8 మంది అగ్రి గోల్డ్‌ డైరెక్టర్ల అరెస్ట్‌ | Arrest of 8 Agri Gold Directors | Sakshi
Sakshi News home page

8 మంది అగ్రి గోల్డ్‌ డైరెక్టర్ల అరెస్ట్‌

Jan 10 2018 1:28 AM | Updated on Aug 21 2018 6:02 PM

Arrest of 8 Agri Gold Directors - Sakshi

లీగల్‌ (కడప అర్బన్‌) : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్‌ కేసులో ఆ సంస్థకు సంబంధించిన 8 మంది డైరెక్టర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి వైఎస్సార్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్‌ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారికి ఈ నెల 23 వరకు రిమాండ్‌ విధించడంతో ఏలూరు కేంద్రకారాగారానికి తరలించారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్‌ కాగా, పరారీలో ఉన్న 8 మంది డైరెక్టర్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి తమ ఎదుట హాజరు పరిచారని తెలిపారు. అరెస్టయిన అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లలో శివనారాయణ, వెంకటసుబ్రమణ్యం, శర్మ, ఉదయభాస్కర్‌రావు, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, ఉమతో పాటు మరొకరు ఉన్నారన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement