సింగరేణి కార్మికుల ధర్నా | Singareni workers stage dharna | Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికుల ధర్నా

Jan 19 2016 5:07 PM | Updated on Sep 2 2018 4:23 PM

సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో ఉన్న సింగరేణి జీఎం కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు.

రెబ్బన (ఆదిలాబాద్) : సమస్యల పరిష్కారం కోసం సింగరేణి కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి టౌన్‌షిప్‌లో ఉన్న సింగరేణి జీఎం కార్యాలయం ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, సకలజనుల సమ్మె కాలం నాటి వేతన బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే వీఆర్‌ఎస్, తొలగింపునకు గురైన కార్మికులకు తిరిగి సింగరేణిలో అవకాశాలు కల్పించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement