విద్యుదాఘాతంతో రైతు మృతి | former died due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jul 15 2015 12:37 PM | Updated on Sep 3 2017 5:33 AM

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామంలో జరిగింది.

వలిగొండ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగస్వామి(24) బుధవారం పొలం దగ్గర ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలిస్తుండగా ప్రమాదవ శాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లింగస్వామికి ఇంకా వివాహం కాకపోవడం, చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. లింగస్వామి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement