దేవీప్రసాద్‌ను కాదని నిజామాబాద్ వ్యక్తికి టికెట్టా | revanth reddy fire on trs | Sakshi
Sakshi News home page

దేవీప్రసాద్‌ను కాదని నిజామాబాద్ వ్యక్తికి టికెట్టా

Sep 6 2014 2:33 AM | Updated on Aug 10 2018 8:08 PM

దేవీప్రసాద్‌ను కాదని నిజామాబాద్ వ్యక్తికి టికెట్టా - Sakshi

దేవీప్రసాద్‌ను కాదని నిజామాబాద్ వ్యక్తికి టికెట్టా

టీఎన్జీవోస్ నేత దేవీప్రసాద్‌ను కాదని కొత్త ప్రభాకర్‌రెడ్డిని నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి మెదక్ లోక్‌సభ టికెట్టు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని టీడీపీ అధికార ప్రతినిధి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌పై రేవంత్‌రెడ్డి ఫైర్

హైదరాబాద్: టీఎన్జీవోస్ నేత దేవీప్రసాద్‌ను కాదని  కొత్త ప్రభాకర్‌రెడ్డిని నిజామాబాద్ నుంచి తీసుకొచ్చి మెదక్ లోక్‌సభ టికెట్టు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని టీడీపీ అధికార ప్రతినిధి ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీహార్ నుంచి వలస వచ్చినట్టు చెప్పుకున్న కేసీఆర్ సీఎం అయ్యారని, గుంటూరు విద్యార్థి కేటీఆర్ తెలంగాణలో ఉద్యోగానికి పనికిరాకున్నా మంత్రిని చేశారని విమర్శించారు. తెలంగాణ వ్యక్తినే సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలన్నారు

Advertisement
 
Advertisement
Advertisement