రైతు ఉసురు తీసిన రుణ భారం | Former suicide | Sakshi
Sakshi News home page

రైతు ఉసురు తీసిన రుణ భారం

Sep 16 2015 12:56 PM | Updated on Jun 4 2019 5:04 PM

రుణబారం మరో రైతు ఉసురు తీసింది. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం ఇస్సానగర్ గ్రామానికి చెందిన పొట్టెల్లి చంద్రయ్య(65) పొలంలో చెట్టుకు ఉరేసుకుని మరణించాడు.

రుణబారం మరో రైతు ఉసురు తీసింది. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం ఇస్సానగర్ గ్రామానికి చెందిన పొట్టెల్లి చంద్రయ్య(65) పొలంలో చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. చంద్రయ్యకు రెండెకరాల భూమి ఉంది. గత ఏడాది నీటి కోసం రెండు బోర్లు వెయ్యగా.. రెండూ ఫెయిల్ అయ్యాయి.  ఈఏడాది మరో రెండు బోర్లు వేశాడు. వాటిల్లో ఒక దాన్లో మాత్రమే కొద్దిగా నీరు వస్తోంది. బోర్ల కోసం  ప్రైవేటుగా, బ్యాంకుల్లో తెచ్చిన అప్పు మొత్తం మూడు లక్షలు తీర్చే మార్గం కానరాక తీవ్ర నిరాశకు గుయ్యాడు. ఉదయం పొలానికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. చంద్రయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్నకూతురుకు ఇటీవలే వివాహం చేశాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement