సాక్ష్యం చెప్తాడేమోనని చంపేశారు! | Two men shot dead in Delhi | Sakshi
Sakshi News home page

సాక్ష్యం చెప్తాడేమోనని చంపేశారు!

May 14 2015 9:37 PM | Updated on Aug 25 2018 6:13 PM

సాక్ష్యం చెప్తాడేమోనని చంపేశారు! - Sakshi

సాక్ష్యం చెప్తాడేమోనని చంపేశారు!

ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. టీ తాగి సేద తీరుదామని వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి కాల్పులు జరిపి పోయారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. టీ తాగి సేద తీరుదామని వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి కాల్పులు జరిపి పోయారు. దీంతో వారిద్దరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారిలో ఒకరు ఓ కేసుకు సంబంధించి సాక్షిగా ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం రామ్ చరణ్ 43, లఖన్ లాల్ 52 అనే ఇద్దరు వ్యక్తులు కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు.

గురువారం టీ తాగేందుకని వెళ్లగా ఒక్కసారిగా ముగ్గురు వ్యక్తులు బైక్ పై వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. రామ్ చరణ్ అక్కడికక్కడే చనిపోగా.. మరోకరు ఆస్పత్రిలో చనిపోయారు. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో రామ్ చరణ్ ఓ కేసుకు సంబంధించి సాక్షి. ఇతడు వచ్చే వారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించిన వ్యక్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement