సిటీలో వర్షం | in city rain | Sakshi
Sakshi News home page

సిటీలో వర్షం

Jun 5 2015 1:21 AM | Updated on Sep 3 2017 3:13 AM

సిటీలో వర్షం

సిటీలో వర్షం

ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్న నగర వాసులకు కాస్త ఉపశమనం లభించింది...

సేదతీరిన నగరం
సాక్షి, సిటీబ్యూరో:
ఎండ తీవ్రతతో అవస్థలు పడుతున్న నగర వాసులకు కాస్త ఉపశమనం లభించింది. గురువారం రాత్రి వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల మోస్తరుగా చినుకులు పడ్డాయి. పాతబస్తీ, అబిడ్స్, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మెహిదీపట్నం, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, బాలానగర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, మల్కాజిగిరి ప్రాంతాల్లో కుండపోతగా కురిసింది.

రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వాహనాల రాకపోకలకూ ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం పడింది.

Advertisement
 
Advertisement
Advertisement