మ్యాచ్‌ కోసం వచ్చి మృత్యువాత | three people dead in accedent | Sakshi
Sakshi News home page

మ్యాచ్‌ కోసం వచ్చి మృత్యువాత

May 2 2017 1:45 AM | Updated on Apr 3 2019 7:53 PM

ఏపీకి చెందిన ముగ్గురు యువ కులు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు.

మృతులు ఏపీకి చెందినవారు
చివ్వెంల: ఏపీకి చెందిన ముగ్గురు యువ కులు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిర్మలగిరి శివారులో సోమవారం జరి గింది.

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయపాలెం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్‌ (26), తన బంధువులు పాత గుంటూరుకు చెందిన తొర్రపాయి కోటేష్‌(24), తెనాలికి చెం దిన  మైలా పూర్ణచందర్‌రావు (21), మరో స్నేహితుడు పాత గుంటూరుకు చెందిన దాదిసాయి భార్గవ్‌లు కలసి హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌ చూసేం దుకు వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. జి.తిర్మలగిరి గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్, కోటేష్, పూర్ణచందర్‌ రావు  అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement