సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ

Congress MLA Jagga Reddy Letter To CM KCR - Sakshi

సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. తీవ్ర నీటి సమస్యతో సంగారెడ్డి పట్టణ ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. సంగారెడ్డితో పాటు హైదరాబాద్‌ జంట నగరాల నీటి అవసరాలను తీర్చే సింగూరు జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో.. ఈ కొరత ఏర్పడిందని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను సింగూరు డ్యాంకు తరలించి నీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన రాసిన లేఖలో పూర్తి వివరాలను పొందుపరిచారు. కాగా మంజీర నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో దానిపై నిర్మించిన సింగూరు డ్యాం పూర్తిగా ఎండిపోయిన విషయం తెలిసిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top