ఎందుకిలా చేస్తున్నారు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు!: సుచిత్ర | Suchitra: I Will Not Give Any More Interviews | Sakshi
Sakshi News home page

ఆ హీరోల గదిలోకి నేను వెళ్లానా? ఎందుకింత..?: సుచిత్ర ఫైర్‌

May 18 2024 6:35 PM | Updated on May 18 2024 7:51 PM

Suchitra: I Will Not Give Any More Interviews

తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడింది సుచిత్ర. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో

సింగర్‌ సుచిత్ర గతంలో సుచీలీక్స్‌ పేరిట హీరోల పర్సనల్‌ ఫోటోలను లీక్‌ చేసి సెన్సేషన్‌ అయింది. చాలాకాలం తర్వాత ఈ మధ్యే ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వగా మరోసారి పలువురు సెలబ్రిటీల బండారాన్ని బయటపెట్టింది. ధనుష్‌- ఐశ్వర్య ఇద్దరూ పెళ్లయినప్పటి నుంచే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారంది. షారుక్‌ఖాన్‌ గే అంది. 

వాటిపైనే ఆసక్తి
తన భర్త కార్తీక్‌ కూడా గే అని, ఈ విషయం ఎంతో ఆలస్యంగా తెలుసుకున్నట్లు చెప్పింది. కమల్‌ హాసన్‌ పార్టీలో డ్రగ్స్‌ వాడతారంది. సినీ విశ్లేషకుడు బైల్వాన్‌ రంగనాథన్‌పైనా విమర్శలు గుప్పించింది. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడింది సుచిత్ర. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఓ వీడియో షేర్‌ చేసింది. యూట్యూబ్‌ ఛానల్స్‌ నా వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. 

అనిరుధ్‌తో..
వారికి నచ్చింది రాసుకుంటూ, ఇష్టారీతిన థంబ్‌నైల్స్‌ పెడుతూ వ్యూస్‌ తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సుచిత్ర ధనుష్‌తో ఉంది.. అనిరుధ్‌తో కూడా గదిలోకి వెళ్లింది.. ఇలాంటి చెత్త థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు. అందుకే ఇక మీదట యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. కేవలం టీవీ ఛానల్స్‌కు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను అని సుచిత్ర చెప్పుకొచ్చింది.

చదవండి: తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. చందు మారతాడనుకుంటే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement