతుల్లో 42 పరుగులతో దుమ్ములేపాడు. మహేంద్ర సింగ్ ధోని కూడా మెరుపులు(13 బంతుల్లో 25) మెరిపించాడు. కానీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా సీఎస్కే బ్యాటర్లు చేతులెత్తేశారు.కాగా అనూహ్య రీతిలో చివరి ఓవర్లో ఆర్సీబీ సారథి డుప్లెసిస్ బంతిని యశ్ దయాల్ చేతికి ఇచ్చాడు.అతడి బౌలింగ్‌లో తొలి బంతికే ధోని సిక్సర్ బాది ఆశలు రేకెత్తించాడు. సమీకరణం 5 బంతుల్లో 11 పరుగులుగా మారింది.దయాల్ అప్పటికే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లి అతడికి దగ్గరికి దిశా నిర్దేశం చేశాడు. ధోని లాంటి లెజెండ్ క్రీజులో ఉన్నపుడు యార్కర్ కాదు స్లో బాల్ వేయాలంటూ కాస్త గట్టిగానే హెచ్చరించాడు.దీంతో యశ్ దయాల్ ధోనికి స్లో బాల్ సంధించగా.. ట్రాప్‌లో చిక్కుకున్న తలా స్వప్నిల్ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఆర్సీబీ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఇక మిగిలిన నాలుగు బంతుల్లో సీఎస్కే కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించడంతో.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరింది.అలా కోహ్లి దెబ్బకు సెట్ అయిన యశ్ దయాల్ కీలక వికెట్ తీసి ఆర్సీబీ గెలుపునకు ప్రధాన కారణమయ్యాడు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆద్యంతం కీలక సమయంలో ఆటగాళ్లకు సూచనలు ఇస్తూ సానుకూల ఫలితాలు రాబట్టడం విశేషం. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఫాఫ్ డుప్లెసిస్ తన అవార్డును యశ్ దయాల్‌కు అంకితమివ్వడం మరో విశేషం. Nail-biting overs like these 📈Describe your final over emotions with an emoji 🔽Recap the match on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvCSK pic.twitter.com/XYVYvXfton— IndianPremierLeague (@IPL) May 18, 2024pic.twitter.com/xgmfhb0Fri— The Game Changer (@TheGame_26) May 19, 2024
RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్-2024 టైటిల్ సాధించిందా? అన్నంతగా సంబరాలు..ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్ క్రాకర్స్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్.. అంత ప్రత్యేకమాఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్ లీగ్ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్ టీమ్ కప్ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో పరాజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది.ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్ కోహ్లి రాణించినా గ్లెన్ మాక్స్వెల్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అంచనాలు అందుకోలేకపోయారు.మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగాఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్ కింగ్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని విజయం సాధించింది. రిపీట్ అవుతుందా?సీఎస్కేపై గెలిచినా నెట్ రన్‌రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా 2016 ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.ఆర్సీబీ వర్సెస్ చెన్నై స్కోర్లు👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు👉టాస్: చెన్నై.. బౌలింగ్👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)👉చెన్నై స్కోరు: 191/7 (20)👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్‌లో ఎంట్రీ👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫాప్ డుప్లెసిస్(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్‌లు).చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్ Winning celebration of RCB in North America right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/2M2FipXGYX— Kohlified. (@123perthclassic) May 19, 2024Winning celebration of RCB near Trump building Chicago. right now🔥🔥.Bigger than any franchise.RCB , RCB , RCB . pic.twitter.com/dy1Oko6QS7— #RCBNation (@9Sxventy3) May 19, 2024Bengaluru won't sleep tonight 😎RCB RCB all over the city @RCBTweets ❤️🔥pic.twitter.com/6jvvAAVERT— M. (@RCB_Hiv3) May 18, 2024Hear the Roar, Hear "Kohli, Kohli & RCB, RCB" Chants when they qualify for playoffs.- King Kohli & RCB are emotions..!!!! pic.twitter.com/Afqck4jNSH— Tanuj Singh (@ImTanujSingh) May 18, 2024📽️ RAW Reactions post a surreal win ❤️When emotions spoke louder than words at Chinnaswamy 🏟️A special lap of honour for the @RCBTweets fans that continue to believe in their side 👏👏#TATAIPL | #RCBvCSK pic.twitter.com/CrBQUBRKEI— IndianPremierLeague (@IPL) May 19, 2024
RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
#RCB Vs CSK ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండుగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంటర్స్(#RCB) అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరగని రీతిలో ఐపీఎల్-17లో ప్లే ఆఫ్ల్స్కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చైన్నె సూపర్ కింగ్స్‌కు షాకిస్తూ మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్‌లో సీఎక్కేపై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లిసిస్కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా డూప్లిసిస్ మాట్లాడుతూ.. బెంగళూరులో ఈ సీజన్‌ను ముగించడం చాలా ఆనందనిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్‌కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ యశ్ దయాల్‌కు అంకితమిస్తున్నాను. యశ్ బౌలింగ్ చేసిన విధానం చాలా బాగుంది. అతడి వల్లే మ్యాచ్ గెలిచాం. అందుకే తనకు అవార్డ్‌ను అంకితమిస్తున్నా. THE WINNING CELEBRATION FROM RCB. 🫡❤️- RCB into the Playoffs after having 1 win out of first 8 matches. 🤯🔥pic.twitter.com/LPFjay2A7C— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 ఇలాంటి పిచ్‌పై పరుగులు చేయడం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. మా బౌలర్లు కూడా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని పరుగులు చేయకుండా ఆపగలిగారు. ఈ క్రెడిట్ అంతా మా బౌలర్లదే. ఇక, మా జట్టు ఓడినా.. గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెబుతున్నాను. ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. THE GREATEST COMEBACK IN IPL HISTORY. 🏆- RCB qualified for Playoffs after losing 6 consecutive matches. 🤯pic.twitter.com/eIe6J7Iqhh— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024 అదరగొట్టిన ఆర్సీబీ బ్యాటర్స్..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డుప్లెసిస్ (54), కోహ్లి (47), రజత్ పటీదార్ (41), గ్రీన్ (38) చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్‌లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఔటయ్యాడు. ఇక, మూడో ఓవర్లో మిచెల్ (4) కూడా నిష్క్రమించాడు. దీంతో, 19/2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్, రహానె (33) నిలబడడంతో కాసేపు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85/2 స్కోర్‌తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గూసన్.. రహానెను ఔట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్‌తో పాటు దూబె, శాంట్నర్ ఔట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129/6తో నిలిచింది. గెలవాలంటే ఐదు ఓవర్లలో 90 పరుగులు పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్‌కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన స్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి రెండు ఓవర్లలో ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం 35 (విజయం కోసం కావాల్సింది 53) పరుగులు చేయాలి. ఫెర్గూసన్ వేసిన ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి.. 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ (యశ్ దయాళ్) తొలి బంతికే ధోని సిక్స్ బాదడంతో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండో బంతికి ధోనీని ఔట్ చేశాడు. ఆ తర్వాతి నాలుగు బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మరిచిపోలేని విజయాన్ని అందించాడు.
నిఖత్ జరీన్‌కు స్వర్ణం
అస్తానా (కజకిస్తాన్): ప్రపంచ చాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎల్డోరా కప్ టోర్నమెంట్లో నిఖత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్‌కు చెందిన జజీరా ఉరక్‌బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించింది. అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి.
బిజినెస్
భారత్‌లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
భారత్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీని బట్టి పాలసీని రూపొందించలేదని, అన్నీ ఈవీ కంపెనీలకు ఒకేరకమైన పాలసీ ఉంటుందంటూ నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అమితాబ్ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీపై అమితాబ్ కాంత్ ఓ కార్యక్రమంలో పరోక్షంగా స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పాలసీలు అన్ని కంపెనీలు ఆ విధానాన్ని మాత్రమే అనుసరించాలని అమితాబ్ కాంత్ చెప్పారు. కొన్ని నిర్దిష్ట కంపెనీల ప్రకారం భారత్ తన ఈవీ పాలసీ విధానాన్ని మార్చదని స్పష్టం చేశారు. అంతేకాదు టెస్లా సంస్థ తమకు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచి ఉండొచ్చు. భారత్‌లో ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ప్రభుత్వం ఈవీ పాలసీని ప్రవేశ పెట్టిందని అన్నారు. భారత్‌లో కనీసం రూ.4150 కోట్ల పెట్టుబడి పెట్టే ఈవీ సంస్థలకు రాయితీలు అందిస్తామని కేంద్రం తెలిపింది. పాలసీ ప్రకారం దేశంలో ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలి. లేదంటే దేశీయంగా తయారయ్యే విడిభాగాలను కనీసం 25శాతం వినియోగించాలి. ఐదేండ్ల తర్వాత ఆ మొత్తం వినియోగాన్ని 50 శాతానికి పెంచాలి అని ఈవీ పాలసీలో పేర్కొంది.కొత్త విధానం ప్రకారం, భారతదేశంలో ఈవీ ప్యాసింజర్ కార్ల తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లు, అంతకంటే ఎక్కువ ధర కలిగిన వాహనాలపై 15 శాతం తక్కువ కస్టమ్స్/దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంది.
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్.. టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీని భారత్‌లో విడుదల చేసింది. రెండు స్మార్ట్ఫోన్లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్ 30 ప్రో 5జీ, క్యామన్ 30 ప్రీమియర్ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్ 30 5జీ 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉందిక్యామన్ 30 ప్రీమియర్ 5జీ 12 జీబీ ర్యామ్,512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. టెక్నో క్యామన్ 30 5జీ స్పెసిఫికేషన్స్:టెక్నో క్యామన్ 30 5జీ 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్‌జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్ జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 7020 చిప్సెట్, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, 10డబ్ల్యూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.
లోక్‌సభ ఎలక్షన్స్.. రతన్ టాటా సందేశం
భారతదేశంలో ఇప్పటికే నాలుగు దశల్లో వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ తరుణంలో దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓటర్లను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు.మే 20న ముంబైలో (ఫేజ్ 5) ఓటింగ్ జరగనుంది. ముంబై వాసులందరూ బయటకు వెళ్లి బాధ్యతాయుతంగా ఓటు వేయాలని నేను కోరుతున్నాను.. అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ.. తప్పకుండా ఓటు వేస్తామన్నట్లు చెబుతున్నారు.ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ముంబై సిటీ, ముంబై సబర్బన్‌లోని ఆరు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెల్లడవుతాయి.Monday is voting day in Mumbai. I urge all Mumbaikars to go out and vote responsibly.— Ratan N. Tata (@RNTata2000) May 18, 2024
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా: '3 ఇడియట్స్' సీన్‌తో..
ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) యుగంలో భారతీయ ఇంజనీర్లకు సలహాలు ఇచ్చారు. టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.ఫేస్బుక్, యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ (FAANG) వంటి సంస్థల్లో ఇంటర్వ్యూల్లో ఎలా విజయం సాధించాలో వివరిస్తూ.. రోట్ లెర్నింగ్ గురించి వివరించారు. ఒక విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా.. బట్టీ పడితే ఉపయోగం లేదని అన్నారు. కాబట్టి సాఫ్ట్వేర్ ఇంజినీర్స్ తప్పకుండా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని అన్నారు.దీనికి ఉదాహరణగా 3 ఇడియట్స్ సినిమా గురించి వివరించారు. ఈ సినిమాలో మోటార్ ఎలా పనిచేస్తుంది అనే ప్రశ్నకు ఓ విద్యార్ధి బట్టీ పట్టిన సమాధానం చెబుతాడు. ఆ పద్దతి సరైనది కాదని వివరించారు. ఒక వ్యక్తి ఎంత స్మార్ట్ అయినప్పటికీ.. ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టడంలో విఫలమవుతున్నారని ఆయన అన్నారు.
వీడియోలు
ఏజన్సీలో డయేరియా ఇద్దరు మృతి
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
టీడీపీపై బొత్స సెటైర్లు
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
కేబినెట్ భేటీ వాయిదా.. కారణం ఇదే..
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
ఫ్యామిలీ
మిణుగురుల్లా మిలమిలలాడే పూల మొక్కలు!
పూలు ఘుమఘుమలాడటం సహజం. మరి పూలకు మిలమిలలు ఎక్కడివని కోప్పడిపోకండి. రాత్రివేళ మిణుగురుల్లా మిలమిల మెరిసే పూలను ఒక శాస్త్రవేత్త సృష్టించాడు. అమెరికా ప్రాంతాల్లో విరివిగా కనిపించే పిటూనియా మొక్కలకు జన్యుమార్పిడి చేసి, పిటూనియా పూలు మిణుగురుల్లా మిలమిలలాడేలా చేశాడు.అమెరికన్ కంపెనీ ‘లైట్ బయో’లో పనిచేస్తున్న డాక్టర్ కీత్ వుడ్ అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని సాధించాడు. మాలిక్యులర్ అండ్ కెమికల్ బయాలజీలో విస్తృత పరిశోధనలు సాగిస్తున్న డాక్టర్ కీత్ వుడ్, తొలుత పొగాకు మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టాడు. పొగాకు మొక్క చిన్నది కావడంతో ఆ ప్రయోగం విజయవంతం కాలేదు. తర్వాత పీటూనియా మొక్కల్లోకి మిణుగురుల జన్యువును ప్రవేశపెట్టి, అద్భుత ఫలితాలను సాధించాడు. పీటూనియా మొక్క ఎదిగిన తర్వాత దానికి పూసే పూలు రాత్రివేళ అచ్చంగా మిణుగురుల్లా మిలమిలలాడుతూ కనిపించాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘లైట్ బయో’ కంపెనీ పెరటి తోటల్లో పెంచుకునేందుకు వీలుగా రాత్రివేళ మిలమిల వెలుగులు వెదజల్లే పీటూనియా మొక్కలకు ‘ఫైర్ ఫ్లై పీటూనియా’గా నామకరణం చేసి, వాటిని అమ్మడం ప్రారంభించింది. అమెరికన్ జనాలు ఈ మిణుగురు పూలమొక్కలను ఎగబడి మరీ కొంటున్నారు. (చదవండి: చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!)
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
వేసవి అంటే వేడి.. ఉక్కపోత.. పచ్చళ్లు.. అప్పడాలు, వడియాలు, మల్లెపూలు, మామిడిపళ్లు! కానీ తూనీగల్లాంటి పిల్లలకు మాత్రం వేసవంటే అచ్చంగా సెలవులడ్లు.. స్కూలు, హోమ్‌వర్క్, క్రమశిక్షణ నుంచి కొంతకాలం ఆటవిడుపు. ఇంతకాలం వారంలో వచ్చే ఒక ఆదివారం లేదా రెండవ శనివారంతో కలసి వచ్చే రెండురోజుల సెలవులతో సరిపెట్టుకున్న పిల్లలకు దాదాపు నలభై అయిదు రోజుల సెలవులు ఎంత సంబరం కలిగించే విషయమో కదా!. సెలవల్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఎండా తప్పించుకోవచ్చు. మన విలువైన సెలవుల కాలాన్ని సద్వినియోగమూ చేసుకోవచ్చు. అందుకే ఈ సెలవుల్ని మరుసటి ఏడాదికి ఒక మరపురాని జ్ఞాపకంగా, మళ్లీ రొటీన్లో పడేందుకు ఒక రీచార్జ్‌గా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.సుమారు ఇరవై ముప్పై ఏళ్ల కిందటి వరకు ‘వేసవి సెలవులు’ ఎంత గొప్పగా ఉండేవనీ! పిల్లలూ పెద్దలూ కూడా వేయికళ్లతో ఎదురు చూసేలా ఉండేవి. ఎండాకాలం సెలవుల్లో గ్రామీణ ప్రాంతం వారు పట్టణాలకు, పట్టణాల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మమ్మ, నాయనమ్మలు ఇతర బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. ఇందులో భాగంగా రకరకాల శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఆయా ప్రాంతాల పద్ధతులు, అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునే వీలుంటుంది. దాని ద్వారా పిల్లల్లో అనుభవ జ్ఞానం కలుగుతుంది. వీటన్నింటినీ ఆనాటి పిల్లలు ఎటువంటి నిర్బంధమూ లేని స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో హాయిగా ఆస్వాదించేవారు. ఆటపాటల విషయంలో కూడా నాటి వేసవి సెలవుల తీరే వేరు. ఊరి చివరి చెరువులు, బావుల్లో ఈత కొట్టడం, కోతికొమ్మచ్చి ఆడటం, సీమ చింతకాయలు, బాదం కాయలు ఏరుకుని తినడం, మామిడి తోటలలో చెట్లకు కాసిన కాయలకు రాళ్లేసి కొట్టడం, రాలిన కాయలను కోసుకుని ఉప్పూకారం అద్దుకుని తినడం, తాటిముంజెలను జుర్రడం, ఆనక ఆ తాటిబుర్రలను బండిలా తయారు చేసుకుని ఈడ్చుకుంటూ వీధుల వెంబడి తిర గడం.. ఇవిగాక ఆరుబయట కబడ్డీ, క్రికెట్, నేలా బండాలాంటి ఆటలు హాయిగా ఆడుకోవడం. వీటన్నింటి వల్లా మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి శారీరక వ్యాయామమూ లభించేది. దాంతో కరకరలాడే ఆకలి పుట్టి, చద్దన్నాలనీ, చింతకాయపచ్చళ్లనీ చూడకుండా పెద్దవాళ్లు పెట్టినదంతా వద్దనకుండా కడుపునిండా తిని సెలవులు అయిపోయి తిరిగి స్కూళ్లు, కాలేజీలు తెరిచేసరికి నిగనిగలాడుతూ నున్నగా తయారయేవాళ్లు. ఆటలేగాక ఆయా కాలాలలో లభించే మామిడి, పనస, ఈత, జామ వంటి పళ్లు స్వయంగా సేకరించుకుని అందరూ కలసి కాకెంగిలి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తినడంలో కూడా చెప్పలేని అనుభూతి, ఆనంద ఆరోగ్యాలు సొంతమయ్యేవి.ఇక రాత్రివేళ ఆరుబయట అందరూ కూర్చుని రోజంతా చేసిన అల్లరిపనులు నెమరువేసుకుంటూ కలసి అన్నాలు తినడం, ఆ తరువాత డాబాల మీదనో ఆరు బయట మంచాల మీదో పిల్లలంతా కబుర్లాడుకోవడంతో పాటు తాతయ్యలు, మావయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు. నాటి పిల్లలు భేదాభిప్రాయాలు, అరమరికలూ లేకుండా కలసిమెలసి ఉండేవారు. ఒకవేళ ఏమన్నా చిన్నా చితకా తేడాలు, మాట పట్టింపుల్లాంటివి వచ్చినా పెద్దలు వెంటనే బుజ్జగించి బుద్ధి చెప్పేవారు. ఆచరణతో జీవించే నాటి తరం పెద్దలంటే పిల్లలకు భయంతో కూడిన గౌరవం ఉండేది. ఒక చక్కని దృక్పథంతో భయభక్తులతో ‘పరిధులు గల స్వేచ్ఛ’తో పరమానంద భరితమైన బాల్యం అనుభవించేవారు ఆనాటి పిల్లలు. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి వేసవి సెలవులు కేవలం ‘ఆటవిడుపు వినోదాలకే’ కాకుండా విలువైన నైతిక భావాలు నింపే రోజులుగా కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు..?ఇప్పుడు నానమ్మలు, అమ్మమ్మలు, ఇతర పెద్దలూ దాదాపు కనిపించడం లేదు. అన్నిచోట్లా దాదాపు న్యూక్లియర్ కుటుంబాలే! పిల్లలకు సుద్దులు చెప్పవలసిన తాతలూ, బామ్మలూ వంటి పెద్దలు వృద్ధాశ్రమాలలో మూలుగుతున్నారు. ఈ పరిస్థితులలో వాళ్లకు కథలూ కాకరకాయలూ చెప్పేవారే ఉండరు కాబట్టి, కనీసం వాళ్లు ఆడియో కథలైనా వినేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కథలు చక్కటి ఊహాకల్పనకు, తద్వారా సృజనకు ప్రాణం పోస్తాయి. ఎందుకూ పనికిరారనుకున్న రాజుగారి కుమారులు విష్ణుశర్మ చెప్పిన పంచతంత్ర కథల ద్వారానే ప్రయోజకులయ్యారని మనం చదువుకున్నాం. అందువల్ల వీలయినంత వరకు ఏదో ఒకలా వారి చేత పుస్తకాలు చదివించడం లేదా కథలు వినేలా చేయడం మంచిది. పిల్లలూ.. ఊరికెళుతున్నారా? వేసవైతే పల్లెకు వెళ్తుంటారు చాలామంది. సాధారణంగా పల్లెటూరి వాతావరణానికి, పట్నాలు, నగరాల వాతావరణం, జీవనశైలికీ చాలా తేడా ఉంటుంది. పట్టణాలూ, నగరాలూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగానే నిద్ర లేస్తుంటాయి. గ్రామీణ వాతావరణం మాత్రం అందుకు విరుద్ధం. రాత్రిపూట తొందరగా పడుకుని, తెల్లవారు ఝాముకల్లా నిద్రలేచి.. పొలం పనులు, ఇంటిపనులు చేసుకుంటారు. మీరు పల్లెటూళ్లకు వెళితే అక్కడా బద్ధకంగా బారెడు పొద్దెక్కాక లేవద్దు. వీలయినంత తొందరగా నిద్రలేవండి. పొలం పనులకు పెద్దలు వెళ్తుంటారు కదా. వారితోబాటు మీరూ వెళ్లండి. వాళ్లు చేసే పనులు శ్రద్ధగా చూడండి. దుక్కి దున్నడం, పొలాలకు నీళ్లు పట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులనూ గమనించండి. మీరు వెళ్లే దారిలో ఏయే పంటలున్నాయో, మొక్కలున్నాయో, చెట్లున్నాయో.. ఏ పంటకు ఎంతకాలం పడుతుందో, ఏ మొక్కకు ఏయే పూలూ, పండ్లు వస్తాయో తెలుసుకోండి.చెట్ల ఆకులను, కొమ్మలను పరిశీలించండి. వాటి పై ఏయే పక్షులున్నాయో చూడండి. వాటి కూతలను అనుకరించండి. మీరు చూసిన వాటి వివరాలన్నీ ఇంటికొచ్చాక ఒక డైరీలోనో, నోట్బుక్లోనో రాయండి. పక్షి రెక్కలెలా ఉన్నాయో, ఏయే రంగులలో ఉన్నాయో రాసుకోండి, వీలయితే వాటి బొమ్మలనూ వేయండి. చెట్ల పేర్లు, వాటి ఆకుల ఆకారం, వాటి సైజు వివరంగా రాయండి.ఇంట్లో పనులను, వంట చేసే పద్ధతిని గమనించండి. మీ సందేహాలను పెద్దవాళ్లనడిగి తీర్చుకోండి. ఆ వివరాలన్నీ నోట్ చేసుకోండి. పెద్దల సమక్షంలో ఆ పనులన్నింటినీ ప్రయత్నించండి. అన్నం తిన్న తరువాత కాసేపు పడుకుని సాయంత్రం బయటికెళ్లి కొత్త స్నేహాలను కలుపుకోండి. కొత్త కొత్త ఆటలను నేర్చుకోండి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తమామల చేత కథలు చెప్పించుకుని వినండి. పాటలు పాడే వాళ్ళను పాడమనండి. వాటన్నింటినీ నేర్చుకోండి. అన్నీ పుస్తకంలోకి ఎక్కించడం మాత్రం మరవకండి. మిగిలిన సమయాల్లో దొరికిన పుస్తకమల్లా చదవండి. మీ తోటివాళ్లతో మీరు చూసిన సినిమా, ఊళ్ళ విశేషాలను పంచుకోండి. వాళ్ళ విషయాలనూ అడిగి తెలుసుకోండి. దూరంగా ఉన్న స్నేహితులకి ఈ విషయాలతో ఉత్తరాలు రాయండి. మీరు చదివిన, విన్న కథలను, అలాగే సినిమాలనూ ఇతరులకు చెప్పండి. సొంత భాషలో వాటిని తిరిగి రాయండి. అలా చేస్తే మీరు విన్న, కన్న విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా విషయాలను చెప్పడం అలవడు తుంది. భాష, భావప్రకటనల మీద పట్టు వస్తుంది. ఆసక్తి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. బొమ్మలు వేయగలిగిన వాళ్ళు.. సెలవుల్లో చూసిన విశేషాలను బొమ్మలుగా వేయండి, కథలు రాయండి.పెద్దలూ.. ఇలా చేయండి!బోధనా మాధ్యమాలు మాతృభాషేతరం కావడం వల్ల పిల్లలు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన ‘అమ్మ భాషలోని బాల సాహిత్య’ సొగసులను ప్రత్యక్షంగా అందుకోలేక ఎంతో నష్టపోతున్నారు. విలువైన చదువులు విద్యార్థులకు సార్థకత చేకూర్చాలంటే చదువు అనే ప్రధాన పంటలో అంతర్గత పంటగా ఉండాల్సిన ‘నైతిక విద్యా విలువలు’ భావిపౌరులకు అత్యవసరంగా అందించాలి. అందులో ప్రధానం పుస్తక పఠనం. దాన్ని అలవర్చడానికి వేసవి సెలవులను మించిన వేదిక లేదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ల ఆత్మకథలు, నీతి కథలు వంటివి పిల్లల చేత చదివించండి. వాళ్లు ఏం అర్థం చేసుకున్నారో సమీక్షలు రాయమనండి. లేదంటే వినిపించమనండి. అలా వినిపిస్తున్నప్పుడు వాటిని రికార్డ్ చేసి ఒక పాడ్‌కాస్ట్ చానెల్‌ను క్రియేట్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్న వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. తద్వారా వచ్చిన ప్రశంసలు పిల్లల్లో కొత్త ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. వాళ్ల ఆలోచనా శక్తి, ఊహాశక్తి మెరుగవుతుంది. సైన్స్ మీద ఆసక్తి ఉన్న పిల్లల చేత సైన్స్ ప్రయోగాలు చేయించండి. తెలుగు, ఇంగ్లిష్ భాషల పదసంపదను పెంచుకునేలా వాళ్ల చేత పజిళ్లు నింపించండి. తార్కిక జ్ఞానం కోసం సుడోకు లాంటివి పూర్తి చేయించండి. పర్యావరణ స్పృహ కోసం వాళ్లు ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడండి. జంతువులతో పక్షులతో సమయాన్ని గడిపేలా ప్లాన్ చేయండి. టెర్రస్ మీద లేదా పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు, పూలమొక్కల పెంపకం వంటి విషయాల్లో మెలకువలు నేర్పించండి. అలాగే పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే సమయం వేసవి సెలవులే! సంగీతం, డాన్స్, పెయింటింగ్, డ్రాయింగ్ నేర్పించడం, కుట్లు, అల్లికలు, కాగితాలతో బొమ్మల తయారీ(ఓరిగామి), ఎండిన ఆకులు, క్లాత్‌తో బొమ్మలు చేయించండి. వీటివల్ల పిల్లల్లో సృజనతోపాటు మానసిక వికాసం కలుగుతుంది.ప్రాక్టికల్‌గా జీవించడంజీవితంలో ఎదగడానికి చదువు ఒక ఆసరా మాత్రమే! దాంతోపాటు తెలుసుకోవలసిన ప్రాక్టికల్ పాఠాలు చాలా ఉంటాయి. 13 ఏళ్లు నిండిన పిల్లలు తమ చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను తెలుసుకునేందుకు అర్హులు అవుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి వాళ్లకు చెప్పవచ్చు. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో చెప్పాలి. డబ్బు విలువ, పొదుపు అవసరాల గురించి తెలియజేయాలి. ఆర్థిక లావాదేవీలను ఆధునిక టెక్నాలజీ ఎంత మేడ్ ఈజీ చేసినా బ్యాంకు, దాని పనితీరు గురించి పిల్లలకు ప్రాక్టికల్‌గా చూపించాలి. అందుకే బ్యాంకుకు వెళ్లేటప్పుడు పిల్లలనూ తీసుకెళ్లాలి. అక్కడ డబ్బు ఎలా డిపాజిట్ చేస్తారు, ఎలా విత్ డ్రా చేస్తారు. చెక్ బుక్ అంటే ఏంటి, డీడీ ఎలా తీస్తారు.. వంటి ప్రాథమికాంశాలను చూపించాలి. పిల్లల పేరిట ఇచ్చే బ్యాంక్ అకౌంట్స్ వివరాలను తెలుసుకుని వాటిని ఓపెన్ చేయించి, ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే మంచిది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్‌బ్యాంక్ తర్వాత తిరిగి ఆ స్థాయిలో సేవలు అందిస్తున్నది పోస్టాఫీసులే! కాబట్టి పిల్లలను పోస్టాఫీసుకూ తీసుకువెళ్లి అక్కడి పని విధానంపైనా అవగాహన కలిగించాలి. అలాగే పోస్టాఫీసులో ఉండే పొదుపు పథకాల గురించి తెలియజెబుతూ వారికి అక్కడ పొదుపు ఖాతా తెరిచి, వారంతట వారే తమ పాకెట్ మనీని తమ ఖాతాలో జమ చేసుకునేలా చేయాలి.అన్ని పనులూ.. అందరికీఇంకో విషయం.. పిల్లలకు ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఇంటి పని, వంటపని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే! వారిని గారాబం చేయడంతోపాటు పనులపై అవగాహన కూడా కలిగించడం అవసరం. తద్వారా భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా ఏ పని కోసమూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా చేసుకోగలుగుతారు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆటవిడుపుపిల్లలు ఎంత ఆడుకుంటే అంత ఉల్లాసం కలుగుతుంది. అందుకే వారిని బాగా ఆడుకునేలా చేయాలి. ఇండోర్ గేమ్స్ ద్వారా కేవలం మాన సికోల్లాసమే కలిగితే, ఔట్‌డోర్ గేమ్స్ వల్ల శారీరక ఉల్లాసం కూడా చేకూరుతుంది. ఆటలాడిన పిల్లలు మంచి తిండి తిని బలంగా తయారవుతారు. శారీరక బలం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చెట్టుకు చెంబుడు నీళ్లు.. పిట్టకు చారెడు గింజలుపిల్లలకు భూతదయ అంటే ఏమిటో తెలియజెప్పాలి. ఎండుతున్న చెట్లకు కాసిని నీళ్లు పోయడం, ఆహారం, నీళ్లు సంపాదించుకునే ఓపిక లేక రెక్కలు వేలాడేసి ప్రాణాలు కోల్పోయే అల్ప జీవుల కోసం కాసిని గింజలూ, నీళ్లూ అందించేలా అలవాటు చేయడం వల్ల వారిలో హెల్పింగ్ నేచర్ పెరుగుతుంది. ఫ్యామిలీ బడ్జెట్‌పై అవగాహనపిల్లలకు కుటుంబ ఖర్చుల విషయం తెలియడం ఇష్టపడరు చాలామంది తల్లిదండ్రులు. ఆర్థికంగా తమకు ఎంత కష్టం ఉన్నా, దానిని పిల్లలకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు. దానివల్ల భవిష్యత్తులో తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల కుటుంబ అవసరాలకు ఎంత ఖర్చవుతుంది, తమకు ఎంత ఆదాయం వస్తుంది అనే రెండు అంశాలనూ బేరీజు వేసుకుని దానిని సమతుల్యం చేయడం ఎలాగో వారికి నేర్పించాలి. అందుకు ఈ వేసవి సెలవులనే ఆసరా చేసుకోవడం బెటర్. నేటి వేసవి ‘శిక్ష’ణ కార్యక్రమాలుకాలంతో పాటు వస్తున్న మార్పుల్లో భాగంగా గత పదేళ్లుగా వేసవి సెలవుల్లోనూ మార్పులొచ్చి పడ్డాయి. లక్షణాలతోపాటు లక్ష్యాలు మారిపోతున్నాయి. అప్పట్లో వేసవి సెలవులు పిల్లలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నీ ఇస్తే ఇటీవలి కాలంలో వస్తున్న వేసవి సెలవులు మొక్కుబడి ‘శిక్ష’ణల సెలవులుగా తయారయ్యి ‘సమ్మర్ కోచింగ్’ పేరుతో వేసవి సెలవులు సైతం పాఠశాలల పనిదినాలను తలపింపజేస్తున్నాయి.పిల్లల అభిప్రాయాలను, ఆకాంక్షలనూ ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఆలోచనా విధానాన్ని, ఆకాంక్షలను, పిల్లల బంగారు బాల్యానికి బలంగా రుద్ది, ‘వేసవి శిక్ష’ణా కార్యక్రమాలకు అంకితం చేసేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. దాంతో పిల్లలు యాంత్రిక జీవనవిధానానికి అలవాటు పడి, సెలవులను కూడా క్షణం తీరికలేకుండా గడపవలసి వస్తోంది. సమ్మర్ కోచింగ్ పేరుతో ఏమాత్రం శారీరక శ్రమలేని ఆటలు, కేవలం ఇళ్లకే పరిమితమైన, బుర్రలు వేడెక్కే కంప్యూటర్ గేమ్స్.. అవి కూడా వినోదం కోసం కాక పరీక్షల్లో మార్కుల గుడ్లు పెట్టేందుకు మాత్రమే పనికి వచ్చేలా ఉంటున్నాయి. ఫలితంగా ఆటల ద్వారా రావాల్సిన ఐక్యతాభావం స్థానంలో గెలుపే లక్ష్యం అన్న అనారోగ్యకరమైన పోటీ కనిపిస్తోంది. దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే! పిల్లల బాల్యాన్ని లాగేసుకునే హక్కు ఎవరికీ లేదు, ఉండదు. ఎలా ఉండాలో... ఎలా ఉండకూడదో నేర్పించాలిఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడంతో పాటు సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా పిల్లలకు అవగాహన కలిగించాలి. పిల్లలు విద్యాపరంగా అత్యున్నత స్థాయిలో ఉండాలి అని ఎలా అశిస్తున్నారో అలాగే సామాజికంగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించాలి. మన భావి తరానికి కావాల్సింది గొప్ప వ్యక్తులే కాదు, మంచి వ్యక్తులు కూడా. మానవత్వం నిండిన మనుషులు అత్యవసరం, చదువులు మార్కుల కోసమే కాదు పిల్లల్లోని ప్రవర్తనా మార్పుల కోసం కూడా అని గుర్తించాలి. ఈ కాలపు వేసవి సెలవులు సాయపడాలని కోరుకుందాం. ∙డి.వి.ఆర్ భాస్కర్
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
చాందిని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
కొన్ని కోరికలు ఎప్పటికీ తీరవు. కొన్ని ఎప్పటికో గాని తీరవు. 35 ఏళ్ల క్రితం ‘చాందిని’ సినిమా చూసి శ్రీదేవిలా అలాంటి లొకేషన్లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందనుకుందామె. 35 ఏళ్ల తర్వాత ఆ కోరిక తీరింది. ‘తేరె మేరె హోటోంపె’ అనే పాటకు ముంబైకి చెందిన అనిత వడేకర్ అనే మహిళ డాన్స్ తెగ వైరల్ అవుతోంది.1989లో రిలీజైన ‘చాందిని’ సినిమా భారీ హిట్ అయ్యింది. శ్రీదేవిని దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలబెట్టింది. ఏ మూల చూసినా ఏ షాపు వెతికినా చాందినీ చీరలు, చాందినీ చుడీదార్లు విపరీతంగా అమ్ముడుపోయాయి. చాందిని పాటలు కూడా సూపర్ హిట్. ‘మేరే హాతోంమే’, ‘చాందిని ఓ మేరి చాందిని’, ‘లగీ ఆజ్ సావన్ కీ’... ఇవన్నీ రేడియోల్లో టీవీల్లో మారుమోగాయి. వాటి తోపాటు ‘తేరే మేరే హోటోంపే మిత్వా’... పాట కూడా ఆదరణ అందింది. విదేశాల్లో పర్వత ప్రాంతాల్లో పచ్చదనంలో తీసిన ఈ పాటలో శ్రీదేవి రిషి కపూర్‌తో వేసే స్టెప్స్ కోసం జనం విరగబడ్డారు. ఆ పాటను గుర్తు పెట్టుకుని అలా డాన్స్ చేయాలనుకున్న ముంబైకి చెందిన అనిత వడేకర్ దాదాపు 35 ఏళ్ల తర్వాత హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. అక్కడ సేమ్ చాందినీ సినిమాలోని లొకేషన్ చూసి తన మనసులోని ముచ్చట తీర్చుకుంది. ‘తేరే మేరే హోటోంపే మిత్వా పాటకు శ్రీదేవిలాగానే పరవశంతో నాట్యం చేసింది. ఆమె కొడుకు ఆవి వడేకర్ షూట్ చేసి ‘అమ్మ 40 ఏళ్ల కల’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే పది లక్షల లైకులు కొట్టి అనిత వడేకర్‌ను ప్రశంసించారు. ఇన్నాళ్లకైనా ఒక సరదా కోరిక నెరవేర్చుకున్నందుకు ముచ్చటపడ్డారు. వయసుదేముంది పక్కన పడేస్తే పడి ఉంటుంది... మనసులోని ఉత్సాహం ముఖ్యం అంటూ ఇలా ఏవైనా కోరికలున్నవారు ‘తుజే దేఖాతో ఏ జానా సనమ్’లాంటి పాటలకు డాన్స్ చేయడానికి లొకేషన్స్ వెతుక్కుంటున్నారు. View this post on Instagram A post shared by Aavi Vadekar🐢 (@wakeup_aavi) (చదవండి: ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!)
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలన్న ఆలోచన మానుకోండి... కాంగ్రెస్ పార్టీకి హితవు పలికిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాకాండపై వినీత్ బ్రిజ్‌లాల్ నేత్వత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు.. ఇంకా ఇతర అప్డేట్స్
రుణమాఫీకి ఏర్పాట్లు చేయండి, ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే.. అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 81.3 శాతం పోలింగ్... వెల్లడించిన సీఈవో కార్యాలయం వర్గాలు.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన ఓటర్లు. కడపటి వార్తలు అందే సమయానికి 76.50 శాతం పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో వన్స్‌మోర్... రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం తథ్యమని జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 50 సీట్లు కూడా రావు, ప్రతిపక్ష పార్టీ హోదా దక్కదు... తేల్చిచెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 57 నెలలకే అంతం చేసే కుట్రలు.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
చంద్రబాబుది పెత్తందార్ల కూటమి... ఎన్నికల ప్రచార సభల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారు... కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ప్రేమోన్మాది నాగరాజుకు ఉరిశిక్ష విధించాలి
నెల్లూరు(అర్బన్): ప్రేమ పేరుతో వెంటపడి వేధించి పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లీకూతుళ్లపై హత్యాయత్నం చేసిన క్రూరుడు నాగరాజును సమాజంలో తిరగనీయకూడదని, అలాంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించాలని మహిళా కమిషన్ రాష్ట్ర చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరులో పూజిత, ఆమె తల్లి కాంతమ్మలపై నిందితుడు నాగరాజు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరులోని ఎనెల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పూజిత, కాంతమ్మను మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యానికి ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం ఆమె దర్గామిట్టలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న వన్‌స్టాప్ సఖి సెంటర్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ రాష్ట్ర కార్యదర్శి వల్లెం విమల, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయనిర్మల, రాజ్యలక్ష్మి, అధికార ప్రతినిధి సుప్రియ పాల్గొన్నారు.
ప్రజా ప్రతినిధులకే కుచ్చుటోపి
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శినంటూ ప్రజా ప్రతినిధులనే మోసం చేస్తున్న ఘరానా మోసగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎస్ మట్టం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు అలియాస్ మల్లారెడ్డి/ దాసరి అనిల్ కుమార్ మై నేత.కామ్ వెబ్సైట్ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ నంబర్లు సేకరించేవాడు. వారికి ఫోన్ చేసి ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా పరిచయం చేసుకునేవాడు. ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుందని, గ్రాంట్‌ను విడుదల చేయనుందని వివరించేవాడు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం కావాలని కోరేవాడు. నిజమేనని నమ్మిన ప్రజా ప్రతినిధులు బాలాజీ నాయుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేసేవారు. ఆ తర్వాతి నుంచి ఫోన్ స్విఛాఫ్ చేసేవాడు. ఈ క్రమంలో ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి.. కొత్త ప్రభుత్వం రుణ పథకాన్ని ప్రారంభిస్తుందని, తనతో పాటు వంద మంది సభ్యులు పాల్గొనాల్సి ఉంటుందని సూచించాడు. నిజమేనని నమ్మిన సదరు శాసనసభ సభ్యుడు రూ.3.60 లక్షలు నిందితుడు సూచించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. నగదు విత్‌డ్రా చేసిన తర్వాత నిందితుడు కాల్స్ చేయడం మానేశాడు. దీంతో మోసపోయామని గ్రహించిన ఎమ్మెల్యే సూచన మేరకు తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు బాలాజీని అరెస్టు చేశారు.లంచం కేసులో దొరికే, జాబ్ పోయే.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన తోట బాలాజీ నాయుడు 2008లో రామగుండంలోని ఎనీ్టపీసీలో ఏఈగా ఉద్యోగంలో చేరాడు. చేరిన ఏడాది కాలంలోనే 2009 ఫిబ్రవరిలో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటుండగా.. సీబీఐ చేతికి చిక్కాడు. దీంతో బాలాజీని అరెస్టు చేసి, రిమాండ్ నిమిత్తం కరీంనగర్ జైలుకు తరలించారు. దీంతో ఎనీ్టపీసీ సంస్థ బాలాజీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసింది. జైలు నుంచి బయటికి వచ్చిన కొంత కాలం తర్వాత బాలాజీ మళ్లీ విశాఖ పరవాడ సింహాద్రీ పవర్ ప్లాంట్‌లో తిరిగి ఉద్యోగంలో చేరాడు. కానీ, అతని ప్రవృత్తిలో మార్పు రాకపోవడంతో 2009లో అతన్ని సరీ్వస్ నుంచి తొలగించారు. ఇక అక్కడ్నుంచి మోసాలకు పాల్పడటే వృత్తిగా ఎంచుకున్నాడు. బాలాజీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 37 కేసులున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతని చేతిలో మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.
ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌ను అడ్డుకునేందుకు కుట్ర
విమానాశ్రయం (గన్నవరం): విదేశీ పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు కుట్ర పన్నడం కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి సీఎం జగన్ విదేశీ పర్యటనకు బయల్దేరేముందు ఎయిర్‌పోర్టులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కుట్ర విఫలమైంది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన్ని అమెరికా పౌరసత్వం కలిగిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంకు చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్బాబుగా పోలీసులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.. లండన్ పర్యటనకు వెళ్లేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఆ సమయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పార్కింగ్ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న డాక్టర్ ఉయ్యూరు లోకేష్‌బాబును గుర్తించారు. ఆయన సెల్‌ఫోన్ నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన మేసెజ్‌లను పంపినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ విషయమై ఆయన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని గన్నవరం పోలీసు స్టేషన్‌కు తరలించారు. విదేశాలకు వెళ్తున్న సీఎంను విమానాశ్రయంలో అడ్డుకునేందుకు అతను వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల ఎల్లో మీడియాకు చెందిన పలు ఛానళ్లలో జరిగిన చర్చల్లో కూడా లోకేశ్‌బాబు పాల్గొని సీఎం వైఎస్ జగన్ లండన్ పర్యటనపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేశారు. పోలీసులు విచారిస్తున్న సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వరప్రసాద్ తెలిపారు. ఆయనకు 41ఎ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.టీడీపీ నేతలు, ఎల్లో మీడియాకు ముందస్తు సమాచారంఎయిర్పోర్ట్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకుంటున్నట్లుగా డాక్టర్ లోకేశ్‌బాబు ముందుగానే టీడీపీ నేతలకు, ఎల్లో మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. సీఎం లండన్‌కు వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కూడా ఎయిర్‌పోర్ట్‌కు రావాలని వాట్సాప్ గ్రూపులో సందేశాలు పంపించారు. ఈ సంఘటనను ఎల్లో మీడియా ప్రసారం చేయాలని ఆయన కోరినట్లు సమాచారం. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ బాబు ఎన్నికలకు ముందు స్వదేశానికి వచ్చినట్లు తెలిసింది. నిత్యం సోషల్ మీడియా, ఎల్లో మీడియా వేదికగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన విషం కక్కుతున్నారు. ఇదిలా ఉండగా విజయవాడలో లోకేశ్‌బాబును టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు కలిశారు.
పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు. 94కు చేరిన కేసుల సంఖ్య...చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.