రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు | Congress MLCs to join TRS, D.Srinivas phone call to mlcs | Sakshi
Sakshi News home page

రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు

Jun 25 2014 10:34 AM | Updated on Mar 18 2019 7:55 PM

రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు - Sakshi

రంగంలోకి దిగిన డీఎస్, ఫోన్లో మంతనాలు

హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు స్టీరింగ్ పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు తెలంగాణ శాసనమండలి నేత డీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు.

హైదరాబాద్ : హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారు స్టీరింగ్ పట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు తెలంగాణ శాసనమండలి నేత డీ శ్రీనివాస్ రంగంలోకి దిగారు. అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలను బుజ్జగించేందుకు డీఎస్ పావులు కదుపుతున్నారు. వారితో  ఆయన ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీలతో డీఎస్ భేటీ కానున్నారు.

కాగా ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు డి.శ్రీనివాస్‌కు, షబ్బీర్‌ అలీకి  కౌన్సిల్‌లో కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌ పదవులివ్వడంపై ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఆమోస్‌, రాజలింగం, జగదీశ్వర్‌రెడ్డి,భానుప్రసాద్‌రావు , భూపాల్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఇక కాంగ్రెస్‌లో ఉంటే పదవులు సీనియర్లకే వస్తాయి తప్ప పార్టీ కోసం కష్టపడ్డ తమలాంటి వారికి రావనేది వారి ఆరోపణ.

 

దీంతో ఈ ఎమ్మెల్సీలు అధికార టిఆర్‌ఎస్‌ వైపు ఆకర్షితులవుతున్నట్లు సమాచారం. వీరంతా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో బుధవారం మధ్యాహ్నం గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కూడా టీఆర్ఎస్లో చేరనున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement