అదుపులో శంకరాపురం గ్యాంగ్ | Gang control sankarapuram | Sakshi
Sakshi News home page

అదుపులో శంకరాపురం గ్యాంగ్

Oct 30 2014 12:27 AM | Updated on Sep 2 2017 3:34 PM

అదుపులో శంకరాపురం గ్యాంగ్

అదుపులో శంకరాపురం గ్యాంగ్

తమిళనాడు రాష్ట్రం శంకారాపురం గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు సభ్యులను ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సుమారు 2.4 లక్షల విలువచేసే 8 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

పంజగుట్ట: తమిళనాడు రాష్ట్రం శంకారాపురం గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు సభ్యులను ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సుమారు 2.4 లక్షల విలువచేసే 8 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆసక్తి కరమైన అంశాలు వెలుగుచూశాయి. పంజగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సార్ నగర్ డీ.ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ....  
 
అందరూ దొంగలే..
తమిళనాడు రాష్ట్రం వెల్లూరు మండలం శంకరాపురం గ్రామంలో అందరూ  దొంగలే.
     
 గ్యాంగ్ లోని సభ్యులు  కొంత మంది నగరానికి వచ్చి నగర పొలిమేరలు, బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్ల సమీపాల్లో నివాసం ఏర్పరుచుకుంటారు.
     
 వీరు ఎక్కువగా హాస్టల్స్, అపార్ట్‌మెంట్స్ ఉన్న స్థలాలను ఎంపికచే సుకుంటారు.
     
 రాత్రి 10 గంటల ప్రాంతంలో గ్యాంగ్ లోని సభ్యులు ఇద్దరిద్దరిగా విడిపోయి చోరీలకు పాల్పడుతుంటారు.
     
 గాఢనిద్రలో ఉన్న సమయంలో హాస్టల్స్, అపార్ట్‌మెంట్లలో డోర్లు తెరచి చేతికి దొరికింది దొరికినంత దోచుకుంటారు.
     
 అందరూ మరుసటిరోజు ఉదయం 11 గంటలకు కలుసుకుంటారు.
     
 ఎవరైనా రాకపోతే వారు పోలీసులకు చిక్కిన ట్లే. వెంటనే మిగిలిన సభ్యులు అరగంట లోపే అక్కడ నుంచి పారిపోతారు.
     
 పోలీసులకు చిక్కిన వారు ఉదయం 11 గంటల వరకు మూగవాడిలా నటిస్తారు. లేకపోతే తెలుగు, ఇతర భాషలు రానట్లు నటించి కేవలం తమిళంలోనే మాట్లాడుతారు. వీరు నోరు తెరచి మిగిలిన సభ్యుల పేర్లు చెప్పేలోపే వారు అక్కడ నుంచి పరారవుతారు.
     
 దొంగిలించిన సొత్తును తమిళనాడులోని ప్రాంతంలోనే పచ్చి కొప్పం నటరాజ్ అనే వ్యక్తికి తక్కువ ధరకు విక్రయిస్తారు. నటరాజ్ దొరికితే భారీ మెత్తంలో సోమ్ము రీకవరీ అయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
     
 గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నామని పోలీసులు చెప్పారు.
 
అదుపులో ఇద్దరు..

శంకరాపురానికి చెందిన వెంకటస్వామి సుబ్రమణ్యం (24), బాలాజీ మురుగణ్ (20) లతో పాటు మరో ఐదుగురు  కొద్దిరోజుల క్రితం నగరానికి వచ్చి శంషాబాద్ మండల్ బుద్వేల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారు. వారంతా నగరంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఎస్సార్ నగర్ డీ.ఐ శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం ఎస్సార్ నగర్ ఆదిత్యా ట్రేడ్ సెంటర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో వెంకటస్వామి, బాలాజీ అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. శంషాబాద్‌కు వెళ్లగా అప్పటికే గ్యాంగ్ లోని సభ్యులు పరారయ్యారు. వారి నుంచి 8 ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement