breaking news
Kotesh
-
సింగయ్య చనిపోయే అవకాశమే లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సత్తెనపల్లి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదానికి వక్రభాష్యం చెబుతూ కూటమి సర్కార్ అక్రమ కేసుల నమోదుకు తెగబడిందని ప్రత్యక్ష సాక్షులు దాసరి వీరయ్య, న్యాయవాది కోటేష్ పేర్కొన్నారు. చీలి సింగయ్య అనే కార్యకర్త ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి చెందినట్టు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ అధికారికంగా ప్రకటించిన తర్వాత మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం నక్క జిత్తులను ప్రదర్శిస్తోందన్నారు వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా పనిచేస్తోందని వారు దుయ్యబట్టారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరైన వైఎస్సార్సీపీ నేత దాసరి వీరయ్య మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా నేను కూడా కాన్వాయ్‌లో వెళ్లాను. మేం చూసే సమయానికి సింగయ్య స్వల్పగాయాలతో ఉన్నారు.మేం వైఎస్సార్సీపీ కార్యకర్తలుగా బాధ్యత వహించి ఆటోలో అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ.. అక్కడ ఉన్న ఏఎస్ఐ రాజశేఖర్ వద్దని అడ్డుకున్నారు. అంబులెన్స్‌లోనే తీసుకెళ్లాలన్నారు. దాంతో సింగయ్య వివరాలు తీసుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. అతనికి ఉన్న గాయాలను చూస్తే చనిపోయే అవకాశమే లేదు. తలకు ఎక్కడా గాయాలు కూడా కాలేదు. సింగయ్య మరణంపై అనుమానం ఉంది. ఈ రెడ్‌బుక్ రాజ్యాంగంలో ఏదైనా జరగొచ్చు’ అని పేర్కొన్నారు. తేలికపాటి గాయాలే అయ్యాయి హైకోర్టు న్యాయవాది బరిగల కోటేష్ మాట్లాడుతూ.. ‘చీలి సింగయ్య గాయాలతో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నా. ఆయనకు తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి. వెంటనే నా కారులోంచి గొడుగు తెచ్చి ఆయనకు ఎండ తగలకుండా పట్టుకున్నాను. సోషల్ మీడియాలో వచి్చన ఒక వీడియోను తీసుకుని ఎస్పీ మాట్లాడిన తీరు సరికాదు. అంతకుముందు ఇంకో కారు నంబర్ చెప్పి.. ఇప్పుడు జగన్ కారు అని చెప్పటం ఏమి టి? బాధ్యత కలగిన ఎస్పీ అలా మాట్లాడటం సరికాదు. సింగయ్య మరణం, ఎలా జరిగిందనే అంశంపై నేను లీగల్‌గా తేల్చుకుంటా’ అని చెప్పారు. -
మ్యాచ్ కోసం వచ్చి మృత్యువాత
మృతులు ఏపీకి చెందినవారు చివ్వెంల: ఏపీకి చెందిన ముగ్గురు యువ కులు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం జి.తిర్మలగిరి శివారులో సోమవారం జరి గింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయపాలెం గ్రామ ఎంపీటీసీ సభ్యుడు శ్యామల శ్రీకాంత్ (26), తన బంధువులు పాత గుంటూరుకు చెందిన తొర్రపాయి కోటేష్(24), తెనాలికి చెం దిన మైలా పూర్ణచందర్రావు (21), మరో స్నేహితుడు పాత గుంటూరుకు చెందిన దాదిసాయి భార్గవ్‌లు కలసి హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూసేం దుకు వెళ్లారు. ఆదివారం రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. జి.తిర్మలగిరి గ్రామ శివారులో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో శ్రీకాంత్, కోటేష్, పూర్ణచందర్ రావు అక్కడికక్కడే మృతి చెందారు. -
కోటేష్ చిత్రానికి ఉగాది పురస్కారం
నంద్యాల: ఏపీ బాషా, సాంస్కృతిక శాఖ, ఆర్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రదానం చేస్తున్న ఉగాది పురస్కారాలకు ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ ఎంపికయ్యారు. ఈయన చిత్రీకరించిన ఆనందతాండవం కళంకారి చిత్రానికి ఈ పురస్కారం దక్కింది. ఈ మేరకు తనకు లేఖ అందిందని కోటేష్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పురస్కారాలకు 36 మందిని ఎంపిక చేయగా కర్నూలు జిల్లా నుంచి కోటేష్ ఒక్కరికే జాబితాలో స్థానం లభించడం విశేషం. ఉగాది సందర్భంగా ఈ నెల 29వతేదీన కోటేష్‌కు పురస్కారం అందిస్తారు. -
సృజనాత్మకత
నంద్యాల: ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ కాఫీ పొడితో స్వామి వివేకానంద చిత్రాన్ని తీర్చిదిద్దారు. గురువారం స్వామి వివేకానందుడి జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని వేశానని చెప్పారు. ఆయన ప్రబోధాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. -
కోటేష్ చిత్రానికి జాతీయ అవార్డు
నంద్యాల: తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో కోనసీమ చిత్రకళా పరిషత్ నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రకళా పోటీల్లో నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ చిత్రీకరించిన రాధాకృష్ణ చిత్రానికి చిత్రమిత్ర అవార్డు దక్కింది. ఈ మేరకు కళా పరిషత్ నిర్వాహకుడు కొరసాల సీతారామయ్య మంగళవారం కోటేష్‌కు లేఖను పంపారు. పలు రాష్ట్రాల నుంచి 200 చిత్రాలు పోటీలో పాల్గొనగా రాధాకృష్ణ చిత్రానికి పురస్కారం దక్కింది. జనవరి 22న అమలాపురంలో కోటేష్ ఈ అవార్డును అందుకోనున్నారు. -
కరికాళ చోళుడు
ఉత్తమ కళాఖండంగా ఎంపిక నంద్యాల: స్థానిక చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రూపొందించిన కరికాళ చోళుడు చిత్రం ఉత్తమ కళా చిత్రంగా ఎంపికైంది. నెల్లూరులోని అమీర్ ఫైన్ ఆర్ట్ అకాడమీ జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకళ పోటీల్లో ఆయన చోళుడు చిత్రాన్ని కాంస్య విగ్రహ శైలిలో సజీవంగా చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని కాన్వాస్‌పై నాలుగు అడుగుల పొడవు, మూడు అడుగుల వెడల్పులో తైల వర్ణంలో నెలరోజులు శ్రమించి తీర్చిదిద్దారు. ఈ చిత్రం ఉత్తమ కళాఖండంగా ఎంపిక కావడంపై ప్రముఖ చిత్రకారుడు చందా రామయ్య, రాంప్రసాద్ అభినందించారు. నవంబర్ 20న నెల్లూరు టౌన్హాల్లో అవార్డును అందజేస్తారని కోటేష్ తెలిపారు. -
వైఎస్ఆర్ అక్షరాలతో చిత్రం
నంద్యాల: ఇంగ్లిష్‌లో వైఎస్ఆర్ అక్షరాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రాన్ని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన కళాకారుడు కోటేష్ తీర్చిదిద్దారు. జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ అక్షరాలతో రెండు గంటలు శ్రమించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. తనకు వైఎస్ఆర్ అంటే ఎనలేని అభిమానమని, గతంలో కూడా పలు చిత్రాలు గీశానని చెప్పారు.