చిల్లర కోసం చిత్రమైన చోరీ | demonetisation effect, theft at nagolu | Sakshi
Sakshi News home page

చిల్లర కోసం చిత్రమైన చోరీ

Dec 4 2016 8:26 PM | Updated on Aug 11 2018 6:04 PM

చిల్లర కోసం చిత్రమైన చోరీ - Sakshi

చిల్లర కోసం చిత్రమైన చోరీ

పెద్ద నోట్ల రద్దుతో విచిత్రమైన దొంగతనాలు వెలుగుచూస్తున్నాయి.

నాగోలు: పెద్ద నోట్ల రద్దుతో విచిత్రమైన దొంగతనాలు వెలుగుచూస్తున్నాయి. నోట్లు రద్దు తర్వాత చిల్లర కోసం ప్రజలు నానా కష్టాలు పడుతున్న నేపథ్యంలో దొంగలు ఓ వైన్‌షాపు షెట్టర్ తాళాలు పగులగొట్టి అందులోని చిల్లర నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం సంతోషిమాతా దేవాలయం సమీపంలో ఉన్న లక్ష్మీనరసింహ వైన్స్‌లో శనివారం రాత్రి చోరీ జరిగింది.

మద్యం దుకాణం షెట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు గల్లాపెట్టేలోని 10, 50, 100 రూపాయల నోట్ల రూపంలో ఉన్న దాదాపు రూ.60వేలను ఎత్తుకెళ్లారు. దీంతో నిర్వాహకుడు వెంకటేష్ ఆదివారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement