సభలో నిలదీస్తాం : రేవంత్ రెడ్డి | Telangana TDP leaders meeting with Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సభలో నిలదీస్తాం : రేవంత్ రెడ్డి

Nov 3 2014 11:48 PM | Updated on Aug 11 2018 4:44 PM

రేవంత్ రెడ్డి - Sakshi

రేవంత్ రెడ్డి

ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

హైదరాబాద్: ప్రజా సమస్యలపై శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని టీడీపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ టీడీపి నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన సమావేశం ముగిసింది. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.

ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఇప్పటివరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సమావేశాలు నిర్వహించలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.
**

Advertisement
 
Advertisement
Advertisement