రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం.. | Bus on way to Rahul Gandhis rally overturns in Gujarat, 35 injured | Sakshi
Sakshi News home page

రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం..

May 1 2017 6:06 PM | Updated on Sep 5 2017 10:08 AM

రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం..

రాహుల్ ర్యాలీకి వెళ్తుండగా ప్రమాదం..

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు.

అహ్మదాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 35 మంది గాయపడ్డారు. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. తాపి జిల్లా కంజా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు.

నర్మదా జిల్లాలోని దేదియపడ బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తల కోసం బస్సులు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం కంజా వద్ద వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. కాగా ఎక్కడి నుంచి వీరిని బహిరంగ సభకు తీసుకువెళ్తున్నారన్న విషయం తెలియరాలేదు. క్షతగాత్రులను సూరత్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని బర్దోలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement