breaking news
bus dash
-
ఇబ్రహీంపట్నంలో ఘోరం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన స్కూల్ వ్యాన్
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం పరిధిలోని శేరిగుడలో మంగళవారం ఉదయం దారుణం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులపైకి ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌ను అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. మృతి చెందిన విద్యార్థి స్థానికుడు కాదని.. అతనిది బీహార్‌కు చెందిన కుటుంబంగా గుర్తించారు. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయాలు కావడంతో చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు సాగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, పోలీసులు జోక్యం చేసుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఇదీ చదవండి: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. చిన్నారిపై కుక్క దాడి! -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలుడు మృతి
కొత్తూరు: మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని చంద్రాయగూడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందాడు. చంద్రాయగూడలో రోడ్డు దాటుతున్న బాలుణ్ని షాద్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివకుమార్(9) అనే బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. బాలుడి స్వస్థలం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామం. కన్నకొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.