మాన్వి వద్ద రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి | Two cars involved in fatal crash, 2 died | Sakshi
Sakshi News home page

మాన్వి వద్ద రెండు కార్లు ఢీ: ఇద్దరు మృతి

Apr 14 2017 6:05 PM | Updated on Aug 30 2018 4:10 PM

జిల్లాలోని మాన్వి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు త్రీవంగా గాయపడ్డారు.

రాయచూరు రూరల్‌ : జిల్లాలోని మాన్వి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు త్రీవంగా గాయపడ్డారు. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళుతున్న ఇన్నోవా కారు రాయచూరు నుంచి హుబ్లీకి వెళుతున్న స్విఫ్ట్‌ కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

రాయచూరు నుంచి హుబ్లీకి కొత్త ఇంటి సామానుల కొనుగోలుకు వెళుతున్న రాయచూరు తాలూకా గాణదిన్నికి చెందిన న్యాయవాది సురేష్‌రెడ్డి, హంచినాళకు చెందిన గంగాధర పాటిల్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. స్విఫ్ట్‌ కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు రోహిత్, హనుమంతు, చెన్నమ్మ, దేవరాజులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రాయచూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement