నిఖత్‌ జరీన్‌కు స్వర్ణం | Sakshi
Sakshi News home page

నిఖత్‌ జరీన్‌కు స్వర్ణం

Published Sun, May 19 2024 4:29 AM

Gold medal for Nikhat Zareen

మీనాక్షికి కూడా పసిడి  

అస్తానా (కజకిస్తాన్‌): ప్రపంచ చాంపియన్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఎల్డోరా కప్‌ టోర్నమెంట్‌లో నిఖత్‌ స్వర్ణ పతకం గెలుచుకుంది. 

52 కేజీల విభాగంలో శనివారం జరిగిన ఫైనల్లో నిఖత్‌ 5–0 పాయింట్ల తేడాతో స్థానిక బాక్సర్, కజకిస్తాన్‌కు చెందిన జజీరా ఉరక్‌బయెవాపై ఘన విజయం సాధించింది. మరో భారత బాక్సర్‌ మీనాక్షి కూడా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. 48 కేజీల విభాగం ఫైనల్లో మీనాక్షి 4–1తో రహ్మొనొవా సైదాహొన్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను ఓడించింది. 

అయితే ఫైనల్లో ఓడిన మరో ఇద్దరు భారత బాక్సర్లు అనామిక (50 కేజీలు), మనీషా (60 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. ఓవరాల్‌గా ఈ టోర్నమెంట్‌లో భారత్‌ మొత్తం 12 పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఇందులో 2 స్వర్ణాలు, 2 రజతాలు, 8 కాంస్యాలు ఉన్నాయి.   

Advertisement
 
Advertisement
 
Advertisement