Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

EC has failed miserably in conducting elections and maintaining law and order
కళ్లకు గంతలు కట్టుకున్న ఈసీ... పచ్చ ముఠా స్వైర విహారం

సాక్షి, అమరావతి: ఈసీ చేష్టలుడిగి చూస్తుండటంతో పచ్చముఠాలు ఆయుధాలు చేతబట్టి వీధుల్లో వీరంగం వేస్తున్నాయి! ఎన్నికల వేళ తమ మాట వినలేదనే ఉక్రోషంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్లపై దాడులకు తెగబడుతున్నాయి. టీడీపీ రౌడీ మూకల మారణకాండతో మహిళలు, వృద్ధులు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించి కఠిన చర్యలు చేపట్టాల్సిన ఈసీ ఈ అరాచకాలకు పరోక్షంగా కొమ్ముకాస్తుండటం విస్మయపరుస్తోంది.ఈ ఎన్నికల ఫలితాలను నిర్దేశించేది గ్రామీణ ప్రజలు, మహిళలు, అవ్వాతాతలేనని పసిగట్టిన పచ్చ ముఠాలు వారిని ఇంటి నుంచి బయటకు రాకుండా చేయడమే లక్ష్యంగా హింసాత్మక ఘటనలకు తెర తీశాయి. వైఎస్సార్‌ సీపీకి ఓటేస్తారని ఖాయంగా తేలడంతో వారి ఓటింగ్‌ శాతాన్ని తగ్గించేందుకు ఉద్రికత్తలు రేకెత్తించాయి. ‘మనవాళ్లంతా ఉదయం 11 గంటలకల్లా ఓటేసేయాలి’ అని చంద్రబాబు పోలింగ్‌కు ముందురోజు పిలుపునివ్వ­డం చూస్తే.. మద్యాహ్నం నుంచి హింసకు తెగబడనున్నారని, అవ్వాతాతలను, మహిళలను పోలింగ్‌ బూత్‌లకు రానీయకుండా చేయాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని తేటతెల్లమవుతోంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఈసీ పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన జిల్లాల్లో హింస కొనసాగుతుండటమే దీనికి నిదర్శనం. తాజాగా పల్నాడు జిల్లా కొత్త గణేశునిపాడులో వైఎస్సార్‌సీపీకి ఓటేసేశారనే అనుమానంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిపై టీడీపీ మద్దతుదారులు దాడులకు దిగడంతో మహిళలు, పిల్లలు రాత్రంతా ఓ దేవాలయంలో తలదాచుకుని క్షణక్షణం భయంభయంగా గడిపారు. కుట్రలకు పరోక్ష సహకారం మ్యాచ్‌ రిఫరీ తరహాలో ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఈసీ రాజకీయాల కుట్రలకు తలొగ్గింది! పోలింగ్‌ సందర్భంగా, అనంతరం దాడులకు పాల్పడ్డాలని టీడీపీ రూపొందించిన ముందస్తు కుట్రలకు దాసోహమైంది. సమస్యాత్మక జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులను హఠాత్తుగా బదిలీ చేసి చంద్రబాబు కుట్రల అమలుకు దారి చూపింది. టీడీపీ అధినేత ఆదేశాలతో పురందేశ్వరి సూచించిన అధికారులను ఆ స్థానాల్లో నియమించి పచ్చ కుట్రలకు పరోక్షంగా సహకరించింది. ఇదే అదునుగా టీడీపీ రౌడీలు బరితెగించి దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టిస్తున్నా.. బాంబుల మోత మోగిస్తున్నా ఆ జిల్లాలపై పట్టులేని పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. ఒత్తిడికి తలొగ్గి హఠాత్తుగా బదిలీలుజిల్లాలపై క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న పోలీసు అధికారులు కొనసాగితే ఎన్నికల వేళ తమ పథకం పారదని చంద్రబాబు ముఠా ఆందోళన చెందింది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలసి చంద్రబాబు పన్నిన పన్నాగంలో ఈసీ చిక్కుకుంది. విజ్ఞతతో ఆలోచించకుండా ఒత్తిడితో అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంది. సున్నితమైన జిల్లాలు, సమస్యాత్మక నియోజకవర్గాలపై క్షేత్రస్థాయిలో పూర్తి పట్టున్న అధికారులను ఇష్టానుసారంగా బదిలీలు చేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన తరువాత రాజ్యాంగబద్ధంగా అధికార వ్యవస్థ అంతా ఈసీ ఆ«దీనంలోకి వెళుతుంది. అధికార యంత్రాంగం ద్వారా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పూర్తి బాధ్యత ఈసీదే. అయితే టీడీపీ, బీజేపీ ఫిర్యాదులను సహేతుకంగా విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవాల్సిన ఈసీ తన బాధ్యతను విస్మరించి అ­సంబద్ధంగా వ్యవహరించింది. చంద్రబాబు, పురం­దేశ్వరి ఫిర్యాదు చేయడమే ఆలస్యం వారు కోరినట్లుగా పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసేసింది. ఏకంగా 29 మంది అధికారులను బదిలీ చేయడం గమనార్హం. వీరిలో నలుగురు మినహా 25 మంది పోలీసు అధికారులే ఉన్నారు. సమస్యాత్మక నియోజకవర్గాలుగా ఈసీ గుర్తించిన పల్నాడు, ప్రకాశం, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని అధికారులే 90 శాతం మంది ఉన్నారు. పురందేశ్వరి జాబితా ప్రకారమే అంతారాష్ట్ర శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిఘా విభాగం ఇన్‌చార్జ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులతోపాటు పల్నాడు పరిధిని పర్యవేక్షించే గుంటూరు డీఐజీ పాలరాజు, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్‌ జిల్లాలను పర్యవేక్షించే అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిని ఈసీ హడావుడిగా బదిలీ చేయడం విస్మయకరం. సమస్యాత్మక నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్న పల్నా­డు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అనంతపురం ఎస్పీలు, విజయవాడ సీపీలను కూడా ఈసీ హఠాత్తుగా బదిలీ చేసింది. డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం 14 మందిని బదిలీ చేయడం గమనార్హం. ఈ అధికారులంతా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు కొద్ది నెలలుగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. అలాంటి వారిని రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి ఈసీ బదిలీ చేయడం విభ్రాంతికరం. పోనీ ఆ స్థానంలో నియమించిన పోలీసు అధికారుల విషయంలోనైనా ఈసీ సహేతుకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుందా అంటే అదీ లేదు. చంద్రబాబు ఆదేశాలతో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని పోలీసు అధికారులకే ఈసీ పోస్టింగులు ఇవ్వడం విభ్రాంతికరం. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు పోలీసు అధికారులపై ఫిర్యాదు చేయ­డం సహజం. కానీ ఆ స్థానాల్లో ఎవరిని నియమించాలో కూడా సూచిస్తూ జాబితాను సమర్పించడం ఇప్పటివరకు దేశ చరిత్రలోనే లేదు. తమ అధికార పరిధిలో జోక్యం చేసుకోవటాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన ఈసీ అందుకు విరుద్ధంగా జాబితాను ఆమోదించి చేతులు దులుపుకొంది. ఈసీ దన్నుతో టీడీపీ విధ్వంసకాండ తాము చెప్పినట్లుగా ఎన్నికల కమిషన్‌ ఆడుతుండటంతో టీడీపీ మూకలు యథేచ్ఛగా విధ్వంసానికి దిగాయి. పోలీసు అధికారులను ఈసీ బదిలీ చేసిన జిల్లాల్లోనే హింస చెలరేగడం, పచ్చ ముఠాలు రక్తపాతానికి తెగబడటం గమనార్హం. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు సీఎం జగన్‌కు వెన్నంటి నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, పేద వర్గాలే లక్ష్యంగా టీడీపీ దాడులకు పాల్పడుతోంది. పల్నాడు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో టీడీపీ గూండాలు, రౌడీ మూకలు కర్రలు, కత్తులు, బాంబులతో స్వైర విహారం చేస్తున్నారు. పల్నాడులో పురి విప్పిన ఫ్యాక్షన్‌.. పల్నాడులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాసు మహేశ్‌రెడ్డిపై టీడీపీ మూకలు దాడులకు దిగాయి. పిన్నెల్లి కుమారుడు గౌతమ్‌రెడ్డితోపాటు ఆయన అనుచరులకు తీవ్రగాయాలయ్యాయి. నరసరావుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసం, ఆసుపత్రులపై టీడీపీ గూండాలు రాళ్ల వర్షం కురిపించారు. వాహ­నాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో 15 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు బాంబు దాడులకు దిగి బీభత్సం సృష్టించారు. పిడుగురాళ్ల శివారు ప్రాం­తం, మాచవరం మండలంలోని కొత్త గణేశు­నిపాడులో ఎస్సీ, బీసీ కుటుంబాలపై టీడీపీ రౌడీలు దాడులకు తెగబడటంతో బాధితులు రాత్రంగా ఓ గుడిలో తలదాచుకున్నారు. సీమలో చెలరేగిన హింస.. తిరుపతి జిల్లా చంద్రగిరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి వాహనశ్రేణిపై టీడీపీ మూకలు దాడి చేసి రెండు కార్లను ధ్వంసం చేశాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తన కుమారుడు ఆస్మిత్‌రెడ్డి, అల్లుడు దీపక్‌రెడ్డితో కలసి విధ్వంసానికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై రాళ్లతో దాడులు చేయించారు. వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి ప్రత్యక్షంగా దాడులకు నేతృత్వం వహించారు. టీడీపీ దాడులపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు సాక్షి,అమరావతి: పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేషునిపాడులో టీడీపీ గూండాల దాడుల ఘటనపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం సచివాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మలసాని మనోహర్‌ రెడ్డి, గ్రీవెన్స్‌ సెల్‌ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి ఎన్నికల అధికారులను కలిసి దాడులకు సంబంధించిన ఆధారాలను అందజేశారు. మంత్రి అంబటి మాట్లాడుతూ.. కొత్తగణేషునిపాడులో పోలింగ్‌ ముగిశాక యాదవ కాలనీ, రజక కాలనీలపై టీడీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడులు చేయడంతో వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కాలనీలు వదిలి గంగమ్మ ఆలయంలో రాత్రి తలదాచుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారన్నారు. పోలీసు అధికారులకు సమాచారం అందించినా స్పందించ లేదని ఆరోపించారు. మంగళ­వారం ఎమ్మెల్యే కాసు కృష్ణారెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లు బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారని, గ్రామం నడిబొడ్డులో ఉన్న మరికొంతమందిని పరామర్శించేందుకు వెళ్లిన తమ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణులు కర్రలు, మారణాయుధాలతో దాడి చేశాయన్నారు. సమర్థులను తప్పించి అనుకూలురకు పోస్టింగ్‌లుఐజీ పాలరాజు, ఎస్పీ రవిశంకర్‌రెడ్డిపై టీడీపీ తప్పుడు ఫిర్యాదులుసాక్షి ప్రతినిధి, గుంటూరు: ఎన్నికల సందర్భంగా పల్నాడులో హింస చెలరేగేందుకు ఎన్నికల కమి­షన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న పోలీసు అధికారులను ఆకస్మికంగా బదిలీ చేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగించడమే దీనికి కారణమని పేర్కొంటు­న్నారు. ఎన్నికల రోజే కాకుండా మర్నాడు కూడా హింస కొనసాగుతున్నా అడ్డుకోలేని నిస్సహాయ స్థితిలో పోలీసు యంత్రాంగం ఉండిపోవడం దీనికి నిదర్శనం. ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా పోలీసు సిబ్బందిని ఎవరు నియంత్రించారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోలీసు బలగాలు భారీగా అందుబాటులో ఉన్నా తాపీగా గంటన్నర తరువాత చేరుకోవడం, ఈలోగా టీడీపీ నాయకులు విధ్వంసానికి తెగబడటంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన పోల్‌ అబ్జర్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులెక్కడ?ఎన్నికలకు ముందు గుంటూరు రేంజి ఐజీగా పాలరాజు, పల్నాడు ఎస్పీగా రవిశంకరరెడ్డి లాంటి సమర్థ అధికారులున్నారు. వారు ఉంటే తమ ఆటలు సాగవనే భయంతో టీడీపీ పదేపదే ఫిర్యాదులు చేస్తూ వచ్చింది. పురందేశ్వరి ద్వారా రాజకీయంగా ఒత్తిళ్లు తెచ్చింది. దీంతో ఎన్నికల కమిషన్‌ వీరి స్థానంలో డీఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠీ, ఎస్పీగా బింధుమాధవ్‌ను నియమించింది. ఎన్నిక­లకు 4 రోజుల ముందు మాచర్ల, కారంపూడి సీఐలతో పాటు వెల్దుర్తి ఎస్‌ఐలను మార్చి టీడీపీకి అనుకూలంగా ఉండే వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ తరువాత పచ్చ ముఠాలు రెచ్చిపోయాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్యతో పాటు కుమారుడిపై కూడా దాడి జరిగింది. ఎన్నికల సమయంలో స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారిని నియమిస్తే రౌడీ మూకలు, నేరగాళ్లను సమర్థంగా అదుపు చేసే అవకాశం ఉంటుంది. బదిలీల తరువాత దీనికి భిన్నంగా జరిగింది. అంబటిపై రివాల్వర్‌ ఎక్కుపెట్టి..సమస్యాత్మక కేంద్రాల గురించి తెలిసినా బందోబస్తు కల్పించకుండా ఒక్క కానిస్టేబుల్‌తో సరి­పెట్టారు. మంత్రి అంబటి రాంబాబు ఫోన్‌ చేసినా, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్‌ చేసినా పోలీసు సిబ్బంది కనీసం స్పందించని పరి­స్థితి నెలకొంది. మాచర్లలో పోలీసుల తీరు ఆక్షేప­ణీయంగా ఉంది. వైఎస్సార్‌సీపీ అనుకూల గ్రామా­లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఓట­ర్లు బయ­టకు రావడానికి భయపడే పరిస్థితి కల్పించారు. టీడీపీ అనుకూల గ్రామాల్లో ఎస్‌ఐ స్థాయి అధికారి కూడా లేకుండా చేశారు. ఎమ్మెల్యే కుమా­రుడిపై దాడి చేసినా పోలీసులు స్పందించలేదు. ఈవీఎంలు ధ్వంసం చేసి వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు లేకుండా చేసి టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు దిగారు. మంత్రి అంబటిని హౌస్‌ అరెస్టు చేసి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణను పోలింగ్‌ బూత్‌ల వద్దకు తిరిగేందుకు అనుమతించారు. కన్నా కుమారుడు బెది­రిస్తున్నట్లు ఫిర్యాదులు అందినా సీఐ స్పందించలేదు. ఘటనాస్థలికి వచ్చిన మంత్రి అంబటిపై రివాల్వర్‌ ఎక్కు పెట్టే ధైర్యం ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. సత్తెనపల్లిలో చీఫ్‌ ఏజెంట్‌గా ఉన్న మంత్రి అంబటి అల్లుడు ఉపేష్‌పై దాడి చేసినా పోలీసులు స్పందించలేదు. నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపైదాడి చేశారు. ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసినా..గురజాల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల అరాచకం అంతా ఇంత కాదు. మాచవరం మండలంలోని కొత్త గణేశునిపాడు, కేసానుపల్లిలో బీసీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులకు తెగబడ్డాయి. తమ మాట వినకుండా వైఎస్సార్‌ సీపీకి ఓటేశారనే ఆగ్రహంతో టీడీపీ మద్దతుదారులు దాడులకు దిగడంతో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు సోమవారం రాత్రి గ్రామంలోని గంగమ్మ గుడిలో తలదాచుకు­న్నారు. వారిని పరామర్శించడానికి ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ రావడంతో వారిపై కూడా దాడులకు బరి తెగించారు. దీంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఘటనా స్థలానికి ఒక ఎమ్మె­ల్యే వెళ్తున్నారని సమాచారం ఉన్నా సరైన బందోబస్తు కల్పించకపోవడం, పరిస్థితిని నియంత్రించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గ్రామంలో బీసీలు, ఎస్సీలు ఎస్టీలు పెద్ద ఎత్తున వైఎస్సార్‌ సీపీలో చేరడంతో తమ ఆధిపత్యానికి గండిపడుతుందని భావించి ఎన్నికలు ముగిసిన వెంటనే ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. 2019లో కూడా కాసు మహేష్‌రెడ్డిపై ఇదే గ్రామంలో దాడికి ప్రయత్నించారు. పల్నాడులో గెలవలేమని టీడీసీ నిర్ధారణకు రావడంతో దాడులు, దౌర్జన్యాలు, ఈవీఎంల ధ్వంసానికి పూనుకుంది. ఇదంతా టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకే జరిగి­నట్లు చెబుతున్నారు. సస్పెండ్‌ అయిన పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ టీడీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని పోలీసు­లను నడిపించారన్న ఆరోపణలకు పల్నాడు పోలీ­సులు వ్యవహారశైలి అద్దం పడుతోంది. కొంతమంది నిజాయితీగా పనిచేసే వారున్నా ఉన్నతా­ధికారుల తీరు చూసిన తర్వాత అభద్రతా భావంతో విధులను నిర్వహించలేని పరిస్థితిలో ఉండిపోయారు. పల్నాడు చరిత్రలో ఈ తరహాలో పోలీసుల వ్యవహార శైలి ఎప్పుడూ చూడలేదని సీనియర్‌ సిబ్బంది పేర్కొంటున్నారు.మాచవరంలో మరో దాడిపల్నాడు జిల్లా మాచవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ చౌదరి సింగరయ్యపై మంగళవారం రాత్రి టీడీపీ మూకలు దాడి చేయడంతో కాలు, చేయి విరిగాయి. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ దారం లచ్చిరెడ్డికి చెయ్యి విరిగింది. ఘటనలో కారు ధ్వంసం కాగా మరో కార్యకర్తకు కూడా గాయాలయ్యాయి.

KSR Comment On AP Elections After Poling
వైఎస్సార్‌సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్‌.. కూటమిలో లేదు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఘట్టం ముగియడంతో సర్వత్రా ఎవరు గెలుస్తారన్నదే చర్చగా సాగుతోంది. ఈ ఎన్నికలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రంగా జరిగిన ఎన్నికలు కావడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో జగన్ విజయం సాధిస్తే అది దేశానికి ఒక మోడల్ అవుతుంది.జగన్ తీసుకువచ్చిన పలు వ్యవస్థలను దేశ వ్యాప్తంగా అమలు చేయడానికి వివిధ రాష్ట్రాలు ముందుకు వస్తాయి.జగన్‌ను ఒంటరిగా ఓడించలేమన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కాళ్లావేళ్ల పడి జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకుంది. అయినా ఎంతవరకు ప్రయోజనం కలిగిందన్నది ప్రశ్నార్దకమే. మూడు పార్టీల కూటమి కావడంతో బలం పెరిగిందని,తెలుగుదేశం పార్టీ నౌ ఆర్ నెవర్ అన్న చందంగా పని చేసిందని, ఆ పార్టీకి జీవన్మరణ సమస్య కావడంతో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు తమను తాము భ్రష్టు పట్టించుకుంటూ కూడా అబద్దాలు ప్రచారం చేశాయని, వాటన్నిటి పలితంగా గెలిచే అవకాశం లేకపోలేదన్నది ఆ పార్టీవారి భావనగా ఉంది.అయినా వైఎస్సార్‌సీపీలో కాన్ఫిడెన్స్ తెలుగుదేశం కూటమిలో కనిపించడం లేదన్నది సత్యం.. నిజంగానే టీడీపీ కూటమి గెలుస్తుందన్న నమ్మకం కలిగి ఉంటే ,ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అదే తరహాలో కూటమి గెలుపు ఖాయం అన్న శీర్షిక బ్యానర్‌ ఇచ్చేవని, అలా చేయకపోవడం కూడా టీడీపీ ఓటమికి ఒక సంకేతం అన్న విశ్లేషణ వస్తోంది.నిజానికి ఈనాడుకు ఉన్న నెట్ వర్క్ రీత్యా, సోమవారం సాయంత్రానికి జనాభిప్రాయ సేకరణ పూర్తి చేసి వాస్తవ పరిస్థితిని ఇచ్చి ఉండవచ్చు. అలా చేయలేదంటే వారికి కూటమి విజయంపై సందేహం కలిగి ఉండవచ్చని కొందరు అంటున్నారు. ఒకవేళ మంగళవారం ఏమైనా ఇస్తారేమో తెలియదు. కాని కేవలం టీడీపీ వర్గాల ధీమా పేరుతోనే కథనాలు ఇచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వ పనితీరుకు ఒక రిఫరెండంగా పరిగణించే ఈ ఎన్నికలలో మహిళలు ,వివిధ సంక్షేమ పధకాల లబ్దిదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమన్నది ఆయా వర్గాలలో వినిపిస్తున్నమాట.ఓవరాల్‌గా చూసినప్పుడు అత్యధికులు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వస్తుందనే విశ్వసిస్తున్నారు. దీనికి కొన్ని కారణాలు బలీయంగా కనిపిస్తున్నాయి. అవేమిటో చూద్దాం. టీడీపీ కూటమిలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ, జనసేనలు కలిసి 31 నియో.జకవర్గాలలో పోటీచేశాయి. వారికి ఉన్న బలాబలాల రీత్యా, టీడీపీ నుంచి వచ్చే ఓట్ల బదలాయింపు వంటి అంశాల కారణంగా ఈ రెండు పార్టీలు కలిసి ఐదు నుంచి పది సీట్లు మాత్రమే గెలవవచ్చన్నది ఒక అంచనా. ఈ లెక్కన వైఎస్సార్‌సీపీ ఇరవై సీట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ తిరుగులేని ఆధిక్యత ఉంది.గత ఎన్నికలలో సైతం 52 సీట్లకు గాను నలభై తొమ్మిదింటిని వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 2024 ఎన్నికలలో సైతం వైఎస్సార్‌సీపీ వేవ్ రాయలసీమ అంతటా ఉంది. అయినప్పటికీ కొన్ని సీట్లు తగ్గుతాయని అనుకున్నా, మినిమమ్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు రావచ్చని అంతా అంగీకరిస్తున్నారు. అంటే ఇప్పటికి ఏభై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకున్నట్లు లెక్క అవుతుంది. ఉత్తరాంధ్రలో వైఎస్సార్‌సీపీ బలం బాగా ఉంది.అక్కడ ఉన్న ముప్పై నాలుగు సీట్లలో కనీసం పదిహేడు నుంచి ఇరవై సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుచుకోవచ్చు. అదే జరిగితే ఇక్కడికి డెబ్బై సీట్లు గెలిచినట్లు అవుతుంది. ఇక ఇరవై సీట్లు తెచ్చుకుంటే వైఎస్సార్‌సీపీ గెలిచినట్లే అవుతుంది.టీడీపీ పొత్తు పెట్టుకున్న కారణంగా ముస్లిం మైనార్టీలు కూటమికి దూరం అయ్యారు. వారు కనీసం నలభై నుంచి ఏభై నియోజకవర్గాలలో ప్రభావం చూపవచ్చు. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని బీజేపీ చేసిన ప్రకటన కూడా ముస్లింలలో ఆగ్రహానికి కారణం అయింది. ఈ నేపధ్యంలో రాయలసీమలో అధిక శాతం ఉన్న ముస్లింలు వైఎస్సార్‌సీపీవైపు మొగ్గు చూపుతున్నారు. కోస్తా ఆంధ్రలో సైతం అదే పరిస్తితి ఉంది. నెల్లూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ఉన్న ఆరు జిల్లాలలో నలభై సీట్లు రావడం కష్టం కాదు. అంటే ఈ లెక్కన కనీసం 110 సీట్లు వైఎస్సార్‌సీపీకి రావడం ,తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావడం తధ్యం అనిపిస్తుంది. 2014లో ఉన్న కూటమి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు నరేంద్ర మోదీ హవా బాగా పనిచేసింది.అలాగే అప్పుడే పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని పెట్టడం, కాపు వర్గాన్ని బాగా ఆకర్షించడం కారణంగా టీడీపీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ మూడు పార్టీలు 2019 ఎన్నికల సమయంలో ఒకదానిని ఒకటి తిట్టుకున్నాయి. విమర్శించుకున్నాయి. బీజేపీతో పొత్తు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని తమ అవసరాలకు వాడుకోవడం, ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడం కోసమేనన్న సంగతి అందరికి అర్దం అయింది. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలు దాదాపు నెరవేర్చడం , ఆయన ఒంటరిగా ధైర్యంగా ఎన్నికల గోదాలోకి దిగడం, ఒక సిస్టమాటిక్ గా సభలు నిర్వహించడం , ఆచరణ సాధ్యమైన హామీలనే ఇవ్వడం వంటి కారణాల వల్ల ప్రజలలో ఆయన పట్ల ఒక నమ్మకం కుదిరింది. ప్రత్యేకించి పేద, బలహీనవర్గాలలో అది బాగా ప్రస్పుటంగా కనిపించింది. సామాజికంగా కూడా జగన్ పలు ప్రయోగాలు చేసి బిసిలకు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగారు.అది కూడా ప్లస్ పాయింట్ గా ఉంది. జగన్ ఎక్కువగా పాజిటివ్ ఓటుపై ఆధారపడితే విపక్ష కూటమి నెగిటివ్ ఓటుపైనే ఆధారపడింది. వారి మానిఫెస్టోని ఎవరూ విశ్వసించడం లేదు. తెలుగుదేశం కు ఓటు వేయాలని అనుకున్నవారు సైతం ఆ ఎన్నికల ప్రణాళిక అయ్యేది కాదని తెలిసినా, ఇతర కారణాల రీత్యానే ఓట్లు వేశారు.గతంలో జగన్ ఈ స్కీములను అమలు చేస్తుంటే శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేసిన చంద్రబాబు తన మానిఫెస్టోలో అంతకు మించి రెండు,మూడు రెట్లు సంక్షేమ పధకాలు అమలు చేస్తామని అనడంతో జగన్ గ్రాఫ్ బాగా పెరిగింది. అబద్దాల ప్రచారాన్ని నమ్ముకుని టీడీపీ పనిచేసింది. లేని లాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూములను జగన్ లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేశారు. అసెంబ్లీలో టీడీపీ మద్దతు ఇచ్చిన బిల్లునే మాటమార్చి వ్యతిరేకిస్తోందని చెప్పడంలో వైఎస్సార్‌సీపీ చాలా వరకు సఫలం అయింది.అది కూడా టీడీపీకి నష్టం చేసిందని చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రెడ్లు, అగ్రవర్ణాలలోని అధికశాతం పేదలు జగన్‌కు మద్దతు ఇస్తున్నారు. ఆ ప్రభావం పోలింగ్ పై స్పష్టంగా కనబడింది. ఈకాంబినేషన్ అలాగే కొనసాగితే జగన్ ను ఓడించడం అసాద్యం. 2019 లో ఇవే సామాజికవర్గాలు జగన్ కు భారీ ఎత్తున మద్దతు ఇచ్చాయి. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతుండడం జగన్‌కు కలిసి వచ్చే పాయింట్. తమ కోసం లక్షల మంది కార్లు వేసుకుని హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చారని టీడీపీ వాదిస్తోంది. కార్లలో వెళ్లినవారు పెత్తందార్లకు ప్రతినిధులుగా ఉంటే, బస్‌లు, ట్రైన్లలో వెళ్లినవారు పేద ప్రజలకు ప్రతినిదులగా చెప్పవచ్చు. ఆ రకంగా చూసుకున్నా, ఇలా వెళ్లినవారిలో వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులే ఎక్కువగా కనిపిస్తారు. సామాజికవర్గాల సమీకరణ రీత్యా చూసినా, ప్రాంతాల వారీగా పరిశీలించినా, రాజకీయ కోణాలలో అద్యయనం చేసినా, ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీ కూటమి ప్రభుత్వమేనన్న అభిప్రాయం కలుగుతుంది. పోటీ బాగా టైట్‌గా సాగితే వైఎస్సార్‌సీపీకి కనీసం 100 నుంచి 110 సీట్లు వస్తాయి.అది వేవ్‌గా మారితే వైఎస్సార్‌సీపీ గత ఎన్నికల మాదిరి 150 వరకు రావడం కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Daily Horoscope: Rasi Phalalu 15-05-2024 In Telugu
Today Horoscope: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.సప్తమి ఉ.5.56 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: ఆశ్లేష సా.4.58 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.11.31 నుండి 12.19 వరకు, అమృతఘడియలు: ప.3.12 నుండి 4.55 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.32, సూర్యాస్తమయం: 6.19. మేషం: వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.వృషభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆలయదర్శనాలు.కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభం. విలువైన వస్తువులు సేకరిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం.సింహం: చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.కన్య: ఆకస్మిక ధనలాభం. పనులు సజావుగా సాగుతాయి. బం«ధువుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి..తుల: కొత్త పనులు ప్రారంభం. శుభవార్తలు. దైవదర్శనాలు. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.వృశ్చికం: ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.ధనుస్సు: .బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.మకరం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కుటుంబసభ్యులతో వివాదాల పరిష్కారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కుంభం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. నూతన ఉద్యోగయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకం.మీనం: పనులు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి.

CM YS Jagan Tweet On AP Election Polling
ఏపీ పోలింగ్‌పై సీఎం జగన్‌ ట్వీట్‌

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఘట్టం ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఏపీలో ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అత్యధికంగా 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.తాజాగా ఏపీలో నమోదైన పోలింగ్‌, ఓటర్లను ఉద్ధేశిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. మండుటెండల్లోనూ తనకు ఓటువేసి ఆశీర్వదించేందుకు సునామీల తరలివచ్చిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపుకోసం చెమటోడ్చి శ్రమించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు సాగిన పాలన మరింత మెరుగ్గా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.నిన్న జరిగిన ఎన్నికల్లో మండుటెండలు సైతం లెక్కచేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలివచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యువతీయువకులందరికీ పేరుపేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు… pic.twitter.com/RQcsHZqWEO— YS Jagan Mohan Reddy (@ysjagan) May 14, 2024

AP Home Minister Taneti Vanitha Speaks With DGP In Phone
AP: డీజీపీకి హోంమంత్రి తానేటి వనిత ఫోన్ 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తాతో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల తలెత్తిన హింసాత్మక ఘటనలను ఆమె డిజిపి దృష్టికి తీసుకొచ్చారు. చంద్రగిరి, గురజాల తాడిపత్రి గోపాలపురం తదితర నియోజకవర్గాల్లో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన హింసకాండ అంశాలపై డీజీపీతో ఆమె మాట్లాడారు.ఎమ్మెల్యేలపై దాడులు చేస్తుంటే స్థానిక పోలీసులు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. టిడిపికి ఓటు వేయలేదు అన్న కారణాలతో మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ నాయకులు దాడులు చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకుల దాడులను స్థానిక పోలీసుల దృష్టికి తీసుకొచ్చినా స్థానిక పోలీసులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు డీజీపీకి తెలిపారు.దాడులకు పాల్పడ్డ నాయకులను, కార్యకర్తలను చట్టం ప్రకారం వెంటనే అరెస్టు చేయాలని ఆమె కోరారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కచ్చితంగా తెలియజేయాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నియమించిన భద్రతా వ్యవహారాల పరిశీలకుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సమాచారం ఉన్నట్లు హోం మంత్రి తెలిపారు.

Mural painter Sneha Chakraborty on her journey as an NFT artist
ప్రాణమున్నగోడలు

బయటి గోడలు ఎలా ఉంటే ఏంటి అనుకుంటారు చాలామంది.అరె.. ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అనేలా చేస్తుంది స్నేహ చక్రవర్తి. ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యూరల్స్‌ గీయడం సవాలు.మహిళా ఆర్టిస్ట్‌గా ఆ సవాలును ఎదుర్కొంది స్నేహ.దేశంలో గొప్ప కుడ్య చిత్రకారిణిగా ఉన్నఆమె జీవన విశేషాలు.కూర్గ్‌ కాఫీ తోటల్లో పనిచేసే కార్మికులు, కొచ్చిలో చేపలు పట్టే బెస్తవారు, బెంగళూరులో ఇడ్లీ హోటల్‌ నడిపే ముసలామె, తమిళనాడులో తిరిగే జడలు గట్టిన సాధువులు, కష్టజీవులు, శ్రామిక మహిళలు... వీరిని భారీ బొమ్మలుగా ఎప్పుడైనా గోడల మీద చూశామా? స్నేహ చక్రవర్తి ‘మ్యూరల్స్‌’ (కుడ్య చిత్రాలు– గోడ బొమ్మలు) చూస్తే వీరే కనపడతారు. ‘దేశంలో ఎవరూ గమనించని జీవన ΄ోరాట యోధులు వీరంతా. వీళ్లను బొమ్మల్లో చూపడమే నా లక్ష్యం’ అంటుంది స్నేహ చక్రవర్తి. గత సంవత్సరం ఆమె ‘ట్రావెల్‌ అండ్‌ పెయింట్‌ ఇండియా’ పేరుతో భారత దేశ యాత్ర చేసింది. కూర్గ్‌తో మొదలెట్టి హిమాచల్‌ ప్రదేశ్‌ వరకూ అనేక రాష్ట్రాల్లో తిరుగుతూ గోడల మీద భారీ చిత్రాలు గీసింది. వాటిలో ప్రధాన అంశం సామాన్యులు, సామాన్య జీవనం... దానిలోని సౌందర్యం. ‘దేశమంటే వీళ్లే’ అంటుంది స్నేహ.సొంత ఊరు ఢిల్లీఢిల్లీలో పుట్టి పెరిగిన స్నేహ అక్కడ చదువు పూర్తి చేసింది. ఆమె తండ్రి ఇంజినీర్, తల్లి గృహిణి. ‘నాకు ఏడేళ్ల వయసున్నప్పుడు చేతుల మీద మెహందీ వేసే ఒక మహిళ వచ్చింది. ఆమె వేసిన డిజైన్లు నన్ను ఆకర్షించాయి. ఆమె మా పక్కింటికి వెళితే అక్కడకు కూడా వెళ్లి ఆమె మెహందీ వేయడం చూశాను. మరుసటి రోజే అమ్మను అడిగి మెహందీ తెచ్చి ట్రై చేశాను. నాకు మెహందీ వేయడం వచ్చేసింది. ఎనిమిదేళ్లకు మా ఏరియాలో గిరాకీ ఉన్న మెహందీ ఆర్టిస్ట్‌ను అయ్యాను. అయితే కళ అన్నం పెట్టదు అనే భావనతో ఏదైనా పని చేయమని నన్ను మా తల్లిదండ్రులు కోరారు. వారి కోసమని ఒక ఎయిర్‌లైన్స్‌ సంస్థలో ఇంటీరియర్‌ డిజైనర్‌గా చేశారు. కాని ఇలా ఒకరి కింద పని చేయడం నాకు నచ్చలేదు. నా మనసు అక్కడ లేదు. నేను రంగుల కోసం పుట్టాను. రంగుల్లో మునుగుతాను. నా బొమ్మలు అందరూ చూడాలి. అంటే నేను మ్యూరలిస్ట్‌గా, స్ట్రీట్‌ ఆర్టిస్ట్‌గా పేరు గడించాలి. ఆ విషయం ఇంట్లో చెప్పి 2018 నుంచి మ్యూరలిస్ట్‌గా మారాను’ అని తెలిపింది స్నేహ చక్రవర్తి.జటిలమైన చిత్రకళకాన్వాస్‌ మీద బొమ్మ గీయడం వేరు... ఒక పెద్ద గోడను కాన్వాస్‌గా చేసుకోవడం వేరు. కాగితం మీద వేసుకున్న బొమ్మను పదింతలు ఇరవై యింతలు పెంచి గోడ మీద గీస్తారు. దొంతీలు కట్టుకుని గోడ మీద బొమ్మ వేస్తే మళ్లీ కిందకు దిగి దూరం నుంచి చూసుకుంటూ బొమ్మను అంచనా కడుతూ గీయాలి. సాధారణంగా మగవారు ఈ ఆర్ట్‌లో ప్రావీణ్యం సం΄ాదిస్తారు. మ్యూరలిస్ట్‌లుగా ఉన్న మహిళలు తక్కువ. వారిలో స్నేహ చక్రవర్తి పేరు పొందింది. పూణె, ముంబై స్లమ్స్‌లో ఆమె గీసిన బొమ్మలు ఆ మురికివాడలకు జీవం, ప్రాణం ΄ోశాయి. ‘అందమైన బొమ్మ ఉన్న గోడ దగ్గర ఎవరూ చెత్త వేయడానికి ఇష్టపడరు. ఉమ్మివేయరు’ అని చెప్పింది స్నేహ. స్త్రీలు– సందేశాలు‘నా మ్యూరల్స్‌తో స్త్రీల సాధికారతను చూపిస్తుంటాను. స్వేచ్ఛాభావనను చూపుతుంటాను. సరైన సందేశాలు కూడా ఇస్తుంటాను. ఒకసారి ఒక పెద్ద స్త్రీ బొమ్మ గీచి ఫర్‌ సేల్‌ ఫర్‌ సేల్‌ అని చాలాసార్లు ఆ స్త్రీ బొమ్మ చుట్టూ రాశాను. ΄ోర్నోగ్రఫీ వల్ల స్త్రీ దేహం అమ్మకానికి సులువుగా దొరుకుతుందన్న భావన పురుషులలో ఉంటుంది. అలాంటి భావజాలం ఎంత దుర్మార్గమైనదో తెలిసొచ్చేలా ఆ బొమ్మ గీశాను. దానికి మంచి స్పందన వచ్చింది. గోడలు లేని ప్రపంచం లేదు. అందుకే నేను ప్రపంచమంతా తిరిగి బొమ్మలు వేస్తాను. నా బొమ్మ ప్రతి దేశం గోడ మీద మన ప్రజలను, సంస్కృతిని చూ΄ాలన్నదే నా కోరిక’ అని తెలిపింది స్నేహ.

polling percentage final figures
లోక్‌సభ పోలింగ్‌ 66.3 శాతం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు సోమవారం జరిగిన సాధారణ ఎన్నికల్లో నమోదైన పోలింగ్‌ శాతంపై స్పష్టత వచ్చింది. దీనికి సంబంధించి తుది గణాంకాలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్‌ మంగళవారం రాత్రి విడుదల చేశారు. మొత్తంగా రాష్ట్రంలో 66.3 శాతం పోలింగ్‌ నమోదైంది. మొత్తం 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,24,806 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఇందులో 2,18,14,035 మంది పోలింగ్‌ కేంద్రాల్లో ఓటేయగా.. 2,10,771 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేశారు. ఇందులో 1,89,091 మంది ఎన్నికల సిబ్బంది, 21,680 మంది వయోవృద్ధులు/వికలాంగ/ అత్యవసర సేవల ఓటర్లు ఉన్నారు. వీరిలో వయోవృద్ధులు, వికలాంగులు తమ ఇళ్ల వద్దే ఓటేశారు. భువనగిరిలో అత్యధికం 2019 లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్‌ నమోదవగా.. ఈసారి 3.6శాతం అదనంగా పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా భువనగిరి లోక్‌సభ స్థానంలో 76.78 శాతం పోలింగ్, అత్యల్పంగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో 48.48శాతం పోలింగ్‌ నమోదయ్యింది. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు: సీఈఓ వికాస్‌రాజ్‌ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని.. అవాంఛనీయ ఘటనలు జరగలేదని సీఈఓ వికాస్‌రాజ్‌ తెలిపారు. పోలింగ్‌ శాతం పెంచడానికి ఎన్నికల యంత్రాంగం చేసిన కృషి ఫలించిందన్నారు. ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఓటర్లు, ఎన్నికల యంత్రాంగం, సిబ్బంది, పోలీసు బలగాలు, ఎన్‌ సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లకు కృతజ్ఞతలు తెలి పారు. రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం రాలేదని చెప్పారు. ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామాగ్రిని పరిశీలకులు/అభ్యర్థులు/ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో తనిఖీ చేసి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపర్చినట్టు వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. వచ్చే నెల 4వ తేదీన 34 కౌంటింగ్‌ సెంటర్లలో పరిశీలకులు, అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఆ ప్రక్రియ అంతా వీడియో రికార్డింగ్‌ చేస్తామని చెప్పారు. కౌంటింగ్‌ తర్వాత ఈవీఎంలను కొంతకాలం తిరిగి స్ట్రాంగ్‌ రూమ్‌లలో భద్రపరుస్తామని వెల్లడించారు.

20 cases On Man Behind Mumbai Billboard That Collapsed
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్‌ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’ యాడ్‌ ఏజెన్సీ యజమాని భవేష్‌ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్‌ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్(చెక్‌ బౌన్స్‌) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్‌పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్‌లు,బ్యానర్‌లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్‌ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్‌కోపర్‌లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్‌ బోర్డ్‌ పక్కనే ఉ న్న పెట్రోల్‌ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్‌ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన, భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది అద్భుతమైన మరియు వైవిధ్యమైన శ్రేణి సమకాలీన, రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు, కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా, ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్, ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్ 18కేరట్ మరియు 22కేరట్ బంగారంలో విస్తృతమైన శ్రేణి డిజైన్‌లతో, నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని సంపూర్ణం చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement