ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి | A kid died in a road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి

Feb 12 2015 10:27 PM | Updated on Aug 30 2018 3:56 PM

మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని చంద్రాయగూడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు.

కొత్తూరు: మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని చంద్రాయగూడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు. చంద్రాయగూడలో రోడ్డు దాటుతున్న బాలుణ్ని షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్(9) అనే బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామం. కన్నకొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement