ఎమ్మెల్యే ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం | woman committed suicide at mla home | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

Dec 8 2017 3:00 PM | Updated on Nov 6 2018 8:08 PM

రంగారెడ్డి : రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంటి ముందు టీఆర్ఎస్ మహిళా నాయకురాలు లక్ష్మీరాజ్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకోబోయింది. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. వార్డ్ కమిటీ మెంబర్ పదవి ఇవ్వలేదని ఆమె ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కేవలం మైలర్దేవుపల్లి కార్పొరేటర్ సూచన మేరకు వార్డ్ కమిటీ మెంబర్లను నియమించారని ఆవేదన వ్యక్తం చేసింది.

సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సొమ్మసిల్లి పడిపోవడంతో  తోటి కార్యకర్తలు ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement