సోనూ సర్దార్ ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే | Supreme court stays execution of death sentence in Chhattisgarh | Sakshi
Sakshi News home page

సోనూ సర్దార్ ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు స్టే

Jun 19 2014 10:16 PM | Updated on Sep 2 2018 5:20 PM

ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో నిందితుడు సోనూ సర్దార్‌కు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

న్యూఢిల్లీ: ఐదుగురు కుటుంబ సభ్యులను హతమార్చిన కేసులో నిందితుడు సోనూ సర్దార్‌కు విధించిన ఉరిశిక్ష అమలుపై సుప్రీం కోర్టు స్టే విధించింది.  ఈ మేరకు గురువారం జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ , జస్టిస్ శివ కీర్తి సింగ్ లతో కూడిన ధర్మాసనం అతని ఉరిశిక్ష అమలుపై కేంద్ర, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.  1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకుబ్ మెమొన్, ఎర్రకోటపై దాడి కేసులో మహ్మద్ ఆరిఫ్‌లకు కోర్టు విధించిన ఉరిశిక్ష అమలుపై పిటిషన్లు రాజ్యాంగ ధర్మాసనం దగ్గర పెండింగ్‌లో ఉన్న విషయాన్ని నిందితుడి తరఫు లాయర్లు ప్రస్తావించారు.

 

సోనూ ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలని కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు సోనూ అప్పీల్‌ను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఇదిలా ఉండగా రాయ పూర్ సెంట్రల్ జైల్ లో ఉన్న సర్దార్ క్షమాబిక్ష పిటీషన్ ను ఏప్రిల్ 21వ తేదీన రాష్ట్రపతి తిరస్కరించారు.2004లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటన అప్పట్లో కలకలం సృష్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement