చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి | 2 children died in medak district | Sakshi
Sakshi News home page

చెరువులో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి

Dec 14 2015 11:14 AM | Updated on Sep 17 2018 8:02 PM

మెదక్ జిల్లాలోని పఠాన్ చెరు లో సోమవారం విషాదం చోటు చేసుకుంది.

మెదక్ : మెదక్ జిల్లాలోని పఠాన్ చెరు లో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్ధానిక రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అమీన్ పూర్ పెద్ద చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. వివరాలు... వాణి నగర్ కు చెందిన మురళి(9), రాజశేఖర్(10 ) లు పెద్ద చెరువుకు ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. రాజశేఖర్ మృత దేహాన్ని గమనించిన స్థానికులకు విషయం తెలిసింది. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలికి చేరుకుని మురళి మృత దేహం కోసం గాలింపు చేపట్టారు.  

Advertisement
 
Advertisement
Advertisement